పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16467

  1. మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా గురించి S.Bhavabarayabna. అభిప్రాయం:

    04/30/2011 8:17 pm

    This brief note at best could only be a travesty of gratitude I felt for the effort you have put in collecting the rare trivia of information, and rarer pieces of audio. [I have been pestering one of my acquaintances in AIR , VIJAYAWDA acceding access to any early pieces of A. M. Raja]. I do appreciate the zeal and perseverance that must have gone into the task. Our heart felt appreciation is due, in this respect to Sri Paruchuri Sreenivas garu.

    Your appraisal as to some intrinsic features of A,M.raja’s voice, has enabled us to notice the beauty and evocative virtue of the voice. In this light, I assume the I have been guided to the sublime nuances, endemic to the voice of of A.M Raja. Though the profound listening experience defies every rational explanation, I do express my gratitude to the essayists for endorsing my listening aptitude and for giving some rare pieces of information. Yet, I may be excused for my insatiable curiosity for more information regarding myriad details that went into the making of the man and making of the artist.

    The Telugu Psyche cannot but equate creative nuances withe the quantum of commercial success. I pray that connoisseurs like KrishnaMohan garu and Sreenivas garu, who are free of professorial exigencies shall never succumb to the lure of popular acceptability.

    Yours thankfully,
    S.Bhavanarayana.

    N.B: Manathan Maravillai movie is the Tamil version of Telugu movie Gundamma Kadha, not that of Appu chesi pappu koodu. Some how this error has eluded your typist’s vision. Please see to it that the rectified information is incorporated.

  2. ప్రేమ కవితలు గురించి mani kumar అభిప్రాయం:

    04/30/2011 5:44 am

    మీ కవితలు చాలా బాగున్నాయి.

  3. రాగలహరి: ఆభేరి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/27/2011 12:23 pm

    ఆభేరి రాగం గురించిన వ్యాసం కాబట్టి ఈ రోజు నాకు జరిగిన ఒక అనుభవం మీతో పంచుకోవాలని ఈ అభిప్రాయం రాస్తున్నాను.

    ఏప్రెల్ 25న జరిగిన “పాడుతా తీయగా” కార్యక్రమం చూస్తూ ఉండగా ఒక పది, పన్నెండేళ్ళ అమ్మాయి ఎస్‌. ఎమ్‌. సుబ్బయ్య నాయుడు గారు సంగీతం ఇచ్చి ప్రముఖ గాయని శ్రీమతి జానకి గారిచే పాడించిన “నీ లీల పాడెద” అన్న పాట పాడగా విన్నాను. వ్యాసంలో ఇచ్చినట్టు ఈ పాట “ఆభేరి” రాగంలో స్వరబద్ధమ్ చేయబడింది. ఆ అమ్మాయి పేరు “అంజనీ నిఖిల”. ఆ అమ్మాయి పాట ఎంత అద్భుతంగా ఉందంటే పాట వింటున్నంత సేపు నా కళ్ళు చెమ్మగానే ఉన్నాయి. ఈ పాట బాగా పాడగలిగితే “ఆభేరి” రాగం పూర్తిగా వచ్చినట్టే!

    మళ్ళీ, మళ్ళీ అంజని పాడిన పాట విన్నా! ఆంధ్రదేశంలో యువతలో ఇంత ప్రతిభ ఉందని తెలిసి మహా ఆనందం వేసింది. నాకు అటువంటి కూతురు ఉంటే బాగుండేది కదా అన్న ఊహ కూడా వచ్చింది.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  4. మేఘాంగన గురించి desikachary అభిప్రాయం:

    04/26/2011 11:22 pm

    సిద్ధార్థగారు చేసే ప్రతివాదనలకు జవాబివ్వడంవల్ల ప్రయోజనం లేదని నా అభిప్రాయం. ఆలేఖ్యము, ఆలేఖికా,ఆలేఖకుడు అనేవి వారికి వెంటనే అవగాహనకానంతలో అవి అప్రసిద్ధపదాలనడం శబ్దజ్ఞానంగల ఎవ్వరికైనా ఆశ్చర్యజనకం కాకుండా ఉండనేరదు. అట్లాంటిదే ప్రతిరచన అనే పదం గూడాను. వారు ఆక్షేపించే కేళికాశబ్దానికి బలవత్తరమైన మహాకవి భట్టుమూర్తిగారి కావ్యాలంకారసంగ్రహంలో ని ప్రయోగ మీక్రింది పద్యం:

    “వరుఁడని పేర్కొనన్ శిరము వాంచుఁ దలోదరి సాలభంజికా
    పరిణయవేళ; నెచ్చెలులఁ బాయక యెప్పటియట్ల కేళికాం
    తర మొనరింపఁబోదు; చనెనా యెదఁ బయ్యెదఁ జేర్చి సిగ్గునం
    బరగుఁ బ్రియాంగనానుకృతి భావన కేళికిఁ గాఁగ నిచ్చలున్”

    పై పద్యంలో కేళికా+అంతరము = కేళికాంతరము అన్న చోట కేళికా అనే రూపాన్ని, కేళికి అన్నచోట కేళీ పదానికి వికృతరూపమైన కేళి అనే పదాన్ని ఆట అనే అర్థంలో రామరాజభూషణుఁడు వాడియున్నాడు. ఇంతకంటె గొప్ప ప్రమాణం ఉండదుగదా

  5. నిశ్శబ్దం గురించి venkat అభిప్రాయం:

    04/22/2011 10:01 am

    I liked your first poem. It’s very touching. Keep writing.

  6. విద్యాసుందరి గురించి S.Bhavanarayana అభిప్రాయం:

    04/21/2011 10:52 pm

    Krisna mohana Rao garu,

    Those who toil with perseverance, and come out victorious in producing a remarkable piece on the life and achievements of rare individual have to put up with those who intrinsically are tuned to search for loopholes. I think the style of the essay is inconsistent in that it does not adhere to either of the two styles adopted. It oscillates between the literary and the colloquial. The resultant inconsistency has marred the homogeneity of style, which in turn is bound to interfere with the required engrossment necessary to feel the joy and enlightenment of the content , full of rare pieces of relevant information.

    And sir , I don’t think it is not mandatory on our part to endorse the in-egalitarian aspects of the social set up and the practices in music and art, guided by the caste system, endemic in the feudal society of the time.

    I would like to thank you for the hard work, your perseverance, skill and patience that have gone into coordinating the widely strewn pieces of information. the versatility shown in giving a unity and character to the wrte up, by fusing information gleaned from divergent sources spanning widely separated sectors .

    This laudable effort deserves still better exposure, more and better informed and more positively positioned readers than I.

    With best regards and due apology.
    Yours thankfully,
    S B N

  7. త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి Dr. I.A.P.S. Murthy అభిప్రాయం:

    04/21/2011 12:47 pm

    శ్రీ బ్రహ్మానందం గారికి,

    మీరు త్యాగరాజ కీర్తనలలో స్వరాక్షరాల గురించి కూడా వ్రాయవచ్చును కదా!

    – అ. ప్ర. స. మూర్తి.

  8. రచయితలకు సూచనలు గురించి raghu అభిప్రాయం:

    04/21/2011 4:16 am

    హామీ ఇవ్వమన్నారు.వివరంగ చెప్పగలరని మనవి.

    [మీరు పంపే రచన మీ స్వంతమనీ, ఇంతకు ముందు ప్రచురించలేదనీ, వేరే ఏ పత్రిక వద్దా ప్రచురణకు పరిశీలనలో లేదనీ, హామీ ఇవ్వాలి. అనువాద రచన అయితే, మూలపు రచయిత అనుమతి కూడా తీసుకోవలసి ఉంటుంది. – సం.]

  9. రాగలహరి: ఆభేరి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    04/19/2011 8:28 am

    సంపాదకులకి:

    పది సంవత్సరాల క్రితం రాసిన వ్యాసం పై ఇప్పుడు చర్చ వింతగా ఉంది. ప్రస్తుతం నేను వృత్తిరీత్యా జర్మనీలో ఉంటున్నాను. పని వత్తిడి వల్ల ఈమాట చూడటం కూడా తక్కువైంది.

    ముందుగా ఒక పెద్ద పొరపాటు దొర్లింది ఈ వ్యాసంలో. రాగం పేరు “ఆభేరి”. “అభేరి” కాదు! వీలైతే ఈ తప్పు సవరించండి.

    రాజమకుటం సినిమాలో పి.లీల (మాష్టర్ వేణు సంగీత సారధ్యంలో) అద్భుతంగా పాడిన పాట శుద్ధధన్యాసి రాగంపై అధారమైందే! భీంపలాస్ (ఆభేరి రాగం) కాదు. శుద్ధధన్యాసి రాగంలో “రి, ధ” లు లేవు. సవరణకు రోహిణీ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.

    రోహిణీప్రసాద్ గారి అభిప్రాయం వ్యక్తిగతంగా ఎవ్వరినీ ఉద్దేశించిదని నేను అనుకోను. ఆ అభిప్రాయానికి ఎవరూ బాధ పడవలసిన అవసరం లేదు. ఆయన అభిప్రాయప్రకటన తీరు అది.

    ఇక ఈ వ్యాసపరంపరల ఉద్దేశ్యం ఔత్సాహిక గాయకులకు (గాయనీమణులకు) తేలికగా సంగీతం పరిచయం చెయ్యటమే తప్ప, ఈ వ్యాసాలు ప్రామాణికాలు అవుతాయని కాదు. సంగీతం శాస్త్రీయంగా నేర్చుకొని దానిపై విశేషంగా కృషి చేసిన విద్వాంసులు ఎందరో ఉన్నారు. ముఖ్య విషయం ఒకటి ఉంది. కొత్తగా రాగాలు నేర్చుకొనేవారికి ఒక రాగం పూర్తిగా అనుభవంలోకి రావటానికి సమయం పడుతుంది. రాగలక్షణం నరనరాల్లోకి వెళ్ళటానికి నియమబద్ధమైన నిరంతర సాధన, పట్టుదల ఉండాలని గురువులు ఏనాడో చెప్పారు.

    సూక్ష్మంలో మోక్షంలాగ సినిమాపాటలు రాగాల పరిచయానికి వాడుకోటం జరిగిందని సంగీత ప్రియులకి తెలిసేఉంటుంది!

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. మూడు లాంతర్లు – 2 గురించి indrani palaparthy అభిప్రాయం:

    04/19/2011 3:52 am

    ఇది నాకు బాగా ఇష్టమైన ఉపన్యాసాల్లో ఒకటి. మీ అందరికీ కూడా ఆసక్తి కలిగించవచ్చునని లింక్ ఇస్తున్నాను:

    ఇంద్రాణి పాలపర్తి.