ఒకచెంప నలరించు నాకాశహర్మ్యాలుమొగులుసీమల జేరు సిగల తోడమరుచెంప విలసిల్లు హరితంపు కోవెలగాలినొసగి కాయు జాలి తోడవృషభమై చెలరేగు విపణివణిజ్యంబువిశ్వమంతయు చూడ వెరపు తోడనవరసాలొలికించు నాటకరంగంబుసిరులపుంతలు దొక్కు సృజన తోడ
గోడగోడకొక్క కుడ్యచిత్రమ్ముతోవీథివీథికొక్క వింత సొబగుఐదుయింద్రియమ్ము లదిరదిరిపడగానడచి కనిన తెలియు నగరశోభ
చిత్రాతిచిత్రమౌ చిత్రముల కొరకైచరవాణిపాణులై తిరుగువారువాసికెక్కిన కళావారసత్వంబులక్రొందేనె తనుపార గ్రోలువారుశిఖరాధిరోహణే జీవితసాఫల్యమంచు తలంచి తపించువారురెక్కాడితేగాని డొక్కాడబోదనికష్టించి పనిజేయు కర్మజనులు
రేపుమాపను భేదమ్ము లేశమాత్రమైనలేక నీజనసమూహాంబురాశిడస్సిబోని సంద్రపుకెరటముల భంగిపొంగు నిద్రిల్ల నిమ్మహానగరి నందు
చోరితదేశంబు సొంతమెప్పుడు గాదునీతితోన నిజము నెంచి చూడప్రాచీన ధనముతో పైచేయి సాధించిసమత నాక్షేపించు స్వార్థజనులునవ్యనాగరికతా భవ్యాభ్యుదయభావముల దీపధారులై చెలగువారుఈనాడు గాకున్న నెల్లియైనను గూడిపోరాడి సాధించు పూర్ణసమత
భిన్నజాతులుమతము లభిన్న మనుచుసర్వసంస్కృతులు సభకు సభ్యులంపెనేమొ కొండయద్దమున కొంచెమయినట్లుజగతియే ధరియించె నిన్నగరిరూపు