Comment navigation


15821

« 1 ... 94 95 96 97 98 ... 1583 »

  1. ప్రసంగాలు – పాటలు గురించి ramakanth గారి అభిప్రాయం:

    11/07/2023 12:13 pm

    ఎప్పటిలాగే చాలా చక్కటి విషయాలు చెప్పారు. రాళ్ళపల్లి గారి రికార్డింగ్ రెండు సార్లు పెట్టినట్టున్నారు. సమయం దొరికినప్పుడు దయచేసి “లలిత సంగీతం” కింద ఉన్న రికార్డింగ్ మార్చండి. Thanks!

    [సరయిన ఆడియో జత చేశామండి. తప్పు చూపినందుకు కృతజ్ఞతలు – సం.]

  2. నేత్రోన్మీలనం గురించి chandrika గారి అభిప్రాయం:

    11/07/2023 9:56 am

    ధన్యవాదాలు సంపాదకుల వారికీ. నా వ్యాఖ్యకి స్పందించినందుకు. ఇటువంటి వ్యాఖ్యలని ఖండించవలసిందే. వేరే ఆలొచనకి తావు లేదు

    రచయిత ప్రైవసీ దృష్ట్యా కొన్నివిషయాలు గోప్యంగా కూడా సంపాదకుల వారు పెట్టి ఉండవచ్చును అన్న దృష్టితో అందుకే మొట్టమొదటి మాటే ఈవిధంగా చెప్పాను. “‘భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం’ – ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఇంకో ఆలోచనే లేదు ఈ విషయంలో _/\_.” ఈ మాట కూడా చెప్పాను ‘నాకు కనిపించలేదో, నా దృష్టికోణం పోలేదేమో మరి’

    నా ప్రశ్న ఒకటే ‘మరి సామాన్య పాఠకుడు వాడి బాధ ఇక ఎవరికి చెప్పుకోవాలి?’ ఆ ప్రశ్నకి సంపాదకులు సమాధానం ఇచ్చినట్లయితే నాలాంటి సామాన్య పాఠకులకు కొంత స్వాంతన.

    ఇక్కడ వ్యాఖ్యలు చేసిన కొందరు, పాఠకులను వారి భక్తిని ఏ కొలబద్ధతో కొలుస్తున్నారో అర్ధం కావటం లేదు. ముఖ పుస్తకంలో ‘ఈమాట’ టపాను పంచుతూ కొందరు తమ వ్యాఖ్యలతో, కథ చదివి బాధ పడ్డ పాఠకులని ఇంకా కించపరుస్తూ మాటలతో గాయపరుస్తున్నారు.

    ఉదాహరణకు ఒకటి చెప్తాను: ‘మీలోనే కొందరు, సాహిత్య పరిధులని దాటి, రచయిత పట్ల విషపూరితమైన, హింసాత్మకమైన భావాలను ఎగదోస్తున్నారు, పైగా వీరంతా, రామ భక్తులమని ప్రకటించుకుంటూ. వీరిని మీరు మీకు చేతనైనంతగా ధిక్కరించండి.’

    కానీ వీరు చాలా సామాన్య పాఠకులు. ‘సీతమ్మ మాయమ్మ’ అనుకునే సామాన్యులు. అమ్మని ఏదన్నా అంటే తట్టుకోలేని చిన్న పిల్లల లాంటి వారు. ‘ఏడ్చాను’ అని ఓ పాఠకురాలు అన్నది అంటే ఎంత క్షోభ పడ్డదో అర్ధం చేసుకొనవచ్చు. ‘కథని కథగా’ చూడాలి అంటే పాఠకుడు మేధావిగా ఉండాలి అని మేధావీ వర్గం చెబుతోందా?

    ఓ పత్రికకి రచయిత freedom of speech ఎంత ముఖ్యమో, ఓ సామాన్యుడి పాఠకుడి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం కాదా? కనీసంలో కనీసం అంత దీనంగా వ్యాఖ్య చేసిన తాడిగడప శ్యామలరావుగారి కైనా క్షమాపణలు చెప్పాలి కదా. ఆయనేమి దూషించలేదు ఎక్కడా! నా FB పోస్టులో వారి వ్యాఖ్యకి దాదాపు 20 మంది వారి మాటకి ఆమోద ముద్ర వేశారు అంటే, వారి బాధను గుర్తించాలి కదా. ‘రచయితలను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవటం భావ్యం కాదు’ అంటూ ఆయన గౌరవప్రదంగానే ఖండించారు. కాబట్టి నా ప్రశ్న ఇటువంటి పాఠకుల గురించి మాత్రమే.

    ‘ఇలా సాహిత్య ప్రయోగాలన్నీ పాఠకుల మనోభావాలు దెబ్బ తీసేలా రచయితలు ప్రయోగిస్తూ ఉంటారు. కానీ పాఠకులు మాత్రం అవేవి పట్టించుకోకుండా ఎటువంటి భావాలు లేకుండా చదివి వెళ్ళిపోవాలి’ అని ఇదేనా పత్రిక వారి ఉద్దేశ్యం/expectation ? ఇక్కడ నేను ఈ రచయిత్రి రచన గురించి నేను మాట్లాడటం లేదు. కేవలం పత్రిక యొక్క వైఖరి గురించి మాత్రమే మాట్లాడుతున్నాను.

    పాఠకుడు ‘తన మనోభావం దెబ్బ తిన్నది’ అని చెప్పే మాటకి విలువ లేదా? ‘సాహిత్యం’ అనేది మేధావీ వర్గానికి మాత్రమే అయితే పత్రికలెందుకు?

    చెప్పవలసింది చెప్పాను. ఇక నా దగ్గర నుంచీ ఏ ప్రతీస్పందన ఉండదు. ధన్యవాదాలు.

  3. నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/07/2023 9:46 am

    సంపాదకులు ప్రచురించి చూపిన Kakra Muralidhar గారి వ్యాఖ్య అభ్యంతరకరంగానే ఉంది. సందేహం లేదు. ఆయన ఈకథను ఎద్దేవా చేసినంత మాత్రాన ఆయనను మీరు భక్తుడు అని ఎగతాళిగా చెప్పటం అవసరం కాదు. ఈకథను దురుసుగా ఆక్షేపించారు కాబట్టి ఆయన భక్తుడు అనటం ద్వారా మీరు భక్తులు ఇలాంటి భాషను భావజాలాన్ని వాడుతారని దురదృష్టకరమైన తప్పుడు అవగాహనకు వచ్చారంటే, మీకు సంప్రదాయికంగా భక్తులనే వారు ఎంతటి వినయభూషణులుగా ఉంటారో అన్న విషయంలో ఏమీ అవగాహన లేదని అర్ధం అవుతున్నది.

    ఆకథా రచయిత్రి యొక్క గౌరవమర్యాదల గురించిన ఆలోచన మీకు కలిగింది. సంతోషం. కాని మీకు యావద్భారతమూ అనాదిగా ఎంతో ప్రేమతో అభిమానంతో గుండెల్లో నింపుకొని పూజించే సీతారాముల గౌరవమర్యాదల గురించిన ఆలోచన ఏదీ ఈకథను ప్రచురణకు అంగీకరించే సమయంలో కలుగలేదు కదా? కథారచయిత్రిపై ఒక రాయి (పోనీ కొన్ని లేదా అనేక రాళ్ళు) పడినందుకు అభ్యంతరమూ ఆవేదనా కలిగిన మీకు సీతారాముల మీద ఇలాంటి కథల ద్వారా రాళ్ళు వేయటం అనుచితం అని కొంచెం కూడా స్ఫురించలేదు! ఈఈఉదయం మాచెల్లెలు ఒకామె మాట్లాడుతూ రాముడి మీద రాళ్ళు విసిరితే కాని రచయితలు కారా ఏమిటి అంది. ఈకాలపు సోకాల్డ్ అభ్యుదయ రచయుతల వ్రాతలు చూస్తే అలాగే ఉన్నాయి.

    మనమధ్యన ఉన్నందుకు రచయిత్రి ఎక్కువ గౌరవనీయురాలున్నూ మనమధ్యన భౌతికంగా లేనందుకు సీతారాములు తక్కువ గౌరవనీయులున్నూ కారని మీరు తప్పక అర్దం చేసుకోవలసి ఉంది. సీతారాముల చరిత్రనూ పాత్రలనూ వక్రీకరించటం వాళ్ళ మీద రాళ్ళు వేయటం అన్నది అగౌరవపరచటం కాదూ అని మీరు అంటే ఇంక చెప్పవలసినది ఏమీ ఉండదు.

    [ ఆ వ్యాఖ్య మీకు కేవలం “అభ్యంతరకరం.” భక్తుడు అని ఎగతాళిగా అనలేదండీ. ఇటువంటి ‘భక్తులూ’ ఉన్నారని చెప్పడం కోసం వాడాను. మీ ఉత్తరానికి రాసిన జవాబులో ఇంకొకరి అభిప్రాయాలు స్క్రీన్ షాట్ కూడా పెట్టి చూపించాను. భక్తులమని వారికి వారే చెప్పుకున్నారు కాబట్టే వాడాను. మీరు 1994 తెలుసా రోజులనుంచీ మాకు పరిచయం. మీమీద మాకు గౌరవం ఉంది. ఈ కథపై మీ అభిప్రాయం మీరు చెప్పారు. బలంగా చెప్పారు. కొన్నిసార్లు చెప్పారు. ఈ కథ పట్ల ఎన్నో భిన్నాభిప్రాయాలు. కథ కొందరికి నచ్చింది. కొందరికి నచ్చలేదు. కథ నచ్చినా నచ్చకున్నా సభ్యమైన భాషతో తమ విమర్శను ప్రకటించిన అన్ని అభిప్రాయాలనూ ఈమాట నియమాల ప్రకారం ప్రచురిస్తూనే ఉన్నాం. కాని, ఎవరినేమన్నా మీరు వ్యక్తిగతంగా తీసుకుని అందుకు స్పందిస్తున్నారో మాకు అర్థం కావటం లేదు. ఇక్కడ మీరొక్కరే లేరు. మీ అభిప్రాయాలే అందరివీ అని అనుకోకండి. దయచేసి ఇక ఇలా చేయకండి. – సం.]

  4. నేత్రోన్మీలనం గురించి Kakra Muralidhar గారి అభిప్రాయం:

    11/07/2023 4:17 am

    బహుశా ఈవిడ *****

    [చంద్రికగారు “ఈ కథ పైన ముఖపుస్తకంలో, బ్లాగులలో నా పరిధిలో నేను చదివిన వ్యాఖ్యలు, పోస్టులు ఒక్కటి కూడా దూషించే రీతిలో లేవు” అని అభిప్రాయపడ్డారు. వారికి, ఇతర పాఠకులకూ ఒక ఉదాహరణ చూపడం కోసం ఈ భక్తుడి అభిప్రాయం ప్రచురిస్తున్నాను. ప్రచురించనివి, ప్రచురించలేనివి, పదులలో ఉన్నాయి కేవలం ఈమాటలోనే. వాటితో పోలిస్తే ఇది పొగడ్తలా కనిపిస్తుంది. – సం.]

  5. నేత్రోన్మీలనం గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    11/07/2023 2:37 am

    విలక్షణమైన కథ. క్షుణ్ణంగా చర్చంచుకోవలసిన కథ. ధాష్టీకాలకు బలి అయింది.

  6. నేత్రోన్మీలనం గురించి Sneha గారి అభిప్రాయం:

    11/06/2023 10:00 pm

    ఈమాట సంపాదకులకు,

    ఈమాట ఒక సాహిత్యపత్రిక. సాహిత్యానికి పరిధులు, పరిమితులు ఉండవని, సాహిత్యం ఆహ్లాదాన్నే కాదు, ఆలోచననూ కలిగించాలని, సమాజపు పోకడలను ప్రశ్నించి, నిలదీసేలా కూడా ఉండాలని నమ్మే పత్రిక.”

    చాలా మంచి నమ్మకం కలిగిన పత్రిక. సమాజపు పోకడలను ప్రశ్నించేలా అన్నారే! ఈ కథ ఏ సమాజపు పోకడను ప్రశ్నిస్తోంది? రామరాజ్యంలో ఏ పోకడలు ఉన్నాయో మీకు తెలుసా? రామరాజ్యం ఎలా ఉండేదో వాల్మీకి మహర్షి చెబితేగానీ తెలిసిరాలేదు. అదే మహర్షి రావణుడు దుర్మార్గుడు అని తీర్పు చెప్పేస్తే కాదు అతి మంచి వ్యక్తి అని కథ రాయడం ఏ సమాజపు పోకడలను ప్రశ్నించడం? సీతారాములది ఎంతో ఉన్నతమైన వ్యక్తిత్వం. మనలాంటి సామాన్య జనాలు (మిమ్మల్ని మీరు సామాన్యులు కాక మేధావులు అన్న భ్రమలో ఉంటారేమో) ఆ వ్యక్తిత్వంలోనుండి ఎంతో కొంత, కనీసం ఒక్క లక్షణాన్ని పట్టుకుని ఆచరిస్తే మానసికంగా ఎదగగలము. మనం ఎత్తుకు ఎదిగేకొద్దీ వారి వ్యక్తిత్వాలు అర్థం చేసుకునే శక్తి వస్తుంది. అంతే కాక ఇలా వారి వ్యక్తిత్వాలను మీ ఇష్టం వచ్చినట్ట్లుగా మార్చి కథరాసి ఆలోచన కలిగించే కథ అంటారా? ఇలాంటి ఆలోచనలు కలిగించే కథలు చదివి సమాజం మరింత మానసికరోగగ్రస్థమవుతుంది. ఇలాంటి విపరీతపోకడలను ఆలోచన అనుకొని ఒకరినొకరు మెచ్చుకుంటూ ఉన్నారు కాబట్టే సమాజం నిండా ఇలాంటి మానసిక రోగాలు వస్తున్నాయి. గొప్ప కష్టం కలిగితే అంత కష్టాన్ని నా రాముడెట్లా భరించినాడో, సీతమ్మ తల్లి ఎంత ఓర్పుతో సహించిందో అనుకుంటే కష్టం నుండి బయటపడే శక్తి వస్తుంది. ఆ తల్లి మానసిక రోగానికి గురై ఎంతో క్షోభ అనుభవించింది అనుకుంటే కలిగేది మానసికరోగం.

    కళలు, సాహిత్యం పట్ల కాని, వాటిని సృజించే కళాకారులు, కవి రచయితలు ఆ క్రమంలో ఏ రకమైన నిర్బంధాలకూ గురి కాగూడదని, వారికి వారి సృజన పట్ల పూర్తి స్వేచ్ఛ ఉందనీ నమ్మే పత్రిక

    స్వేచ్చ అన్నది కేవలం కవులకు, రచయితలకు మాత్రమే ఉందా? మీ పాటికి మీరు రాసి ఆన్‌లైన్‌లో పడేసి కేవలం మెచ్చుకోవాలి తప్ప వివర్శించకూడదు అంటే చదివేవాడికి లేదా స్వేచ్చ? ఎవరికోసం రాస్తారు ఈ కథలు? కొందరు రచయితలు ఒక గుంపుగా ఏర్పడి ఒకరినొకరు మెచ్చుకోవడానికా? అలా అయితే ఈ చెత్త మా మొహాన కొట్టడం ఎందుకు ఈ కథలను మీకు నచ్చినవారితో పంచుకుని చర్చించుకోండి. మా నమ్మకం మీద, మా సంస్కృతి మీద ఇలా దారుణంగా దెబ్బ కొట్టకండి అని చెబితే దాడి అంటారేమిటి? మొదలుపెట్టడం ఎందుకు, పట్టుబడితే విక్టిమ్ కార్డ్ చూపించడం ఎందుకు? రాసేవాడికి సమాజంలో మనుషుల నమ్మకాల పట్ల, సంస్కృతి పట్ల బాధ్యతలేదా?

    కాని, సాహిత్య విమర్శ ఆ వేదికను దాటి, మత రాజకీయశక్తులకు, వారి దౌర్జన్యానికి ఒక ఆయుధమై, రచయితలకు మానసిక, శారీరక హాని కలిగించే ప్రమాదం ఉందని నిశ్చయమైనప్పుడు ఆయా రచయితలను కళాకారులను కాపాడుకోవడం కూడా ఈమాట తన బాధ్యతగానే పరిగణిస్తుంది.

    భౌతికదాడులు చేయడం అన్నది ఖండించాలి. ఇందులో మరోమాట లేదు. మీ కళాకారులని మీరు కాపాడుకున్నట్లే, మా సంస్కృతిని మేము కాపాడుకుంటాము. మా సంస్కృతిమీద దాడి జరిగినా, మా సీతారాముల వ్యక్తిత్వాలకు మచ్చ తెచ్చేట్లు కథలు రాసినా మేము ఖండిస్తాము. మీరు దాడి మొదలుపెట్టకండి. విమర్శలు వస్తే విక్టిమ్ కార్డ్ వేయకండి.

    నేత్రోన్మీలనం అన్న ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలియడంతో, రచయిత్రి చట్టపూర్వకంగా చేసిన అభ్యర్థన మేరకు, ఆమె భద్రత గురించిన ఆందోళనతో, ఈ కథను ఈమాట నుంచి తొలగిస్తున్నాను. ఈ కథ ప్రచురించడం ద్వారా ముందు ముందు రాబోయే ఏ రకమైన చట్టపరమైన చర్యలకైనా ఈమాట బాధ్యత వహిస్తుందని తెలియజేస్తున్నాను.”

    భౌతికమైన దాడులు ఎవరిమీదైనా ఖండించదగినవే.

    నేనుకూడా ఇలాంటి కథలు రాసేవాళ్ళ మీద, ప్రచురించే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొనేరోజు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

  7. నేత్రోన్మీలనం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:

    11/06/2023 9:46 pm

    శోధిని అగ్రిగేటర్ వారి వ్యాఖ్యల పేజీలో ఉన్న చంద్రిక గారి క్రొత్త వ్యాఖ్యను చూసి స్పందనగా వ్రాస్తున్న కొద్ది మాటలు.

    నా మనస్సు ఇప్పటికీ గాయపుతీవ్రత నుండి కోలుకోలేదండి. అఖండరామనామస్మరణం కొనసాగిస్తూ దాని పూర్వకంగా ఉపశమనం లభిస్తుందని ఎదురుచూస్తున్నాను.

    ఈ కథను రాసిన రచయిత్రికి అశ్లీలము, అసభ్యము అయిన దూషణలే కాక, ఆమెపై భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం, అది నిజం అయే ప్రమాదమూ ఉందని తెలిసిందని మాధవ్‌గారు అన్నది చదివాను. అది ఆందోళనకరమైన విషయం. రచయితలను వ్యక్తిగతంగా లక్ష్యం చేసుకోవటం భావ్యం కాదు. అలా లక్ష్యం చేసుకొనే వారి వివేకం చిత్యం.

    రచయితలు కూడా సామాజికబాధ్యతను కలిగి ఉండాలని గుర్తెరగాలి. సామాజికబాధ్యత అన్నది సున్నితమైన అంశం. వారి కాల్పనికస్వేఛ్చను సమాజం గౌరవిస్తుంది. వారు నైతిక సాంస్కృతిక ప్రమాణాలను అవహేళన చేయకుండా జాగ్రత వహించాలి కాని నవ్యత అన్నపేరుతో ఇష్టారాజ్యంగా వ్రాయటం క్షమార్హం కాదు.

    బాధ్యత కల రచయితలు సమతూకంగా ఆలోచించి వ్రాస్తారు. బాధ్యత కల చదువరులు కూడా వివేకంతో స్పందిస్తారు కాని వ్యక్తులను లక్ష్యం చేసుకోరు.

  8. నేత్రోన్మీలనం గురించి Chandrika గారి అభిప్రాయం:

    11/06/2023 3:41 pm

    ‘భౌతికమైన దాడులకు కూడా సంసిద్ధత వ్యక్తం కావడం’ – ఖచ్చితంగా ఖండించవలసిన విషయం. ఇంకో ఆలోచనే లేదు ఈ విషయంలో _/\_.

    ఈ కథ పైన ముఖపుస్తకంలో, బ్లాగులలో నా పరిధిలో నేను చదివిన వ్యాఖ్యలు , పోస్టులు ఒక్కటి కూడా దూషించే రీతిలో లేవు. నాకు కనిపించలేదో, నా దృష్టికోణం పోలేదేమో మరి. అందరూ బాధ పడుతూ, వేదన చెందుతూ పెట్టిన పోస్టులే నాకు కనిపించాయి. నిజం చెప్పాలి అంటే ‘శ్యామలీయం’ గారి వేదన చూసి కళ్ళలో నీరు వచ్చింది అని చెప్పాలి. చాలా బాధ అనిపించిన విషయాలు రెండు ఈ కథ విషయంలో.

    ఒకటి ‘శ్యామలీయం’ అనే బ్లాగుతో తాడిగడప శ్యామలరావు గారు వ్రాస్తారు. క్రమం తప్పకుండా రోజూ రాముల వారిపై ఓ కీర్తన ఉంటుంది వారి బ్లాగులో. ఆయన వ్యాఖ్య ఇక్కడ చూసి నాకే కన్నీరు వచ్చింది. ఓదార్చడానికి ప్రయత్నిస్తే వారు సమాధానం ఇది ‘నా మనస్సు చాలా దారుణంగా గాయపడి ఉంది. ఎప్పటికి ఉపశమనం కలుగుతుందో తెలియదు’.

    ముఖపుస్తకంలో ఇంకొక ఆవిడ కూడా కథ చదివి ‘ఏడ్చాను’ అని వ్రాసారు.

    ఈ విధంగా రామాయణం అంటే రోజూ వారి జీవనం కొందరికి. ‘మానవ శరీరం’ మీద ప్రయోగాలు చేసే వైద్య విద్యార్థి కూడా కొన్నిటికి చలించిపోతాడే? ‘కథని కథలా చూడాలి’ అంటూ రామాయణం అనేది ఓ ‘కథాంశం’ మాత్రమే అనుకునే వారికి ఈ సామాన్యుల బాధ అర్ధం కాదా? ’రామాయణం’ అనేది ఒక సంస్కృతి అని ఏ రోజున గ్రహిస్తారు? ఒక కళాకారుడి సృజనాత్మకతను అర్ధం చేసుకునే మీ పత్రిక, బాధ కలిగితే ‘అయ్యో రామచంద్రా’ అంటూ రాముడిని తల్చుకునే ఒక సంస్కృతిని అర్ధం చేసుకోలేదా? లెదా సాహిత్యానికి /సంస్కృతికీ సంబంధమే లేదంటారా?

    నా ఆవేదనని విశదీకరిస్తూ ఓ సామాన్య పాఠకురాలిగా ‘సంచిక’ పత్రికలో ఓ వ్యాసం వ్రాసాను. అదే విధంగా ఓ సామాన్య పాఠకురాలిగా అక్టోబర్ 21- 22 జరిగిన వంగూరి గారి సాహితీ సదస్సులో కూడా ప్రసంగించడం జరిగింది. ప్రసంగించిన వారానికే ఇటువంటి కథ మీ పత్రిక ప్రచురించింది అంటే, నాలాంటి సామాన్యుల సంస్కృతి అంటే ఓ ‘కథాంశం’ మాత్రమే అని మీ పత్రిక నిరూపించింది.

    అందరూ కళాకారులే! అందరూ సాహిత్య మేధావులే! మరి సామాన్య పాఠకుడు వాడి బాధ ఇక ఎవరికి చెప్పుకోవాలి?

    https://sarachandrika.wordpress.com/

    [చంద్రికగారూ, క్రింద ప్రచురించిన కాక్ర మురళీధర్‌గారి అభిప్రాయం చూడగలరు. – సం.]

  9. అలా నచ్చుతుంది గురించి వంశీ క్రిష్ణ గారి అభిప్రాయం:

    11/06/2023 12:51 pm

    చాట్ పీజీకి మగ బొమ్మని జోడించి ప్రేమికుడిగానో భర్తగానో ఉంచుకున్న ఏఐ మాయాజాలం, మీ ఊహకి జోడించిన కథ అదుర్స్.

  10. నేత్రోన్మీలనం గురించి Rams గారి అభిప్రాయం:

    11/06/2023 12:02 pm

    ఆసక్తికరమైన రచన, అంతరంగాన్ని ఆవిష్కరించడం, ఆత్మగౌరవం, ఊహ, వర్ణన అన్ని కలగలిసినట్టున్నాయి. సీతదేవి ఆధార్ ప్రూఫ్‌తో వస్తే కాని దీన్ని ఖండించలేనిది. ఎందుకంటే భావప్రకటన స్వేచ్చ.

« 1 ... 94 95 96 97 98 ... 1583 »