సహజం

చీకటిగుహ నుండి
బయట పడుతున్నప్పటి
వెలుగు
ఉదయం

పగలంతా
ఒక
విచ్చలవిడి తనం
ఎవరేమనుకున్నా సరే!

సాయంత్రానికి తెలుసు
తాను దేనికి దగ్గరౌతోందో!

ఎప్పుడో
హఠాత్తుగా వచ్చేసిన
వరద కాదు వయస్సు
ఎలాగైనా
ఆనకట్టలతో ఆపేయలేని మృత్యువు

ఎవరున్నా
లేకున్నా
పూచే పూలు పూస్తూనే ఉంటాయి!