అంబై


సొంత ఊరు:
కోయంబత్తూరు
ప్రస్తుత నివాసం:
ముంబై
వృత్తి:
సొంత వెబ్ సైటు:

జీవిత విశేషాలు

తమిళ రచయిత్రి సి.ఎస్‌. లక్ష్మి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. పందొమ్మిది సంవత్సరాల వయసులోనే కథలు రాయడం మొదలుపెట్టి, తమిళ పత్రిక ‘ ఆనంద్‌ వికటన్‌’ లో ఆమె రాసిన ఎన్నో కథలు ప్రచురితమై ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టాయి.


 

ఒకరోజు రాత్రి పొడుగాటి హాల్లో ఆ చివరి నుంచి ఈ చివరి వరకూ జంపకాన పరిచి, కొన్ని తలగడలు పడేసుకుని పడుకున్నాం. నూనె మరకలతో కనీసం గలీబులైనా లేని ఆ తలగడల అందం చూసి తీరాలి. పైన ముదురు రంగు గుడ్డ, లోపలేమో గడ్డ కట్టిన దూది ఉండలుగా పైకి కనిపిస్తూ ఉండేది. రోజంతా ఒళ్ళు హూనమయ్యేలా ఆటలాడిన పిల్లలం తలగడ మీద తల ఆనీ ఆనగానే నిద్రలో పడేవాళ్ళం. అవి రాళ్ళలా ఉంటే మాత్రం ఎవడిక్కావాలి గనక?