ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…
తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?
నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశానికి తెలుసా?
ఒక పాట నుండి
ఇంకో పాటలోకి
ఇంకో కాలంలోకి…
తొలిస్పర్శ, తొలిముద్దు,
తొలి తొలి సుఖాల క్షణాల దాటి దాటి
ఎక్కడున్నావిప్పుడు?
నీడలు ముసిరేదీ, చెదిరేదీ
అన్నీ చూసిన ఆకాశానికి తెలుసా?
అలా బీచ్‌కెళ్ళి కాసేపు వాక్ చేసొద్దామా? అంటూ ఈ కథలో ఎవరూ డయలాగ్ వేయలేదు. వాక్‌కెళ్ళారు. ఇసుక తెల్లగా, పొడిగా ఉన్నచోట కూర్చున్నారు. చుట్టూ కనుచూపు మేరలో ఎవరూ లేరు. ఇప్పుడు ఈ చోట కథ క్రైమ్ కథలా మారిపోయేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ కథలో ఆబ్సెంట్ అయిన కమలాకర్ పాత్ర వల్ల కథ మరో దారిలో ప్రయాణించేందుకు మేకప్ అదీ వేసుకుని రెడీ అవుతోంది.
దూరం
బహుశా కొలుస్తున్నావేమో
దూరం
బహుశా మోస్తున్నావేమో
దూరం
నించి బహుశా చలిస్తున్నావేమో
దూరం
నించి బహుశా నువ్వూ కదుల్తున్నావేమో…
రాయ్‌చరణ్ అలా వెళ్ళడం ఆలస్యం, కుర్రాడు ఇటు నదికేసి తన బండి లాక్కుంటూ వెళ్ళిపోయేడు. విపరీతమైన వేగంతో పోయే నీళ్ళ ప్రవాహం చూసేసరికి వాడికి మరింత సరదా పుట్టింది. పక్కనే దొరికిన చిన్న కర్ర పట్టుకుని నీళ్ళలోకి దాన్ని వంచుతూ చేపలు పడుతున్నట్టూ వంగడం, నీళ్ళని ఆ కర్రతో కొట్టడం సాగించేసరికి చిన్న నీటి తుంపర వాడి మీద పడింది. దాంతో నీళ్ళంటే మరింత ఉత్సాహంతో మరింత ముందుకి వెళ్ళాడు బండిని లాక్కుంటూ…
ఛాయాదేవి అంటే క్రమశిక్షణ. ఛాయాదేవి అంటే సమయ పాలన. ఛాయాదేవి అంటే ప్రతిపనీ కళాత్మకంగా చెయ్యడం. ఛాయాదేవి అంటే హాస్య చతురత. ఎంత కష్టాన్నైనా అది సహజమేనన్నట్లు స్వీకరించడానికి సిద్ధంగా వుండడం. మృత్యువు అనివార్యం. కాని అందరూ సంసిద్ధంగా ఉండలేరు. ఛాయాదేవి మాత్రం ఎవరికీ ఎలాంటి తడబాటూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుని సగౌరవంగా వెళ్ళిపోయారు.
వనజకి కళ్ళనీళ్ళ పర్యంతమయింది. తన సెక్షన్ వర్క్ గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. తన అనుభవంతో సంపాదించిన విజ్ఞానాన్ని ప్రదర్శించటానికి రవంత అవకాశం కూడా ఇవ్వలేదనిపించింది. ఊరుకున్నదాన్ని పిలిచి అప్లై చెయ్యమనీ, సెక్షన్ గురించి పుస్తకాలు చదవమనీ ప్రత్యేకం సలహా ఇచ్చిన పెద్దమనిషి ఇంటర్వ్యూలో అలా కర్కశంగా ఎందుకు ప్రవర్తించాడో అర్థంకాలేదామెకి.
గూడు నాదే నన్న భ్రమలో
మాయాద్వీపపు పక్షినై విహరించిన నాకు
బంధం కేవలం భావనే అన్న ఎరుక కలిగించిన నువ్వు
నీ కళ్ళలో నా నీడ కోసం
వెతికి వెతికి ఓడిపోయాక
ఇప్పుడు నా బొమ్మ ఎదురుగా నువ్వు
గణపతిముని విదేశీయుల పాలనలో కృశించిపోయిన భారతసమాజం మళ్ళీ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలనే అకుంఠితమైన శ్రద్ధతో, వేదనతో తన తపఃజీవితాన్ని గడిపాడు. స్వతంత్రోద్యమంలో కొన్నాళ్ళు చురుగ్గా పాల్గొని, మద్రాస్ కాంగ్రెస్ సభలలో సభ్యుడిగా పాల్గొన్నాడు. గాంధీజీ హిందీ భాషోద్యమంతోనూ, హరిజనోద్యమంతోనూ ఆయనకి మౌలికమైన విభేదాలు రావడంతో, కాంగ్రెస్ నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది.
ఆకాశమందలి యవిభక్త నాద
మాకారమైయెప్పు నక్షరమునకు
ఆనాదముగణేశు నాదిమమూర్తి
ధ్యానముచేయుట దానిని వినుట
శర్వుని పట్టిగా సత్యనాదమును
సర్వము తెలిసిన సజ్జనులనిరి
వర్గ ప్రాతినిధ్యపు
పక్షపాతపు చూపులేని కవిత
పుంఖానుపుంఖాలుగా సాగి
రొట్టకొట్టుడు ప్రయోగాలతో
సూక్తివాక్యాలతో
నీకు మాత్రమే సందేశమవని
కవిత ఒక్కటి చెప్తావా
అడ్డం కీకారణ్యానికైనా, జనారణ్యానికైనా తిండి కావాలంటే జరిగి తీరాల్సిందే (10) సమాధానం: కిరణజన్యసంయోగక్రియ ఈ మూడు బేడలు వేదాల్లోవా?(4) సమాధానం: ఆరణాలు అన్యభాషలో చూస్తే […]
క్రితం సంచికలోని గడినుడి-33కి గడువుతేదీ లోగా నలుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారు: అనూరాధా శాయి జొన్నలగడ్డ, వైదేహి అక్కిపెద్ది, చందన శైలజ, భమిడిపాటి సూర్యలక్ష్మి. విజేతలకందరికీ మా అభినందనలు.
గడి నుడి-33 సమాధానాలు, వివరణ.
రెండు చేతులు కౌగిలించుకునప్పుడు
వచ్చే కడియాల చప్పుడుతో
తరగతి గదులు నిద్రలేస్తుంటాయి
అక్కడ తలలు లేని సూత్రాలు
ప్రాణం లేని సమీకరణాలు
ఎందుకు పుట్టాయో తెలియని ప్రమేయాలు
జీవితాలను లోతుగా అధ్యయనం
చేస్తుంటాయి
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
ఏ ఏటికాయేడు ఇబ్బడిముబ్బడిగా కథలు, కవిత్వ సంకలనాలు ప్రచురింపబడటం తెలుగునాట రానురానూ రివాజుగా మారుతోంది. ఊరికొకరుగా వెలిసి సాహిత్యాన్ని తమ భుజాల కెక్కించుకు మోస్తున్నామని చెప్పుకోడం చూపించుకోడం మొదలయ్యాకే మన సాహిత్య ప్రమాణాలు ఏ ఎత్తులో ఉన్నాయో మరీ స్పష్టంగా అందరికీ తెలిసి వస్తోంది. పేరు పొందిన కథా/కవిత్వ సంకలనాలు ఏవి తీసుకున్నా అందులో చేర్చబడని కథల/కవితల చర్చ అనివార్యంగా వాటితో జతపడి ఉంటుంది. కానీ, నిజానికి అసలు సమస్య అది కాదు. ఎంపిక చేయబడుతున్న రచనలూ నానాటికీ తీసికట్టుగా తయారవుతుండడం, ఏ సంకలనాన్ని గమనించినా అది ఒక ఏడాదిలో వచ్చిన గొప్ప రచనల తాలూకు జ్ఞాపికగానో లేదంటే ఆ ఏడాది వినపడ్డ కొత్త గొంతుకలను మరికొందరికి పరిచయం చేసే ప్రయత్నంగానో కనపడకపోతుండడం, సాహిత్యేతర ప్రయోజనాలే ఈ సంకలనాలు క్రమం తప్పకుండా విడుదలయ్యేలా ప్రోత్సహిస్తున్నాయన్న నిజం సాహిత్యావరణంతో అంతగా పరిచయం లేని మామూలు పాఠకులకు కూడా అర్థమయ్యేంత స్పష్టంగా ఈ రాజకీయాలు పెచ్చుపెరిగిపోవడం, కలవరపెట్టే విషయాలు.
నాలుగు రచనలు మన ముందున్నప్పుడు వాటిలో ఏది అత్యుత్తమ రచనో బేరీజు వెయ్యడం, నాలుగింటినీ విలువ కట్టి వరుసలో ప్రకటించడం అసాధ్యమైతే కావచ్చు కానీ, ఇన్ని ప్రింట్ పత్రికలు,కొత్తగా పుట్టుకొస్తోన్న వెబ్ పత్రికలు, ఏడాది పొడుగునా ప్రచురిస్తోన్న ఇన్ని వందల రచనల్లో నుండి, ఒక కనీస స్థాయిలో నిలబడగల రచనలను ఎంపిక చేయలేకపోవడం ఎలాంటి దుర్గతి! ఏ ఏ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారో, ఏ ప్రాతిపదికన ఎంపిక జరిగిందో మాటవరసకు కూడా ప్రకటించని సంపాదకుల అలక్ష్యం. తమ రచనలు ఎట్లాంటి సంకలనాలలో ప్రచురింపడుతున్నాయో కనీస వివరం తెలియని స్థితిలో రచయితలున్నారు. ముందుగా రచయితలకు తెలియబరచడం, అనుమతి తీసుకోవడం అక్కర్లేని పనులయ్యాయి. ఆపాటి గౌరవాన్ని కూడా ఆశించకుండా, తమ రచనలను అచ్చులో చూసుకుంటే చాలన్న తృప్తితో బ్రతుకుతున్నారా తెలుగు రచయితలు? వెబ్‌పత్రికలలో రచనలు పరిశీలనకు అనర్హమైనవనీ, ప్రింట్ పత్రికలలో ప్రచురింపబడ్డ రచనలనే ఈ సంకలనాలకు పరిశీలిస్తామనీ బిగ్గరగా, బహిరంగంగా చెప్పుకుంటున్న సంపాదకవర్గాలది మరో వింత పోకడ. సాంకేతికతను కళకు విరోధిగా భావించే మూర్ఖత్వమిది. లేదా వెబ్‌పత్రికలలో వస్తోన్న సాహిత్యాన్ని గమనించలేని అలసత్వం. మాధ్యమాలను బట్టి, రచయిత పేరును బట్టీ కాక, అక్షరాలను బట్టి రచనలకు విలువ గట్టే ధోరణి మనకింకెప్పటికి అలవడుతుంది? లేని విలువలను ఈ సంకలనాలకు ఆపాదించడం ఆపి, మన చేతుల్లో నుండి చల్లగా జారుకుంటోన్న ఉత్తమ ప్రాచీన సాహిత్యమేదైనా ఉంటే దానిని పునఃప్రచురించుకుంటే, కనీసం కొత్త చెత్తను కాస్త తగ్గించుకున్నవారమవుతాం.
టీమ్ వర్క్ అనగానే వాడి కళ్ళు మెరిశాయి. ఆ మెరిసిన కళ్ళల్లోంచి మిగిలిపోయిన నీటిచుక్కలు మరింత మెరుస్తూ స్ఫటికాలలాగా రాలిపడ్డాయి. వాడు నా ఒళ్ళో కూర్చొని స్టీరింగ్ వీల్ తిప్పుతుంటే నేను కాళ్ళతో పెడల్స్ కంట్రోల్ చేస్తూ, పార్కింగ్ లాట్‌లో అలా ఒక అరగంట టీమ్ ఆట ఆడేం. నేను వాణ్ణి గేర్లు కూడా మార్చనిచ్చాను కాసేపు. రివర్స్ గేర్ వేసినప్పుడల్లా వాడు ఒకటే కేరింతలు. కన్నబిడ్డ నవ్వును మించింది ఏముంటుంది ఈ లోకంలో.
అకస్మాత్తుగా ఒకాయన తన కిష్టమైన ఓ బూజీ వూజీ ట్యూన్ చెప్పి అది పియానో పై వాయిస్తే వెయ్యి డాలర్లు కేష్ ఇస్తానన్నాడట. ఆలక్స్ స్టూడెంట్లని వద్దనలేదు. అతను అసలు ఏమైనా అనే లోపలే, ఒక కుర్రాడు ఉత్సాహంతో వాయించాడు. అక్కడి నుండీ అక్కడి అతిథులందరికీ ఒక్కొక్కరికీ కిర్రెక్కి, వారి జాజ్, పాప్ మ్యూజిక్ కోర్కెలు అడగటం, వెంటనే కేష్ ప్రైజ్ ఆఫర్స్, ఆ ట్యూన్స్ వచ్చిన వాళ్ళు అవి వాయించటంలో, ఒక కొత్త ఉత్సాహం, ఒక కోలాహలం.
ఒక్కోసారి తాతగారి హుంకరింపు వినిపించినా పలికేవాణ్ణి కాదు. మా అమ్మ కూడా గట్టిగా అరిస్తే విసుక్కుంటూ వెళ్ళేవాణ్ణి. ఒకటి రెండుసార్లు చూసి, మా తాతగారు, “సీఈఈత! పి. బి. కామేశ్వర్రావని కొత్తగా ఈ. ఎన్. టీ వచ్చాడట. బాగా చూస్తాట్ట. వీణ్ణి తీసుకుని వెళ్ళకూడదూ” అన్నారు. ఆయన అంత గంభీరంగా జోకేస్తున్నారో నిజంగా చెప్తున్నారో తెలిసి చావలేదు నాకు. ఆ తరవాత ఎప్పుడూ వినపడగానే దగ్గరకెళ్ళేవాణ్ణి, ఈ వెటకారాలెవడు పడతాడనుకుంటూ.
పఠాభి ఒక ప్రపంచయుద్ధం సృష్టించిన విధ్వంసం అనంతరం, ఆ విధ్వంసం నుంచి కోలుకోకుండానే ప్రపంచం మరొక ప్రపంచయుద్ధం కోసం సమాయత్తమౌతున్న కాలంలో, వినాశనం వైపుగా, ఆత్మ విధ్వంసకత్వం వైపుగా ప్రపంచం అడుగులు వేస్తున్న కాలంలో ఆ యుగ మనఃస్థితిని, ఆ కాలంలో తన ఆత్మ విచికిత్సని పఠాభి కావ్యరూపంలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని మనమర్థం చేసుకోవాలి.
అమ్మా సత్యవతిగారూ! కథలో కథంతా చెప్పే ప్రధాన పాత్రకు పేరు లేదు. ఒక వ్యక్తిత్వమూ, ఒక అభిరుచి, ఒక రుచి, అతగాడి ఒక వృత్తి కనపడదు. అసలు కళ్ళముందుకు రాని సుశీల మాత్రం మనకు అంతా తానై మనతో ఉండిపోతుంది. ఈ కథ ఇంకో గొప్ప టెక్నిక్. అమ్మా మీకు నా పరి పరి దండాలు.