Comment navigation


15823

« 1 ... 98 99 100 101 102 ... 1583 »

  1. అలా నచ్చుతుంది గురించి అనంత్‌ మల్లవరపు గారి అభిప్రాయం:

    11/02/2023 1:36 pm

    కథ బాగుంది. ఇంటింటి రామాయణం. మనసు మాయాజాలం!

  2. అలా నచ్చుతుంది గురించి S. Narayanaswamy గారి అభిప్రాయం:

    11/02/2023 11:24 am

    చాలా బావుంది.

  3. అలా నచ్చుతుంది గురించి వారణాసి నాగలక్ష్మి గారి అభిప్రాయం:

    11/02/2023 2:59 am

    భలే రాశారే కొత్తగా! Enjoyed reading it. 🙂

  4. నేత్రోన్మీలనం గురించి RAMARAO KANNEGANTI గారి అభిప్రాయం:

    11/01/2023 11:37 pm

    మొదటి నుండీ ఒక్కబిగిన చదివించేసింది. ఎన్ని అర్థాల్లో అర్థాల్లో. ట్రామాకి గురి అయిన వాళ్ళకి చిత్రలేఖనం ఒక చికిత్స లేదా ఉపశమనం అంటారు. ఇంకా రెప్రెస్‌డ్ మెమొరీస్ లాంటివి పూర్తిగా మర్చిపోవడం కాదు — ఎలాగో తమ కథలో ఒక భాగంగా చేసుకోవాలి — గాయం పడిన మచ్చ లాగ!

    మళ్ళీ చదివితే ఇంకేమన్నా తోస్తుందేమో — ఒక సంవత్సరం ఆగి వచ్చి చదువుతాను!

  5. అలా నచ్చుతుంది గురించి Jeevan babu గారి అభిప్రాయం:

    11/01/2023 9:33 pm

    చక్కటి కథ, పేరుతో సహా.

  6. నేత్రోన్మీలనం గురించి దర్పణం శ్రీనివాస్ గారి అభిప్రాయం:

    11/01/2023 9:03 pm

    రామరాజ్యంలో కూడా ఒక స్త్రీ కున్న స్వేచ్ఛ పరిమితులను కళ్ళకు కట్టించారు. అదేసమయంలో స్త్రీ ఆత్మ గౌరవాన్ని ప్రస్పుటించారు. తండ్రిపై బిడ్డ కున్న అనురాగం, తండ్రిని బిడ్డను చేసిన వైనం అద్భుతం. ‘రమా’యణం.

  7. నవంబర్ 2023 గురించి Amarendra Dasari గారి అభిప్రాయం:

    11/01/2023 4:50 pm

    ‘ఈమాట’కు రజతోత్సవ శుభాకాంక్షలు..

    గత ఏడెనిమిదేళ్లుగా ఈమాటతో సన్నిహిత బాంధవ్యం ఏర్పడినందుకు ఎంతో సంతోషంగా ఉంది.

  8. కన్యాశుల్కం లోని ‘ఎత్తడం’ ఆట గురించి మద్దిపాటి కృష్ణారావు గారి అభిప్రాయం:

    11/01/2023 2:14 pm

    చాలా చక్కగా వివరించారు!

    ఈ బేస్తు-కుదేలు ఆటను వెల్చేరు నారాయణరావు గారు అనువదించిన కన్యాశుల్కం (Girls for Sale) నాటకంలో వేలూరి వెంకటేశ్వరరావు గారు కూడా వివరించారు.

    అడ్డాటకు కొన్ని పోలికలున్నా, ఇందులో అందరూ ఎవరికి వారే. కానీ అడ్డాటలో సరి సంఖ్యలోనే ఆటగాళ్ళుంటారు. పైగా రెండు జట్లుంటాయి. చేయి విడిచి చేయి ఒక జట్టవుతుంది. అడ్డాటలో పందాలకు అవకాశం తక్కువ. కానీ గంటల తరబడి హోరాహోరీగా ఆడేవాళ్ళం. 1950 ల నాటికే బేస్తు-కుదేలు ఆట మరుగున పడిపోయిందని విన్నాను.

    అడ్డాట గురించి చాలాకాలం క్రితం రచ్చబండలో చర్చించాం.

  9. నేత్రోన్మీలనం గురించి Siva Somayajula గారి అభిప్రాయం:

    11/01/2023 2:09 pm

    చాలా చాలా బాగుంది, మీ ఊహ, వర్ణన – వెరసి మొత్తంగా మీ కథ. మీ నుంచి ఇటువంటి కథని ఊహించకపోవటంవల్ల నన్ను ఆశ్చర్యపరచింది కూడా. శెభాష్ పూర్ణిమా!

  10. అలా నచ్చుతుంది గురించి Siva Somayajula గారి అభిప్రాయం:

    11/01/2023 1:01 pm

    ఏ కృత్రిమ మేధస్సు, జెనరేటివ్ ఎఐ కి అంతుచిక్కని వ్యవహారం ఇది. మగాళ్ళూ, మీకు జోహార్లూ!

« 1 ... 98 99 100 101 102 ... 1583 »