రచయిత వివరాలు

రాళ్ళపల్లి వెంకట సుబ్బు సుందరం

పూర్తిపేరు: రాళ్ళపల్లి వెంకట సుబ్బు సుందరం
ఇతరపేర్లు: ఆర్వీయస్.సుందరం, R.V.S.Sundaram
సొంత ఊరు: నెల్లూరు
ప్రస్తుత నివాసం: మైసూరు, కర్నాటక
వృత్తి:
ఇష్టమైన రచయితలు: తిక్కన,వేమన,శ్రీశ్రీ
హాబీలు: బోధన, రచన, సంగీతం, క్రికెట్, ఇంద్రజాలం
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రాయటం మొదలుపెట్టి సుమారు 50 ఏళ్ళు, రాసింది తెలుగు,కన్నడం ,ఇంగ్లీషుల్లో 90 పుస్తకాలు, పెక్కు పరిచయాలు, దేశవిదేశ యాత్రలు, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన

 

తన దోషాన్ని తాను తెలుసుకోవడం కష్టం. కళ్ళు తమ కాటుకను ఎప్పుడూ చూడలేవు. అందువల్ల కావ్యరచనకు పూనుకున్నవాడు తెలివిగల వాళ్ళ చేత తన కావ్యాన్ని చదివించుకోవాలి — భారతీయ భాషలలోనే కాక ప్రపంచ భాషల్లోనే కవిరాజమార్గం ఒక విశిష్ట శాస్త్ర గ్రంథమని చెప్పడానికి ఆస్కారం ఉంది. భారతీయ అలంకారశాస్త్ర సంప్రదాయాన్ని స్థానిక భాషలో జనుల రీతి నీతుల్ని చేర్చి తీర్చిదిద్దిన ఘనత శ్రీవిజయునిది.

క్రీస్తు పూర్వమే తమిళంలో సాహిత్యం ఉందనటానికి శాసనాధారం కాని, ఇతర చారిత్రక ఆధారాలు కాని లేవు. తమిళ బ్రాహ్మిని గురించి ఐరావతం మహాదేవన్ కాని, భద్రిరాజు కృష్ణమూర్తి కాని చెప్పే విషయాలను అంగీకరించడం కష్టం.

ఒక కాలానికి నిరవకాశంగా మారిన సంస్కృత సాహిత్యం సావకాశం కల తెలుగును బాధించిందా అన్న విషయం పరిశీలించదగ్గదే. దీని మాట ఎలా ఉన్నా తెలుగువారు తమ సాహిత్యావకాశాన్ని ఏర్పరచుకొనేటప్పుడు కేవలం సంస్కృతం మీదనే ఆధారపడలేదని, ఇరుగు పొరుగు బాషలను కూడా గమనించారని తెలుసుకొని సాహిత్యవికాసాన్ని పరిశీలించాలన్నది ముఖ్యం.