నాగార్జున వెన్న
జీవిత విశేషాలు
తెలుగు వికీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్నపుడు రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం), నెట్ లో తెలుగు సమాచారాభివృద్ధికి ఒక మైలురాయి. ఈ లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించి అంగీకారాన్ని తెలిపాడు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబర్ 10న[1] ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియాలోని మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత ఆయనదే. ప్రధానంగా సాంకేతికాంశాలపై 170 మార్పులు చేసిన అతని చివరిమార్పు 2006 జూలై 21 న జరిగింది.