పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. మూడు లాంతర్లు – 2 గురించి Kameswara Rao అభిప్రాయం:

    03/03/2011 9:17 am

    ఈ వ్యాసపరంపరలోని వ్యాసాలకోసం ఎదురు చూసే వాళ్ళల్లో నెనొకణ్ణి.
    ఈ భాగంలో చెప్పిన రెండు విషయాల మీద సందేహాలు వచ్చాయి, వీటి గురించి కొంచెం వివరిస్తారా:

    1. “రెండవది ఏమంటే నికార్సైన సృజన, దాన్ని అనివార్యంగా ప్రేమించే సృజనశీలురు కూడా సున్నితంగా, మృదు స్వభావులై ఉంటారు”

    ఎందుకు? దీనికి ఆధారాలేమైనా ఉన్నాయా?

    2. “దీనికి కావలసిన ముడి సరుకు (experimental subjects) ఎవరంటే స్వయంగా సృజనశీలురైన వాళ్ళ సృజనలు, వాళ్ళు చెప్పుకున్న మాటలు, వాళ్ళ ప్రవర్తన, హావభావాలు, జీవితాలు, వాటిని స్వీకరిస్తున్న పాఠకులు – ఇవి”

    ఈ “సృజనశీలురు” ఎవరన్న ప్రశ్న దగ్గరే పెద్ద సమస్య ఎదురుకాదా?

  2. కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి రాఘవ అభిప్రాయం:

    03/03/2011 6:38 am

    కోనసీమకథ అంటే ఉత్సాహంకొద్దీ చదివాను. చదివాక, ఊఁ… సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతానండీ. ఇది కథా కల్పనా?

    బహుశా నాకు మా ఊళ్లో (అదే అమలాపురంలో) ఇలాంటి సంగతులు తెలిసి ఉండకపోవచ్చు. కానీ నాకు ఇది కల్పనగానే అనిపిస్తోంది. వంశీగారి పసలపూడి కథలు కూడ కొంచెం ఇలాంటి విషయాలతోనే ఉంటాయని అనగా విన్నాను.

  3. భాషల ఋతువు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    03/02/2011 7:59 pm

    రవిశంకర్ గారు,
    చాలా బావుంది. ఇంత క్లుప్తంగా ఒక పెద్ద చక్కని కథనే చెప్పారు.
    ఓ పదేళ్ళ తర్వాత తెలుగు కూడా సుదూర ఆకాశంలో ఉండి అందుకోమంటుందేమో!
    రవి వీరెల్లి

  4. కాలనీ భోగి గురించి sudha అభిప్రాయం:

    03/02/2011 2:53 pm

    chala bagundi. I really enjoyed reading each and every line.

    Please write some more stories.

  5. సామాన్యుని స్వగతం: మంచి స్నేహితురాలు గురించి భావకుడన్ అభిప్రాయం:

    03/02/2011 2:04 pm

    నా స్నేహితురాలిని గుర్తు చేసారు…….మళ్ళీ గర్వం వచ్చింది…..థాంక్స్.
    మీకు మీ స్నేహితురాలికి అభినందనలు.

  6. నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి సూర్యుడు అభిప్రాయం:

    03/02/2011 1:42 pm

    ఈ పద్యాలు గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.

  7. కాలనీ భోగి గురించి Subba Reddy Meka అభిప్రాయం:

    03/02/2011 10:30 am

    సత్య గారు,
    చితక కొట్టారు. అదిరినది. I thouroughly enjoyed it. It reminded my Bhogi days. The way you wrote this story, it shows your great talent.

    Please keep up doing this good work.

    భవదీయుడు
    మీ “సుబ్బా”

  8. తవ్విపోత గురించి perugu.ramakrishna అభిప్రాయం:

    03/02/2011 2:27 am

    మంచి కవిత, John.

  9. ఇల్లు విడిచి పోతావా రమణా? గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    03/02/2011 2:17 am

    కనక ప్రసాదు గారూ, మీ అందరి ప్రయత్నమూ మెచ్చుకోతగ్గది. చారుకేశి రాగం వల్లనేమో వినడానికి సొంపుగా వుంది కానీ పాడుకోడానికి సులువుగా సాహిత్యం లేదు. బలవంతాన ఇరికించినట్లుగా అనిపించింది. చరణాల వరకూ వెళ్ళనవసరం లేదు. పల్లవే సజావుగా నడవలేదు. పల్లవే సులభంగా, సరళంగా లేకపోతే ఎంత మంచి వరసయినా ఎక్కదని నా అభిప్రాయం. సంగీతం చెవుల్ని మెలేస్తే సాహిత్యం నాలిక మడతేయించాలి. వరసలు కట్టేటంత సంగీతం రాదు కానీ విని పాట స్థాయి చెప్పగలను.

    పద్మావతి గారి గొంతు మాత్రం భలే వుంది. పూర్తి వాయిద్య సహకారంతో ఆవిడ పాడిన పాటలుంటే చెప్పండి. మీ పాటక్కూడా పక్కవాయిద్యం లోటు కొట్టచ్చినట్లు కనిపించింది.

    మీరు జవాబు చెప్పకుండా దాటవేసే ప్రశ్నే మరోసారి. స్వరకల్పనకీ, స్వరరచనకీ భేదం ఏమిటి? ఏఏ సందర్భాలలో అవి వాడతారు? మీరు జవాబు చెప్పకపోయినా పరవాలేదు. నాకు విక్రమార్కుడు స్పూర్తి కాదులెండి.

  10. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి సాయి బ్రహ్మానందం గొర్తి అభిప్రాయం:

    03/02/2011 1:55 am

    నాగరత్నమ్మ గారు త్యాగరాజు మీద తెలుగులో స్వయంగా రాసిన ఒక వ్యాసం నావద్ద వుంది. ఇక్కడ జత చేస్తే బావుంటుదనిపిస్తే స్కాన్ చేసి పంపగలను.

    – సాయి బ్రహ్మానందం గొర్తి

    [మీరు పంపితే మేము ఒక నిర్ణయం తీసుకోగలం. ఏ వివరాలు తెలియకుండ ఎలా చెప్పగలం? – సం.]