ఎద మీటినారెవరొ
ఏకాంత వేళ
ఈ ఏకాంత వేళ
కోనలో కోవెలలొ అలలేని కొలనులో
చేప అలికిడి కలువ పువును కదిలించినటు
ఎద మీటినారెవరొ ఏకాంత వేళ
ఏకాంత వేళ ఈ ఏకాంత వేళ
కనులకు కనిపించని రూప విభవముతొ
వీనులకు వినిపించని రాగ మధురిమతొ
ఎద మీటినారెవరొ
ఏకాంత వేళ ఈ ఏకాంత వేళ
పాలపిట్టలు వచ్చి పలకరించాయి
మేఘమాలికలొచ్చి మేలమాడాయి
ఊటబావితొ తోట గుసగుసలు నను జూసి
ముసిముసి నవ్వులై ముసురుకున్నాయి
కలకూజితాలతో ఊహలను శ్రుతి జేసి
సెలయేటి పరుగుతో ఊపిరులు జత జేసి
ఎద మీటినారెవరొ
ఏకాంత వేళ ఈ ఏకాంత వేళ