ఆర్. ఉణ్ణి


సొంత ఊరు:
కోట్టయం, కేరళ
ప్రస్తుత నివాసం:
తిరువనంతపురం
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

కలం పేరు ‘ఆర్. ఉణ్ణి’గా పెట్టుకున్న పి. జయచంద్రన్, 1971లో కేరళలోని కోట్టయంలో జన్మించారు. మలయాళ సమకాలీన రచయితలలో ఒకరైనటువంటి ఉణ్ణి ఒక వైపు సాహిత్యం, మరోవైపు సినిమాల్లోనూ కొనసాగుతున్నారు. ఉణ్ణి 2020లో వాంఖ్ అనే కథకు కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. అలాగే తను కథనం అందించిన ‘చార్లీ’ సినిమాకుగాను 2015లో ఉత్తమ కథన రచయితగా కేరళ రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. ఉణ్ణి రచనలు ఇంగ్లీష్, తమిళ్, తెలుగు భాషల్లోకి అనువదించబడ్డాయి. అతని ‘ప్రతి పూవనకోళి’ నవలిక తెలుగులో ‘కుట్రదారు కోడి’గా తెలుగులోకి అనువదించబడింది. ఇప్పటివరకు మళయాళంలో పది కథా సంపుటాలు, రెండు వ్యాససంపుటాలు వెలువడ్డాయి.


 

కథ చెప్పుకోవడంలో ఎదురయ్యే సమస్యేమిటో, వాళ్ళు వెంటనే పసిగట్టగలిగారు. కొత్తగా ఒక కథను చెప్పడం మొదలుపెడితే మనచేతనే సృష్టించబడ్డ పాత్రధారులు పునఃసృష్టితో దేవుళ్ళుగా మారి ఎప్పుడు మళ్ళీ కథ లోపలికి ప్రవేశిస్తారో మనం ఖచ్చితంగా చెప్పలేం. వాళ్ళు మనల్ని చూసి నవ్వి, చేతులతో సైగ చేసి, మారీచుడిలా ఆశ చూపి కుట్ర చేసి ఎటో దూరంగా తీసుకెళ్ళిపోతారు. చిట్టచివరికి కుట్ర బయటపడేసరికి మనం సెలవు తీసుకోవాల్సిన సమయం దగ్గరపడుతుంది.