డబల్‌యూ డబల్‌యూ డబల్‌యూ డాట్ నోస్టాల్జియా డాట్ కాం

వెలుగు నగరాలు కాదు
ఈ మృదుల తల్పాలు కాదు
కర్ర కోటలలో ఇన్నివర్ణ చిత్రాలు కాదు
ఈ లోహ పుష్పాలు కాదు
పండుగల గోడలకి సున్నాలు కావాలి
వేసంగి రాత్రుళ్ళు అన్నాలు కావాలి
Marriot జ్వాజ్వల్యమానాలు కాదు
మెట్ల నిచ్చెన చివర బహుమానాలు కాదు
వాకిళ్ళలో
చన్నీళ్ళ స్నానాలు కావాలి

Double click on Kurupam
చల్లని చీకటి తెలియని ఈ అగ్ని ద్వీపాలలో
ఉండుండి ఎప్పుడైనా దీపాలు పోవాలి
బుగ్గివీధులలో జముకు నాట్యాలు చూడాలి
ఇరుకు బస్సులలో చెమట పన్నీరు కావాలి
మర్యాద వేదికల మీద
ఇన్ని రేటియోసినేషన్లు కావు
T.R. మహదేవన్‌ Y.S. కృష్ణన్‌లు కావు
Double click on రెల్లివీధి
కోడిపెట్టల మేష్టరు ట్యూషన్లు కావాలి
గోధుమలు పామాయిల్‌ రేషన్లుకావాలి

చీకట్లు వాలాలి చీకట్లుచీకట్లు
మట్టి నడవలలో పాతలాంతర్లు వెలగాలి
దిగులు పిట్టల గుంపులుతీరాలు చేరాలి


రచయిత కనకప్రసాద్ గురించి:

కవి, కథకుడు కనకప్రసాద్ \\\’ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా\\\’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, \\\’బర్సాత్‌ మే బిల్లి\\\’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.

 ...