పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16635

  1. ℞: మారేజ్ గురించి Sivasankar Ayyalasomayajula అభిప్రాయం:

    10/05/2017 5:07 am

    మనస్సులో ఒక పల్చటి పొరలో తనలో తాను సంభాషించుకున్నట్లు ఉంది. నవీన నాగరికతకు మానసిక రూపురేఖలు దిద్ది కథగా మలచి, అవ్యక్తము కాని చిత్రాన్ని చాలా బాగా చిత్రించడానికి ప్రయత్నించారు. కథ బావుంది. చదువుతూంటే తెలిసిన సన్నిహితురాలి కథ కళ్ళ ముందు ప్రతిబింబించింది.

  2. ℞: మారేజ్ గురించి Ravi Karumanchi అభిప్రాయం:

    10/05/2017 12:20 am

    A heart rendering portrait of Anamika’s Amavasya phase by Purnima Garu!

    A short story that speaks volumes! A life’s struggle distilled to its essence! Unvarnished! Bravo!

    A path-breaking story! Proud to have a writer of this caliber in telugu!

  3. ℞: మారేజ్ గురించి lyla yerneni అభిప్రాయం:

    10/04/2017 1:53 pm

    Tickled pink. The Telugu Bridget Jones, the heckled spinster is bullied, bamboozled into marriage, and Dear God! Is going to have kids. I bet it will be twins. May be triplets. Additional blessings of late pregnancies, fertility drugs, embryo transfers. This pregnant female, (unless she is Beyoncé or Amal) perhaps will be a future visual horror to the fellow workers, even if they may have big beer bellies themselves.

    Such a smart ass story. So true.

    To Amarendra: Life is not a one liner of encapsulated wisdom at end of a travel essay. Life cannot be what you want it to be. Life is a very complex long journey much of which, you have no control of. (Also I think if you are a passenger in a real cab,  you should let your cab driver pay attention to road and traffic, instead of collecting his life history from the back seat and giving him extra tip, if his lifestyle meets your approval.)

    To Sarma: Nothing wrong in giving a patient’s sex, D.O.B, current address, weight, blood pressure, etc. on a prescription. All relevant info to pharmacy and pharmacist to safely fill the prescription.

    Dear eemaata readers, Here is a writing on ‘Marriage’ I posted in Racchabanda Yahoo groups on January 2nd in 2006 (message#14829). Read on if you wish. Some of the people mentioned in the essay are in the current news.

  4. ℞: మారేజ్ గురించి Vaidehi Sasidhar అభిప్రాయం:

    10/04/2017 7:52 am

    Very well written and touching story Purnima! జీవితం లోని, ప్రపంచం లోని డొల్లతనాన్ని చాలా బాగా చూపించావు.

  5. జిక్కి పాడిన మూడు పాటలు గురించి RAVI KRISHNA C అభిప్రాయం:

    10/04/2017 5:38 am

    సౌదామినిలో కుందరదనా పాట మీరు నాకు పంపినది శ్రీనివాస్ గారు, youYubeలో మీ సౌజన్యముతొ అనే post చేసాను.

  6. మరికొన్ని అరుదైన పాటలు గురించి RAVI KRISHNA C అభిప్రాయం:

    10/04/2017 5:29 am

    అలనాటి ఆ మధురిమలను అనంద డోలికల మనసు ఆర్ద్రత తో నిండింది.
    మీ ఈ సంగీత,సాహిత్య సేవలు మరువలేనివి శ్రినివాస్ గారు.

  7. కొత్త కథకులు గురించి డింగు అభిప్రాయం:

    10/04/2017 4:02 am

    నాకు తెలిసి తోట రాముడు అనబడే సిద్దార్థ గౌతమ్ ఇప్పటి హాస్య కథకులలో అగ్రగణ్యుడు. తర్వాత అశ్విన్, శైలజ చందు, బులుసు సుబ్రహ్మణ్యం తదితరులు కూడా తమదైన శైలిలో పాఠకులను అలరిస్తూ ఉన్నారు. అలాగే వ్యంగ్యంలో రమణ యడవల్లి గారిని కొట్టేవాడు లేడు.

  8. శిక్ష గురించి suryavamsie అభిప్రాయం:

    10/03/2017 11:03 pm

    హేట్సాఫ్ వర్మగారూ, ‘అమ్మని పూసిన కొమ్మ’ అమ్మమ్మని ఏం చెప్పారు! ‘చిటికెన వ్రేలు బొటన వ్రేలి బాబంతయ్యిందా? మరో కధ కోసం నిరీక్షిస్తున్నాం.

  9. కొత్త కథకులు గురించి suryavamsie అభిప్రాయం:

    10/03/2017 10:58 pm

    ఈ మధ్య కాలంలో విరివిగా రాస్తున్న చిరంజీవి వర్మ గురించి ఈ వ్యాసంలో ప్రస్తావించకపోవడం కొంచెం లోటుగా వుంది.

  10. Walmart గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/03/2017 2:33 pm

    అయ్యో సగం రాసి అసలు కధ వదిలేస్తే ఎలా?.. ఇలా కంటిన్యూ చేయండి.

    —–

    approved. Please take your receipt and come back again. Thank you for shopping at Walmart.

    నాకీ షర్టూ, గిన్నె, దిండూ, పిల్లకి కొన్న కార్ సీటు నచ్చలేదు. తిరిగిచ్చేయండి.

    సరే, బిల్లెక్కడ ఉంది?

    బిల్లా, నాదెగ్గరెందుకుంటుంది? అయినా అదెందుకు? వాళ్ళు బిల్లు లేకుండా వెనక్కి తీసుకుంటారు. వెళ్లండి వెళ్ళండి.

    నాన్నా కొనేటప్పుడు అమ్మ వస్తుందిగా మనకూడా, కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు నిన్ను వెళ్ళమంటుందే?

    [ఏడుపుగొట్టు నవ్వు.] అది అంతేరా నాన్నా. పెళ్ళైతే నీకూ తెలుస్తుంది.

    ఎందుకండీ ఇది రిటర్న్ చేస్తున్నారు?

    ఇవన్నీ మా ఆవిడ కొంది. రాంగ్ సైజు షర్టూ, ఈ సీటు పనిచేయట్లేదు, దిండు తలకింద పెడితే గాలి పోతోంది. కౌంటర్ కి ఇరువైపులా జనానికి తెలిసిపోయే శుభ్రమైన తెల్లటి అబద్ధం.

    సరే కార్డు మీద ఇవ్వడం కుదరదు వాపసు. స్టోర్ క్రెడిట్ ఇస్తాము సరేనా?

    అదే భాగ్యం, అంత కన్నానా? వినదభీషణ శంఖము దేవదత్తమే

    ఇక్కడో సంతకం తగలేయండి, హావ్ ఏ గుడ్ డే, నెక్స్ట్ ప్లీజ్, మే ఐ హెల్ప్ యూ?

    పదరా నాన్నా ఈ కార్డుతో మరోసారి కురుక్షేత్రం చూసి వద్దాం

    కురుక్షేత్రం అంటే ఏంటి నాన్నా?

    ఏవిటా, థేంక్స్ గివింగ్ తర్వాత రోజూ పీకిపారేసిన వస్తువులు వాల్ మార్టు లో క్షతగాత్రుల్లా లేవూ? అదే కురుక్షేత్రం. ఇదే మన జీవితం, తరం తరం నిరంతరం పోరాటం. పదపోదాం.

    థేంక్ యూ ఫర్ షాపింగ్ ఎట్ వాల్మార్ట్. మళ్ళీ రండి. మళ్ళీ మళ్ళీ తప్పకుండా రండి, రండోయ్, రారండొయ్.

    వాల్మార్ట్ అంటే ఏవిటో తెల్సురా?

    ఏంటి నాన్నా?

    వాలం అంటే తోక, ఆర్ట్ అంటే తెలుసు కదా? కోతి వెనక్కి తిరిగి తోక అనే కుంచెతో రంగు రంగులతో వేసే మహాద్భుతమైన ఆర్టు ఇది. క్రిస్మస్ కో రంగూ, హాలోవీన్ కో రంగూ, అలా మారుతూ ఉంటాయి షాపులో రంగులు. మూడు నెలల ముందు నుంచీ బాకా ఊదుతూ ఉంటారు కొనండి, విసరండి మళ్ళీ కొనండి, మరోసారి విసరండి . అయినా ఏ కాలంలో నైనా క్షతగాత్రులు తప్పరు. అందుకే కురుక్షేత్రం లా కనబడుతూ ఉంటుంది

    డాడ్ అర్ యూ వోకే?

    [వెర్రినవ్వు,] ఇప్పటిదాకా బాగానే ఉందిరా. హూ నోస్ వాట్ ఫ్యూచర్ హోల్డ్స్?