Comment navigation


15818

« 1 ... 70 71 72 73 74 ... 1582 »

  1. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి అల్లాడి మోహన్ గారి అభిప్రాయం:

    04/07/2024 9:13 pm

    మెడికో శ్యామ్ ఆలోచనాలోచనాల్లో… సాహిత్య సాగరయానం, వరివస్య ఆద్యంతమూ అబ్బురపరుస్తూ సాగింది. కథలు, వాటివెనుక కథావస్తువులు, కలలు, కథా రచయితలు, పాత్రలు… వీటన్నిటితో తన అనుభవాలు జ్ఞాపకాలు మేళవించి ఒక అరుదైన సాహిత్యయోగాన్ని అందించారు రచయిత. చదివిన పుస్తకాల గురించి కుతూహలాన్ని రేకెతిచ్చే కథనాలు కలిగిన ఈ రచన, చదవరులు మరిన్ని మంచి పుస్తకాలు చదివేందుకు స్ఫూర్తి కాగలదు!

  2. పొంతన గురించి Vijaya Karra గారి అభిప్రాయం:

    04/06/2024 9:30 pm

    కథ సింపుల్‌గా, హాయిగా వుంది. ఇలాంటి మంచి ప్రేమ కథ చదివి చాలా ఏళ్లయింది. సౌమ్యా రాఘవన్ కథలు మరిన్ని అనువాదం చెయ్యండి.

  3. రెండు ప్రయాణాలు గురించి కె.కె. రామయ్య గారి అభిప్రాయం:

    04/06/2024 9:25 am

    సత్యాన్వేషి మూలా సుబ్రతో కవిత్వం స్వీట్ అండ్ సింపుల్ అని త్రిపుర తండ్రి చేత కూడా ప్రశంసించ బడినాడు.

  4. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి వసుంధర గారి అభిప్రాయం:

    04/06/2024 9:22 am

    తెలుగు కథకు ఈ తరహా విశ్లేషణ అపూర్వం. ఇది అందించడానికి తగిన పరిజ్ఞానం, పరిణతి, సామర్థ్యం ఉన్న మెడికో శ్యాం – అందుకు పూనుకోవడం తెలుగు సాహితి అదృష్టం. సాహితీప్రియులందరూ చదివి తీరాల్సిన ఈ ప్రసంగవ్యాసం- వెనుకనున్న కృషి, తపన అభివందనీయం అంటే అది చాలా చిన్నమాట!

    తెలుగు సాహితికి అద్భుతమైన ‘షామియానా’ సమకూర్చిన మెడికో శ్యాం లో మరో విశేషం – తన మనోభావాల్ని సూటిగా నిష్కర్షగా నిజాయితీగా చెప్పడం! అందువల్ల వారి పొగడ్తలకూ, విమర్శలకూ విలువ పెరుగుతుంది. ఎన్నో దశాబ్దాల క్రితం జ్ఞాపకాల్లోంచి వ్రాస్తున్నందువల్ల ఎక్కడైనా తప్పులు దొర్ల వచ్చునన్న అనుమానాన్ని వెలిబుచ్చారు వారు. ఆ మేరకు మా (వసుంధర) రచనలకు సంబంధించిన రెండు సవరణలను ఇక్కడ ఇస్తున్నాము.

    1. ‘పెసరపప్పు’ మా మొదటి కథ కాదు. మొదటిది ఆంధ్రపత్రికలో వచ్చిన ‘స్టంటు సినిమా కథ’. స్వాతి మాసపత్రిక తాజా సంచిక (మే 2024) లో కెవిఎస్ వర్మ అనే రచయిత ఇటీవలే దీన్ని పరిచయం చేశారు.

    2. ముళ్లపూడి వెంకటరమణ గారు ఎస్టీడీ ఖరీదైన రోజుల్లో మద్రాసునుంచి అరగంటకు పైగా మమ్మల్ని మెచ్చుకుంటూ చేసిన ఫోను- ”పెళ్లయ్యాక చూడు’ నవల గురించి కాదు. ‘పెళ్లి చేసి చూడు’ నవల గురించి. మధ్యతరగతి కుటుంబంలో ఓ ఆడపిల్ల పెళ్లి కథ అది. ”పెళ్లయ్యాక చూడు’- దాంపత్య జీవితంలో దంపతులకు తొలి సంతానం ముచ్చట్లు. మెడికో శ్యాం గారు చదివింది ఇది. ఒక విధంగా ఇది మాకు సంతోషమే. రెండు నవలలకూ మహామహుల ప్రశంస లభించినట్లు కదా!

    ‘షామియానా’లో మెడికో శ్యాం విశ్వరూపాన్ని దర్శించినవారిగా- వారి ప్రసంగవ్యాసంలో మా రచనల ప్రసక్తి రావడం మాకు గౌరవంగా భావిస్తున్నాం.

    ఈ ప్రసంగవ్యాసాన్ని- సాహితీలోకానికి అందించిన శ్రీ మెడికో శ్యాం గారికి కృతజ్ఞతలు; ప్రచురించిన ‘ఈ మాట’కు అభినందనలు; మాకు చేర్చిన శ్రీమతి శ్యామల గారికి ధన్యవాదాలు.

    వసుంధర, హైదరాబాద్

  5. దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2 గురించి Ramesh గారి అభిప్రాయం:

    04/05/2024 10:35 pm

    ఇది ఒక అద్భుతమైన యత్రానుభవం. ధన్యవాదాలు మీ ఈ యాత్రాపరిచయం.

  6. ఏప్రిల్ 2024 గురించి సాయి బ్రహ్మానందం గొర్తి గారి అభిప్రాయం:

    04/05/2024 3:28 pm

    సంగీతానికి గుత్తేదారలమంటూ వెలుబుచ్చే వారి అభిప్రాయాలకి అతీతమైంది త్యాగరాజు సంగీతం.

    ఒకప్పుడు జాన్ హిగ్గిన్స్ కర్నాటక కచేరీని కూడా హేళన చేసినవారున్నారు. ఇంగ్లీషు వాడవడం వలన ఉచ్ఛారణ బాగో లేదనీ, వేరే మతస్థులు పాడితే త్యాగరాజ కృతులలో వున్న భక్తి భావం కనిపించదనీ సన్నాయి నొక్కులు నొక్కేవారు. అవన్నీ పక్కనబెట్టి ఆయన పని ఆయన చేసుకున్నాడు, పాడగలిగినంతా కచేరీలు చేసాడు. ఇప్పటిలా సోషల్ మీడియా వంటి వెసులు బాటులు లేకపోవడం వలన ఎవరూ అంతగా పట్టించుకోలేదు; షేక్ చిన మౌలానా తన నాద స్వరంలో త్యాగరాజ కృతులు అద్భుతంగా పలికించాడు.

    సంగీతానికి కులం, మతం ఎప్పుడూ అడ్డు కావు; కాకూడదు కూడా. సంగీతానికి సాహిత్యం ఒక వాహకం మాత్రమే! సాహిత్యం లేకపోయినా సంగీతం మనగలదు.

    పేరుపొందిన విద్వాంసులు కూడా త్యాగరాజు కృతులు పాడేటప్పుడు సాహిత్యం తప్పుగా ఉచ్ఛరిస్తారు. పదాలని విరవకూడని చోట విరుస్తారు.

    అంతెందుకు? అందరికీ తెలిసిన “సామజ వరగమనా” పాట ( సినిమాది కాదు; కచేరీల్లో పాడినది ) వినండి: ఒక చరణంలో–సామని గమజ సుధా–అని పాడతారు. సాహిత్యాన్ని పట్టించుకుని పాడాలంటే–సామ నిగమజ సుధా–అని పాడాలి. పేరొందిన సంగీతజ్ఞులు కూడా ‘సామని గమజ సుధా’ అనే పాడతారు. బాలమురళి మొదట్లో అందరిలాగా పాడినా, తరువాత సవరించుకుని సాహిత్య ప్రకారమే పాడారు.

    ‘బంటురీతి కొలువూ ఇయ్యవయ్య రామా’ కృతిలోనో ఇలాంటి తప్పిదాలే దొర్లుతాయి.

    వ్యక్తిగత అయిష్టాలతో రోడ్డెక్కి సంగీతానికి తామే గుత్తేదారులనుకోవడం ఎవరికీ మేలు చేయదు.

  7. దక్షిణ అమెరికా దృశ్యమాలిక-2 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    04/05/2024 2:20 am

    కీతో ఉన్నది 2850 మీటర్ల ఎత్తులో..
    ఆక్సిజన్ ప్రస్తావన వచ్చింది ట్రెక్కింగులో 4000 మీటర్ల మార్క్ దాటినపుడు..
    మెడికల్ టెర్మ్స్ లో 2500 మీటర్లు దాటాక హై అల్టిట్యూడ్ గా పరిగణిస్తారని గుర్తు.

  8. ఆలోచనాలోచనాల్లో నే చదివిన పుస్తకాల్లో పాత్రలూ వాక్యాలూ గురించి డి.య‌స్.యస్.రామం గారి అభిప్రాయం:

    04/05/2024 12:15 am

    మన అనుభవాలు, జ్ఞాపకాలు, ఆలోచనలు మనతో పాటు చివరిదాకా వస్తాయి. ఎన్ని పుస్తకాలు చదివినా ఆ పాత్రలు ఏవీ గుర్తు లేవు. తప్పని సరిగా వాటి ప్రభావం మన మీద ఉండి ఉంటుంది. చాలా బాగా చెప్పారు.

  9. మార్ట్ డ్రకర్ గురించి MAD books గారి అభిప్రాయం:

    04/04/2024 10:18 pm

    అరకొర చూసాను గానీ, ఈ మార్ట్ డ్రకర్ గురించి మొదటిసారి తెలుసుకున్నాను. థాంక్స్ టు అన్వర్ గారు.

  10. గ్రహణాలు: అజ్ఞానం నుండి విజ్ఞానం దాకా గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:

    04/04/2024 3:52 pm

    అయ్యా
    లింకులు ఇస్తే రిఫెరెన్స్ ఇచ్చినట్టా? కాదని నా పుస్తకాల పబ్లిషర్స్ ఎన్నో నెలలబట్టి చెప్తున్నారు. లింకులో ఇచ్చిన వ్యాసాలకీ, అందులో బొమ్మలకి వేరే కాపీరైట్ ఉంటుంది. రూల్స్ ప్రకారం పుస్తకాల, వ్యాసాల, బొమ్మల కాపీరైట్ రచయిత/ఆర్టిస్ట్ జీవితకాలం ప్లస్ మరో డబ్భై సంవత్సరాలు. వ్యాసం చివర్లో ఆయా బొమ్మలు వేసినవారివి అని చెప్పాల్సి ఉంటుంది. మీరు పబ్లిగ్గా ఊరికే ఇచ్చిన బొమ్మలు వాడినా వ్యాసం చివర్లో ఫలానా వ్యాసం మా రిఫరెన్స్ అని చెప్పడం మర్యాద. లింక్ ఇచ్చేసి అదే రిఫరెన్స్ అనుకోమనడం సరైనది కాదని నాకు పదే పదే చెప్పారు వేరు వేరు సంపాదకులు. ఆఖరికి మీరు మైక్రోసాఫ్ట్ విండోస్, ఆఫీస్ వారి స్క్రీన్ షాట్ వాడినా అవి ఫలానా అని చెప్పాల్సి ఉంటుంది మర్యాద కోసం. అవి అందరికీ తెల్సు, కావాలంటే లింకులో చూసుకుంటారో పోతారో మాకేల అనుకోవడం మంచిది కాదనుకుంటా.

    నాకు తెల్సినది చెప్పాను. తర్వాత మీ ఇష్టం. కాపీ రైట్ రూల్స్ ఇక్కడ.

    https://www.copyright.gov/help/faq/faq-duration.html#:~:text=As%20a%20general%20rule%2C%20for,plus%20an%20additional%2070%20years.

« 1 ... 70 71 72 73 74 ... 1582 »