అడ్డం
- బాకీ సరసర తీర్చెయ్యాలంటే అర్థంకాని భాష నేర్చుకో (6)
సమాధానం: కీసరబాసర - అక్షరం ఉన్నా లేకున్నా తేనె తేనే (4)
సమాధానం: మరందము - జాతీయగీతంలో బ్రహ్మ (3)
సమాధానం: విధాత - కుర్చీకీ మంచానికీ ముందుండే భక్ష్య విశేషం (3)
సమాధానం: మడత - వేలిముద్ర సంతకం? (5)
సమాధానం: హస్తాక్షరము - చక్కని పొందిక ఉండాలంటే మామ సగము చిక్కాలి(5)
సమాధానం: సమాగమము - పేరు వినడానికి ఆహ్లాదంగా అనిపించినా కడుపులోకి వెళ్ళిందంటే కల్లోలమే! (4)
సమాధానం: ఆముదము - గాయకుడిలా ఉన్న వంచకుడు (4)
సమాధానం: లయకాడు - మేఘాల్లో కొద్దిసేపు మాత్రమే వెలిగే దీపం? (3)
సమాధానం: క్షణిక - సమయములో మార్పులు కాగా బడిశ దొరుకుతుంది (3)
సమాధానం: గాలము - తర్జని కొసలతో గర్భం (2)
సమాధానం: చూలు - అసలే చిరాకు. మధ్యలో గురక మొదలుపెడితే పుట్టే దళం (4)
సమాధానం: చిగురాకు - తక్కువగా మాట్లాడేవాడి వాతమిది కాబోలు (4)
సమాధానం: మితవాది - కైలాస పర్వతాన దొరికే లోహం? (2)
సమాధానం: వెండి - తెలంగాణా మట్టి (3)
సమాధానం: వుసుక - మంచి మనస్సు ఉన్న ధనికుడు (3)
సమాధానం: ఆఢ్యుడు - అర్థంపర్థంలేని కథలకి ఇవి ఉండవు (4)
సమాధానం: తలాతోక - ముందు చదువు శ్రేష్ఠము – జబ్బుని నయంచేసే శాస్త్రం (4)
సమాధానం: చరకము - గరుడపక్షి పాముభోజనం కాదు (5)
సమాధానం: చిలువతిండి - వంశ పారంపర్యంగా వచ్చే బాధ్యత కలవాడు (5)
సమాధానం: మిరాసిదారు - గణితశాస్త్రంలో తీసివేతకు విరుద్ధం (3)
సమాధానం: కూడిక - పండితులు రైతులకు దున్నుకునేందుకు ఇచ్చే హక్కు (3)
సమాధానం: కవులు - ఇలాఅంటే ఏమయినా సరే అనంగీకారమే (4)
సమాధానం: ససేమిరా - శ్రవణేంద్రియంలో దూరే జలగ (6)
సమాధానం: చెవిచొరుపాము
నిలువు
- అగ్నికణాలు వెదజల్లే ప్రాణి (4)
సమాధానం: కీటమణి - సారము చెడినప్పుడు తలదూరిస్తే పాతాళలోకం కనిపిస్తుంది (5)
సమాధానం: రసాతలము - ఓర్పులో అన్నచివరి ప్రయత్నం (5)
సమాధానం: సన్నహనము - అరటి మునగ మొదలుతో వెదురు (3)
సమాధానం: రంభము - ఈ గిరి గ్రామాధికారి పని (4)
సమాధానం: మునసబు - ఉదాహరణకి గద్ద చూసే చూపు కాబోలు (6)
సమాధానం: విహంగవీక్షణం - ఎక్కువ కష్టాల్లో ఉన్నప్పుడు పాతాళలోకం ప్రతిరూపం కనిపిస్తుంది (6)
సమాధానం: తలమునకలు - రాజులు కవులకు ఇచ్చే బహుమానానికి కొలమానం (6)
సమాధానం: అక్షరలక్షలు - ఉండడానికి ఠికాణా, చిల్లుగవ్వ లేకుండానే చిరకాల నివాసస్థలం (3)
సమాధానం: కాణాచి - మారుమోగి ఒక రాగానపడ్డ పెద్ద ఢంకా (3)
సమాధానం: నగారా - నీటకలిసిన పత్రం జలనీలిగా మారుతుంది (3)
సమాధానం: నీరాకు - ఈ తరహా రాజకీయాలు పార్టీలకే చేటు (2)
సమాధానం: ముఠా - తనదేదో తనది, మనదసలే పడదోయ్ అన్నాడు మిస్సమ్మ కథానాయకుడు (3)
సమాధానం: మతము - కాకి గోల! (2)
సమాధానం: కావు - దరి లేని పెట్టెతో కొంగ (3)
సమాధానం: బకము - అప్పు తీర్చలేనివాడు చేతులెత్తేస్తే? (3)
సమాధానం: దివాలా - ఒక్కొక్కప్పుడు ప్రమాదం ఇలాకూడా తప్పుతుంది (6)
సమాధానం: వెంట్రుకవాసిలో - అన్నివిధాలా వెనుకపడ్డవారు (6)
సమాధానం: బడుగువర్గాలు - రెక్కలున్నంత మాత్రాన పక్షి కాదు (5)
సమాధానం: ఆకుచిలుక - అరబ్ దేశాల్లో కనిపించేది? (3,2)
సమాధానం: చమురుబావి - ఈమె పెంపుడు సంతానం కాదు (5)
సమాధానం: కన్నకూతురు - ఇది అందని కోరిక, లంబాడోళ్ళ రాందాసా! (4)
సమాధానం: అడియాస - కపాలము బద్దలయితే అగ్ని పుడుతుంది (4)
సమాధానం: పాకలము - ఎటునుండి చూసినా కాంతే (3)
సమాధానం: మిసిమి