పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16634

  1. అక్టోబర్ 2024 గురించి Venkat Siddareddy అభిప్రాయం:

    10/03/2024 2:25 pm

    ఏం చేస్తే “ఈమాట” వాళ్ల ఆఘాయిత్యాలు ఆగుతాయి.వీళ్ల అథారటీ ఏంటి? ఏది మంచి ఏది చెడు అని మొత్తం వీళ్లే డిసైడ్ చేస్తున్నారు. ఒక ఫేక్ నేరేటివ్ ఉందని డిసైడ్ చెయ్యడం వీళ్లే.దాన్ని ఖండింఛడం వీళ్లే.

    తెలుగు సమాజంలో కుహనా వాదరచయితలకు, వాళ్ళకు జేజేలు పాడే భజంత్రీలకు ఏనాడూ లోటు లేదు, ఉండదు. సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు.

    మన తెలుగు రాష్ట్రాల రచయితల్లో ఒక్కరంటే ఒక్కరూ ఈ వ్యాఖ్య గురించి స్పందించకపోవడంలో రెండు interpretations ఉన్నాయి.

    ఒకటి: మీది ఎప్పుడో ముక్కిపోయిన పత్రిక, కనీసం ఎవరూ చదవడం లేదు.
    రెండు: మీ అమెరికా ట్రిప్ బిస్కట్స్ కి ఆశపడి మీతో ఎందుకని మనసు రాయి చేసుకున్న తెలుగు రచయితలు. లేదంటే, రాళ్లూ, రత్నాలు అని మీ చేత డిసైడ్ చేపించుకునే దుస్థితిలో ఉన్నారు ఇక్కడ రచయితలనబడే ఒక వర్గం.
    అసలు మీ పత్రికకు ఈమాట అని ఎందుకు? మీమాట అని పెట్టుకోండి. సరిపోతుంది.
    గొడవే లేదు కదా!
    నువ్వక్కడ
    నీనెక్కిడ
    అని చక్కగా పాడుకుంటాం.
    లేదంటే చి న అని హాయిగా నవ్వుకుందాం.
    ***
    నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల కోసం మరొకసారి ఈమాట వారి మామాట పోస్ట్ చేస్తున్నా

    తెలుగు సమాజంలో కుహనా వాదరచయితలకు, వాళ్ళకు జేజేలు పాడే భజంత్రీలకు ఏనాడూ లోటు లేదు, ఉండదు. సమాజంలో బలహీన, నిమ్న, విస్మృత వర్గాల గురించి వ్రాసినంత మాత్రాన అవి సాహిత్య రత్నాలయిపోవు.

    సాహిత్యమంటే మీరనుకున్నదే ఇతరులు రాయడం కాదు. నిర్భాగ్యులకు, అణగారిన వర్గాలకు సాహిత్యం ఎన్నో ముఖ్యమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. సాహిత్యం అణగారిన వర్గాలకు గొంతును ఇస్తుంది, వారి అనుభవాలను మరియు దృక్పథాలను చూడటానికి మరియు వినడానికి అవకాశం కల్పిస్తుంది. ఇది వారి పోరాటాలను ధృవీకరించడంలో సహాయపడి, పాఠకులలో సానుభూతిని కలిగిస్తుంది.

    రచయితలు సామాజిక అసమానతలను మరియు అన్యాయాలను విమర్శించడానికి సాహిత్యాన్ని ఉపయోగించవచ్చు. అణగారిన వర్గాల వారి విజయ గాథలు సవాళ్లను ఎదుర్కొంటున్న వారిలో ఆశను మరియు ధైర్యాన్ని ప్రేరేపిస్తాయి. అణగారిన సమాజాలకు, అణచివేత లేదా తుడిచివేత ఎదుర్కొంటున్నప్పుడు సాహిత్యం వారి చరిత్ర, సంప్రదాయాలు మరియు గుర్తింపును కాపాడటంలో సహాయపడుతుంది. సాహిత్యం నిర్భాగ్యులకు మరియు సంపన్నులకు సామాజిక సమస్యల గురించి బోధించవచ్చు, అవగాహనను పెంపొందించవచ్చు.

    ఇలా ఇంకో వందరకాలుగా సాహిత్యం ద్వారా ఉపయోగాలను ప్రతిపాదించవచ్చు. మీరెవరు బాబూ అక్కడెక్కడో కూర్చును ఇది తప్పు, ఇది ఒప్పు అని డిసైడ్ చెయ్యడానికి?

    [Edited for language – Ed.]

    ***

    [Sri Venkat: Thank you for fortifying our opinions about the reading comprehension skills of Telugu literati with your emotional outburst. We apologize we can’t answer your questions as we only participate in civil discourse. – Ed.]

  2. కథకుడి అంతర్మథనం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/03/2024 1:51 pm

    >> ముళ్ళపూడి వారిని మించాడు…(డా. ఘండికోట గారు)

    మోహన్‌గారు రాసిన సమీక్ష సులభంగా, అర్ధమయ్యేలా చాలా బాగుంది కానీ ముళ్ళపూడి రాసిన సమీక్షలు, కధలు, కాకరకాయలు చదివిన ఎవరూ ఈ మాట అనలేరు. అమరావతి కధలకి ముళ్ళపూడి సమీక్ష రాసారు (ముందుమాట కూడా). అది మీరు చదవలేదు అనిపిస్తుంది మీరు ఇక్కడ రాసిన వ్యాఖ్య చూస్తే. ముఖ్యంగా మోహన్ గారంటే మీకు ఎంత అభిమానం ఉన్నా ఇక్కడ అసలు విషయం శ్యామ్‌గారి పుస్తకం. అది మీరు చదివారా? ఆ విషయం చెప్పి ఉంటే బాగుండేది. నేను మీ, మోహన్‌గారి, శ్యామ్‌గారి విద్వత్తుని వెక్కిరించడం లేదని గమనించగలరు. వ్యాఖ్యాత ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తే మీరు ఆ పుస్తకాన్ని వదిలేసి వ్యాఖ్యాత గురించి ప్రస్తావించారు. అదే నేను చెప్పదల్చుకున్నది.

  3. కాలుష్యాష్టకం గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:

    10/03/2024 1:11 pm

    * ఏ. తె. కలుషితము తిరుపతి లడ్డూ
    కలుషితములు గోవులు, తిను దధిగ్రాసంబులున్
    కలుషితము కలుపు నేయి
    కలుషితములు ఏడుకొండలును మహి నీకలిలో

    * ఏ. తె. మనయాత్రలు కలుషితములు
    కలుషితమగు మనచేతలతో దేవుడి చేతులు
    గట్టిగ కట్టిన విడిపించుకుని
    వెంకన్న దైవమె జనుల గాపాడవలెన్

    *ఏ. తె – “ఏమో తెలియదు” అనే వృత్తం. ఆయన అష్టకం కలుషితం చేసి దశకం చేసినందుకు శ్యామలరావుగారికి క్షమాపణలతో. 🙂

  4. సంఘర్షణల పళ్ళచక్రం మధ్య నిలిచిన ‘అనుపమ’ గురించి ఎమ్వీ రామిరెడ్డి అభిప్రాయం:

    10/03/2024 12:43 pm

    ఇల్లిందల సరస్వతీదేవి గారి నవల ‘అనుపమ’ చదవలేకపోయిన లోటును తీర్చారు సుభద్రాదేవి గారు. ఆనాటి సామాజిక పరిస్థితుల్ని అవగాహన చేసుకోటానికి ఇలాంటి నవలలు ఉపకరిస్తాయి. సూక్ష్మంగా కథను వివరించటంతోపాటు పాత్రల గురించి అందించిన విశ్లేషణ బాగుంది. శీలా సుభద్రాదేవి గారికి అభినందన పూర్వక ధన్యవాదాలు.
    – ఎమ్వీ రామిరెడ్డి

  5. అప్రకటిత యక్షగానం: రామదాసు చరిత్రం గురించి D.V.N. మల్లికార్జున శర్మ అభిప్రాయం:

    10/03/2024 11:38 am

    శ్రీ భట్టు వెంకటరావు ఈ అరుదైన రచనను వెలుగులోకి తీసుకొని రావడం వెనుక ఎంతటి శ్రమ ఉండగలదో పరిశోధన రంగంలో కృషి చేసే వారికి బాగా తెలియగలదు. ఇటువంటి కళారూపాన్ని తెలుగు వారికి అందుబాటు లోకి తెచ్చిన వెంకటరావు గార్కి అభినందనలు . ప్రదర్శన యోగ్యమైన ఈ యక్షగానాన్ని తగిన కళాకారులకు చేరవేయడం, ప్రాచుర్యానికి తగు ప్రోత్సాహ సహకారాలను అందించగల సమర్ధత గల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సాంస్కృతిక శాఖలు చేయగలవని ఆశిస్తాను.

  6. అజ్ఞాతవాసి గురించి రమ అభిప్రాయం:

    10/03/2024 6:26 am

    విజ్జి పిన్ని! కొత్త గా భలే ఉంది కధ 😘.

  7. సత్సంగం గురించి v.srinivasa rao అభిప్రాయం:

    10/03/2024 1:38 am

    ఆహా’ ఎంత హాయిగా అనిపిస్తున్నదో చదివిన తరువాత. ధన్యవాదాలండీ.

  8. పరిపాకం గురించి v.srinivasa rao అభిప్రాయం:

    10/03/2024 1:28 am

    అద్భుతంగా, ఆచరణీయంగా ఉన్నది. ధన్యవాదాలు రచయితకు మరియు ఈమాటకు.

  9. పాత్రదానం గురించి V.Srinivaasaraavu. అభిప్రాయం:

    10/03/2024 1:04 am

    చాలా బావుంది, ధన్యవాదాలు.

  10. పంచేంద్రియాలు: 1. వాసన గురించి Srinivasa Rao .V అభిప్రాయం:

    10/03/2024 12:59 am

    వ్యాసం ఎంతో బావుంది. ఉపయోగకరం మరియు ఆనందకరం. రచయితకు, ఈమాటకు ధన్యవాదాలు.