శతావధాని రా. గణేశ్
జీవిత విశేషాలు
భారతదేశంలోని అగ్రగణ్యులైన సంస్కృత కవులు, పండితులలో ఒకరైన శతావధాని రా. గణేశ్‌గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్‌లో జన్మించారు. కన్నడ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు భాషలలో రచనలు చేసిన వీరు యూవీసీఈ (UVCE) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మెటలర్జీ మరియు మెటీరియల్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పట్టాలు పొందారు. అలాగే ఆయనకు సంస్కృతంలో ఎంఏ పట్టా కూడా ఉంది. భారతీయ ప్రాచీన సాహిత్యం, తాత్త్విక, ఆలంకారిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా రచనలు, ఉపన్యాసాలు చేసారు. ప్రాచీన అవధాన కళలో నిష్ణాతులైన ఈయన, కన్నడంలో ఈ కళకు పునరుజ్జీవనం కలిగించిన ఘనతను పొందారు. సంస్కృతభాషకు ఆయన చేసిన సేవకుగాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘బాదరాయణ-వ్యాస’ పురస్కారాన్ని అందుకున్నారు.