మీట నొక్కితే
పిట్ట గొంతుకది
తేనెలు ఊరే కూకూలన్నది
తడిసిన బూట్లు వణికాయన్నది
పువ్వుల గుత్తులు వేచాయన్నదిఅది విని
ముక్కు కొద్దిగా వంగుతుండగా
ఎర్రని పెదవులు విచ్చుతుండగా
ఓరగ తెరిచి తలుపు
బులుగు ఎరుపు
పసుపు తెలుపు
రంగు పిట్టల స్వెట్టర్ ఒక్కటి
వంచి తలను కొంచెం పక్కకితెల్లగ నవ్విందదిగో
ఆవిడ జుట్టు పళ్ళు
ఒకటే రంగు.ఆ ఇంటికి నిండుగ
కొలువు తీరినవి
నిక్కి నిక్కి
చూస్తూ ఉన్నవి
బారులు తీరి
రంగు రంగుల
పిట్టల బొమ్మలు
తోకలున్నవి
తోకలు లేనివి.ఆమె తన
ఎర్రని గోళ్ళని
ఈకల వేళ్ళని
ఆన్చీ బుగ్గనితవ్వి చల్లని
కువ కువ
మాటల ఊటని
నవ్వుల చాటున
మిస మిస
తేటనిటీ కప్పుల్లో
మూల నెగడులో
రెక్కలు విప్పిన
వేడి సెగల్లో
గదిలో నిండిన
నవ్వు రవ్వల్లో
మా తెరిచిన నోళ్ళు
తెరిచి ఉండగనేతన ముసలి రెక్కలను
సాచి మెల్లిగ
ఈకల ఒంటిని
లేపి సూటిగకిటికీలోంచి
కొండల మీదికి
కొండల్లోని
సూర్యుడి వైపుకి
గాలి కడలిలో
తెడ్లను వేస్తూ
ఒకటే చూపు
అదే పోత.పరుగున పోయి
చూసిన గుంపుకు
కిటికీ ముందర
నేలకు రాలిన
బులుగు ఎరుపు
పసుపు తెలుపు
దిగాలు ఈకల
వెక్కిలి సన్నగ.