నేను ఒక సాహిత్య విద్యార్థిని. 1984లొ ,అమృతం కురిసిన రాత్రి-వాక్యలయ భావపోషణ అన్న అంశంపై ఎంఫిల్ కేంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాను. ఆధునిక కవిత్వంలో ‘నేను’ అనే అంశంపై 1990 లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశాను. నావద్ద ఈ చర్చకు సంబంధించి నేను రాసినవి, మంచి వ్యాసాలు, మీ సందేహాలను తీర్చగలవి ఉన్నాయి. నాఅచ్చైన పుస్తకాల నుండి మీకు ఎలా పంపాలో నాకు తెలియటం లేదు. ముఖ్యంగా వచన కవిత్వంలో పాదవిభజనకు సంబంధించి నా గమనింపులు కొన్ని ఉన్నాయి. నా లాప్‌టాప్ లో కీమాన్, ఐలీప్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆ వ్యాసాలను పంపటం సాధ్యమేనా?
పద్యం అనే మాట ను నేను కవితలోని స్టాంజాగా స్వీకరించాను. కవితలో కొన్ని పద్యాలు ఉండటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. పాదవిభజన సాధారణంగా భావ విశ్రాంతిని అనుసరించి ఉండటం నేను గమనించాను. ఇక ఒక పాదాన్నో, మాటనో, పునరావృతం చేసి, హైఫన్ ను ఉపయోగించి, లేక ఒకేపదాన్ని ఒకపాదంగా చేసి , కవులు తాము చూపదలచుకొన్నప్రభావాన్ని చూపుతున్నారు. బైరాగి ‘నాక్కొంచం నమ్మకమివ్వు లో హైఫన్ను ఉపయోగించుకొన్నాడు ఆ కాలంలోనే. ఇక కవిత్వంలో శబ్దం నిశ్శబ్దం అనే వ్యాసంలో నేను వచనకవి వాడుతున్న ఎన్నో సాంకేతిక విన్యాసాలను చర్చించాను. ఆ వ్యాసాన్ని మీకు ఎలా పంపాలో నాకు తెలియటంలేదు. వ్యాసంలో అయితే ఒక్కొక్కొక్క విషయం క్రమపద్ధతిలో ఉంటుంది.
డా.వై. కామేశ్వరి.
[ఒకసారి ప్రచురితమైన సమకాలీన రచనలకు సామాన్యంగా ఈమాటలో స్థానం లేదు, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో తప్ప. మీ వ్యాసాలను ఈమాట చర్చావేదికలో పంచుకోండి. ఈ విషయంలో మీకు సహాయం కావాలంటే editors@eemaata.com చిరునామావద్ద మాతో సంప్రదించండి … సం.]
నేను కూడా “కర్ణపేయం” ..అలాగే ” శ్రుతిపేయం”..అన్న మాటలనే విన్నాను. ” శ్రుతపేయం” అని వినలేదు. కామేశ్వరరావు గారన్నట్టు అది అచ్చుతప్పు కావచ్చు. “శ్రుతి” అన్నదే సరైనది. ఎవరు “శృతి” అన్నారూ?? మంచి నిఘంటువులని ఎన్నిక చేసి కమ్ప్యూటరైజ్ చేసే పనిని ఎవరన్నా చేసేరా?? చేస్తారా?? మరీ ముఖ్యంగా “శబ్దార్ధ దీపిక” లాంటివి. అలా ఎవరు చేసినా వాళ్ళు నిజంగా ఒక గొప్ప ఉపకారం చేసినవారు అవుతారు తెలుగు కోసం. అలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే నలుగురికీ చెప్పండి.
నేను తెలగాణ విఫలాంధ్రప్రదేశ్ అనే పుస్తకం రాసిన. కృష్ణదేశికాచార్యుల వారి ఫ్రాంతీయిడినే . వారి విద్వత్ప్రతిభ అసామాన్యం. వారి కవిత్వంలో తెలుగుల ఐక్యతాభివ్యక్తి ఉన్నది. అది ఎదుకు సాకారము కాలేదు అన్నది ప్రశ్న . శ్రీనివాస్ గారు, తదితరులు జవాబులు చెప్పినారు .
నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని . ఆసక్తి గల ఈ మాట చదువరులు ఈ లంకె ను చూడగలరు: http://www.clatgyan.com/Telangana-Viphalandhra-VageeshanHarathi.pdf
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
బైపోలార్ భూతం గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
03/23/2011 1:04 am
ఈ కవిత అనేక పదేళ్ళ కవిత్వ సంకలనంలో వచ్చినది.
అభినందనలు
ఒక ప్రముఖ చర్చకు పునఃపరిచయం గురించి yaddanapudi kameswari అభిప్రాయం:
03/22/2011 1:22 pm
నేను ఒక సాహిత్య విద్యార్థిని. 1984లొ ,అమృతం కురిసిన రాత్రి-వాక్యలయ భావపోషణ అన్న అంశంపై ఎంఫిల్ కేంద్రవిశ్వవిద్యాలయం నుండి పొందాను. ఆధునిక కవిత్వంలో ‘నేను’ అనే అంశంపై 1990 లో అదే విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి చేశాను. నావద్ద ఈ చర్చకు సంబంధించి నేను రాసినవి, మంచి వ్యాసాలు, మీ సందేహాలను తీర్చగలవి ఉన్నాయి. నాఅచ్చైన పుస్తకాల నుండి మీకు ఎలా పంపాలో నాకు తెలియటం లేదు. ముఖ్యంగా వచన కవిత్వంలో పాదవిభజనకు సంబంధించి నా గమనింపులు కొన్ని ఉన్నాయి. నా లాప్‌టాప్ లో కీమాన్, ఐలీప్ ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆ వ్యాసాలను పంపటం సాధ్యమేనా?
పద్యం అనే మాట ను నేను కవితలోని స్టాంజాగా స్వీకరించాను. కవితలో కొన్ని పద్యాలు ఉండటంలో ఎవరికీ అభ్యంతరం ఉండదనుకుంటాను. పాదవిభజన సాధారణంగా భావ విశ్రాంతిని అనుసరించి ఉండటం నేను గమనించాను. ఇక ఒక పాదాన్నో, మాటనో, పునరావృతం చేసి, హైఫన్ ను ఉపయోగించి, లేక ఒకేపదాన్ని ఒకపాదంగా చేసి , కవులు తాము చూపదలచుకొన్నప్రభావాన్ని చూపుతున్నారు. బైరాగి ‘నాక్కొంచం నమ్మకమివ్వు లో హైఫన్ను ఉపయోగించుకొన్నాడు ఆ కాలంలోనే. ఇక కవిత్వంలో శబ్దం నిశ్శబ్దం అనే వ్యాసంలో నేను వచనకవి వాడుతున్న ఎన్నో సాంకేతిక విన్యాసాలను చర్చించాను. ఆ వ్యాసాన్ని మీకు ఎలా పంపాలో నాకు తెలియటంలేదు. వ్యాసంలో అయితే ఒక్కొక్కొక్క విషయం క్రమపద్ధతిలో ఉంటుంది.
డా.వై. కామేశ్వరి.
[ఒకసారి ప్రచురితమైన సమకాలీన రచనలకు సామాన్యంగా ఈమాటలో స్థానం లేదు, కొన్ని కొన్ని ప్రత్యేక సమయాలలో తప్ప. మీ వ్యాసాలను ఈమాట చర్చావేదికలో పంచుకోండి. ఈ విషయంలో మీకు సహాయం కావాలంటే editors@eemaata.com చిరునామావద్ద మాతో సంప్రదించండి … సం.]
కాలనీ భోగి గురించి Murthy Akella అభిప్రాయం:
03/21/2011 4:23 am
కథ బాగుంది, మొదట్లో మరేందిరా సతీష్ గా, హైదరాబాద్ పదప్రయోగంలాగా లేదూ? విజయవాడ బేక్ డ్రాప్ లో కథ కదా !
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి Murthy Akella అభిప్రాయం:
03/21/2011 4:08 am
కథ బాగంది, కాని ఎందుకో డ్రై గా, కృతకంగా అనిపించింది,బహుశా సత్యవతి పాత్ర చిత్రణలో, పాప్యులర్ తెలుగు సీరియల్ ఛాయలున్నాయేమో !
మేఘాంగన గురించి machlipatnam అభిప్రాయం:
03/20/2011 3:25 pm
“కఱ్ఱచట్రంబు……..” పద్యం లో “ఱ” ప్రాసకు “ర” ప్రాస్ బగా కుదిర్చారు.మొత్తం “ఱ” ప్రాస లో వ్రాయొచ్చును కదా!!!!!!
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి rama bharadwaj అభిప్రాయం:
03/20/2011 7:18 am
నేను కూడా “కర్ణపేయం” ..అలాగే ” శ్రుతిపేయం”..అన్న మాటలనే విన్నాను. ” శ్రుతపేయం” అని వినలేదు. కామేశ్వరరావు గారన్నట్టు అది అచ్చుతప్పు కావచ్చు. “శ్రుతి” అన్నదే సరైనది. ఎవరు “శృతి” అన్నారూ?? మంచి నిఘంటువులని ఎన్నిక చేసి కమ్ప్యూటరైజ్ చేసే పనిని ఎవరన్నా చేసేరా?? చేస్తారా?? మరీ ముఖ్యంగా “శబ్దార్ధ దీపిక” లాంటివి. అలా ఎవరు చేసినా వాళ్ళు నిజంగా ఒక గొప్ప ఉపకారం చేసినవారు అవుతారు తెలుగు కోసం. అలాంటి సమాచారం ఎవరికైనా తెలిస్తే నలుగురికీ చెప్పండి.
రమ.
తెలగాణెము గురించి vageesh అభిప్రాయం:
03/19/2011 4:31 pm
అయ్యలారా, అమ్మలారా
నేను తెలగాణ విఫలాంధ్రప్రదేశ్ అనే పుస్తకం రాసిన. కృష్ణదేశికాచార్యుల వారి ఫ్రాంతీయిడినే . వారి విద్వత్ప్రతిభ అసామాన్యం. వారి కవిత్వంలో తెలుగుల ఐక్యతాభివ్యక్తి ఉన్నది. అది ఎదుకు సాకారము కాలేదు అన్నది ప్రశ్న . శ్రీనివాస్ గారు, తదితరులు జవాబులు చెప్పినారు .
నేను రాజనీతి శాస్త్ర విద్యార్థిని . ఆసక్తి గల ఈ మాట చదువరులు ఈ లంకె ను చూడగలరు: http://www.clatgyan.com/Telangana-Viphalandhra-VageeshanHarathi.pdf
మీ అభిప్రాయాలను తెలియ గొరుతున్న.
విధేయుడు
హారతి వాగీశన్
కోనసీమ కథలు: ఆకాశం వారి మేడ గురించి umamaheswaram madduri అభిప్రాయం:
03/19/2011 3:07 pm
బ్రహ్మానందం గారి కధ, కధనం ఆసాంతం చదివేట్లు చేసింది.కధను మలచిన తీరు చాలాబాగుంది పాఠకులను పక్కకు తిరగకుండా కట్టి పడేసినందుకు ధన్యవాదాలు
ఉమామహేశ్వరం మద్దూరి
ఈమాట జనవరి 2008 సంచిక విడుదల గురించి MVR Murty అభిప్రాయం:
03/19/2011 1:01 pm
మొదటిసారిగా ఈ సైట్ చూసి సంభ్రమాశ్చర్యానికి గురయ్యాను. కొడవళ్ళ హనుమంతరావు గారి వ్యాసానికి, ఆయనకి శతకోటి వందనాలు.
ప్రస్తుత్తమో అప్రస్తుతమో తెలీదు కాని, ఒక విన్నపం. వ్యక్తుల పేర్లలో surnames ని తగ్గిద్దాం, వీలయితే వదిలేద్దాం. ఏమంటారు ?
-యమ్.వి. ఆర్. మూర్తి .
బెంగళూరు
A Forgotten Empire: Vijayanagar; A Contribution to the History of India గురించి Rajendra Prasad.Maheswaram అభిప్రాయం:
03/19/2011 2:29 am
Sir, thank u for the wonderful and informative posting. Really liked it and it is a matter to be shared with many.. Regards..RP