అయినా హంతకుల భయం పూర్తిగా వైదొలగలేదు. అది చిమ్మచీకటిలా, కారుమబ్బులా జనావాసం పైన క్రమ్ముకొనే వుంది. భయాందోళనలు పోగొట్టడానికి పోలీసులు తమ చేతనైన కృషి తాము చేస్తున్నారు. కాలనీలో ఓ పోలీసు ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. పగటిపూట కూడా పోలీసులు కాలనీ వీధుల్లో గస్తీ తిరుగుతూ కనిపించిన ప్రతి వ్యక్తి పైన ప్రశ్నలు గుప్పిస్తున్నారు.