రావునేదో అర్థంకాని అసహ్యభావం ముంచేసింది. శరీరం యావత్తూ ఏవగింపుతో జలదరించింది. తననీ, తన సంతానాన్నీ చూసుకుంటూ కాలం గడిపేయాల్సిన తల్లిదండ్రులు! అమ్మకి నలభై ఐదేళ్ళు దాటాయి. నాన్నకి యాభై ఏడో ఎనిమిదో ఉంటాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో అడుగుపెట్టారు. కొడుకూ కోడలూ, కూతురూ అల్లుడూ, రెండు వేపులా మనవలూ! అమ్మమ్మకీ తాతకీ ఇప్పుడు పిల్లలా? ఇప్పుడు పసిబిడ్డ! ఒక్కసారిగా ఆ ఇద్దరి మీదా రావుకి చీదర ముంచుకొచ్చింది. అసలు ఈ వయస్సులో బిడ్డల్ని కనవచ్చునా?
రచయిత వివరాలు
పూర్తిపేరు: రంగనాయకమ్మఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: