Comment navigation


15795

« 1 ... 1558 1559 1560 1561 1562 ... 1580 »

  1. Zenగల్వలు – 1 గురించి srinivasu గారి అభిప్రాయం:

    08/19/2006 8:43 am

    చాలా బాగుంది. కృతజ్ఞతలు.

  2. నౌషాద్‌ గురించి గుళ్లపూడి శ్రీనివాసకుమార్ గారి అభిప్రాయం:

    08/18/2006 3:43 am

    నౌషాద్ అంటే హిందీ సినీ సంగీతానికి పర్యాయపదం అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. ఆయన జీవితంపై చక్కటి విశ్లేషణతో కూడిన అద్భుత వ్యాసరాజమిది. రచయిత నుంచి ఇలాంటి మరెన్నో వ్యాసాల కోసం ఎదురు చూస్తున్నాను.

  3. సందుక గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:

    08/18/2006 12:52 am

    స్వామి గారూ,

    చాలా బాగున్నాయి కవితలు.
    రెండు మూడు సార్లు చదివా…. ఓ ఉచిత సలహా…

    జ్ఞాపకాల్ని పదిలపరుచే క్రమంలో దరిద్రాన్ని ఎక్కడన్నా గ్లోరిఫై చేస్తున్నారేమో కొంచెం జాగ్రత్త పడండి. ఇప్పుడు మనం కారులో వెళుతూ “సిటీ బస్సులో వేళ్ళాడుతూ వెళ్ళటం గొప్ప అనుభవం” అని రాస్తే, ప్రస్తుతం వెళ్ళాడుతున్న వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. మీరిలా చేశారని కాదు, ఇలాటి వస్తువుల గురించిన సాహిత్యంలో సాధారణంగా జరుగుతున్న తప్పుని మీకు ఎత్తిచూపించాలనే ప్రయత్నం.

    హైదరాబాదు లో ఉండి మీ పుస్తకావిష్కరణకి రాలేక పోవటం దురదృష్టకరం.

    అక్కిరాజు

  4. సందుక గురించి narayanaswamy గారి అభిప్రాయం:

    08/17/2006 10:25 am

    ప్రసాద్ గారూ
    సందుక అంటే తెలంగాణ లో పాతకాలపు ట్రన్కు పెట్టె అని. కొన్ని చోట్ల సందుగ అని కూడా అంటారు.
    నా కొత్త కవితల పుస్తకమ్ సందుక మొన్న ఆగష్టు 7 న హైదరాబాదులో ఆవిష్కరించారు.
    మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
    మీ
    నారాయణస్వామి

  5. నాతి నోట నువ్వు గింజ గురించి umarani గారి అభిప్రాయం:

    08/12/2006 3:16 am

    ఈమాటలో మాటలు ఇంత తీపి అని ఇప్పుడే తెలుసుకున్నాను.

    ఉమ

  6. నేటి సినిమాలలో వికృత పోకడలు – విపరీత ధోరణులు గురించి గుళ్లపూడి శ్రీనివాసకుమార్ గారి అభిప్రాయం:

    08/10/2006 5:42 am

    స్వయంకృతాపరాధాలతో దుర్భిక్షంలో కూరుకుపోయిన నేటి సినిమా తీరు తెన్నులను అన్ని కోణాల్లో సవివరంగా ఆవిష్కరించిన వ్యాసరాజం ఇది.

  7. ఈమాట కొత్త వేషం గురించి గుళ్లపూడి శ్రీనివాసకుమార్ గారి అభిప్రాయం:

    08/10/2006 5:22 am

    కొత్త వేషం ముచ్చటగా ఉంది. మీ బృందం అభినందనీయమైన సేవలు చేస్తోంది. ఈ సందర్భంగా నేనొక విషయాన్ని మీతో పంచుకుందామనుకుంటున్నాను.

    తెలుగు యునికోడ్ ఫాంట్ ఉపయోగించి క్ చ్ ట్ త్ ప్ గ్ జ్ డ్ ద్ బ్ వంటి హలంతాక్షరాలను టైప్ చేసేప్పుడు ఇక్కడ తెలిపిన ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు… కంప్యూటర్‌కు… హార్డ్‌వేర్‌లో… మానిటర్‌తో… మెషీన్‌పై… అని మీరు టైప్ చెయ్యాలనుకుంటే… హలంతాక్షరాలు, వాటితోపాటు టైప్ చేసిన అక్షరాలు కలిసిపోయి కంప్యూటర్కు… హార్డ్వేర్లో… మానిటర్తో… మెషీన్పై ఇలా వస్తాయి. దీంతో ఏం చెయ్యాలో అర్థంకాక చాలా మంది కంప్యూటర్ కు… హార్డ్ వేర్ లో… మానిటర్ తో… మెషీన్ పై… ఇలా హలంతాక్షరానికి, దాని వెంటనే టైప్ చెయ్యాల్సిన అక్షరానికి మధ్య ఒక ఖాళీ ఉంచి టైప్ చేస్తున్నారు. దీనికి ఓ పరిష్కారం ఉంది. వర్డ్ లేదా నోట్‌ప్యాడ్‌లో మీరు ఇలా చేసుకోవచ్చు.

    హలంతాక్షరం టైప్ చెయ్యగానే దాని పక్కనే కర్సర్ ఉంచి Ctrl+Shift+2 కీలు కలిపి నొక్కండి. ఆ తర్వాత మీకు కావలసిన అక్షరాలను పక్కనే టైప్ చేసుకున్నప్పటికీ అవి హలంతాక్షరాలతో పైన చూపిన విధంగా కలిసిపోవు. Ctrl+Shift+2 కీల ద్వారా హలంతాక్షరం పక్కనే నాన్-జాయినర్ (ఇది కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది.

    ఇదే సమస్యకు మౌస్ ఉపయోగించి, నోట్‌ప్యాడ్‌లో కూడా పరిష్కారం పొందవచ్చు. హలంతాక్షరం పక్కనే మీ కర్సర్ ఉంచి, మౌస్ రైట్ క్లిక్ చెయ్యండి. అక్కడ కనిపించే మెనూలోంచి “INSERT UNICODE CONTROL CHARACTER” పైన మౌస్‌ను పాయింట్ చేస్తే… ఉప మెనూ తెరుచుకుంటుంది. ఇందులో “ZWNJ – Zero Width non-joiner” పైన క్లిక్ చెయ్యండి. దీంతో హలంతాక్షరం పక్కన నాన్-జాయినర్ (కనిపించదు) చేర్చబడి, ఈ సమస్యను నివారిస్తుంది. తర్వాత ఈ టెక్ట్స్‌ను వర్డ్, ఎక్సెల్ లేదా మీకు కావలసిన దానిలోకి కాపీ చేసుకోవచ్చు.

    ఈమాట ద్వారా ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నది నా అభిమతం.
    ఇదే పరిష్కారం కన్నడ భాషకూ వర్తిస్తుంది.

  8. అనుబంధం గురించి sreenivas గారి అభిప్రాయం:

    08/09/2006 12:49 am

    చాలా అందంగా వ్రాశారండి. శ్రీనివాస్.

  9. సంకట్ కాల్ మే బాహర్ జానే కా మార్గ్ గురించి Geetha గారి అభిప్రాయం:

    08/07/2006 11:02 pm

    ఈ కధ చదువుకొనని, హాయిగా నవ్వుకున్నాము..

  10. యథార్థ చక్రం – 1 గురించి Rama S Yeleswarapu గారి అభిప్రాయం:

    08/07/2006 2:00 pm

    గౌరవనీయులైన ఈమాట సంపాదకులకు,
    అయ్యా,

    మీ ఈమాట పత్రిక అద్భుతముగా ఉన్నది. అయితే, ఇది వరకు మీరు, మంచి మంచి గ్రంధములు ప్రచురించారు. దురదృష్టవశాత్తు అవి మీ నూతన వెబ్ సైట్ లొ అందుబాటులో లేవు. ఉదాహరణకు, శ్రీ కృష్ణ దేవరాయ విరచితమైన “ఆముక్తమాల్యద”. దయచేసి, మరల ఆ అధ్భుత గ్రంధాన్ని తెలుగు వ్యాఖ్యానంతో అందించ కోరుతున్నాను.

    ఇట్లు భవదీయుడు,
    రామ సుబ్రహ్మణ్యం యేలేశ్వరపు

« 1 ... 1558 1559 1560 1561 1562 ... 1580 »