సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఉంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడినింపేదిశ: 
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)
అడ్డం
- తారుమారై విరహ సలాముగా మారిన శ్రీనాధుని పుస్తకం (6)
- హా! మతభారము… ఎంత చెడ్డా, మన పవిత్ర గ్రంధమే (6)
- గుర్తు తప్పుకి ముందుండేది (2)
- మనం బిగించుకుని కూర్చుంటే విష్ణు పూజ ఎవరు చేస్తారు? (2)
- అక్కడక్కడ వేలుమధ్యన చిక్కుకున్న శతకకారుడు (3)
- గుండెలోకి పాతుకున్న గుండు ఇటునుండే ఇక్కడినుంచే వచ్చింది (3)
- నీడకు ముందుంటుంది. ఒట్టు. (2)
- అరటిచెట్టులాంటి అప్సరస (2)
- ప్రకృతిని ఎదుర్కొన్న గృహము (2)
- అమ్మలక్కల పరిశ్రమతో పిడత (2)
- ఈ పరిమళం వద్దని వారిస్తూ కళ్ళు మూసుకోకు. తిరిగి చూడు (3)
- స్వర్గానికీ దీనికీ ఎగరలేనమ్మ (2)
- కలువల్లో అక్కడక్కడ కనపడే జత (2)
- గ్రహాలు అనుకూలిస్తే పట్టేది కాబోలు (5)
- ముక్కున్నంతసేపూ ఇది ఉంటుందిట, సామెత ప్రకారం (3)
- వడ్డీని సంపాదించే మూలధనం బురదా? (3)
- పస మధ్యన ఉంటే పండవుతుంది (3)
- విన్నపాలు లో సగం భాగం (2)
- కారు, తాడు, సుర ఇవన్నీ ఒక క్రమంలో పేరిస్తే రాక్షసుడౌతాడు (6)
- రామ! రామ! రామ! రామ! రామ!… అవి తోటల్లా కనిపిస్తాయికానీ దేవాలయాలు (6)
- అసలే చిరాకు. మధ్యలో గురక మొదలుపెడితే పుట్టే దళం (4)
- జింక మధ్యలొ వాగడం ఆరంభిస్తే పళ్ళెం (4)
- తునాతునకలు అయినా కనపడే ప్రతిరూపం (3)
నిలువు
- అణువు లాంటి సన్నని నూక (2)
- డబ్బుతోవ్యవహారం! కావాలా దేవి? తలకొట్టి బెడిసికొట్టింది (4)
- ఎట్నుంచి చూసినా సంతోషము (3)
- చంద్రభానుచరిత్రలో తలకిందులైన మాసం (2)
- లేతదనం తరంగిణిలా కనిపిస్తుంది అటుపిమ్మట (5)
- మగటిమి పస అక్కడక్కడ తిరిగి పుంజుకుంటే నేర్పు అదే వస్తుంది (3)
- గతికి ముందు వచ్చే ఎక్కువ మాట (2)
- మనమున మగడితో తిరుగు ప్రయాణం (4)
- పూలరంగడు సరిగ్గా చూస్తే అసాధ్యుడే (4)
- కష్టం పొరకప్పిన తప్పు (2)
- సంతోషాలతోట ఆడవారికేనా? మాలతీచందూర్ ను అడిగితే సరి. (5)
- పట్టుకో గలనా బామ్మ ఈ పాతచిత్రాన్ని (5)
- ఇది చేస్తే అదుపులో ఉంటారు (3)
- ఇది చెప్పేరంటే పన్లోంచి తీసేసేరన్నమాటే! (4)
- అడవికుక్క మధ్యలేకుంటే చర్మం (2)
- దేశవాళీ పద్ధతిలో తయారుచేసిన సరకు (4)
- అహోబలపండితీయంలో రాసేది (3)
- తీవ్రమైన కదలికలు మధ్య కంప భూములు (5)
- ఎంతకోసుకున్నా తరగని దూరం (2)
- జంజాటములో సరిగా దాగున్న కాలం (2)
- పనంతా శుభ్రంగా చేస్తే వెలుతురు కనిపిస్తుంది (3)
- ఉండడానికి ఠికాణా, చిల్లుగవ్వలేకుండానే చిరకాల నివాసస్థలం (3)
- చారికి దొరికిన నీచమైన కొలువు (3)