కైలాసరావు చూపు ఆమె వెంటే వెళ్ళింది. ఆమె గది లోపలికి వెళ్ళిపోయింది. ‘కిఱ్ఱు’మనే శబ్దంతో తలుపు మూసుకుని, ఆయన చూపు తలుపుకు గుద్దుకుంది. మూసిన ఆ తలుపు మీద ఒక ఆడ మనిషి ఆకారం చిత్రలేఖనంలా కనిపించింది. వయసు పదహారేళ్ళు ఉంటుంది. నున్నగా దువ్విన తలమీద నాగరం, పాపిడికి రెండుపక్కలా నెలవంక బిళ్ళ, వదులుగా జారవిడిచిన జడకు జడకుప్పెలు, నుదుట వెలుతురును వెదజల్లే ముత్యాల పాపిడిబిళ్ళ.
జయకాంతన్
జీవిత విశేషాలు
డి. జయకాంతన్ (1934 – 2015) తమిళ సాహిత్య చరిత్రలో ఒక అత్యున్నత స్థానం కలిగిన రచయిత, పాత్రికేయుడు, వక్త, మరియు సినీ నిర్మాత. ఆయన రచనలు సమాజంలోని సామాన్య ప్రజల జీవితాలను, మానవ సంబంధాలలోని విభిన్న కోణాలను చాలా వాస్తవికంగా చిత్రించాయి. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత జయకాంతన్, తన సామాజిక దృక్పథంతో తమిళ సాహిత్యంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించారు.