అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, […]
నవంబర్ 2003
ఇది “ఈమాట” ఐదో జన్మదిన సంచిక!
అంటే, “ఈమాట” ఇంకా బాల్యావస్థలోనే వుంది. ఎంతో ఎదగాల్సి వుంది. ఎన్నో సాధించాల్సి వుంది.భవిష్యత్తంతా ముందుంది. దాన్ని ఉజ్వ్జలంగా ఉండేట్టు చూసే బాధ్యత మనందరిదీ.
ఈ ఐదేళ్ళ కాలంలోను “ఈమాట” ప్రచురణలో నా సహసంపాదకులుగా చేయూత ఇచ్చిన వారు విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్, కొలిచాల సురేశ్, ద్వానా శాస్త్రి గార్లు. వారందరి కృషికి నా కృతజ్ఞతలు.
ఈ సంచిక నుంచి మరో ముగ్గురు సంపాదకులు కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వీరు ఆరి సీతారామయ్య, డొక్కా శ్రీనివాస ఫణికుమార్, శొంఠి రమణ గార్లు. ఒక్కొకరు ఒక్కొక రంగంలో నిష్ణాతులు. ముఖ్యంగా తెలుగు సాహిత్యం మీద, సంస్కృతి మీద, భాష మీద మిక్కిలి మక్కువ వున్న వారు. వీరి ఉత్తేజకరమైన నిర్వహణలో “ఈమాట” కొత్తపుంతలు తొక్కి, కొత్తవిషయాలు నేర్చుకొని, ఉన్నత శిఖరాల్ని అధిరోహిస్తుందని మనం ఆశించవచ్చు.
ఈ జన్మదిన ప్రత్యేక సంచిక కోసం ఆదరంగా ముందుకు వచ్చి చక్కటి రచనల్ని అందించిన అందరికీ నా కృతజ్ఞతలు. ముఖ్యంగా కనకప్రసాద్, కన్నెగంటి చంద్ర, వేలూరి వేంకటేశ్వరరావు గార్లను ఈ సందర్భంలో ప్రత్యేకించి పేర్కొనాలి. ఈ సంచికలో ఒక విశేషం ఏమంటే దాదాపు కవితలన్నిట్నీ ఆయా కవులు తమ సొంతగొంతుల్తో చదివి వినిపిస్తున్నారు! అంతే కాకుండా కొందరు తమ కవితాసంకలనాల నుంచి కొన్ని కవితల్ని ఎన్నిక చేసి చదివి వినిపిస్తున్నారు కూడ.
ఇక, అడిగీ అడగక ముందే ఎంతో ఉత్సాహంతో ఆకాశవాణి ఎప్పుడో ప్రసారం చేసిన అరుదైన కార్యక్రమం రమణాశ్రమం నుండి ప్రఖ్యాత రచయిత చలం గారితో “రజని” గారి ముఖాముఖి శబ్దరూపంలో మనందరికీ అందిస్తున్న పరుచూరి శ్రీనివాస్ గారికి కృతజ్ఞలని చెప్పి ఊరుకోవటం కేవలం భాష చాలకనే. ఈ కార్యక్రమంలో ముందుగా చలం గురించి విశ్వనాథ వంటి ప్రముఖుల అభిప్రాయాలు కూడ పొందుపరిచారు. అలా ఎందరో మహానుభావుల భావాల్ని వారి గళంలోనే వినగలుగుతున్నాం. దీన్ని డిజిటైజ్ చేసి, పరిశుభ్ర పరిచి, కావలసిన రూపంలో అందించిన మాచవరం మాధవ్ గారి కృషికి కృతజ్ఞతలు.
శ్రీనివాస్ గారే మరొక అపురూపమైన ఆకాశవాణి ప్రసారాన్ని కూడ పంపించారు. ఆకాశవాణి స్వర్ణోత్సవాల సందర్భంగా ఉషశ్రీ ఉపోద్ఘాతంతో ఎందరో సాహితీప్రముఖుల గళాల్లో వారి కవిత్వాన్ని (కొండొకచో ఏవో విషయాల మీద వారి అభిప్రాయాల్ని) వినే అవకాశం దీని ద్వారా కలుగుతోంది. వేలూరి శివరామశాస్త్రి, పుట్టపర్తి నారాయణాచార్యులు, విశ్వనాథ సత్యనారాయణ, ఇంకా ఎందరో విఖ్యాతుల్ని విని ఆనందించండి.
అద్దేపల్లి రామమోహనరావు గారు జాషువా గారి గబ్బిలం కావ్యాన్ని వ్యాఖ్యానిస్తూ వీనులవిందుగా చదివి వినిపిస్తున్నారు. దీన్ని “ఈమాట” కు అందించిన శొంఠి రమణ గారికి, ఇంత చక్కటి శ్రవ్యరూపాన్ని మనకిచ్చిన అద్దేపల్లి వారికి కూడ కృతజ్ఞతలు.
ప్రచురణల భవిష్యద్వ్దారాలు ఇంటర్‌నెట్ గుండానే తెరుచుకుంటాయనే విశ్వాసం ఈ పత్రిక జననానికి బీజం. ఇకనుంచి శ్రవ్యరూపాల్లో కూడ వీలైనన్ని అంశాల్ని అందిస్తూ ఆ దిశగా మరో ముందడుగు వెయ్యటానికి ప్రయత్నిస్తున్నాం. ఇందుకు రచయిత్రు(త) లందరి సహకారం కావాలి.
చలంతో రజని ముఖాముఖి (ఆకాశవాణి సౌజన్యంతో – సేకరించిన శ్రీనివాస్ పరుచూరి గారికి, శుభ్రపరిచి డిజిటైజ్ చేసిన మాధవ్ మాచవరం గారికి ప్రత్యేక కృతజ్ఞతలతో) […]
చనిపోయినవారి ఆత్మక్షోభ స్మారక స్థూపాలు ఆ రాళ్ళరక్తపు మరకల్లో వారి జీవితాల్ని చిదిమేసిన పాదముద్రలే భయపెడ్తాయి వారి జ్ఞాపకాల్ని పదే పదే కెలికే వారి […]
ఆశబోతు జనాలు (అవుతాయవుతాయని గావాల) అమ్ముతారు కొంటారు అందుకే! అని పోతారు కట్ట మీద గుడిగంట ఎందుకు అంటున్నా బెదురుగొడ్డు జనాలు (పదండిపదండని గావాల) […]
కాళ్ళని తడిపి వెళ్తాయి తెల్లని నవ్వులతో అలలు. కళ్ళని తడిపి వెళ్ళే నీ స్మృతులల్లే ఊరకే కూర్చోనివ్వదు హోరున పొంగే సముద్రం కబుర్లు చెప్పే […]
“హియరీ, హియరీ .. హేస్ కౌంటీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఇన్ సెషన్,ది ఆనరబుల్ జడ్జ్ మైకల్ ఫీల్డ్ ప్రిసైడింగ్. ఆల్ రైజ్” కోర్ట్ అనౌన్సర్ […]
“Brahma” by Ralph Waldo Emerson రక్తతర్పణమొనరించు రాజులైన రక్తధారలు చిందించు ప్రాణులైన పుడమి జేసిన కర్మలు, పొందు బాధ దలచిరేని వారజ్ఞానధనులగుదురు నా […]
“మీకేమన్నా పిచ్చి పట్టిందా ఏమిటి, ఎక్కడో అమెరికాలో ఉన్న కన్న కూతురి మీద దావా వేస్తామంటారు?” నిర్ఘాంతపోతూ అన్నది లక్ష్మి. “పిచ్చిదానా! నేను ఇప్పుడున్నంత […]
ప్రపంచంలో ప్రతి సజీవభాష కాలానుగుణంగా తనకు కావలసిన విమర్శకులను తయారుచేసుకొంటూనే వుంది.కవిత్వంలాగే విమర్శ కూడా అతిసహజం.. అది స్వభావానికి సంబంధించినది.పండితులందరూ కవులూ విమర్శకులు కాలేరు, […]
” పొద్దుట లెగ్గానే…మొట్టమొదాట ఒకాలోచనొస్తుంది కదా! అదేంటి..? అది … It is an assumption! …..ఎసంప్షన్ … ” అని ఎడం చేత్తో […]
మొన్న సెప్టెంబరు 25న సాహిత్యోపాధ్యాయుడు, సాంస్కృతిక సిద్ధాంతకారుడు, రాజకీయ ఉద్యమకారుడు అయిన ఎడ్వర్డ్ సయీద్ (Edward Said) న్యూయార్కు నగరంలో కన్నుమూసాడు. ఈ అసామాన్యమైన […]
ఆ శుక్రవారం సాయంత్రం అతడు ఇల్లు చేరేసరికి ఆలస్యమయింది. నెరిసిన జుట్టు అద్దంలో చూసుకున్నప్పుడల్లా ఒకటే ఇబ్బంది పెడుతుండడం చేత దారిలో ఆగి షాప్‌లో […]
రాగాన్ని విని ఆనందించడానికి కొంత పరిజ్ఞానం అవసరమేమో కాని లయబద్ధమైన సంగీతం అందరికీ సులువుగా బోధపడుతుంది. సైన్యం కవాతులో గుర్రాలు కూడా భేరీల మోతను […]
దీపావళి అనగా దీపముల వరుస, ఆ రోజు పెందలకడనే లేచి… అంటూ పరీక్షల్లో వ్యాసాలు రాసేస్తావే గానీ, నిజంగా దీపావళి గురించి రాయాలంటే బోల్డుంది. […]
ప్రతి కథకీ ఒక నీతి ఉంటుంది; నువ్వు ఆ నీతిని పట్టుకోవాలేగానీ Lewis Carroll, Alice in Woderland మాట్లాడే స్వాతంత్య్రం, ( Free […]
శ్రీ లక్ష్మీ విలాసులో ప్రొద్దుటే ఒక ప్లేటు ఇడ్లీ తిని కాఫీ తాగడం అలవాటైంది కొద్ది రోజులుగా. హోటలు ఎదుటే వున్న గవర్నమెంటు హాస్పిటల్లో […]
తెలుగులో స్వీయ జీవిత చరిత్రల్ని గ్రంధస్థం చేయటం కందుకూరి వీరేశలింగంతో ప్రారంభమైంది. “తెలుగు భాషలో స్వీయచరిత్ర వ్రాయబూనుట కిదియే ప్రథమ ప్రయత్నం,” అని వారే […]
రూంలో వుండేది నలుగురం. నాకు బియ్యంలో కొలత ప్రకారం నీళ్ళు పోసి, అన్నం వండడం కూడా రాని రోజులవి. సాయంత్రం ఆఫీసుల నుంచి ఎవరు […]
“దేవీనామ సహస్రాణి కోటిశ స్సంతి కుంభజ” దేవీనామములు కోట్లకొలది ఉన్నప్పటికి నామస్తోత్రాలలో లలితా రహస్యనామ స్తోత్రం ఉత్తమోత్తమ మైనది. విశిష్టమైనది. “శ్రీమాయః ప్రీతయే తస్మాదనిశం […]
పొద్దుపొద్దున్నే నిద్ర కళ్ళతో గోడను పట్టుకుని, బెడ్రూములోంచి వంటగదిని దాటుకుని, ముందు గదిలోకి వచ్చి, తలుపు తీసి పేపరు కోసం చూడ్డమూ వారం రోజుల్లో […]
మా ఊరంటే నాకు మహగొప్ప అభిమానం. నేను ప్రతిసంవత్సరం మా ఊరెళ్ళి వస్తాను. అందరికీ ఆశ్చర్యం గానే ఉంటుంది, నేను పని కట్టుకొని మావూరు […]
ఆనందంగా ఆడే పిల్లలను ఏనాడైనా చూశావా? తపతపమని నేలను తాకే వాన ఎప్పుడైనా ఆ చప్పుడు విన్నావా? గిరికీల సీతాకోకచిలుకను సరదాగా అనుసరించావా? మునిగిపోయే […]
ఖాళీలను పూరించుము అని ఎవరో చెప్పినట్టు నవ్వులూ నాలుగు చుక్కల కన్నీళ్ళూ తదితరాలూ ఎంత ఓపిగ్గా నింపినా నిండదు నిరతం అసంతృప్తం జీవితం జీవితమూ […]
ఏదో ఒక రుతుబలహీనతకి లోబడి వేరు పడుతుందేగాని పచ్చగా కలిసి ఉండటమే చెట్టుకి హాయి. అందుకే రంగుమారిన మరుక్షణం నుంచి రాల్చటం మొదలెడుతుంది. కలవని […]
మా ముఖ ద్వారాలకు లేనిపోని అలంకారాలు చెయ్యొద్దు తడబడే అడుగులు చూసి మెట్ల తలలు కొట్టించొద్దు గడపలను పగలకొట్టించొద్దు నోరు తిరక్క మాటల్ని వొంచితే […]