Comment navigation


15815

« 1 ... 1513 1514 1515 1516 1517 ... 1582 »

  1. పునశ్చరణం గురించి P. Siva గారి అభిప్రాయం:

    04/19/2007 6:40 am

    రాజశంకర్ గారు,
    ఇవి మెటఫర్లు కావు సిమిలీలు. అనగా ఉత్ప్రేక్షలు కావు, ఉపమానాలు. ఇక ‘క్లుప్తంగా వివరించడం’ అనేది oxymoron.
    ఈమధ్య క్లుప్తత మీద obsession పెరుగుతున్నట్లుంది. నాలుగు మాటలు ఎక్కువయినంత మాత్రాన కొంపలేవీ మునిగిపోవు భావం అద్భుతంగా ఉన్నప్పుడు, కవి చెప్పదలుచుకున్నది పాఠకుడి మనసుకి అందినప్పుడు. సందర్భాన్ని బట్టి కవితలు ఒక్కోసారి దీర్ఘంగానూ ఉంటాయి, పదాలూ, భావాలూ పునరావృతమవుతూ ఉంటాయి. అందరి నవ్వులూ, ఏడుపులూ ఒకలా ఉండవుగదా! అన్నింటికీ క్లుప్తత మంత్రం పనికి రాదు. అప్పుడు మనకు హైకూలు తప్ప ఏవీ మిగలవు. ‘ఇక్కడ తాజా చేపలు సరసమైన ధరలకు అమ్మబడును’ అన్న బోర్డు కథ వినలేదా? అవధరించండి.
    ఒకాయన కొత్తగా చేపలకొట్టు పెట్టుకున్నాడు పైన చెప్పిన బోర్డు రాయించుకుని. మీలాంటి పెద్దమనిషి వచ్చి “పిచ్చోడా, షాపు ఇక్కడ పెట్టుకుని చేపలు ఇంకెక్కడో అమ్ముతావా? ‘ఇక్కడ’ అక్కర్లేదు తీసేయ”మన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. ఇంకొకాయన వచ్చి “ఈ సముద్రపొడ్డున తాజా చేపలు కాకపోతే కుళ్ళినవి ఎవరయినా అమ్ముతారా? ‘తాజా’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మరొకాయన వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుని చేపలు కాక ఇంకేం అమ్ముతావు. ‘చేపలు’ తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. మీరొచ్చి “చుట్టూ పోటీగా ఇన్ని కొట్లుంటే అందరూ సరసమైన ధరలకే అమ్ముతారు గనక ‘సరసమైన’ అనవసరం’ తీసేయించు” అన్నారు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వేరొకాయన వచ్చి “ధరకు కాకుండా ఊరికే ఎవరయినా ఇస్తారా? ఆ మాట తీసేయించు” అన్నాడు. ఆ అమాయకుడు అలాగే చేశాడు. వాళ్ళావిడ వచ్చి “కొట్టునిండా చేపలు పెట్టుకుంది అమ్మడానికి కాక కొనడానికా? అర్థం లేని మాట, తీసేయించు” అన్నదిట. ఆ అమాయకుడు అలాగే చేశాడు.
    ఇప్పుడు ఆ ఖాళీ బోర్డున్న షాపులో చేపలు ఎవరు కొంటున్నారో మీకే తెలియాలి.
    అన్నట్టు మళ్ళీ పైకి వెళ్ళకుండా బోర్డు మీదినుంచి మీరే మాట తీయించారో చెప్పుకోండి.

  2. అంతరం గురించి Dr. K. Sujatha గారి అభిప్రాయం:

    04/18/2007 11:05 pm

    Theme is very familiar context. Ofcurse unlike Vindya. Infact author would have given more emphsais about vindya and her feelings than focussing too much on Sailu. No need to use so much of English to convey the messages but it is also true that in real context people talk same way.
    Dr. Sujatha.K

  3. వలసపోతున్న మందహాసం గురించి ravi kumar గారి అభిప్రాయం:

    04/18/2007 4:20 am

    హెల్లొ !
    ఈ పత్రిక చాల బాగుంది. It is really fantastic. eemaata is of great value to me. everyday I spend atleast 20 minutes with eemaata.

  4. అత్యుత్తమ హిందుస్తానీ గాయకుడు బడేగులాం అలీ ఖాన్‌ గురించి Rohiniprasad గారి అభిప్రాయం:

    04/16/2007 3:49 am

    హిందుస్తానీ గాయకుడు బడే గులాదుఅలీ ఖాన్ (1901-68) గారికి సంబంధించిన కొన్ని లింకులు ఇటీవల నాకు కనిపించాయి. ఒకటి వీడియో క్లిపింగ్.
    తక్కినవి ఆడియో ఇంటర్వ్యూలు. ఒకటి, రెండు
    ఈ మహాగాయకుడి సంగీతం గురించి ఆసక్తి ఉన్నవారికి ఇందులో అపూర్వమైన సమాచారం లభిస్తుంది.

  5. నామాట గురించి rajasankar kasinadhuni గారి అభిప్రాయం:

    04/15/2007 5:28 am

    నేను మా స్థానిక తెలుగు సంస్థలో కార్యకర్తగా పనిచేసినప్పటి అనుభవాలు, మనోభావాలు శ్రీ వేంకటేశ్వరరావుగారి సంపాదకీయ వ్యాసం, తదితర పాఠకమిత్రుల వ్యాఖ్యలతో మళ్ళీ గుర్తుకొచ్చాయి. ఈ తెలుగు సంస్థల charters లో చెప్పినదానికి, సగటు సభ్యుడికి ఉన్న expectations కి చాలా తేడా వున్నదని గ్రహించగానే, నేను చేసిన మొదటి పని, ఇంట్లో మా పిల్లలకి శతక సాహిత్య పరిచయం. సుమతీ శతకం, వేమన శతకం లోంచి సుళువుగా నోటికి వచ్చే పద్యాలని వాళ్ళతో కంఠస్థం చేయించి వాటి తాత్పర్యాలని వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పటం మొదలుపెట్టాను. వాళ్ళు ఇప్పటికీ ఎంతోకొంత శ్రధ్ధతో వాటిని మననం చేసుకుంటూ ఉంటారు. నన్నయ, తిక్కన, ఇతర ప్రాచీన కవుల సాహిత్యం చదివి అర్థం చేసుకుని ఆనందించే స్థాయికి వాళ్ళు వెడతారనే ఆశ నాకు ఏ కోశానా లేదు కానీ, వాళ్ళతో పాటు తెలుగు భాష మీద వాళ్ళకి ఉన్న ఆసక్తి కూడా పెరిగి ఎక్కడున్నా తెలుగు మాట్లాడడం మానరనే నమ్మకం మాత్రం ఉంది.
    అమెరికా విశ్వవిద్యాలయాల్లొ తెలుగు పాఠ్యాంశంగా ఉండాలా, ఉంటే దానివల్ల కలిగే లాభాలు, స్థానికి సంస్థలకి తెలుగు భాషపట్ల ఉన్న apathy వంటి విషయాలు పక్కనుంచి, ఎవరికివారు తమ తమ స్థాయిలొ మన భాషని, సంస్కృతిని పిల్లలకు అందజేయడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే వచ్చే ఫలితాలు మెండు.

    విధేయుడు,
    కాశీనాథుని రాజాశంకర్

  6. రచయితలకు సూచనలు గురించి kompella ramakrishna murty గారి అభిప్రాయం:

    04/13/2007 7:01 am

    ఇప్పుడే ఈ సైట్ చూసాను.చాలా ఆనందం కలిగింది.దీనిలో ఇండియాలో ఉన్న
    రచయితల రచనలు ప్రచురించరా?
    రచనలు ఎలా పంపాలి
    ఇలా తెలుగులో టైప్ చేసి పంపవచ్చునా
    తెలుగు పీపుల్.కామ్ కు రచనలు పంపగల్గుతున్నాం.అలాగే దీనికి కూడా
    పంపగల మార్గం సూచించండి.

  7. వికీపీడియా – స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    04/13/2007 5:44 am

    Good article! Informative and useful.

  8. నామాట గురించి Vaidehi Sasidhar గారి అభిప్రాయం:

    04/13/2007 5:38 am

    Thought provoking well written editorial.

  9. రచయితలకు సూచనలు గురించి Khaja గారి అభిప్రాయం:

    04/08/2007 11:24 pm

    ఈ మాట బాగుంది. ఇందులో మీ మాటలూ బాగున్నాయి.

    ఖాజా, హైదరాబాద్

  10. గేటెడ్ కమ్యూనిటీ గురించి రానారె గారి అభిప్రాయం:

    04/06/2007 11:27 am

    గేటెడ్ కమ్యూనిటీ మీద అర్జున్‌ వెళ్లగక్కే ఆక్రోశమే మనదేశంలో ఉన్నవారు ప్రవాసభారతీయుల పట్ల చూపడం నేను గమనించాను. ఈ కథ చివరలో సుధ మాట్లాడిన మాటలు ఆర్థిక అసమానతలతో జీవితపోరాటం చేస్తున్న సమాజాలన్నింటికీ ప్రపంచవ్యాప్తంగా వర్తిస్తాయనిపిస్తుంది. దాన్ని అర్థంచేసుకొని పరస్పర సహనంతో మసలే సహృదయతే బహు అరుదు. మంచి ఇతివృత్తం. చదివించే లక్షణం పుష్కలంగా ఉన్న కథ.

« 1 ... 1513 1514 1515 1516 1517 ... 1582 »