దీపక్ బుద్‌కీ


సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
విశ్రాంత ప్రభుత్వోద్యోగి
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

దీపక్ బుద్‌కీ (Dipak Budki) సుప్రసిద్ధ ఉర్దూ రచయిత. 1971 నుంచి రచనలు చేస్తున్నారు. ఆయన మొదటి కథ ‘సల్మా’ శ్రీనగర్ నుంచి వెలువడే హమ్‌దర్ద్ అనే దినపత్రికలో అచ్చయింది. 1976లో ఇండియన్ పోస్టల్ సర్వీస్‌కి ఎంపికై దాదాపు ఇరవై సంవత్సరాలు రచనలకి దూరమయ్యారు. 1996 నుంచి మళ్ళీ రచనా వ్యాసాంగాన్ని చేపట్టారు. అనంతర కాలంలో ఆయన దాదాపుగా 60 కథలు రాశారు, అవన్నీ భారత ఉపఖండం, బ్రిటన్, ఉర్దూని చదివి అర్ధం చేసుకునే ఇతర ప్రాంతాలలో ముద్రితమయ్యాయి. ఈయన కథలు హిందీ, తెలుగు, కశ్మీరీ భాషలలోకి అనువాదమయ్యాయి. 1999లో “అధూరే చెహెరే” అనే కథా సంకలనం, 2005లో “చినార్ కే పంజే” అనే కథా సంకలనం వెలువడ్డాయి. మూడో సంకలనం “జీబ్రా క్రాసింగ్ పర్ ఖడా ఆద్మీ”. ఉర్దూ సాహిత్యంలోని సుప్రసిద్ధ రచయితలు, విమర్శకులు – సుల్తానా మెహర్, వారిస్ అల్వీ, హర్‌చరణ్ చావ్లా, సయ్యద్ జాఫర్ హష్మీ, అన్వర్ సాదీద్ వంటి లబ్దప్రతిష్టులు ఈయన రచనలని ప్రస్తుతించారు. కథలను ఎంతో నైపుణ్యంతోను, కళాత్మకంగాను అల్లుతారు దీపక్ బుద్‌కీ. ఈయన కథలు మానవ జీవితాలలోని వ్యథలని చిత్రిస్తాయి, వాటిని చదివాక పాఠకులు సమాజంలో ఎక్కడ తప్పు దొర్లుతోంది అని ఆలోచించకుండా ఉండలేరు.


 
  1. జీబ్రా క్రాసింగ్ దగ్గర ఒక మనిషి
  2. అనువాదాలు » కథలు » జనవరి 2013