ఈ మధ్య మరీ ‘తాతల కాలంనాటి పాతపాటలు’ వినిపిస్తున్నానని కొంతమంది వ్యక్తిగతంగా ఫిర్యాదు చేశారని, రేడియో ప్రసంగాలు ఏమయినా ఉన్నాయా అని నా టేపుల్లో వెతుకుతుంటే మో (వేగుంట మోహనప్రసాద్), సంజీవదేవ్‌, విజయవాడ రేడియో కేంద్రంలో మాట్లాడినవి దొరికాయి.

గడినుడి 15 పూర్తిగా నింపినది ఈసారి కామాక్షి గారు ఒక్కరే. కామాక్షి గారికి అభినందనలు. సరిచూపు సహాయంతో నింపిన మొదటి ఐదుగురు: 1. రమాదేవి పూల, 2. పి.వి.ఎస్. కార్తీక్ చంద్ర 3. జి.బి.టి. సుందరి 4. హేమంత్ గోటేటి 5. హరిణి దిగుమర్తి. వీరికీ మా అభినందనలు.

గడి నుడి – 15 సమాధానాలు, వివరణ.

అడ్డం 2018కి… సమాధానం: స్వాగతము సభలో ఉద్యోగం సమాధానం: కొలువు. ఈ పదానికి సభ, ఉద్యోగం అనే రెండర్థాలూ ఉన్నాయి. వెనకనుండి చీలుస్తుంది సమాధానం: […]

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఈమాట ఒక కొత్తరూపు దిద్దుకుని మాసపత్రికగా మారి, కొత్తగా మరికొన్ని కొత్త పుంతలు తొక్కి ఈ సంచికతో ఏడాది. రచయితల సహకారం, పాఠకుల ప్రోత్సాహం– నాణ్యతతో ఏమాత్రమూ రాజీ పడకుండా ఈమాటను మాసపత్రికగా ఇక నడపగలమనే నమ్మకాన్ని మాకు ఇచ్చాయి. అందువల్ల ఇకనుంచీ కూడా ఈమాట మాసపత్రికగానే రాబోతున్నది. ఈ సాహితీప్రయాణంలో మాకు తోడుగా నిలిచిన రచయితలకు, పాఠకులకు, ఎన్నిసార్లు చెప్పినా ఎక్కువకాని కృతజ్ఞతలు మరొక్కసారి.

డిటిఎల్‌సి వారి సాహిత్య విమర్శ వ్యాసపోటీలలో ప్రథమ బహుమతి గెలుచుకున్న మానస, జిజ్ఞాసల వ్యాసాలు– ఆ వ్యాస సంకలనం విడుదలయిన సందర్భంగా–ఈ సంచికలో ప్రచురిస్తున్నాం; గత ఏడాదిగా తెరచాటు-వులు వినిపించిన శ్రీనివాస్ కంచిభొట్లకు మా కృతజ్ఞతలు. ఈ సంచికతో ఆ ధారావాహిక ముగుస్తున్నది. ముందుముందు వారినుంచి మరిన్ని చలనచిత్రకథనాలను ఆశిద్దాం; ఈమాటలో గత ఆరునెలలుగా వచ్చిన పాఠకుల వ్యాఖ్యలపై టి. చంద్రశేఖర రెడ్డి ఆసక్తికరమైన విశ్లేషణ; కొత్త సంవత్సరం సందర్భంగా ఈమాట పాఠకులకోసం భైరవభట్ల కామేశ్వరరావు కూర్చిన ఒక స్పెషల్ గడి; కథలూ, కవితలూ, శీర్షికలూ…

అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. మధ్యాహ్నం 3:15.
ఇంకో నలభై ఐదు నిమిషాలు ఉంది విద్య రావడానికి.
అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:20. 2016 మార్చి 27 అది.
అంటే మూడు రోజుల్లో విద్య బర్త్‌డే.
అర్జున్‌ టైమ్‌ చూసుకున్నాడు. 3:48. 2016 సెప్టెంబర్‌ 27.
అంటే మూడు రోజుల్లో తన బర్త్‌డే.

విమర్శ అంటే ఒక సృజన యొక్క విశ్లేషణాత్మక పరిశీలన అని నిర్వచించుకుందాం. సృజన అంటే ఏమిటి? తన అనుభూతులకు, అనుభవాలకు, ఆలోచనలకు, ఒక కళాకారుడు ఇచ్చే రూపం సృజన. ఇది ఎన్నో లలిత కళారూపాల్లో ప్రకటితమవుతుంది. ఇప్పుడు మనముందున్న మొదటి ప్రశ్న: సాహిత్యాన్ని ఎలా పరిశీలించాలి? ఎలా అర్థం చేసుకోవాలి?

ఓ పక్కన వంటలైపోతున్నాయ్. అంటించాల్సిన మైదా వుడుకుతోంది. మరో మూల గడ్డిమంట మీద డప్పులు వేడి పెడుతున్నారు. మా శీనుగాడు గుర్రం తోకలోంచి వెంట్రుక పీకే ప్రయత్నం చేశాడు. గుర్రం ఒక్కసారి తుళ్ళిపడి భయంతో సకిలించింది. అంతే! మున్సిపల్ గ్రౌండ్స్ హద్దులు దాటేదాకా తరిమారు. బతుకు జీవుడా అని బయటపడ్డాం. ఇహ మాకు అవే కబుర్లు. ఎవడి అనుభవాలు వాడు తవ్వుతున్నాడు.

భళ్ళున బద్దలయిందది. పొరపాటున జారిపడిందా కావాలని విసిరికొట్టిందా తెలియదు. మిటకరించిన కళ్ళలో భయం లేదు. ఏం చేస్తావో చేయి అన్నట్టు నిల్చుంది మూడడుగుల ఎత్తుగా. పెదాల చివర్లలో నవ్వొలుకుతుందా? దాన్ని తాకొద్దని ఆమె వారిస్తూనే ఉంటుంది. చాలా ప్రియమైనది అది. చెదిరిన ముక్కలన్నీ ఏరుతూంటే ఏడుపు ముంచుకొచ్చింది.

ఎనభైలలో, ఫలానా సినీతారకి ‘ఆలిండియా అభిమాన సంఘ అద్యక్షుడు’గా ఉండడం అన్నది ఒక వృత్తిగా మారుతున్న రోజులలో, వసూళ్ళు మందికొడిగా మొదలైన సినిమాని ఒక తోపు తోయడానికి ఈ అభిమాన సంఘాల ద్వారా ఆ తారలే పెట్టుబళ్ళు పెట్టి ప్రధాన సెంటర్లలో ‘టికెట్లు కోయించడం’ (అంటే టికెట్లు మొత్తం వీరే కొని, హవుస్ ఫుల్ బోర్డు పడేట్టుగా చేయడం) మంచం దింపిన సినిమా నోట్లో తులసి తీర్థం పోయడం లాంటిది.

ఇండ్ల పెరళ్ళలో నాలుగైదు పెద్ద వృక్షాలు– మామిడీ పనసా లాంటివి ఉండటం సర్వసాధారణం. అలాంటి ఒక చెట్టు మీద పొద్దున్నే కాకి ఒకటి వచ్చి వ్రాలి కౌ కౌ అని అరుస్తున్నది. మరో చెట్టు మీద కోకిలలు కూర్చుని వాటి అరుపులను అవి తుహీ తుహీ అని అరుస్తున్నాయి. ఒక కూత వినపడగానే జవాబుగా కూయడం కోకిలలకు అలవాటు.

విమర్శనము అంటే శబ్దార్థచంద్రిక ఇచ్చిన ఒక అర్థం పర్యాలోచనము. ఈ పదానికి అర్థం, చక్కగా ఆలోచించుట. వ్యాఖ్యలు రాసే విషయంలో; ఈమాట ఇచ్చిన సూచనల్లో అంతర్లీనంగా ఉన్న భావం, పాఠకులని చక్కగా ఆలోచించి వ్యాఖ్య రాయమనే. వ్యాఖ్య, ఒక రచనపై పాఠకుడి విమర్శ. విమర్శ అంటే ప్రతికూలస్పందన ఒక్కటే కాదు- సానుకూలస్పందన కూడా.

డిగ్రీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రామ్‌నగర్లో కిరాయికున్నాం. ఒకరోజు మధ్యాహ్నం మావాళ్ళు ఎటో పోయినట్టున్నారు; నేను ఒక్కడినే ఉన్నాను. ఓనర్‌వాళ్ళ కోడలు మా రూమ్ దగ్గరికి వచ్చింది. వాళ్ళు కూడా పై అంతస్థులోనే ఉండేవాళ్ళు. బ్యాచిలర్ వయసులో కబుర్లకు కారణమయ్యేంత చక్కగా ఉంటుంది. అందుకే ఆమె ప్రెగ్నెంట్ అని తెలుసు. అయితే, ఆమెతో నాకు పెద్ద పరిచయం లేదు.

ఖరీద్దారి ఫ్లోర్‌లో –
రంగుల కాంతులేవో కురుస్తున్నా
ముఖాలు తెలియని
అపరిచిత షేక్ హ్యాండ్‌లే
పాట కొదగని మ్యూజిక్ బీట్స్
శరీరాల మీద దరువులేస్తుంటది

ఎక్‌ఫ్రాసిస్ నిజంగా తెలుగువారికి తెలియని ప్రక్రియేనా? తెలుగు పద్యసాహిత్యం అంటే కవిత్వం అనుకుంటే, తెలుగు కవిత కృతి అయితే,వాటికి మరే ఇతర కళారూపంలోనూ అనుకృతులు సృజించబడలేదా? లేదంటే, ఇతర కళారూపాల్లో ఉన్న తెలుగు కృతులకి, తెలుగు కవిత్వం రూపంలో అనుకృతులు సృష్టించబడలేదా?

జిరాఫీ విజిటర్స్ వంక తూస్కారంగా చూసి నాలుగు ఆకులు పీకి చపక్ చపక్ మని నముల్తోంది కారా కిళ్ళీ నమిల్నట్టు. ఏనుగులు నిద్రలేచి దుమ్ము స్నానాలు చేస్తన్నాయి. పక్కన్నే తొట్లల్లో నీళ్ళు. ఎన్నియల్లో మల్లియల్లో అని పాడుకుంటా తానాలు చేసుంటాయి చిన్నప్పుడెప్పుడో అడవుల్లో. వాటిని పాపం ఎర వేసి. వల వేసి. పట్టార్రా మామా.

నీకు తెలిసిన దైవమ్ము మాకు తెలియు
నీకు తెలిసిన భక్తులు మాకు కలుగు
నీదు నునులేత గుండెలో నిష్ఠచేత
వెలుగు శూలంపుపదును మావలన కాదు.

సామాజిక పరిస్థితులు రచయత సాహిత్య తాత్విక దృక్పథాన్ని, రస మాధ్యమాన్ని రూపొందిస్తే, సాహిత్య తాత్విక దృక్పథం రచయిత ఎంచుకునే వస్తువును ప్రభావితం చేస్తుంది. సమాజం యెడల బాధ్యతాస్పృహ నైతికతతో ముడిపడిన సౌందర్యాభిరుచికి దారి తీస్తుంది. ప్రజలపట్ల పట్టింపు రచయిత ప్రయోగించే భాషను, శైలిలో సరళతను నిర్ణయిస్తుంది.

సాహిత్యాన్ని సీరియస్‍గా తీసుకునే చాలామందికి సాహిత్యానికీ జీవితానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి తెలుసు. ఆ సంబంధం వ్యక్తిగతమే గాదు, సామాజికం అని కూడా లీలగా తెలుసు. ఈ విషయంలో అనేకానేకుల భావనలు స్పష్టాతిస్పష్టంగా ఉండే అవకాశం ఉంది. మరి, తెలుగు సాహిత్యంలో రాజ్యాంగనైతికత స్థానమేమిటి? అవసరమేమిటి?

అఫ్సర్ రాసిన ఇంటివైపు కవిత్వసంపుటి పుస్తకానికి వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ముందుమాట. ప్రచురణ వివరాలు: ఇంటివైపు – అఫ్సర్. వాకిలి ప్రచురణ, 2017. వెల: Rs. 180/- $ 9.95 ప్రతులకు: నవోదయ, అమజాన్, కినిగె, తెలుగుబుక్స్.ఇన్