తలుపు తీసి చూడు కళ్ళల్లో తెల్లవారుతుంది ఇసుకనేల దాహం సముద్రమే తీరుస్తుంది తీగ కదిపి చూడు రాత్రి కన్నీరు రాలుతుంది పొగలు పోయే ఆకలి […]

తుఫాను లెన్నో చూసి శిథిలమై తీరాన్నిచేరి, ఏకాంతంలో సాగరపవనాలు నేర్పిన చదువు ఇసుక రేణువులకు విసుగులేని కెరటాలకు అవిశ్రాంతంగా బోధిస్తోంది ఈ సముద్రనౌక

ఉదయపు గాలి తాకిడికి కలల గాలిపటం తెగడంతో చటుక్కున లేచి కూచుంటాం. తెగిన గాలిపటం ఏ మరుపు పొరల చింతగుబురుల్లోనో చిక్కుకొని, మరి కనిపించటం […]

నీ క్షణికానందాన్ని ఆమె తొమ్మిది నెలలు మోసింది. వీడైతే దానిని నూరేళ్ళూ మోయవలసినవాడు. ఇంకా నీ బెల్టు చారల్ని, వేళ్ళ ఆనవాళ్ళని కూడా ఎక్కడ […]

తడిచేతుల సముద్రం తడిమి తలబాదుకొంటుంది శిలలపై.. బడితెలేని బడిపంతులు పొడవాటి ఒడ్డు అదిలిస్తోంది చదవలేని కెరటాలను పచార్లు చేసేవారిని విచారం లేని చలిగాలి వీచి,పరామర్శిస్తుంది. […]

నీ గదిలోకి ఎవరూ రారు టేబుల్‌సొరుగును తెరవరు ఆకుపచ్చని ఏకాంతాన్ని అనుభవించు. పొద్దుతిరుగుడు పూలు నిద్దురలో,కలలో సద్దు చేయవు. అరాచక ఆకాశాన్ని విరిగిన చంద్రుని […]

ఏటి ఒడ్డున మేటలు వేసిన ఇసుక తేటగ పారే నీరు పరాచికాలాడే ప్రతిబింబాల వైపు పరీక్షగా చూస్తుంటే హఠాత్తుగా లేచి తటాలున వంగి లావాటి […]

గదిలో ఫాన్‌తిరగదు బల్లి నాలుకపై జిగురు ఆరదు పాత రహదారుల మీదే కొత్త రహదారులు వేస్తారు మరణించిన మహామహులు నగరంలో విగ్రహాలై మొలుస్తారు చీమలు […]

నిండైన దీని జీవితాన్ని ఎవరో అపహరించారు. దీని బలాన్ని, బాహువుల్ని, వేళ్ళని, వైశాల్యాన్ని, నింగిని అటకాయించే నిర్భయత్వాన్ని, ఎవరో నిర్దయగా, నెమ్మదిగా, అందంగా అపహరించారు. […]

పాపం దానికేమీ తెలీదు. దాన్నేమీ అనకండి. మనం ఛేదించలేని మృత్యు రహస్యాన్ని అది గుప్పిట్లో పెట్టి నిల్చుంది. వేళ్ళలా చుట్టుకున్న వరల వెనకాల్నించి ఎవరు […]

ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? నివారించలేను, సవారి గుర్రముసకిలించె నురగతో!! ఏ వాలు కెరటమో;తెరచాప కదిలెను. చేవ్రాలు చేయలేను! ఎవరైన ద్వారము ఇవాళ తెరువరా? […]

ఒక మధ్యాహ్నం ఎండ కనురెప్పలు కాల్చినట్టు గుండ్రని నవ్వుల గోళీలు రాచుకున్నట్టు ఎర్రని మెట్లపై ఎపుడూ పాకే నీరు పలక పగుల గొట్టే బాలుడు […]

ఒక్క రాత్రిలో పర్వతాలను కదిలించకు మహావృక్షాలను పెకలించకు నిశాగానం విను అరమూసిన కన్నులతో నడిరేయి నల్లని సంగీతాన్ని గ్రోలు నురగల అంతరంగం..అలల సద్దు మెరిసే […]

తీపి పదార్థాలకు నోరూరదు షోకేసు అద్దాలు నిస్వార్థంగా బ్రతుకుతాయి జలపాతంలా దుమికే మౌనం చెక్కనావై పగిలిపోగలదు భూమి గదిలో కునుకుతీసే కబోది లావాసర్పం ఏమీ […]

బోనులో సింహం నిదురిస్తుంది తపస్సు చేసుకొనే విత్తనం కదలదు ఇంకే బురదలో కత్తులు లోతుగా దిగుతాయి కూలే వంతెనలు పాదస్పర్శకోసం పరితపిస్తాయి గుబురాకుల్లో దాగిన […]

పొలిమేరల్లో ఉన్న ఊళ్ళోకొచ్చిన పులిలా చప్పుడుకాకుండా కాలేజీ కేంపస్‌ లోకి కాలుపెడుతుంది జ్వరం. ఇక్కడి మనుషులు నిరాయుధులని, వీళ్ళ మధ్య యే బలమైన బంధాలూ […]

ఈ కష్టాల్ని భరిస్తూ ఈ కాంప్లెక్సిటీని ఓర్చుకొంటూ ఎన్నాళ్ళిలా సాగిపోదాం ? సముద్రం నుంచి విడిపోవాలనే పడుచు కెరటాలు ఉవ్వెత్తున లేచి మళ్ళీ ఒక్కసారికి […]

ఎగురలేని గాలిపటం తోకలా కొబ్బరి చెట్టు నదిపై ఎండ భూతద్దంలో దూరిన కిరణం నీ తలను కాలుస్తుంది పీతలను తరుముతుంది! గుబురు తోపు వెనుక […]