చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం – కుండంత భావాన్ని కొండంత వృత్తంలో చెప్ప బోతే వచ్చే చిక్కులు – మూలంలో నవనీతం – అనువాదంలో పాలలో కలిసిపోయింది.
సంస్కృత భాగవతం నేను చదవలేదు కానీ, పోతన భాగవతంలో కొన్ని పద్యాలలో కృష్ణుడు వెన్న, పాలు, పెరుగు, నేయి, ఒకటేమిటి మొత్తం Dairy Industry అంతా కొల్లగొట్టాడని ఉంది. అలా అని గోకులం నాశనం చేసినట్టు లేదు. నిజానికి కృష్ణుడు పుట్టాకనే మొత్తం గోకులంలో Dairy Industry అంతా బాగా వృద్ధి చెందినది అంటారు. అదీగాక “మధురానగరిలో చల్లనమ్మ బోయెద దారి వీడుము కృష్ణా …” అనే పాట విని ఉండొచ్చు తెలుగువాళ్ళు. చల్ల అంటే మజ్జిగే కదా?
మత్త. పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! [10.1-310 ]
అనువాదం చేయడంలో నేనూ కొన్ని కష్టాలు పడ్డాను కనక ఓ మాట చెప్పగలను. ఒక భాష, సంసృతిలోంచి మరో భాష/సంస్కృతిలోకి సరిగ్గా అనువాదం చేయడం దాదాపు అసంభవం కొన్ని వెసులుబాట్లు కల్పించుకోకపోతే. పోతన వ్యాస భాగవతం ఒకటే కాక అనేక గ్రంధాలు దగ్గిర ఉంచుకుని భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు అంటారు. అందులో శ్రీధర భాగవతం కూడా ఒకటి అని విన్నాను. పోతన తెలుగు భాగవతంలో మీగడ అన్నం తింటూ మాగాయ/ఊరగాయ నంచుకున్నాడని ఉంటుంది (తెలుగు చందమామలో కూడా). ఆంధ్రా నుండి కొంచెం పైకి ఉత్తరంగా వెళ్తే ఆవకాయ, మాగాయ, ఊరగాయ అంటే ఎవరికీ తెలియదు; “అచార్” అనే పదం తెల్సినా అది ఆవకాయ/మాగాయ కింద రాదని నేను అనుకుంటున్నా. భాగవతంలోకి మాగాయ/ఊరగాయ ఎలా వచ్చిందనేది పోతన సృష్టే అని చెప్పుకోవాలి.
రవీంద్రనాథ్ టాగోర్ విషయంలో పేర్లు తెలుగు లోకి అనువదించడం పెద్ద తలనెప్పి. అవేమిటో కూడా అర్ధం కావు ఒక్కొక్కప్పుడు. ఉదా: ఒక పేరు “ఫైల్నా.” పోనీ మొత్తం అన్నీ పేర్లు మార్చి తెలుగులో రాద్దామా అంటే కుదరదు/నప్పదు. లేకపోతే చందమామ కధలాగా “ఒకవూర్లో ఓ రాజు ఉండేవాడు, రాజుకి ముగ్గురు కొడుకులు. ….” అలా తయారౌతుంది.
అయితే యదుకుల భూషణ్ గారి వ్యాఖ్య అద్భుతంగా ఉంది. ఇటువంటి వ్యాఖ్యలతోనే రచయితలు తమ రచనలు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
శ్యామల రావు గారి చౌరాష్టకం అనువాదపద్యాలను చూడడం జరిగింది పద్యాలు చాలా బాగున్నాయి. వారికి నా హృదయపూర్వక అభినందనలు! పద్యాలతో పాటు విజ్ఞుల ప్రతిస్పందనలు కూడా చూడడం జరిగింది. అయితే దాదాపుగా అందరూ పద్యాలు బాగున్నాయని ప్రతిస్పందిస్తే ఒక విమర్శలో మాత్రం అనువాదం మూలంలో లేని విషయాలను చేర్చిందని, పద్యాలు పేలవంగా ఉన్నాయని, గానయోగ్యంగా లేవని తెలుపడం జరిగింది!
దీనికి స్పందిస్తూ శ్యామలరావు గారు ఇచ్చిన సమాధానంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంకొంచెం లోతుగా వెళితే, విమర్శ సహేతుకంగా లేదేమోనని, విమర్శ లోని ఈ క్రింది వాక్యంతో తేటతెల్లమౌతుంది.
“చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం”
బహూశా విమర్శకులకు పోతన గారి ఈ భాగవత పద్యం గుర్తుకు రాలేదేమో!
శ్యామలరావు గారి కలంనుండి మరిన్ని చక్కటి పద్యాలు వస్తాయని, ఈ మాట వేదిక ద్వారా వాటిని చూడాలని అభిలషిస్తూ వారికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా!
తెలుగు భాగవతం సరే, వ్యాసభగవానుల మూలంలో ఎలా ఉన్నదీ చూదాం. దశమస్కంధే పూర్వార్ధే తృణావర్తమోక్షో నామ సప్తమోఽధ్యాయః అని ఆతరువాత విశ్వరూపదర్శనే అష్టమోఽధ్యాయః వస్తుంది.ఆ అష్టమోధ్యాయం నుండి మూడు శ్లోకాలను ఉటంకిస్తున్నాను.
ఈ శ్లోకాలను ఆధారం చేసుకొని పోతనామాత్యులవారు విజృంభించి 307వ పద్యం నుండి 334వ పద్యం వరకూ గోపికలు యశోదాదేవితో మొఱపెట్టుకొనటం బహుచమత్కారంగా వర్ణించారు.
మూలంలో కూడా స్తేయయోగార్హమైన వస్తువులలో దధి పయః అని పెరుగునూ పాలనూ పేర్కొన్నారు.
వేమన్నగారు గొల్లయిండ్ల పాలు కోరినాడని అనటం దాకా అక్కర లేదు – పోతన్నగారే పాలుపెరుగు మననీడమ్మా అన్నారు గొల్లెతలని చెప్పారని అనటం దాకా కూడా అక్కర లేదు. మూలంలోనే గోపాలకృష్ణుల వారి పయః స్తేయం స్పష్టంగానే ఉన్నది.
శాంతిశ్రీ గారు అన్నట్లు కథనే ప్రామాణికంగా తీసుకుని చదవడం సరైన పని. కానీ కధను చర్చించేటపుడు ఆ కథ పూర్వాపరాలూ నేపథ్యాలూ కూడా పరిగణించడం అవసరం. ఉదాహరణకు కొత్త పాఠకులు కన్యాశుల్కం ను ఊరికే అలా చదివితే ఆ నాటకం బోధపడదు.
ఈ కథను లోతుగా చర్చించినపుడు కథ దేని గురించి అన్న ప్రశ్న వస్తుంది. భిన్నాభిప్రాయాలకు అవకాశమున్న కథ ఇది. ఈ నేపథ్యంలో తన కథ గురించి ఏమన్నాడో ఆమాట పబ్లిక్ డొమైన్లో ఉంది. మళ్ళా ఆయన అన్నమాటలో సగమే విశేష ప్రాచుర్యంలో ఉంది. ఈ సగాన్నే పరిగణిస్తే ఇది కొన్ని పరిధుల పరిమితిలో రాసిన ప్రేమకథ అని స్పష్టమవుతుంది. కానీ ఆయన అన్నమాటను పూర్తిగా గమనిస్తే ఈ కథ మనిషిలోని వాంఛను బహిర్గతం చెయ్యడానికి రాసారని స్పష్టమవుతుంది. నిశితంగా చూస్తే ఈ రెండు ఉద్దేశ్యాల మధ్య కధ కుంటినడక నడిచిందనిపిస్తుంది.
*
ఏదేమైనా కథను కథగానే ఒక పాఠకుడిగా చదివినపుడు అది ఆ చదువరి మనసుమీద బలమైన ముద్రవేసి చాన్నాళ్ళు వెంటాడుతుంది. అందుకే అంత పేరు.
ఈ సుదీర్థమైన ఎంతో అందమైన చాలా ఉపయుక్తమైన ఆసక్తికరమైన వ్యాసంలో ఆశ్చర్యం నాపేరు కూడా ఉంది. ఎంతో కృతజ్ణుడిని గుర్తుంచుకొన్నందుకు.
నేను అమెరికాకు వచ్చిన క్రొత్తలో SCIT వేదికలో రాయల వారి తలపక్షచ్చట గ్రుక్కి బాతువులు అన్న పద్యం గురించి వ్రాసి రంగప్రవేశం చేసాను. దానికి అభినందనపురస్సరంగా స్పందించిన మొదటి సహృదయులు పిల్లలమఱ్ఱి రామకృష్ణగారు.
పిల్లలమఱ్ఱి రామకృష్ణ గారు బహుసౌమ్యులు సహృదయులు. వారితో నాకు మంచి మైత్రి ఉండేది. నేను అమెరికానుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత వారికి దూరమైనాను. వారి మెయిల్ అడ్రసును పోగొట్టుకున్నాను. ఎంత ప్రయత్నించినా వారిని మరలా పలుకరించలేక పోయాను. వారి మెయిల్ అడ్రసు ఎవరైనా ఇస్తే, ఇచ్చినవారికి కృతజ్ఞుడనై ఉంటాను. రామకృష్ణ పిల్లలమఱ్ఱి వారిని పలుకరించటానికి మరలా ప్రయత్నిస్తాను.
రచ్చబండ గురించి తెలియదు! తెలుసా రోజులను ఐతే ఇప్పటికీ మరిచిపోలేను. తెలుసా మిత్రులనూ మరచిపోలేను.
మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.
కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.
అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?
వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?
ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.
దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి శర్మ దంతుర్తి గారి అభిప్రాయం:
11/10/2024 9:19 am
సంస్కృత భాగవతం నేను చదవలేదు కానీ, పోతన భాగవతంలో కొన్ని పద్యాలలో కృష్ణుడు వెన్న, పాలు, పెరుగు, నేయి, ఒకటేమిటి మొత్తం Dairy Industry అంతా కొల్లగొట్టాడని ఉంది. అలా అని గోకులం నాశనం చేసినట్టు లేదు. నిజానికి కృష్ణుడు పుట్టాకనే మొత్తం గోకులంలో Dairy Industry అంతా బాగా వృద్ధి చెందినది అంటారు. అదీగాక “మధురానగరిలో చల్లనమ్మ బోయెద దారి వీడుము కృష్ణా …” అనే పాట విని ఉండొచ్చు తెలుగువాళ్ళు. చల్ల అంటే మజ్జిగే కదా?
మత్త. పుట్టి పుట్టఁడు నేడు దొంగిలఁ బోయి మా యిలు జొచ్చి తా
నుట్టి యందక ఱోలు పీఁటలు నొక్క ప్రోవిడి యెక్కి చై
పెట్టఁ జాలక కుండ క్రిం దొక పెద్ద తూఁ టొనరించి మీ
పట్టి మీఁగడపాలు చేరలఁ బట్టి త్రావెఁ దలోదరీ! [10.1-310 ]
మిగతా “పాలు కొల్లగొట్టే” పద్యాలు 10.1-306 నుంచి 329 వరకూ కింద లింకులో చూడవచ్చు.
https://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=45
అనువాదం చేయడంలో నేనూ కొన్ని కష్టాలు పడ్డాను కనక ఓ మాట చెప్పగలను. ఒక భాష, సంసృతిలోంచి మరో భాష/సంస్కృతిలోకి సరిగ్గా అనువాదం చేయడం దాదాపు అసంభవం కొన్ని వెసులుబాట్లు కల్పించుకోకపోతే. పోతన వ్యాస భాగవతం ఒకటే కాక అనేక గ్రంధాలు దగ్గిర ఉంచుకుని భాగవతాన్ని తెలుగులోకి అనువదించాడు అంటారు. అందులో శ్రీధర భాగవతం కూడా ఒకటి అని విన్నాను. పోతన తెలుగు భాగవతంలో మీగడ అన్నం తింటూ మాగాయ/ఊరగాయ నంచుకున్నాడని ఉంటుంది (తెలుగు చందమామలో కూడా). ఆంధ్రా నుండి కొంచెం పైకి ఉత్తరంగా వెళ్తే ఆవకాయ, మాగాయ, ఊరగాయ అంటే ఎవరికీ తెలియదు; “అచార్” అనే పదం తెల్సినా అది ఆవకాయ/మాగాయ కింద రాదని నేను అనుకుంటున్నా. భాగవతంలోకి మాగాయ/ఊరగాయ ఎలా వచ్చిందనేది పోతన సృష్టే అని చెప్పుకోవాలి.
రవీంద్రనాథ్ టాగోర్ విషయంలో పేర్లు తెలుగు లోకి అనువదించడం పెద్ద తలనెప్పి. అవేమిటో కూడా అర్ధం కావు ఒక్కొక్కప్పుడు. ఉదా: ఒక పేరు “ఫైల్నా.” పోనీ మొత్తం అన్నీ పేర్లు మార్చి తెలుగులో రాద్దామా అంటే కుదరదు/నప్పదు. లేకపోతే చందమామ కధలాగా “ఒకవూర్లో ఓ రాజు ఉండేవాడు, రాజుకి ముగ్గురు కొడుకులు. ….” అలా తయారౌతుంది.
అయితే యదుకుల భూషణ్ గారి వ్యాఖ్య అద్భుతంగా ఉంది. ఇటువంటి వ్యాఖ్యలతోనే రచయితలు తమ రచనలు మెరుగుపర్చుకునే అవకాశం ఉంది. మంచి సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు.
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి Tupurani Krishnama Chary గారి అభిప్రాయం:
11/10/2024 1:35 am
శ్యామల రావు గారి చౌరాష్టకం అనువాదపద్యాలను చూడడం జరిగింది పద్యాలు చాలా బాగున్నాయి. వారికి నా హృదయపూర్వక అభినందనలు! పద్యాలతో పాటు విజ్ఞుల ప్రతిస్పందనలు కూడా చూడడం జరిగింది. అయితే దాదాపుగా అందరూ పద్యాలు బాగున్నాయని ప్రతిస్పందిస్తే ఒక విమర్శలో మాత్రం అనువాదం మూలంలో లేని విషయాలను చేర్చిందని, పద్యాలు పేలవంగా ఉన్నాయని, గానయోగ్యంగా లేవని తెలుపడం జరిగింది!
దీనికి స్పందిస్తూ శ్యామలరావు గారు ఇచ్చిన సమాధానంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇంకొంచెం లోతుగా వెళితే, విమర్శ సహేతుకంగా లేదేమోనని, విమర్శ లోని ఈ క్రింది వాక్యంతో తేటతెల్లమౌతుంది.
“చిన్ని కృష్ణుడు వెన్నదొంగ అని తెలుసు కానీ, పాల దొంగ అని తెలియడం ఇదే ప్రథమం”
బహూశా విమర్శకులకు పోతన గారి ఈ భాగవత పద్యం గుర్తుకు రాలేదేమో!
కం. ఓయమ్మ నీకుమారుడు
మాయిండ్లను పాలుపెరుగు మననీడమ్మా
పోయెద మెక్కడి కైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ!
శ్యామలరావు గారి కలంనుండి మరిన్ని చక్కటి పద్యాలు వస్తాయని, ఈ మాట వేదిక ద్వారా వాటిని చూడాలని అభిలషిస్తూ వారికి మరొక్కసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా!
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/10/2024 12:51 am
శ్రీమదాంధ్రమహాభాగవతము దశమస్కంధము పూర్వభాగములోని పద్యాలు రెండు చూపుతున్నాను శ్రీకృష్ణబాలుడు పాలు కూడా దొంగిలించిన వాడేనని సాక్ష్యంగా.
మ.కో. పుట్టిపుట్టడు నేడు దొంగిలబోయి మాయిలు సొచ్చి తా
నుట్టి యందక ఱోళ్ళు బీటలు నొక్క ప్రోవిడి యెక్కి చే
వెట్టజాలక కుండ క్రిందొక పెద్దతూ టొనరించి మీ
పట్టి మీగడపాలు జేరల బట్టి త్రావె తలోదరీ 310
కం. ఓయమ్మ నీకుమారుడు
మాయిండ్లను పాలుపెరుగు మననీడమ్మా
పోయెద మెక్కడి కైనను
మాయన్నల సురభులాన మంజులవాణీ 329
తెలుగు భాగవతం సరే, వ్యాసభగవానుల మూలంలో ఎలా ఉన్నదీ చూదాం. దశమస్కంధే పూర్వార్ధే తృణావర్తమోక్షో నామ సప్తమోఽధ్యాయః అని ఆతరువాత విశ్వరూపదర్శనే అష్టమోఽధ్యాయః వస్తుంది.ఆ అష్టమోధ్యాయం నుండి మూడు శ్లోకాలను ఉటంకిస్తున్నాను.
వత్సాన్ ముంచన్ క్వచిదసమయే క్రోశసంజాతహాసః
స్తేయం స్వాద్వత్త్యథ దధి పయః కల్పితైః స్తేయయోగైః .
మర్కాన్ భోక్ష్యన్ విభజతి స చేన్నాత్తి భాండం భిన్నత్తి
ద్రవ్యాలాభే స గృహకుపితో యాత్యుపక్రోశ్య తోకాన్ .. 29..
హస్తాగ్రాహ్యే రచయతి విధిం పీఠకోలూఖలాద్యైః
ఛిద్రం హ్యంతర్నిహితవయునః శిక్యభాండేషు తద్విత్ .
ధ్వాంతాగారే ధృతమణిగణం స్వాంగమర్థప్రదీపం
కాలే గోప్యో యర్హి గృహకృత్యేషు సువ్యగ్రచిత్తాః .. 30..
(దీనిని పోతనగారి 310వ పద్యంతో పోల్చి చూడండి)
ఏవం ధార్ష్ట్యాన్యుశతి కురుతే మేహనాదీని వాస్తౌ
స్తేయోపాయైర్విరచితకృతిః సుప్రతీకో యథాఽఽస్తే .
ఇత్థం స్త్రీభిః సభయనయనశ్రీముఖాలోకినీభిః
వ్యాఖ్యాతార్థా ప్రహసితముఖీ న హ్యుపాలబ్ధుమైచ్ఛత్ .. 31
ఈ శ్లోకాలను ఆధారం చేసుకొని పోతనామాత్యులవారు విజృంభించి 307వ పద్యం నుండి 334వ పద్యం వరకూ గోపికలు యశోదాదేవితో మొఱపెట్టుకొనటం బహుచమత్కారంగా వర్ణించారు.
మూలంలో కూడా స్తేయయోగార్హమైన వస్తువులలో దధి పయః అని పెరుగునూ పాలనూ పేర్కొన్నారు.
వేమన్నగారు గొల్లయిండ్ల పాలు కోరినాడని అనటం దాకా అక్కర లేదు – పోతన్నగారే పాలుపెరుగు మననీడమ్మా అన్నారు గొల్లెతలని చెప్పారని అనటం దాకా కూడా అక్కర లేదు. మూలంలోనే గోపాలకృష్ణుల వారి పయః స్తేయం స్పష్టంగానే ఉన్నది.
కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు గురించి Srinivas గారి అభిప్రాయం:
11/09/2024 10:17 pm
https://www.youtube.com/watch?v=5hKA5S8RIdQ
నన్ను గురించి కథ వ్రాయవూ? – నాకు అర్థమయినట్లుగా… గురించి అమరేంద్ర గారి అభిప్రాయం:
11/09/2024 7:46 pm
శాంతిశ్రీ గారు అన్నట్లు కథనే ప్రామాణికంగా తీసుకుని చదవడం సరైన పని. కానీ కధను చర్చించేటపుడు ఆ కథ పూర్వాపరాలూ నేపథ్యాలూ కూడా పరిగణించడం అవసరం. ఉదాహరణకు కొత్త పాఠకులు కన్యాశుల్కం ను ఊరికే అలా చదివితే ఆ నాటకం బోధపడదు.
ఈ కథను లోతుగా చర్చించినపుడు కథ దేని గురించి అన్న ప్రశ్న వస్తుంది. భిన్నాభిప్రాయాలకు అవకాశమున్న కథ ఇది. ఈ నేపథ్యంలో తన కథ గురించి ఏమన్నాడో ఆమాట పబ్లిక్ డొమైన్లో ఉంది. మళ్ళా ఆయన అన్నమాటలో సగమే విశేష ప్రాచుర్యంలో ఉంది. ఈ సగాన్నే పరిగణిస్తే ఇది కొన్ని పరిధుల పరిమితిలో రాసిన ప్రేమకథ అని స్పష్టమవుతుంది. కానీ ఆయన అన్నమాటను పూర్తిగా గమనిస్తే ఈ కథ మనిషిలోని వాంఛను బహిర్గతం చెయ్యడానికి రాసారని స్పష్టమవుతుంది. నిశితంగా చూస్తే ఈ రెండు ఉద్దేశ్యాల మధ్య కధ కుంటినడక నడిచిందనిపిస్తుంది.
*
ఏదేమైనా కథను కథగానే ఒక పాఠకుడిగా చదివినపుడు అది ఆ చదువరి మనసుమీద బలమైన ముద్రవేసి చాన్నాళ్ళు వెంటాడుతుంది. అందుకే అంత పేరు.
ఎవరెస్ట్ బేస్ కాంప్ – 1 గురించి దాసరి అమరేంద్ర గారి అభిప్రాయం:
11/09/2024 7:19 pm
హను గారూ
మీ స్పందనకు ధన్యవాదాలు
శ్రీనివాస్ గారూ
ధన్యవాదాలు
మీలాంటి వారి స్పందన నాకు మరిన్ని రాసే, చేసే ప్రేరణనిస్తుంది
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు II గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 1:22 pm
ఈ సుదీర్థమైన ఎంతో అందమైన చాలా ఉపయుక్తమైన ఆసక్తికరమైన వ్యాసంలో ఆశ్చర్యం నాపేరు కూడా ఉంది. ఎంతో కృతజ్ణుడిని గుర్తుంచుకొన్నందుకు.
నేను అమెరికాకు వచ్చిన క్రొత్తలో SCIT వేదికలో రాయల వారి తలపక్షచ్చట గ్రుక్కి బాతువులు అన్న పద్యం గురించి వ్రాసి రంగప్రవేశం చేసాను. దానికి అభినందనపురస్సరంగా స్పందించిన మొదటి సహృదయులు పిల్లలమఱ్ఱి రామకృష్ణగారు.
పిల్లలమఱ్ఱి రామకృష్ణ గారు బహుసౌమ్యులు సహృదయులు. వారితో నాకు మంచి మైత్రి ఉండేది. నేను అమెరికానుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత వారికి దూరమైనాను. వారి మెయిల్ అడ్రసును పోగొట్టుకున్నాను. ఎంత ప్రయత్నించినా వారిని మరలా పలుకరించలేక పోయాను. వారి మెయిల్ అడ్రసు ఎవరైనా ఇస్తే, ఇచ్చినవారికి కృతజ్ఞుడనై ఉంటాను. రామకృష్ణ పిల్లలమఱ్ఱి వారిని పలుకరించటానికి మరలా ప్రయత్నిస్తాను.
రచ్చబండ గురించి తెలియదు! తెలుసా రోజులను ఐతే ఇప్పటికీ మరిచిపోలేను. తెలుసా మిత్రులనూ మరచిపోలేను.
తుపాకి గురించి Ramesh గారి అభిప్రాయం:
11/09/2024 12:57 pm
చాలా sensitive గా , చిన్న పిల్లలని ఎలా పెంచుకోవాలో వారితో ఎలా వ్యవహరించాలో చక్కగా వుంది, ధన్యవాదాలు
చౌరాష్టకం – ఆంధ్రానువాదం గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 10:58 am
మొదటి శ్లోకానికి నేను ఉత్పలమాలను ఎంచుకున్నాను. దానిని వీరు చీల్చి చెండాడారు. వృత్తం ఎంపికలో ఔచిత్యం లేకపోవడం గురించి వారి వాదన వారిది. మూలం యధాతధంగా రాకపోవటమూ దీర్ఘవృత్తాన్ని ఎంచుకోవటమూ తత్కారణంగా కొన్ని కొత్తపదాలు చేరటమూ వంటివి వారికి నచ్చలేదు. వారి దృక్కోణం వారిది.
కాని వారు “మూలంలో, 70 మాత్రల్లో క్లుప్తంగా, బలంగా – గానయోగ్యంగా ఉన్నవి – దండుగ్గణాలు చేరిన అనువాదం, పేలవ ప్రదర్శన గా మారిపోయింది” అన్నారు. ఈమాట ఆశ్చర్యం కలిగించింది. నిజం చెప్పాలంటే కొంచెం బాధించింది.
దొంగిలె పాలువెన్నలను తొల్లిట నీతడు గొల్లపల్లెలన్
దొంగిలె గొల్లకన్నియలు తోయములాడెడు వేళ చీరలన్
దొంగతనంబుచేసె బహుధూర్తత నావగు పాపసంపదల్
దొంగల రాజువీ డనుచు దోయిలి యొగ్గెద వీని కెప్పుడున్
అన్న ఈవృత్తం గానయోగ్యంగా లేదని వారు ఎలా భావించారో అర్ధం కాదు. క్లుప్తత వీడి దీర్ఘం అవటం వలన గానయోగ్యం కాకుండా పోయిందా? కొత్తపదాలతో పొడుగై పేలవమై గానయోగ్యం కాకుండా పోయిందా? దీర్ఘవృత్తాలు గానయోగ్యాలు కావనుకుంటే ఎవ్వనిచేజనించు పద్యం కూడా గానయోగ్యం కాదు కదా. తిరుపతివేంకట కవుల చెల్లియో చెల్లకో పద్యం అస్సలు గానయోగ్యం కాదు కదా? ఇక మందారమకరంద అంటూ సాగే సీసం ఐతే అస్సలు గానయోగ్యం కాకుండా పోవాలి కదా?
వీరిదృష్టిలో దండుగ గణాలు చేరాయి. సరే, అలా చేరితే అవి దైర్ఘ్యాన్ని ఆపాదించగలవు కాని పద్యాన్ని ఏకంగా గానయోగ్యం కాకుండా చేస్తాయా?
ఈపద్యం గానయోగ్యంగా ఉందని నావిశ్వాసం. నేను గాయకుడిని కాను. ఐతే పాడి మరీ ఋజువు చేయగలిగి ఉండేవాడి నేమో. మిగిలిన పద్యాలూ నాదృష్టిలో గానయోగ్యాలే. కావనుకుంటే నేను చేయగలిగినది లేదు.
దండుగ గణాలు అంటే ఒక సంగతి గుర్తుకు వస్తోంది కరుణశ్రీ గారు కుంతీకుమారి ఖండకావ్యంలో దిగుచున్నది క్రిందికి మెట్లమీదుగన్ అంటారు. దిగటం అంటేక్రిందికి కాక పైకి కూడా ఉంటుందా? క్రిందికి అనటం దండుగే కదా. మెట్లమీదుగన్ అని మాత్రం ఎందుకు? మేడ దిగాలంటే మెట్లే దిగాలి కదా (అప్పట్లో లిఫ్టులు లేవు సుమా) కాబట్టి మెట్లమీదుగన్ అన్నది కూడా దండగే కదా. ఇలా పూరణకోసం పదాలు పడటం దండుగ గణాల వ్యవహారమే కదా. ఇలా లెక్కలు వేస్తూ పోయి కరుణశ్రీకి పద్యాలు వ్రాయటం చేతకాదనీ కుంతీకుమారి, పుష్పవిలాపమూ పేలవకవిత్వాలనీ అనటం చేయవచ్చునేమో. ఏమో నాకు తెలియదు. ఈశంకల వంకల డొంకల నుండి ఏకవి బ్రతికి బయటపడగలడో తెలియదు.
ఈ రచన నా సొంతం కాదు! గురించి తాడిగడప శ్యామల రావు గారి అభిప్రాయం:
11/09/2024 6:20 am
ఇప్పుడు వ్రాస్తున్న మాటలు నాదగ్గర దాదాపుగా యాభైయేళ్ళుగా మురుగుతున్న మాటలు.
విశ్వనాథ వారి నవల ఒకటి ఉంది “బాణామతి” అని. తెన్నేటి హేమలత గారి నవల ఒకటి ఉంది “దెయ్యాలు లేవూ” అని.
ఎవరైనా ఈ రెండు పుస్తకాలను చదివితే అవి ఒకదానికి ఒకటి దాదాపు కార్బన్ కాపీల వంటివి అని స్పష్టంగానే తెలుస్తుంది.
ఇద్దరూ ఉద్దండులైన రచయితలు.వీరిలో ఎవరికీ మరొకరి నవలను దాదాపు యధాతధంగా వ్రాయవలసిన అగత్యం లేదు.కాని ఇలా ఎలా జరిగింది?
అదే నాకు అయోమయంగా అనిపిస్తుంది.
మరొకసారి ఈ రచనలను రెండింటినీ చదువుదామంటే నాకు అంతర్జాలంలో ఐతే కనబడటం లేదు. అవి సంపాదించగలిగితే ఏది ముందుగా వెలువడిందీ అన్నదైనా తెలుస్తుంది.