నాంజిల్ నాడన్
జీవిత విశేషాలు
‘నాంజిల్ ప్రదేశానికి చెందిన వాడు’ అని అర్థం వచ్చేట్టుగా తన కలం పేరు పెట్టుకున్నారు నాంజిల్ నాడన్. వీరి మొదటి కథ విరధం, 1975లో ప్రచురించబడింది. 2002లో వీరి నవల తలైకీళ్ విగితంగల్ సొల్ల మరంద కథై అనే సినిమాగా తంగర్ బచన్ తీశారు. 2010లో వీరి కథా సంకలనం ‘సూడియ పూ సూడర్క’కు సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. వీరి విస్తృత సాహిత్యం ఎన్నో యూనివర్సిటీలలో పాఠ్యాంశాలుగా ఉంది. జీవితాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నంగా, అసిత్త్వాన్ని వెతికి పట్టుకునే ఒక ప్రక్రియగా తన రచనల గురించి చెప్పుకునే నాంజిల్ నాడన్ రచయిత గురించి ఇలా వ్యక్తీకరిస్తారు: “మెచ్చుకోలుతో రచయిత పుట్టడు, కానీ రచయిత మళ్ళీ మళ్ళీ ఎదురుచూసేది ఆ మెచ్చుకోలు కోసమే.”