సీ.
ఒకచెంప నలరించు నాకాశహర్మ్యాలు
మొగులుసీమల జేరు సిగల తోడ
మరుచెంప విలసిల్లు హరితంపు కోవెల
గాలినొసగి కాయు జాలి తోడ
వృషభమై చెలరేగు విపణివణిజ్యంబు
విశ్వమంతయు చూడ వెరపు తోడ
నవరసాలొలికించు నాటకరంగంబు
సిరులపుంతలు దొక్కు సృజన తోడ
మొగులుసీమల జేరు సిగల తోడ
మరుచెంప విలసిల్లు హరితంపు కోవెల
గాలినొసగి కాయు జాలి తోడ
వృషభమై చెలరేగు విపణివణిజ్యంబు
విశ్వమంతయు చూడ వెరపు తోడ
నవరసాలొలికించు నాటకరంగంబు
సిరులపుంతలు దొక్కు సృజన తోడ
ఆ.వె.
గోడగోడకొక్క కుడ్యచిత్రమ్ముతో
వీథివీథికొక్క వింత సొబగు
ఐదుయింద్రియమ్ము లదిరదిరిపడగా
నడచి కనిన తెలియు నగరశోభ
వీథివీథికొక్క వింత సొబగు
ఐదుయింద్రియమ్ము లదిరదిరిపడగా
నడచి కనిన తెలియు నగరశోభ
సీ.
చిత్రాతిచిత్రమౌ చిత్రముల కొరకై
చరవాణిపాణులై తిరుగువారు
వాసికెక్కిన కళావారసత్వంబుల
క్రొందేనె తనుపార గ్రోలువారు
శిఖరాధిరోహణే జీవితసాఫల్య
మంచు తలంచి తపించువారు
రెక్కాడితేగాని డొక్కాడబోదని
కష్టించి పనిజేయు కర్మజనులు
చరవాణిపాణులై తిరుగువారు
వాసికెక్కిన కళావారసత్వంబుల
క్రొందేనె తనుపార గ్రోలువారు
శిఖరాధిరోహణే జీవితసాఫల్య
మంచు తలంచి తపించువారు
రెక్కాడితేగాని డొక్కాడబోదని
కష్టించి పనిజేయు కర్మజనులు
తే.గీ.
రేపుమాపను భేదమ్ము లేశమాత్ర
మైనలేక నీజనసమూహాంబురాశి
డస్సిబోని సంద్రపుకెరటముల భంగి
పొంగు నిద్రిల్ల నిమ్మహానగరి నందు
మైనలేక నీజనసమూహాంబురాశి
డస్సిబోని సంద్రపుకెరటముల భంగి
పొంగు నిద్రిల్ల నిమ్మహానగరి నందు
సీ.
చోరితదేశంబు సొంతమెప్పుడు గాదు
నీతితోన నిజము నెంచి చూడ
ప్రాచీన ధనముతో పైచేయి సాధించి
సమత నాక్షేపించు స్వార్థజనులు
నవ్యనాగరికతా భవ్యాభ్యుదయభావ
ముల దీపధారులై చెలగువారు
ఈనాడు గాకున్న నెల్లియైనను గూడి
పోరాడి సాధించు పూర్ణసమత
నీతితోన నిజము నెంచి చూడ
ప్రాచీన ధనముతో పైచేయి సాధించి
సమత నాక్షేపించు స్వార్థజనులు
నవ్యనాగరికతా భవ్యాభ్యుదయభావ
ముల దీపధారులై చెలగువారు
ఈనాడు గాకున్న నెల్లియైనను గూడి
పోరాడి సాధించు పూర్ణసమత
తే.గీ.
భిన్నజాతులుమతము లభిన్న మనుచు
సర్వసంస్కృతులు సభకు సభ్యులంపె
నేమొ కొండయద్దమున కొంచెమయినట్లు
జగతియే ధరియించె నిన్నగరిరూపు
సర్వసంస్కృతులు సభకు సభ్యులంపె
నేమొ కొండయద్దమున కొంచెమయినట్లు
జగతియే ధరియించె నిన్నగరిరూపు