పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. కథ కథ గురించి Soham అభిప్రాయం:

    03/16/2011 10:45 pm

    Very interesting, but could not go further than three paragraphs. Don’t worry, you can sustain the interest of the reader, but I am little busy ….. will be back to experience you.

  2. మూడు లాంతర్లు – 3 గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/16/2011 2:36 pm

    కరటకశాస్త్రి శిష్యుని భాషలో చెప్పాలంటే, “వీని శిగ్గోసిరి..ఎంతబాగా అన్నాడండి ఈ huge harry గాడు. వీని తస్సాగొయ్యా ఆ అలంకారికులంతా పనీపాటాలేకుండా ఒక వెయ్యేళ్లపాటు అదేంటో ఒకటే తెగ హైరానా పడిపోయి ధ్వన్యాలోకాలన్నీ రాసేసి మా గురువుగారి లాంటి వాళ్లచేత నా నెత్తిన రుద్దేస్తున్నారే!! హారిదేవుడో!! ఈ హారీ గాడెవడో ఒక కంప్యూటర్ తెచ్చి నాకిచ్చినట్టాయనా.. ఆ వెంకటేశం గాడి పనిపట్టనూ? వాడిదగ్గరే కంప్యూటర్ ఉందని ఏం గర్రాగా ఉన్నాడూ?? మా ఈ గురువుల సృజనంతా కలుషితం అయిపోయింది.” వాడెవడూ? ఆ కాళిదాసు కావ్యాలన్నీ ఆ కల్పనలన్నీ వట్టిబూజు! ఒక్క కంప్యూటర్ మాత్రమే “స్వచ్చమైన” సృజనని కల్పిస్తుంది. అంతేకదా మరి ..దానికదే విడిగా డబ్బు సంపాదించనఖ్ఖరలేదు. పేరు సంపాదించనఖ్ఖరలేదు. శృంగారపు జంఝాటం దానికి అసలేలేదు. నాకు కూడా ఒక కంప్యూటర్ గురువైతే ఎంత బాగుండూ?!! కనీశం నేను వచ్చేజనమలో అయినా ఇలా ఈ సుబ్బిలాంటి వేషం కట్టి గురువుగారి కూతుర్ని పెళ్ళాడకుండా నాకు నచ్చిన కంప్యూటర్ ని ఎన్నుకుందును కదా?? సృజన అంటే మధురవాణిలా ఉంటుందని అనుకున్నానే ఇన్నాళ్ళూ నేను. చీచీ !! మధురవాణి ఏం బాగుండదన్నమాట. అది కల్తీ సాని!! ఈ కంప్యూటర్ ఉందే!! ఇదొక్కటే మా నికార్సైన “స్వచ్చమైన “సాని!!

    ఇట్లు శ్రీ వేంకటేశం స్నేహితుడుకాని “సుబ్బి”వ్రాలు

    రమ.

    పి.యస్ . అదేంటోగానీ నాకు అన్నిటికీ డు లు పెట్టి పాఠకుడు..విమర్శకుడు అంటూ “డు” “డూ” అని చదూతుంటే కూడా ఒహటే గుద్దుకుంటున్నట్టూందేంటీ?? ఏంటో? “అహం” వల్ల కాబోలు! మరి నేను ఇంతే ఎప్పటికీ కంప్యూటర్ ని కాలేను కాదు. చస్తే కాను కూడాను. నాకు కల్తీ కల్పనే బాగుంటుంది. కల్తీలేని యంత్రమ్ కల్పించే కల్పన కాదు. అలాంటి కల్పన గిరీశాలకి బాగుంటుంది కాబోలు.!!

  3. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    03/16/2011 1:56 pm

    ” కర్ణపేయము”..” శ్రుతపేయము” అన్నమాటలు వాడుకలో ఉన్నమాటలు.

    శ్రుతమ్ అంటే వినికి. శ్రుతి అన్నా అదే అర్ధమ్ “వినికి “అనే !! పేయం అంటే పాలు అమృతము వంటి బాగున్న ద్రవపదార్ధాలు.పానానికి అనువైనవి.ఇక్కడ చెవి నిజంగా ఆ ద్రవాలని పానం చేస్తుందని కాదుకదా! అలా చెప్పడమ్ ఒక మెచ్చుకోలు తరహా అంతే !వినడానికి సుఖంగా ఉందని అనడంలాంటిది అంటే ఆస్వాదయోగ్యంగా ఉందని అనడం.

    భాషకి ప్రమాణం మొదటగా వాడుక మాత్రమే. వాడుకని అనుసరించి నిఘంటువులు అర్ధవివరణ చేస్తాయి. చెవికి ఇంపుగా ఉంది అన్న అర్ధంలో.. కాసింత విశేషణమ్ వేసిచెప్పడం. చెవి ఆ సంగీతాన్ని సంతోషంగా ఆస్వాదిస్తోంది అనిచెప్పడానికి …చెవి ఆ ధ్వనిని లేదా.. ఆ గానాన్ని స్వీకరిస్తోంది ..పానంచేస్తోంది.. తాగుతోంది అన్న విశేషణాలుగా మార్చిచెప్పడం.” ఆహా !! అమృతోపమానంగా ఉంది “..అని అనడం లాంటిదే ఇదికూడా!! వినడానికి బాగుందని మెచ్చుకోవడానికిగానూ చెవి ఆ గానాన్ని పానంచేస్తోంది అన్నట్టుగా అనడమ్. అందుకని “పేయమన్న” శబ్దం అక్కడ అవసరమయ్యింది. విడి విడిగా ఈ రెండుపదాలు చూస్తే అందులో అతుకు ఏదీలేదు. కానీ వాడుక వాటికి ఆ బలాన్ని ఇస్తుందన్నమాట..” కర్ణపేయంగా”.

    రమ.

  4. మూడు లాంతర్లు – 2 గురించి Madhav అభిప్రాయం:

    03/16/2011 9:11 am

    ఈవ్యాస పరంపరలో మూడవభాగం ఈరోజు (16మార్చ్ 2011) ఈమాటలో జతచేయబడింది.
    -సంపాదకులు

  5. ఇద్దరు దుర్మార్గులు గురించి SAMPATH అభిప్రాయం:

    03/16/2011 3:26 am

    SUPER BROTHER

  6. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/15/2011 5:18 pm

    వినీల్ / మోహన గార్లకి,

    నాకు తెలుసున్నంత వరకూ తాళ గతికీ అంత్య ప్రాసకీ సంబంధం లేదు. అంత్యప్రాస పాదం ముగించేటప్పుడు అందంగా ఉంటుంది. మీరు చెప్పినట్లు కేవలం రూపకాది తాళాలకే అంత్యప్రాసుండాలన్న నియమమూ లేదు. ఉండకూడదన్న సూత్రమూ లేదు. ఈ క్రింది త్యాగరాజ కీర్తన రూపకతాళంలో వుంది. ఇందులో రెండో అక్షర ప్రాసొక్కటే కనిపిస్తుంది.

    భక్తి బిచ్చమియ్యవే
    భావుకమగు సాత్వీక (భ)

    ముక్తికఖిల శక్తికి త్రి-
    మూర్తులకతి మేల్మి రామ (భ)

    ప్రాణము లేని వానికి బంగారు పాగ చుట్టి
    ఆణి వజ్ర భూషణమురమందు పెట్టు రీతి
    జాణలకు పురాణాగమ శాస్త్ర వేద జప ప్రసంగ
    త్రాణ కల్గియేమి భక్త త్యాగరాజ నుత రామ (భ)

    అయితే సాధారణంగా చాలా భజన పాటలు రూపక తాళంలోనే స్వరపరుస్తారు. మోహనగారు చెప్పినట్లు ఆరేసి మాత్రలకి సమన్వయం కోసం అత్యప్రాస్తలు వాడుతారు. ఖండచాపులో వున్న “నాదుపై పలికేరు నరులు” కృతిలో ఒక చరణంలో ఏ ప్రాసా లేదు. మిగతా చరణాల్లో ద్వితీయాక్షర ప్రాసుంది.

    దినము నిత్యోత్సవమునకాస జెందితి
    నా మనసున ఇల్లు ఒకటియనియుంటి కాని
    అనుదినమునొరుల మేలును జూచి తాళ
    లేకను రెండు సేయ వలెననుచు పల్కితినా

    ప్రాసుంటే వినడానికి బావుంటుంది. లేకపోయినా పాట వినసొంపుగా ఉన్నంత వరకూ అభ్యంతరం లేదని నా అభిప్రాయం.

    -బ్రహ్మానందం.

  7. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/15/2011 4:50 pm

    శ్రీనివాస్ గారూ,

    కర్ణపేయమూ, శ్రుతపేయమూ అన్న పదాల వాడుక నేను కొన్ని సంగీత పుస్తకాలలో చూసాను. ఇది నేను సృష్టించినది కాదు. అలావాడడం దుష్టసమాసం అంటే వెనక్కి తీసుకుంటాను. నాకు ఏ భాషలోనూ
    పాండిత్యంలేదని మాత్రం గట్టిగా చెప్పగలను.
    ఒక్కోసారి నిఘంటువుల్లో ఉన్న అర్థాలకే కాకుండా వేరే వాడకం కూడా ఉంటుంది. పైగా మన నిఘంటువులు తరచూ నవీకరణ చెయ్యరు. తరచూ మనం వాడే “అదృష్టం” పదానికి అసలర్థం నిఘంటువుల్లో వెతికితే మీరే ఆశ్చర్యపోతారు.

    -బ్రహ్మానందం.

  8. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి వినీల్ అభిప్రాయం:

    03/15/2011 1:19 pm

    మోహన గారు, నా ప్రశ్న ఇంకొంచెం వివరంగా అడుగుతాను. రూపకం(6), ఆది(8), ఖండ(5),మిశ్ర(7).
    అంత్యప్రాస ఉన్న పాటల్లో రూపకం/ఆది వాడటం, రెండవ అక్షర ప్రాస ఉన్న పాటల్లో చివరి రెండు తాళాలు విరివిగా వాడటం చూశాను. కర్ణాటక తాళాల్లో తాళీ, ఖాళీ ఉన్నాయో లేదో నాకు తెలీదు. హిందుస్తానీ తాళాల్ని బట్టి చూస్తే ప్రాస తరవాత మాత్ర తాళీ ఉండటం గమనించవచ్చు. ఇది రివాజా? లేక కాకతాళీయమా అన్నది నా ప్రశ్న.

  9. సువర్ణభూమిలో … గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి అభిప్రాయం:

    03/15/2011 8:52 am

    ఈ కవిత అనేక పదిసంవత్సరాల సంకలనలో చేర్చారు

    కవికి, ప్రచురణ కర్తలకి అభినందనలు

  10. ధ్యానం గురించి జాన్‌ హైడ్‌ కనుమూరి అభిప్రాయం:

    03/15/2011 8:41 am

    ఈ కవిత అనేక పది సంవత్సారాల కవిత్వంలోకి ఎంపిక అయ్యింది.

    కవికి, ప్రచురణ కర్తలకు అభినందనలు