ఈమాట గురించి గురించి Chimata Rajendra prasad గారి అభిప్రాయం:
09/05/2006 9:09 am
తెలుగు భాషకుసొంతగడ్డ లోనే ఆదరణ తగ్గుతున్నదనిఆవేదనపడే నాలాటి వాళ్ళకు మీ పత్రిక చాలాఉత్సాహాన్నికలిగిస్తోంది.ముఖ్యంగా ఇలా తెలుగులో టైపుచెయ్యడం చాలా థ్రిల్లింగా ఉంది.నా కంప్యూటర్ మీద ఇలా టైపు చెయ్యడానికి ఏం చెయ్యాలో సలహా ఇవ్వగలరా? rpchimata@yahoo.com
నేను ఖమ్మంలో ఉంటున్నాను.
ప్రజాకవులంటూ మొదలు పెట్టి ఒక్క తిరుపతి వేంకట కవులతో సరిపెట్టడం ఏమాత్రం ఉచితంగా లేదు. వారి మీద మీకున్న ప్రేమని “ప్రజల్లో తిరుపతి వేంకటకవులు” అని శీర్షిక పెట్టి వ్రాసినా సరి పోయేది.
మొత్తానికి పసందైన పద్యాలని మళ్ళీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
— ప్రసాద్ http://charasala.wordpress.com
“తెలుగు పూర్వంలాగా పేరుతెలియని మారుమూల భాష కాదు. అది ప్రపంచ భాషగా ఎదుగుతోంది. మేం కోరుకునేంత వేగంగా కాకపోయినా, నెమ్మదిగా అయినా ఎదుగుతోంది” చాలా సంతోషం కలిగించింది.
“తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, నేను భావించడం లేదు.”
“తెలుగు సాహిత్యం లోచర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని, నేను భావించడం లేదు.” పరస్పర విరుద్ధమైన భావాలు.ముద్రారాక్షసమా?
“ఇది నిజానికి చాలా లోతైన వాక్య నిర్మాణం. తెలుగు సాహత్యకుల గురించి జగద్విఖ్యాతమైన రహస్యాన్ని పునరుద్ఘాటిస్తూనే, గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నకి సమాధానమిచ్చిన, రెండువైపుల పదునున్న కత్తి లాంటి వాక్యం. ఇదీ అర్ధం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ”
“తెలుగు సాహత్యకుల” శ్లేషా?!?!
మొలతాడు గురించి Garikapati Pavan Kumar గారి అభిప్రాయం:
09/05/2006 8:19 am
మొలతాడు కవిత చాలా నచ్చింది..
భూషణ్ నేటికాలపు తీరుతెన్నులు లాగానే ఈ కవిత కూడా నేటికాలపు కవుల ప్రమాణాలను ప్రశ్నిస్తుంది.కవితలో ప్రియురాలు కవిత్వమైతే ..ఈతరాని
ప్రియులని నేటికాలపు కవులుగా పేర్కొనవచ్చు.ఈ విధంగా ఆలోచిస్తే
చాలామంది తెలుగు కవులకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది ఉంటే)!!
చాలా పద్యాలు రేడియోలో వింటమో లేకపోతే మా నాన్న గారు పాడగా వింటమో తప్పా ఇలా ఒక చోట చదవగలగటం మీ వల్లనే సాధ్యమయింది. హడావిడిగా వినేటప్పుడు అర్థమవని చమత్కారాలు కూడా మీ వ్యాసం ద్వారా వివరణల ద్వారా తెలుసు కున్నాను. మీ లాంటి వాళ్ళు ఎంత ఎక్కువరాస్తే మాలాంటి వాళ్ళం అంత ఎక్కువ నేర్చుకుంటాం. ఏమన్నా అనండి, మీ వ్యాసం చదవగలను కానీ, ఇప్పటికీ తిరపతి కవుల పుస్తకాల్ని కొనిచదవలేను… ఎందుకో?
అయితే, ఈ వ్యాసంలోకి ప్రజాకవులంటే ఎవరు అనే చర్చని తేవటం అవసరమా? అసలు శ్రీశ్రీ ప్రసక్తి ఎందుకు?
ప్రజలు అంటే మీరు చెప్పిన నిర్వచనాన్ని అంగీకరించాక…. కవుల గురించి ఆలోచిద్దాం.
1. ప్రజాకవులు అంటే మీరు చెప్పినట్టే పాపులర్ కవులేనా?
2. లేక ప్రజల గురించి రాసిన కవులా?
3. లేక పై రెండులక్షణాలూ అటూ ఇటుగా సమంగా ఉన్న కవులా?
మొదటి లక్షణమయితే మీరు చెప్పినట్టు తిరుపతి కవులతో పాటు సముద్రాలనీ, ఆత్రేయనీ, వేటూరినీ, కూడా లెక్క వేయాలి.
రెండో లక్షణమయితే శ్రీశ్రీ, గురజాడల్ని లెక్క వేయాలి.
మూడో లక్షణ మయితే గద్దర, వంగపండు, ఎంకన్న లాంటి వాళ్ళని లెక్క వేయాలి.
గురువు గారూ…
మీ ఈ వ్యాసం చదివాక చిన్నప్పుడు మా పెత్తాత అయిన బాబయ్య చేనులో నుండి చెఱుకు గడలు తెచ్చిఇచ్చి,దగ్గర కూర్చోబెట్టుకొని తన కంచు కంఠం తో “అలుగుటయే యెరుంగని…” అని తన్మయత్వం తో పాడే పద్యాలు గుర్తొచ్చాయి! శ్రీశ్రీ గారంటే నాకు చాలా అభిమానమున్నా ప్రజాకవులు అన్న బిరుదు తిరుపతి వెంకట కవులకు తగినది.
నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.
గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు – వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … – ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.
వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.
వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.
అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!
నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం – ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.
విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.
కొన్ని కవితలు ఆ అర్థం తెలిసిన వారికే అర్థము అవుతాయి అనుకుంటాను!
నాకు అయితే ఇందులోని లోతైన భావం ఏమీ అర్థం కాలేదు, క్షమించాలి.
సంగీతంతో కుస్తీ గురించి Lakshmanna Vishnubhotla గారి అభిప్రాయం:
09/04/2006 9:15 am
ఈ వ్యాసం మీద అభిప్రాయాలు చదివాక ఇది రాయాలనిపించింది!
సంగీతం పై వ్యాసాలు రాయటంలో కొన్ని చిక్కులున్నాయి. ప్రతిరోజూ సంగీతాన్ని సాధనచేసే వ్యక్తులలో రోహిణీ ప్రసాద్ గారు ఒకరు. ఆయన ప్రస్థుతం నేను ఉంటున్న ఊరులోనే (ఆష్టిన్, టెక్సాస్) ఉంటున్నారు. కొన్ని సంగీత పరమైన విషయాలు రాయవలసి వస్తే, భాష యొక్క పరిమితుల వల్ల అన్నీ సాధ్యం కావు. సంగీతం పై వ్యాసాలు రాయటం కన్న, ఒక పద్యం, పాట ద్వారా సంగీతంలోని చమక్కులు చూపటం చాలా తేలిక.
ఈమాట ప్రారంభించాక, మిత్రుల కోరికతో నాకు తెలిసిన సంగీత జ్ఞానాన్ని, వ్యాసాల రూపంలో తెలియపరచటానికి ప్రయత్నించేవాణ్ణి. అందుకు ప్రేరణ, నేను బొంబాయిలో చదువుకుంటున్నప్పుడు రోహిణీ ప్రసాద్ గారితో పరిచయం వల్ల, వేణువు మీద సాధన చేయటం, తద్వారా, సంగీతంలోని కొన్ని మెళకువలను నేర్చుకోటం.
ఒక సందర్భంలో నేను వేణువు మీద “హాయి హాయిగా ఆమనిసాగే” (హంసానందితో మొదలయిన ఘంటసాల, జిక్కీల పాట) అన్న పాట వాయిస్తుంటే, బాగా పాటలు పాడే ఒకాయన వచ్చి “ఇదేమిటి, సినిమాలో ఉన్నది ఉన్నట్టు వస్తోంది?” అని ఆశ్చర్యపోయారు. ఈ పాటల వెనుక ఉన్న స్వరాలు, గమకాలు గురించి పాడే వ్యక్తులందరికీ తెలిసి ఉంటాయని నేను అమాయకంగా ఆలోచించానని అప్పుడు నాకు తెలిసింది.
ఈమాటలో సంగీతం పై రోహిణీ ప్రసాద్ గారు రాస్తున్న వ్యాసాలు చాలా మంది చదివి ఆనందించి, వారి సలహాల మేరకు ఉపయోగం పొందుతున్నారని పాఠకుల అభిప్రాయాల వల్ల తెలుస్తోంది. అది చాలా సంతోషించవలసిన విషయం.
ఇప్పటికీ, నేను రోహిణీ ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో హిందూస్థానీ సంగీతంలోని విషయాలు తెలుసుకొని ఆనందిస్తూ ఉంటాను. నాకు తెలిసిన వారిలో సంగీతంపై, ముఖ్యంగా హిందూస్థానీ సంగీతంపై, ఆయనకు ఉన్న పట్టు, ఆసక్తి, సాధన, జ్ఞానం మరెవరికీ లేవు అంటే అది అతిశయోక్తి కాదు!
ఈమాట పాఠక శ్రోతలకు ఇకముందు కూడా కొన్ని ఆడియో లింక్స్ ద్వారా ఆయనకు తెలిసిన మరిన్ని సంగీత విషయాలు, విశేషాలు తెలుపుతారని ఆశిస్తూ,
ఈమాట గురించి గురించి Chimata Rajendra prasad గారి అభిప్రాయం:
09/05/2006 9:09 am
తెలుగు భాషకుసొంతగడ్డ లోనే ఆదరణ తగ్గుతున్నదనిఆవేదనపడే నాలాటి వాళ్ళకు మీ పత్రిక చాలాఉత్సాహాన్నికలిగిస్తోంది.ముఖ్యంగా ఇలా తెలుగులో టైపుచెయ్యడం చాలా థ్రిల్లింగా ఉంది.నా కంప్యూటర్ మీద ఇలా టైపు చెయ్యడానికి ఏం చెయ్యాలో సలహా ఇవ్వగలరా?
rpchimata@yahoo.com
నేను ఖమ్మంలో ఉంటున్నాను.
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
09/05/2006 8:55 am
ప్రజాకవులంటూ మొదలు పెట్టి ఒక్క తిరుపతి వేంకట కవులతో సరిపెట్టడం ఏమాత్రం ఉచితంగా లేదు. వారి మీద మీకున్న ప్రేమని “ప్రజల్లో తిరుపతి వేంకటకవులు” అని శీర్షిక పెట్టి వ్రాసినా సరి పోయేది.
మొత్తానికి పసందైన పద్యాలని మళ్ళీ గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు.
— ప్రసాద్
http://charasala.wordpress.com
ఒక వేసవి గురించి ప్రసాద్ గారి అభిప్రాయం:
09/05/2006 8:44 am
చాలా బాగుంది. కానీ పసి పిల్ల నీళ్ళకు పచ్చబడింది చెట్టుకాదు, పట్టింది పాచి అనడం నాకు నచ్చలేదు. పసి హృదయం తనకు తోచిన ఆటపాటల్లో వుండి అమ్మమ్మమీద శ్రద్ద చూపి వుండకపోయినంతమాత్రాన అమ్మమ్మ ప్రేమను మరిచిపోయివుంటుందా? పెద్దయ్యాకైనా తెలుసుకొని మురిసిపోదూ!
ప్రసాద్
http://charasala.wordpress.com
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి Chimata Rajendra prasad గారి అభిప్రాయం:
09/05/2006 8:42 am
“తెలుగు పూర్వంలాగా పేరుతెలియని మారుమూల భాష కాదు. అది ప్రపంచ భాషగా ఎదుగుతోంది. మేం కోరుకునేంత వేగంగా కాకపోయినా, నెమ్మదిగా అయినా ఎదుగుతోంది” చాలా సంతోషం కలిగించింది.
“తెలుగు సాహిత్యం లో ఎవరు కూడా తమ తమ అభిప్రాయాలకు జీవితాంతం కట్టుబడి వుంటారని, నేను భావించడం లేదు.”
“తెలుగు సాహిత్యం లోచర్చల వల్ల కొంతమందైనా పునరాలోచనలో పడతారని, నేను భావించడం లేదు.” పరస్పర విరుద్ధమైన భావాలు.ముద్రారాక్షసమా?
“ఇది నిజానికి చాలా లోతైన వాక్య నిర్మాణం. తెలుగు సాహత్యకుల గురించి జగద్విఖ్యాతమైన రహస్యాన్ని పునరుద్ఘాటిస్తూనే, గుడిపాటి వేసిన మౌలికమైన ప్రశ్నకి సమాధానమిచ్చిన, రెండువైపుల పదునున్న కత్తి లాంటి వాక్యం. ఇదీ అర్ధం కాకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? ”
“తెలుగు సాహత్యకుల” శ్లేషా?!?!
మొలతాడు గురించి Garikapati Pavan Kumar గారి అభిప్రాయం:
09/05/2006 8:19 am
మొలతాడు కవిత చాలా నచ్చింది..
భూషణ్ నేటికాలపు తీరుతెన్నులు లాగానే ఈ కవిత కూడా నేటికాలపు కవుల ప్రమాణాలను ప్రశ్నిస్తుంది.కవితలో ప్రియురాలు కవిత్వమైతే ..ఈతరాని
ప్రియులని నేటికాలపు కవులుగా పేర్కొనవచ్చు.ఈ విధంగా ఆలోచిస్తే
చాలామంది తెలుగు కవులకి ఖచ్చితంగా తేలేది మొలతాడే (అది ఉంటే)!!
గరికపాటి పవన్ కుమార్,UK
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి Akkiraju Bhattiprolu గారి అభిప్రాయం:
09/05/2006 12:45 am
వేలూరి గారూ…
చాలా పద్యాలు రేడియోలో వింటమో లేకపోతే మా నాన్న గారు పాడగా వింటమో తప్పా ఇలా ఒక చోట చదవగలగటం మీ వల్లనే సాధ్యమయింది. హడావిడిగా వినేటప్పుడు అర్థమవని చమత్కారాలు కూడా మీ వ్యాసం ద్వారా వివరణల ద్వారా తెలుసు కున్నాను. మీ లాంటి వాళ్ళు ఎంత ఎక్కువరాస్తే మాలాంటి వాళ్ళం అంత ఎక్కువ నేర్చుకుంటాం. ఏమన్నా అనండి, మీ వ్యాసం చదవగలను కానీ, ఇప్పటికీ తిరపతి కవుల పుస్తకాల్ని కొనిచదవలేను… ఎందుకో?
అయితే, ఈ వ్యాసంలోకి ప్రజాకవులంటే ఎవరు అనే చర్చని తేవటం అవసరమా? అసలు శ్రీశ్రీ ప్రసక్తి ఎందుకు?
ప్రజలు అంటే మీరు చెప్పిన నిర్వచనాన్ని అంగీకరించాక…. కవుల గురించి ఆలోచిద్దాం.
1. ప్రజాకవులు అంటే మీరు చెప్పినట్టే పాపులర్ కవులేనా?
2. లేక ప్రజల గురించి రాసిన కవులా?
3. లేక పై రెండులక్షణాలూ అటూ ఇటుగా సమంగా ఉన్న కవులా?
మొదటి లక్షణమయితే మీరు చెప్పినట్టు తిరుపతి కవులతో పాటు సముద్రాలనీ, ఆత్రేయనీ, వేటూరినీ, కూడా లెక్క వేయాలి.
రెండో లక్షణమయితే శ్రీశ్రీ, గురజాడల్ని లెక్క వేయాలి.
మూడో లక్షణ మయితే గద్దర, వంగపండు, ఎంకన్న లాంటి వాళ్ళని లెక్క వేయాలి.
కాదంటారా?
అక్కిరాజు భట్టిప్రోలు
గత శతాబ్దంలో ప్రజాకవులు గురించి డా.ఇస్మాయిల్ పెనుకొండ గారి అభిప్రాయం:
09/04/2006 6:11 pm
గురువు గారూ…
మీ ఈ వ్యాసం చదివాక చిన్నప్పుడు మా పెత్తాత అయిన బాబయ్య చేనులో నుండి చెఱుకు గడలు తెచ్చిఇచ్చి,దగ్గర కూర్చోబెట్టుకొని తన కంచు కంఠం తో “అలుగుటయే యెరుంగని…” అని తన్మయత్వం తో పాడే పద్యాలు గుర్తొచ్చాయి! శ్రీశ్రీ గారంటే నాకు చాలా అభిమానమున్నా ప్రజాకవులు అన్న బిరుదు తిరుపతి వెంకట కవులకు తగినది.
సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి కొడవళ్ళ హనుమంతరావు గారి అభిప్రాయం:
09/04/2006 1:33 pm
నేను కవినీ కాదు, విమర్శకుణ్ణీ కాదు. కాని ఓ పాఠకుడిగా “మన కవులు అక్షరాస్యులేనా?” అన్న ప్రశ్న అవమానకరమైన మకుటమనిపించిందిగాని మౌలికమైన ప్రశ్నగా అనిపించలేదు. “ఎదుటివారి అభిప్రాయాలనూ వ్యక్తిత్వాలనూ గౌరవించగల పెద్ద మనిషి తరహా” ఉండాలని చెప్పిన వెల్చేరు గారు కూడా “మన విమర్శకులు అక్షరాస్యులేనా?” అని అడగడం ఆశ్చర్యమేసింది. వారిద్దరి వ్యాసాల్లో చర్చించదగ్గ విషయాలు చాలానే ఉన్నా, ఆ ప్రశ్నలు వేరే రూపంలో వేసి ఉండాల్సింది.
గుడిపాటి తన వ్యాసంలో మన కవుల గురించి చెప్పిన విషయాలు – వేరే వాళ్ళ కవిత్వాన్ని చదవరు, కవిత్వం మీద వచ్చే వ్యాసాల్నీ, సమీక్షల్నీ చదవరు, చదివినా తమ పేరుందో లేదో అన్న ధ్యాసే గాని ఏమి రాశారో అన్న ఆసక్తి లేదు … – ఆ కవులకి సన్నిహితంగా మెలగడాన తెలిసిన సమాచారం కావచ్చు. వాటి గురించి కవులతో కనీసం ముఖ పరిచయం కూడా లేని నాలాంటి పాఠకుడు చర్చించడం వీలవదు.
వెక్కిరింపులూ, అపహాస్యాలూ మన సాహిత్య చర్చల్లో అనివార్యమయినట్లుంది. అయినా వాటితో పాటు నాలుగు ఉపయోగపడే మాటలు, కాసిని ఉదాహరణలతో చెప్తే నాబోటి వాడు అన్వయించుకుని బోధపరచుకుంటాడు.
వాడుక భాషలో రాయడంలేదని వాపోయిన రంగనాయకమ్మ రాసిన పుస్తకం చదివితే వాడుక భాష గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది. మాతృభాషే అయినా తెలుగు భాషా స్వరూపం తెలియని యువకుల్ని చూసి బాధ పడ్డ బూదరాజు రాసిన పుస్తకాలు చదివి కొంతయినా వ్యాకరణ జ్ఞానం పెంచుకోవచ్చు.
అలాగే మన కవిత్వ, విమర్శ రంగాల దుస్థితిని చూసి విచారించేవాళ్ళు కూడా వాటిని సవరించడానికి కృషి చేస్తే బావుణ్ణు. డబ్బుకీ, కీర్తికీ, అవార్డులకీ, రాజకీయాలకీ మన కవులు అమ్ముడు పోయారంటున్నారు. అలాంటి ప్రముఖుల కవితా సంకలనాల్ని కొన్నిటిని తీసుకొని సహేతుకంగా విమర్శించండి. శబ్దం, రూపం, లయ, అవగాహన, పాండిత్యం ఎలా లోపించాయో వివరించండి. వారాల తరబడి జరిగిన చర్చలో ఆరోపణలకు కొదవ లేదు గాని ఉదాహరణలు మాత్రం శూన్యం!
నాకీ విషయంలో సమకాలికుల్లో తమ్మినేని యదుకుల భూషణ్ ఒక్కరే ఆపని చేస్తున్నట్లనిపిస్తుంది. ఉదాహరణకి నిన్ననే చదివిన వారి వ్యాసం, “ఉమర్ ఖయ్యాం – ఉదాహరణలు.” అనువాదానికి ఉండాల్సిన లక్షణాలేమిటో చెప్పి, మూలంలోని రుబాయి నొకదాన్ని తీసుకొని, కరుణశ్రీ, ముద్దుకృష్ణ మొదలైన వాళ్ళ అనువాదాలు ఎందుకు లోపభూయిష్టమో, చలం, ఆదిభట్ల అనువాదాలు ఎందుకు ఉన్నతమైనవో వివరించారు.
విశేష ప్రతిభావంతుడనిపించే తమ్మినేని కున్న లోపం తనకి నచ్చని వాళ్ళని ఎద్దేవా చెయ్యటం, పెద్దమనిషి తరహా లేకపోవడం. “బుద్ధి చెప్పువాడు గుద్దితే నేమయా” (?) అన్న వేమన వేదాంతం బాగా వంటబట్టించుకున్నట్లుంది. గుద్దులు తిన్నా, చదివినవాడికి కవిత్వం గురించిన అవగాహన కాస్తయినా పెరుగుతుంది.
కొడవళ్ళ హనుమంతరావు
మొలతాడు గురించి kiran kumar chava గారి అభిప్రాయం:
09/04/2006 12:23 pm
కొన్ని కవితలు ఆ అర్థం తెలిసిన వారికే అర్థము అవుతాయి అనుకుంటాను!
నాకు అయితే ఇందులోని లోతైన భావం ఏమీ అర్థం కాలేదు, క్షమించాలి.
సంగీతంతో కుస్తీ గురించి Lakshmanna Vishnubhotla గారి అభిప్రాయం:
09/04/2006 9:15 am
ఈ వ్యాసం మీద అభిప్రాయాలు చదివాక ఇది రాయాలనిపించింది!
సంగీతం పై వ్యాసాలు రాయటంలో కొన్ని చిక్కులున్నాయి. ప్రతిరోజూ సంగీతాన్ని సాధనచేసే వ్యక్తులలో రోహిణీ ప్రసాద్ గారు ఒకరు. ఆయన ప్రస్థుతం నేను ఉంటున్న ఊరులోనే (ఆష్టిన్, టెక్సాస్) ఉంటున్నారు. కొన్ని సంగీత పరమైన విషయాలు రాయవలసి వస్తే, భాష యొక్క పరిమితుల వల్ల అన్నీ సాధ్యం కావు. సంగీతం పై వ్యాసాలు రాయటం కన్న, ఒక పద్యం, పాట ద్వారా సంగీతంలోని చమక్కులు చూపటం చాలా తేలిక.
ఈమాట ప్రారంభించాక, మిత్రుల కోరికతో నాకు తెలిసిన సంగీత జ్ఞానాన్ని, వ్యాసాల రూపంలో తెలియపరచటానికి ప్రయత్నించేవాణ్ణి. అందుకు ప్రేరణ, నేను బొంబాయిలో చదువుకుంటున్నప్పుడు రోహిణీ ప్రసాద్ గారితో పరిచయం వల్ల, వేణువు మీద సాధన చేయటం, తద్వారా, సంగీతంలోని కొన్ని మెళకువలను నేర్చుకోటం.
ఒక సందర్భంలో నేను వేణువు మీద “హాయి హాయిగా ఆమనిసాగే” (హంసానందితో మొదలయిన ఘంటసాల, జిక్కీల పాట) అన్న పాట వాయిస్తుంటే, బాగా పాటలు పాడే ఒకాయన వచ్చి “ఇదేమిటి, సినిమాలో ఉన్నది ఉన్నట్టు వస్తోంది?” అని ఆశ్చర్యపోయారు. ఈ పాటల వెనుక ఉన్న స్వరాలు, గమకాలు గురించి పాడే వ్యక్తులందరికీ తెలిసి ఉంటాయని నేను అమాయకంగా ఆలోచించానని అప్పుడు నాకు తెలిసింది.
ఈమాటలో సంగీతం పై రోహిణీ ప్రసాద్ గారు రాస్తున్న వ్యాసాలు చాలా మంది చదివి ఆనందించి, వారి సలహాల మేరకు ఉపయోగం పొందుతున్నారని పాఠకుల అభిప్రాయాల వల్ల తెలుస్తోంది. అది చాలా సంతోషించవలసిన విషయం.
ఇప్పటికీ, నేను రోహిణీ ప్రసాద్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎన్నో హిందూస్థానీ సంగీతంలోని విషయాలు తెలుసుకొని ఆనందిస్తూ ఉంటాను. నాకు తెలిసిన వారిలో సంగీతంపై, ముఖ్యంగా హిందూస్థానీ సంగీతంపై, ఆయనకు ఉన్న పట్టు, ఆసక్తి, సాధన, జ్ఞానం మరెవరికీ లేవు అంటే అది అతిశయోక్తి కాదు!
ఈమాట పాఠక శ్రోతలకు ఇకముందు కూడా కొన్ని ఆడియో లింక్స్ ద్వారా ఆయనకు తెలిసిన మరిన్ని సంగీత విషయాలు, విశేషాలు తెలుపుతారని ఆశిస్తూ,
విష్ణుభొట్ల లక్ష్మన్న
Lark_Vishnubhotla@yahoo.com