రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ఆకాంక్ష

రచన: సమవర్తి
మే 2014

చిరునవ్వు నవ్వెనాన్ జిరుత మల్లియ చాన
         కుసుమించు నెడనెడఁ గులుకులొలుకు
వలెవాటు గప్పెనాన్ లలి మొల్ల ఫుల్లాక్షి
         సితకోరకాళిచేఁ జెన్నుమీరు
పొలయల్కఁ బూనెనాన్ బున్నాగ యెలనాగ
         తూపుచూపులఁ బూవు దొడుగు బిగిని
మైపుల్క లొదవెనాన్ మందార తరుణియు
         నారక్త సుప్రభ నంది పూచు

తరులు లతలును వెరవునఁ దమ తలపుల
వెలువరించుచుఁ దొలికారుఁ దెలియజేయ
భావుకులకెల్ల పరవశ తావలంబి
సమయవికసన సౌందర్య సముచితముగ

మరల గొనంగ నిచ్ఛ పలుమారు జనింపదొ! గండు కోయిలల్
వరుసలు దీరి మామిడుల వాదనముల్ వినిపింప -వల్లరుల్
పరహితముల్ సువాసనలఁ బంచగఁ – దెమ్మె రలంట -నామనిన్
గర మరుదైన యందము వికస్వరమై ముదమీదె యెల్లచోన్

మానెన్ గోయిల పాడనేఁడు సుమముల్ మానెన్ సుగంధమ్ములన్
బూనన్ గాలుల సౌకుమార్యమడగెన్ మావుల్ ముదంబీయగా
మానెన్ బూవుల దాల్చుచున్ నిలిచి యేమాత్రమ్ము లాలిత్యమే
యూనన్నామని మానె దానికతమేమో మీరు కన్నొగ్గిరే

మారిన పల్లెటూళ్ళు కసుమాలమునిండిన బట్టణాలు మెం
డారిన గుండె మెత్తనలు ఆరనికక్షలు నూరుకాంక్షలున్
భారపు జీవనంబులును బైపయి పూతల నవ్వునెయ్యముల్
తోరములయ్యె నేడు; మనతో జత నచ్చునె! నూతనాబ్దికిన్!

పంటపొలాల ముంపగ నపాంపతి మ్లేచ్ఛుల కారణంబుగా
మంటల గాల ప్రాణితతి మానక దీనులయార్తి యాకసం
బంట చిరంటులన్ దరిమి బన్నము సేయగ వేవిధంబులన్
దుంటరు లెట్లు సంతసముతో నరుదెంత్రు వసంతు దూతలున్

ఇంతయుఁ జింతలేక మనయింతులు రేల, బవళ్ళ వీధి వి
శ్రాంత మనస్కలై చనగజాలిన కాలము దేశ సంపదన్
దొంతులు బేర్చి నాయకులు దోచని కాలము బీదబిక్కి కా
వంతయు వంతలేకఁ గుడువన్, మన, గట్టగ నబ్బుకాలమున్
సంతసమిచ్చు, నూతనవసంతునకున్ మనకీయ దీవనల్

అందపు సిరి, కళ, గౌరమ
లందమ యెద, వాయి,యొడలు లందున గల యా
పొందిక గల మువ్వురు దొర
లందర రక్షింతురనుచు నాకాంక్షింతున్

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మనభాష – మనపద్యం
  • వేడికోలు
  • జీర్ణమఙ్గే సుభాషితమ్
  • ఆకాంక్ష
  • మంజుఘోష

ఇటువంటివే…

  1. అతిథి
  2. మోహమకరందం
  3. భాగవతావతరణము
  4. ఇది మరీ బావుంది
  5. గూడు

మే 2014 సంచికలో ...

  • అతిథి
  • అంపశయ్య: మరొకసారి కొత్తగా!
  • ఆకాంక్ష
  • ఆకుపాట – వాసుదేవ్ కవిత్వం
  • ఇది మరీ బావుంది
  • ఇద్దరు మిత్రులు
  • ఈమాట మే 2014 సంచికకు స్వాగతం!
  • ఎండని ఏడో చేప కథ
  • ఏనాడూ విడిపోని ముడి వేసెనె
  • కంద పద్యగాథ – 2
  • కొత్తపల్లి – పిల్లల పత్రిక సంపాదకుడు నారాయణ శర్మతో ముఖాముఖి
  • కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్
  • గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని
  • గూడు
  • త్రికాల సంపుటి త్రిపుర
  • నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు?
  • పలుకుబడి: దిక్కులు, పక్కలు
  • పెండ్యాల జనరంజని
  • పెద్దక్క ప్రయాణం
  • భాగవతావతరణము
  • మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్
  • మరి నువ్వేమో…
  • మోహమకరందం
  • విముక్తం
  • వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు
  • సెలవురోజు మొదటి ఆట
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అతిథి
మోహమకరందం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.