డానిగర్ పుస్తకంపై బాత్రా అభియోగాలు అర్థవంతంగాలేవని నిరూపించడానికి ఈవ్యాసంద్వారా రచయిత చేసిన ప్రయత్నం బావుంది. కానీ, ఒక లాయర్లా ఒక్కో అభియోగానికి సమాధానం చెప్పినట్టుగా కాకుండా, డానిగర్ పుస్తకంపై ఒక సమగ్రమైన సమీక్షరాసుంటే, పుస్తకం చదవని నావంటి పాఠకులకి ఇంకా ఉపయోగంగా ఉండేదేమో!
సురేశ్ ఈ వ్యాసంలో డానిగర్ పుస్తకంపై తన అభిప్రాయాలు, ఆయన ఉద్దేశంలో బాత్రా అభియోగాలు ఎందుకు హాస్యాస్పదంగా ఉన్నాయో పాఠకులముందుంచటం అనే పరిధిని దాటి మరెన్నో విషయాలు ప్రస్తావించారు.
1. ప్రత్యామ్నాయ కథలకి అస్కారం ఉండాలి అనుకునేటప్పుడు, అసలైన, ప్రధానమైన సంప్రదాయం ఒకటంటూ ఉండాలి కదా, ఉందని ఒప్పుకోవాలి కదా? ఆ సంప్రదాయం పిల్లలని నిద్రపుచ్చడానికి తప్ప మరిదేనికి పనికిరాదని తేల్చేకా, ఇంక ప్రత్యామ్నాయాల గురించి ఆరాటం ఎందుకు? ఆ ప్రత్యామ్నాయాలే అసలైన, విలువైన చారిత్రక రచనలని వాదిస్తున్నప్పుడు, పక్కకి నెట్టబడుతున్న ప్రధానమైన సంప్రదాయం కొంత తిరుగుబాటు దోరణి ప్రదర్శించటం సహజమే కదా?
2. చారిత్రక దృష్టితో ఈ విషయాలని చూడాలని వాదించిన రచయిత కొన్ని విషయాలలో చారిత్రక దృక్పథం ప్రదర్శించినట్టుగా నాకు అనిపించలేదు. ముఖ్యంగా:
అ. సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది అని చెప్పడానికి ఏవో కొన్ని శ్లోకాలని ఉదాహరించడం ఎలా ఉందంటే, యత్రనార్యంతు పూజ్యంతే శ్లోకం కోట్ చేసి, భారత సంస్కృతిలో మహిళలకి ఎంత గొప్పస్థానం ఉందో ఊదరగొట్టే ఇంటర్మీడియల్ పరిక్షల్లో రాసిన వ్యాసంలా ఉంది. రచయిత భారత సంస్కృతిలో ‘డిబేట్’ గురించి చారిత్రకమైన ఆధారాలతో వాదించలేదు (ఉదా: న్యాయమతస్తులకి – బౌద్ధులకి మధ్య కొన్ని వందల సంవత్సరాలపాటు నడిచిన వాదనలు, అద్వైతులకి-బౌద్ధులకి మధ్య జరిగిన వాద/ప్రతివాదాలు మొదలైనవి.) ఈ వ్యాసంలో ఇదొక లోపం అని ఎందుకంటున్నానంటే, రచయిత హిందుత్వ-వాదులవల్ల, ఎంతో విలువైన ఈ సంప్రదాయం నాశనం అయిపోతోందని వాదించారు. కాని అందుకు తగ్గ సరంజామా ఈ వ్యాసంలో నాకు కనిపించలేదు.
ఆ. రచయిత ఒక వ్యాఖ్యలో, మధ్వాచార్యులు, శంకరుల వ్యాఖ్యానాలన్నీ సంస్కృతభాషలో ఒక పదానికి, సమాసానికి ఎన్నో అర్థాలు చెప్పగలిగే సౌలభ్యాన్ని వాడుకుని చేసే ద్రావిడ ప్రాణాయామాలే అని వాటన్నిటిని కొట్టిపడేశారు. సురేశ్ భగవద్గీతకి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని రాయాడానికి పూనుకుంటే అలాంటి వాదనని ఎంచుకోవడంలో తప్పులేదు, కానీ చరిత్రకారుడికి అటువంటి సౌలభ్యంలేదు. చారిత్రక దృక్పథంతో చూడాల్సి వస్తే – “In the Indian Tradition, multiple interpretations of a text based on poetic-interpretations, and argument exploiting the inner, flexible structure of the Sanskrit Language are accepted and integral to the tradition” అని మాత్రమే చెప్పుకోవాలి గదా? వాటిని కొట్టిపడేస్తే ఎలా?
3. డానిగర్, పాశ్చాత్య-పక్షపాతం తన రచనలో చొరబొడే ప్రమాదం ఉందని ఒప్పుకున్నంత మాత్రాన, అది చొరబడలేదని చెప్పలేం కదా? భారతీయ సంప్రదాయలని, సయ్యద్ ఓరియంటలిజంని క్షుణంగా ఎరిగిన సురేశ్, డానిగర్ పుస్తకంలో ఈ పక్షపాతం ఏవరకూ ఉందో సమీక్షించి ఉంటే బాగుండేది.
4. వ్యాసం చివర్లో రచయిత, హిందుత్వవాదం వల్లే హిందూమతానికి ప్రమాదం అనే ముగింపుకి కావాల్సినంత ఆధారాలనిగానీ, “సోషియలాజిల్ ఆర్యుమెంటు”నిగాని ఈ వ్యాసంలో చూపించలేదు. పబ్లిషింగ్ చరిత్రని అధ్యయనం చేసిన వ్యక్తిగా, కేవలం ఇటువంటి చెదురు-మదురు వివాదాల ఆధారంగా ఇంత పెద్ద ప్రమాద సూచికలని ఎగరెయ్యలేం అని నా అభిప్రాయం. ఎందుకంటే..
There is a significant difference between how an academic publisher like Chicago University Press and a general publisher such as Penguin approach publishing.
Academic publishers generally don’t do much marketing since their main distribution channels are university and other academic libraries.
But, for a publishing house like Penguin, marketing and sales constitute large chunk of the overall cost.
So, if they get easy publicity, they will grab it with both hands. If a book can become a controversy, they will do everything in their power to make it so, they would love if somebody goes to court and tries to get a ban on the book.
In this case, Penguin did a brilliant job — they passed on the publicity cost to the public, they made an out of court settlement — which means they don’t have to pull the book out of publication, and they are laughing all their way to bank.
And, as Wendy herself said in her Op-Ed, she is also very happy with the court-case, and the out-of-court settlement — because, just because a radical, right-wing, Hindutva brigade was offended by her book, she gets more ‘academic milage’ in her career, and with her colleagues, and well — her book is selling. That attitude is definitely neither scholarly nor pursuit of truth.
ఇండాలజి అధ్యయనాల్లో ముఖ్యమైన సమస్య సయ్యద్ ఓరియంటలిజం ఒక్కటే కాదనుకుంటా, అంతకన్నా మౌలికమైన సమస్యలున్నాయి. ఇండాలజి పరిశోధనలని బాగా ఎరిగిన సురేశ్ దానిపై వ్యాసం రాస్తే చాలామందికి ఉపయోగపడుతుంది.
మోహనగారూ
వేదాలకు ఛందములన్న వ్యవహారం ఉంది. ఇక్కడ ఛందము అంటే ఆరు వేదాంగాల్లోనూ ఒకటిగా కాక సాక్షాత్తూ వేదము అనే చెప్పుకోవాలి. ఛాందసుడు అంటే సమస్తప్రాంపంచిక వ్యవహారాలనీ వైదికదృష్టితో చూసే వాడు అని అర్థం. ఇంకా కొంచెం ముందుకు పోయి చెప్పుకోవాలంటే వేదంలో ప్రజ్ఞ ఉన్నవాడే కాని లౌకికవ్యవహారాల్లో నేర్పు లేనివాడు. ఛాందసుడు అన్న పదమే చాదస్తుడు అని వ్యవహారంలో మార్పుచెందింది. అర్ధచ్యుతి ఏమీలేదు. కొంచెం అర్థవిస్తృతి కలిగిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చాదస్తుడు అంటే ఏదో కాలంతీరిన ఆలోచనాధోరణి తప్ప వాస్తవిక ప్రపంచజ్ఞానంలేని వాడు అన్న అర్థంలో వాడుతున్నారు ప్రజలు.
బాగా చెప్పారు. తస్లీమ నస్రీన్ సీరియల్ నిషేధింపడడం “secular” అండీ…మీరు ఇలా anti-secular గా ఉండడం ఏమీ బాలేదు!. పైగా మీ పేరు కూడా జై శ్రీరాం లాగా anti-secular గా ఉంది కాబట్టీ మీరు చెప్పినవి సబబు కాదని, అవి సహేతుకం కాదని మన “లిబరల్” మహాసయులు ఎప్పుడు అంటారా అని ఎదురుచూస్తున్నా…అసలు ఇంకా అలా ఏమీ అనలేదిమిటబ్బా అని ఆశ్చర్యం గా కూడా ఉంది.
వెండీ పుస్తకం విషయం లో ఎక్కడా “నిషేధం” జరగలేదు. మీరు ముందు పొస్ట్ చేసిన సందీప్ బాలకృష్న గారు రాసినది చక్కగా వివరించింది. నిషేదింప బడింది అని ఎవరైతే ఈ false premise తో చర్చించ దలచారో, అక్కడే పప్పులో కాలేసారు తప్పులో ములిగేసారు :-).
ఏది ఏమైనా పైన అన్నయ్యగారి మాటలు ఎందుకో పరాజితుల లాజిక్ లా ఉంది. విషయాన్ని ఖండించలేరు కాబట్టీ, వారు చెప్పినది కూడా సరిగ్గా సహేతుకంగా సమర్ధించుకోలేరు కాబట్టీ, అందు చేత “branding, name calling and personal attacks” తో సరిపెట్టుకుంటారు. కుల వ్యవస్థని ధిక్కరించే వీళ్ళు (సబబు గానే అనుకోండి), అస్మదీయ భావాలకి వీళ్ళు కూడా బానిసవుతారు. వారితో ఏకీ భవించక పోతే అంతే, ఏదొ ఒక ఆరోపణ మొదలవుతుంది.
ఉదాహరణ కి ముందు గా చెప్పిన ముక్కలు వారికి సబబు గానే అనిపిస్తాయి. కానీ, ఒక సారి మన కులమో, లేక political affiliation ఓ తెలిసేసరికి అదే భావం తప్పుగా అనిపిస్తుంది. దీనికి నూ: ఒక బ్రాహ్మణుడు ఒక దలితుడు చెప్పిన సత్యాన్ని అప్పటి దాక ఒప్పుకుని, ఆ చెప్పిన వాడు దలితుడని తెలిసేసరికి, అదేమిటి అని ఒప్పుకోకుండ మనసు మార్చేసుకోవడానికి తేడా ఏముంది? ఈ రెండొ విషయమై యుధ్ధం చేసే వీరు (సబబు గానే) ఆ నీతి వారి పట్లే ఎందుకు పాటించరు?
ఇక హుసైన్ విషయానికి వస్తే ఆయన కటార్ పౌరసత్వం తీసుకోవడం లో తప్పేముంది. ఎంతో మంది అమెరికా పౌరసత్వం తీసుకోవట్లే? మళ్ళీ correlation vs causation దగ్గర confusion తోడైంది. కటార్ మన కన్నా సంపన్న దేశం. మన దేశం లో దారిద్ర్యం నడుమ చచ్చే కన్నా, మన కన్నా సంపన్న దేశం లో కన్ను మూయడం లో తప్పేముంది. అది ఆయన వ్యక్తిగత విషయం.
ఐతే ఆయన “freedom of expression” ని ఎవరు restrict చేసినా ఖండించాల్సిన విషయం ఉంది. ఒక వేళ కటార్ పౌర సత్వం తీసుకోవడానికి కారణం ఆయన కళని అవమానించినందుకో లేక కళా స్వేచ్చ తొలగించినందుకో తీసుకున్నారు అంటే – దానికి ప్రమాణాం ఉందా? లేక ఇది ఒక అభిప్రాయమేనా? వ్యక్తిగత విషయమైతే అది ఆయన స్వేచ్చ. నిజంగానే మన వాళ్ళు ఆయాన్ని భిష్కరించి ఉంటే అది తప్పక ఖండించాల్సిన విషయం. కానీ ఆ రెండొది కాదు అని నా అనుమానం.
కానీ మన దేశం లో ప్రభుత్వాలు, “లిబెరల్” మహాశయులు చాలా అసంభధ్ధం గా వ్యవహరించడం వల్ల ఈ విషయాన్ని ఇంకా confuse and complicate చేసి వారి credibility ని వారే దెబ్బ తీసుకుంటున్నారు. దీనికి మూల కారణం కూడా మన first amendment – వాక్స్వేచ్చ ను ఖండించడం అక్కడ మొదలైంది.
ఐనా ఈ వెండీ ది Free speech విషయం కాదు కాబట్టీ, అట్టే ఇంక చర్చించడం అనవసరం (from both sides of the political spectrum). తస్లీమా విషయం లో ప్రభుత్వం నిషేదించింది. ఇది నిస్సందేహం గా వాక్స్వేచ్చకి విరుధ్ధం.
నా విమర్శలన్నీ కూడా వ్యాసం లో లోపించిన ఆలొచనా అస్పష్టత, అహేతుకమైన వాదన, పక్షపాత ధోరణి, loose vocabulary కి సంబంధించనవి (శ్రీరాం గారన్నట్టు). ఆ విషయాలన్నీ నేను ముందే ఉటంకించేసాను. కాబట్టీ ఇక పెద్దగా చర్చ అనవసరం.
ఆంధ్రభారతి నిఘంటువు శోధించగా లభించినది – “ఛందశ్శాస్త్ర సంబంధమైనది ఛాందసం. షడంగాలలో ఒకటి. వేద వ్యాఖ్యాన గ్రంథం ఛాందసం. కేవలం ఛందస్సును మాత్రం పాటిస్తూ, సాహిత్య విలువలను పట్టించు కొనకపోవడం వ్యవహారంలో ఛాందసం అనిపించుకొన్నది. లోక జ్ఞానం లేకపోవడం అని కూడా ఛాందసానికి అర్థం రూఢమైంది. ఛాందసీయుడు అంటే ఛంద శ్శాస్త్రం చదివిన వాడని అర్థం. వ్యవహారంలో లోకజ్ఞానం లేని వాడు అనే అర్థం (ఛాందసుడికి) స్థిరపడింది.”
అయ్యో ఈమాత్రం దానికి sorry ఎందుకండీ! చరిత్రలకే alternatives ఉన్నప్పుడు పద్యాలకు alternative interpretations ఉండడంలో ఆశ్చర్యమేవుంది! మనది కాని interpretation ఎప్పుడైనా ఎలానూ misinterpretation అయ్యే తీరుతుంది. ఎవరి interpretationకి వాళ్ళవాళ్ళ reasoning ఉండనే ఉంటుంది. ఉదాహరణకు నా interpretation వెనక నాకున్న reasoning ఇది – “పొత్తి” “పొత్తిలి” అనేది చిన్నపిల్లలకు వేసే గుడ్డ. అందుకే పసిపాపలను “పొత్తిళ్ళలో బిడ్డ” అని కూడా అంటారు.
ఎవరి మనోభావాలూ దెబ్బతిననంత వరకూ ఇందులో ఇబ్బందేమీ లేదు! 🙂
“చాందసులు మతమౌఢ్యం ముసుగు కనిపించకుండా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ మీ అభిప్రాయాలపై దాడిచేయడం శోచనీయం”
అన్నయగారు,
యోగ గారు చాంధస వాదం అంటే ఎమిటో వికీ లోని వివరణ ఇచ్చారు. మీరు చెప్పె ఛాందసవాదం ఎమీటో మీకే తెలియాలి. మీ లాజిక్ ప్రకారం, ఈ వ్యాస రచయిత కూడా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ, అర్థ సత్యాలను అందంగా చెప్పారని అనవచ్చా? నాసదీయ సూక్తం ఋగ్వేదంతో వ్యాసం మొదలు పెట్టి, పద్నాలుగు పేజిలు రాసి, అటుతిప్పి ఇటుతిప్పి,పాఠకులను కంఫ్యుస్ చేసి, చెప్పిచెప్పనట్లు, చివరకు తేల్చింది హిందువులను తాలిబన్ లతో పోల్చటమా ఈ వ్యాసం యొక్క అంతిమ లక్ష్యం? మోడి సంగతి పక్కన పెట్టండి. ప్రగతి కాముక వామపక్ష వాదులు మమత బెనర్జి ముందు బెంగాల్ ను, సుమారు రెండున్నర దశాబ్దాలపైగా పాలించారే, కనీసం కుల వ్యవస్తను బలపరిచే ఖాప్ పంచాయితిని ఎందుకు నిషేదించలేకపోయారో ఎప్పుడైనా ఆలోచించారా? బెంగాల్ లో వారి పాలన మీరనే మత ఛాందసవాదుల పాలన కంటే భిన్నమైనదా? మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి.
వెండి గారి ఈ పుస్తకం గొడవకు, ఒక వారం ముందు తస్లీమా నస్రీన్ రాసిన టి వి సీరియల్ ని బెంగాల్ ప్రభుత్వం నిషేదించింది. ఆ వార్తను ఏ మీడీయా హౌస్ వారు గాని, మీరు చెప్పే ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్రవాదులు గాని,వెండి గారి పుస్తకానికి ఇచ్చిన అటెన్షన్ లో కనీసం సగం కూడా ఇవ్వలేదు. ఎందుకని? మీలాంటి ప్రగతి కాముకులు హుసేన్ గారి గురించి ఆలోచించే కన్నా, మధ్యతరగతి ప్రజల జీవితాలను గురించి ఆలోచించే తస్లీమ నస్రిన్ లాంటి వారికి మద్దతు ఇస్తే బాగుంట్టుందేమో!
నిర్మాతలకి మత ఛాందసవాదుల వలన వచ్చిన ముప్పేమిలేదు. మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. వారికి పూర్తి స్వేచ్చ ఉంది, మహేష్ భట్ ఇమ్రాన్ హష్మీ తో తీసిన మడ్డర్ 1 & 2 సినేమాలు చూడండి . భారతదేశం లో ఎంత స్వేచ్చ ఉందో మీకే తెలుస్తుంది.
వేదాధ్యయనం మహిళలు చెయ్యకపోవడానికి కారణం ఖచ్చితంగా చెప్పలేమో… వ్యాసకర్త ఉద్దేశంలో అన్నిటికీ హిందుత్వా, (హిందూ) మత చాందస వాదులు (అంటే ఏమిటో నాకింకా తెలీదు) ఎలా కారణమో :-P, నాకు అన్నిటికీ ప్రధాన కారణం పేదరికం… దానికి స్వాతంత్ర్యం లేకపోవడం కారణం.
సంపన్నం గా దేశం లేనప్పుడూ, లేదా పరపాలన పీడితులైనపుడు మహిళల discrimination ఎక్కువవుతుందేమో అనిపిస్తుంది. May be society becomes protective about its women and slowly suppression of their freedom is institutionalized. ఆర్ధిక, రాజకీయ, వ్యక్తిగత స్వాతంత్రం సంభవించినపుడే ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఇది నా అభిప్రాయం.
మీరన్నట్టు ఆ సమయంలో (15th-16th centuries)సమయం లో ఆ పరిస్థితులు నెలకొని ఉండొచ్చు.
ఐతే ఆర్ధిక పరంగా చూసినట్లైతే, వేదాధ్యయనం వల్ల ఏమి వస్తుందో నాకు ఇప్పటికీ తెలీదు (ఇప్పుడు ఈ పాయింటు మీద చర్చలు చెయ్యలేను నేను. దిగ్గజాలందరూ చెప్పినట్టు తీసుకోండి అంతే!). పెద్దగా ఆర్ధిక ఉపయోగం లేనప్పుడు ఎవడు చదువుతాడు. అది ఇప్పుడైనా అప్పుడైనా ఒకటే గా…కాబట్టీ, వేదాధ్యయనం స్త్రీలు చెయ్యనందున వారిని అణగదొక్కారు అన్న కారణం తప్పేమో. అణగదొక్కడం వాస్తవమే కావొచ్చు. దానికి ఇంకా బలమైన కారణాలు,ప్రమాణాలు ఉండొచ్చు.
అంటే మనం చాలా చోట్ల correlation vs causation దగ్గర అయోమయ పడతామేమో అనిపిస్తూ ఉంటుంది.
కానీ కేవలం ఈ ఉదాహరణ (వేదాధ్యయన) లోపభూయిష్టమైనది అని నా అభిప్రాయం. ఐతే చరిత్రకారులెవరో గంభీరంగా పరిశీలించి ఉంటారు లెండి.
“Yoga గారి వాదన ఇంతవరకూ బాగా enjoy చేశాను. అయితే March 12, 2014 5:39 pm వాఖ్య తర్వాత ఆయన వాదనమీది భ్రమలు పఠాపంచలయ్యాయి! రెండు నెలల్లో ముగింపు అన్న వారి సంబరం చూస్తుంటే ముచ్చటేస్తున్నది”
ప్రసాద్ గారూ: మీకు ఆనందం కలిగించినందుకు నాకు ఆనందంగా ఉన్నది, ఆ పై భ్రమ తొలగించినందుకు అసలు చెప్పలేనంత మహదానందంగా కూడా ఉంది.
నా సంబరం నాది, మీ ముచ్చట మీది. (అ)స్వతంత్ర భారతీయులకి ఈ విషయంలో కొద్దిగా స్వేచ్చ ఉన్నాది లెండి 🙂
P.S:- వ్యాసానికి సంబంధం లేదు కనుక ఇక ఈ విషయమై మన పరస్పర satire లు అనవసరం. హాయిగా కావాలంటే offline “చాయ్ పే చర్చా” చేస్కుకోవచ్చు.
చివరికి పరాయి గడ్డపై ఆయన తుదిశ్వాస వీడాల్సిన దుస్థితికి…
ఆయన దుస్థితి మీద మీ జాలి చూస్తుంటే, పాపం హుసేన్ గారు కట్టుబట్టలతో చేతిలో చిల్లిగవ్వలేకుండా, దేశంగాని దేశంలో నానా కష్ట్టాలు అనుభవిస్తూ కన్ను మూశాడనుకొంటారు. ఆయన కష్టాలు మనదేశం వదలగానే మాయమైనట్లు ఉన్నాయి. వారు విదేశాలలో హాయిగా, సుఖంగా, ఎంతో రిచ్ గా జీవించారు. ఆయన కొన్న కార్ల గురించి వచ్చిన వ్యాసం చదవండి.
@ Yoga గారు, “భారతీయ మహిళలు ఎప్పుడు అణగదొక్క బడ్డారు” అన్న విషయం తీర్మానించే ముందు, శుమారు రెండున్నర వేల సంవత్సరాల చరిత్రలో ప్రతి శతాబ్దంలో వివిధ రంగాలలో కృషి చేసిన మహిళలపై Wendy గారు ఒక సమగ్ర అధ్యయనం చేస్తే బావుండేది. కొన్ని శతాబ్దాలలో కాలమాన పరిస్థితుల ప్రభావంతో మహిళలు అన్ని రంగాలలో ప్రతిభ చూపక పోవటం లేదా కొన్ని సార్లు వారిని నిషేధించటం జరిగివుండవచ్చు కాని భారత సమాజంలో స్త్రీలు అణగదొక్కబడితే ఇలా వివిధ రంగాలలో కృషి చేసిన మహిళల పరంపర వుండదు. మహిళల విషయంలో ఇంత సుదీర్ఘ పరంపర వున్న సంస్కృతీ మరొక్కటి నాకు తెలియదు.
చాలామంది Indologists “సత్యార్థ ప్రకాశ” గ్రంధం చదివి వుండరు. స్వామి దయానంద సరస్వతి 18వ శతాబ్దం వాడు. ఆయన ఆర్య సమాజ పరంపర ఇప్పటికి కొనసాగుతూనే వుంది. మొట్ట మొదటగా కర్మ కాండలని ఒక సంస్థాగతంగా నిరసించి వేదాలు అందరు చదువవచ్చు అని చెప్పి వేదాలని సామాన్య మానవులకి అందింపజేసే ప్రయత్నం ఆయన చేసారు. 18వ శతాబ్దం లోనే ఆయనకి ఈ విషయం పై అవగాహన వుంది అంటే ఖచ్చితంగా అంతకు ముందు వేదాధ్యయనం పై తెచ్చిపెట్టుకొని సృష్టించిన ఆంక్షలు కొన్ని ఊండెవెమో అని నాకు అనిపిస్తుంది. మొల్ల (1440–1530) వరకు కూడా మనం స్త్రీలు సాహిత్యంలో ప్రతిభ చూపటం చదివాం. ఇదంతా చదివితే మనకి 1500 నుండి 1800 సంవత్సరాల మధ్య ఈ ఆంక్షలు లేదా, సమాజం లో మూఢనమ్మకాలు పెరిగి ఉండవచ్చు. నేను రెండు కళల గురించి ప్రస్తావించలేదు (సంగీతం, నృత్యం). ఈ రెండు కళలు స్త్రీలకి అట్టే అబ్బుతాయి. ఉత్తర భారతం లో వీటిపై ప్రతిభ చూపిన మహిళలు చాలా మంది వున్నారు.ముఖ్యంగా మొఘల్ పాలన తరువాత స్త్రీలు వేదాధ్యయనం, సాహిత్యం నుండి సంగీత నృత్యాల వైపు మళ్ళారనిపిస్తుంది. So the time it might have started is around 15th – 16th century. The first Panipat war coincides with the time frame. ఇది నా వ్యక్తిగత విశ్లేషణ.
All in all, its a can of worms. If the case went to trial, folks would have to answer many questions. Does suppression is limited to only Vedic Studies? or literature? does it include dance, music ? What about participating in wars ? Claiming women were suppressed in Hindu society is really a, “CLAIM” and will remain a “CLAIM”.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Nagaraju Pappu అభిప్రాయం:
03/15/2014 12:46 pm
డానిగర్ పుస్తకంపై బాత్రా అభియోగాలు అర్థవంతంగాలేవని నిరూపించడానికి ఈవ్యాసంద్వారా రచయిత చేసిన ప్రయత్నం బావుంది. కానీ, ఒక లాయర్లా ఒక్కో అభియోగానికి సమాధానం చెప్పినట్టుగా కాకుండా, డానిగర్ పుస్తకంపై ఒక సమగ్రమైన సమీక్షరాసుంటే, పుస్తకం చదవని నావంటి పాఠకులకి ఇంకా ఉపయోగంగా ఉండేదేమో!
సురేశ్ ఈ వ్యాసంలో డానిగర్ పుస్తకంపై తన అభిప్రాయాలు, ఆయన ఉద్దేశంలో బాత్రా అభియోగాలు ఎందుకు హాస్యాస్పదంగా ఉన్నాయో పాఠకులముందుంచటం అనే పరిధిని దాటి మరెన్నో విషయాలు ప్రస్తావించారు.
1. ప్రత్యామ్నాయ కథలకి అస్కారం ఉండాలి అనుకునేటప్పుడు, అసలైన, ప్రధానమైన సంప్రదాయం ఒకటంటూ ఉండాలి కదా, ఉందని ఒప్పుకోవాలి కదా? ఆ సంప్రదాయం పిల్లలని నిద్రపుచ్చడానికి తప్ప మరిదేనికి పనికిరాదని తేల్చేకా, ఇంక ప్రత్యామ్నాయాల గురించి ఆరాటం ఎందుకు? ఆ ప్రత్యామ్నాయాలే అసలైన, విలువైన చారిత్రక రచనలని వాదిస్తున్నప్పుడు, పక్కకి నెట్టబడుతున్న ప్రధానమైన సంప్రదాయం కొంత తిరుగుబాటు దోరణి ప్రదర్శించటం సహజమే కదా?
2. చారిత్రక దృష్టితో ఈ విషయాలని చూడాలని వాదించిన రచయిత కొన్ని విషయాలలో చారిత్రక దృక్పథం ప్రదర్శించినట్టుగా నాకు అనిపించలేదు. ముఖ్యంగా:
అ. సిద్ధాంత చర్చలు, వాదవివాదాలతో భారతీయ తాత్వికత చరిత్ర అంతా నిండి ఉంది అని చెప్పడానికి ఏవో కొన్ని శ్లోకాలని ఉదాహరించడం ఎలా ఉందంటే, యత్రనార్యంతు పూజ్యంతే శ్లోకం కోట్ చేసి, భారత సంస్కృతిలో మహిళలకి ఎంత గొప్పస్థానం ఉందో ఊదరగొట్టే ఇంటర్మీడియల్ పరిక్షల్లో రాసిన వ్యాసంలా ఉంది. రచయిత భారత సంస్కృతిలో ‘డిబేట్’ గురించి చారిత్రకమైన ఆధారాలతో వాదించలేదు (ఉదా: న్యాయమతస్తులకి – బౌద్ధులకి మధ్య కొన్ని వందల సంవత్సరాలపాటు నడిచిన వాదనలు, అద్వైతులకి-బౌద్ధులకి మధ్య జరిగిన వాద/ప్రతివాదాలు మొదలైనవి.) ఈ వ్యాసంలో ఇదొక లోపం అని ఎందుకంటున్నానంటే, రచయిత హిందుత్వ-వాదులవల్ల, ఎంతో విలువైన ఈ సంప్రదాయం నాశనం అయిపోతోందని వాదించారు. కాని అందుకు తగ్గ సరంజామా ఈ వ్యాసంలో నాకు కనిపించలేదు.
ఆ. రచయిత ఒక వ్యాఖ్యలో, మధ్వాచార్యులు, శంకరుల వ్యాఖ్యానాలన్నీ సంస్కృతభాషలో ఒక పదానికి, సమాసానికి ఎన్నో అర్థాలు చెప్పగలిగే సౌలభ్యాన్ని వాడుకుని చేసే ద్రావిడ ప్రాణాయామాలే అని వాటన్నిటిని కొట్టిపడేశారు. సురేశ్ భగవద్గీతకి ఒక కొత్త వ్యాఖ్యానాన్ని రాయాడానికి పూనుకుంటే అలాంటి వాదనని ఎంచుకోవడంలో తప్పులేదు, కానీ చరిత్రకారుడికి అటువంటి సౌలభ్యంలేదు. చారిత్రక దృక్పథంతో చూడాల్సి వస్తే – “In the Indian Tradition, multiple interpretations of a text based on poetic-interpretations, and argument exploiting the inner, flexible structure of the Sanskrit Language are accepted and integral to the tradition” అని మాత్రమే చెప్పుకోవాలి గదా? వాటిని కొట్టిపడేస్తే ఎలా?
3. డానిగర్, పాశ్చాత్య-పక్షపాతం తన రచనలో చొరబొడే ప్రమాదం ఉందని ఒప్పుకున్నంత మాత్రాన, అది చొరబడలేదని చెప్పలేం కదా? భారతీయ సంప్రదాయలని, సయ్యద్ ఓరియంటలిజంని క్షుణంగా ఎరిగిన సురేశ్, డానిగర్ పుస్తకంలో ఈ పక్షపాతం ఏవరకూ ఉందో సమీక్షించి ఉంటే బాగుండేది.
4. వ్యాసం చివర్లో రచయిత, హిందుత్వవాదం వల్లే హిందూమతానికి ప్రమాదం అనే ముగింపుకి కావాల్సినంత ఆధారాలనిగానీ, “సోషియలాజిల్ ఆర్యుమెంటు”నిగాని ఈ వ్యాసంలో చూపించలేదు. పబ్లిషింగ్ చరిత్రని అధ్యయనం చేసిన వ్యక్తిగా, కేవలం ఇటువంటి చెదురు-మదురు వివాదాల ఆధారంగా ఇంత పెద్ద ప్రమాద సూచికలని ఎగరెయ్యలేం అని నా అభిప్రాయం. ఎందుకంటే..
There is a significant difference between how an academic publisher like Chicago University Press and a general publisher such as Penguin approach publishing.
Academic publishers generally don’t do much marketing since their main distribution channels are university and other academic libraries.
But, for a publishing house like Penguin, marketing and sales constitute large chunk of the overall cost.
So, if they get easy publicity, they will grab it with both hands. If a book can become a controversy, they will do everything in their power to make it so, they would love if somebody goes to court and tries to get a ban on the book.
In this case, Penguin did a brilliant job — they passed on the publicity cost to the public, they made an out of court settlement — which means they don’t have to pull the book out of publication, and they are laughing all their way to bank.
And, as Wendy herself said in her Op-Ed, she is also very happy with the court-case, and the out-of-court settlement — because, just because a radical, right-wing, Hindutva brigade was offended by her book, she gets more ‘academic milage’ in her career, and with her colleagues, and well — her book is selling. That attitude is definitely neither scholarly nor pursuit of truth.
ఇండాలజి అధ్యయనాల్లో ముఖ్యమైన సమస్య సయ్యద్ ఓరియంటలిజం ఒక్కటే కాదనుకుంటా, అంతకన్నా మౌలికమైన సమస్యలున్నాయి. ఇండాలజి పరిశోధనలని బాగా ఎరిగిన సురేశ్ దానిపై వ్యాసం రాస్తే చాలామందికి ఉపయోగపడుతుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:
03/15/2014 10:11 am
మోహనగారూ
వేదాలకు ఛందములన్న వ్యవహారం ఉంది. ఇక్కడ ఛందము అంటే ఆరు వేదాంగాల్లోనూ ఒకటిగా కాక సాక్షాత్తూ వేదము అనే చెప్పుకోవాలి. ఛాందసుడు అంటే సమస్తప్రాంపంచిక వ్యవహారాలనీ వైదికదృష్టితో చూసే వాడు అని అర్థం. ఇంకా కొంచెం ముందుకు పోయి చెప్పుకోవాలంటే వేదంలో ప్రజ్ఞ ఉన్నవాడే కాని లౌకికవ్యవహారాల్లో నేర్పు లేనివాడు. ఛాందసుడు అన్న పదమే చాదస్తుడు అని వ్యవహారంలో మార్పుచెందింది. అర్ధచ్యుతి ఏమీలేదు. కొంచెం అర్థవిస్తృతి కలిగిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం చాదస్తుడు అంటే ఏదో కాలంతీరిన ఆలోచనాధోరణి తప్ప వాస్తవిక ప్రపంచజ్ఞానంలేని వాడు అన్న అర్థంలో వాడుతున్నారు ప్రజలు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/15/2014 8:57 am
శ్రీరాం గారూ…
బాగా చెప్పారు. తస్లీమ నస్రీన్ సీరియల్ నిషేధింపడడం “secular” అండీ…మీరు ఇలా anti-secular గా ఉండడం ఏమీ బాలేదు!. పైగా మీ పేరు కూడా జై శ్రీరాం లాగా anti-secular గా ఉంది కాబట్టీ మీరు చెప్పినవి సబబు కాదని, అవి సహేతుకం కాదని మన “లిబరల్” మహాసయులు ఎప్పుడు అంటారా అని ఎదురుచూస్తున్నా…అసలు ఇంకా అలా ఏమీ అనలేదిమిటబ్బా అని ఆశ్చర్యం గా కూడా ఉంది.
వెండీ పుస్తకం విషయం లో ఎక్కడా “నిషేధం” జరగలేదు. మీరు ముందు పొస్ట్ చేసిన సందీప్ బాలకృష్న గారు రాసినది చక్కగా వివరించింది. నిషేదింప బడింది అని ఎవరైతే ఈ false premise తో చర్చించ దలచారో, అక్కడే పప్పులో కాలేసారు తప్పులో ములిగేసారు :-).
ఏది ఏమైనా పైన అన్నయ్యగారి మాటలు ఎందుకో పరాజితుల లాజిక్ లా ఉంది. విషయాన్ని ఖండించలేరు కాబట్టీ, వారు చెప్పినది కూడా సరిగ్గా సహేతుకంగా సమర్ధించుకోలేరు కాబట్టీ, అందు చేత “branding, name calling and personal attacks” తో సరిపెట్టుకుంటారు. కుల వ్యవస్థని ధిక్కరించే వీళ్ళు (సబబు గానే అనుకోండి), అస్మదీయ భావాలకి వీళ్ళు కూడా బానిసవుతారు. వారితో ఏకీ భవించక పోతే అంతే, ఏదొ ఒక ఆరోపణ మొదలవుతుంది.
ఉదాహరణ కి ముందు గా చెప్పిన ముక్కలు వారికి సబబు గానే అనిపిస్తాయి. కానీ, ఒక సారి మన కులమో, లేక political affiliation ఓ తెలిసేసరికి అదే భావం తప్పుగా అనిపిస్తుంది. దీనికి నూ: ఒక బ్రాహ్మణుడు ఒక దలితుడు చెప్పిన సత్యాన్ని అప్పటి దాక ఒప్పుకుని, ఆ చెప్పిన వాడు దలితుడని తెలిసేసరికి, అదేమిటి అని ఒప్పుకోకుండ మనసు మార్చేసుకోవడానికి తేడా ఏముంది? ఈ రెండొ విషయమై యుధ్ధం చేసే వీరు (సబబు గానే) ఆ నీతి వారి పట్లే ఎందుకు పాటించరు?
ఇక హుసైన్ విషయానికి వస్తే ఆయన కటార్ పౌరసత్వం తీసుకోవడం లో తప్పేముంది. ఎంతో మంది అమెరికా పౌరసత్వం తీసుకోవట్లే? మళ్ళీ correlation vs causation దగ్గర confusion తోడైంది. కటార్ మన కన్నా సంపన్న దేశం. మన దేశం లో దారిద్ర్యం నడుమ చచ్చే కన్నా, మన కన్నా సంపన్న దేశం లో కన్ను మూయడం లో తప్పేముంది. అది ఆయన వ్యక్తిగత విషయం.
ఐతే ఆయన “freedom of expression” ని ఎవరు restrict చేసినా ఖండించాల్సిన విషయం ఉంది. ఒక వేళ కటార్ పౌర సత్వం తీసుకోవడానికి కారణం ఆయన కళని అవమానించినందుకో లేక కళా స్వేచ్చ తొలగించినందుకో తీసుకున్నారు అంటే – దానికి ప్రమాణాం ఉందా? లేక ఇది ఒక అభిప్రాయమేనా? వ్యక్తిగత విషయమైతే అది ఆయన స్వేచ్చ. నిజంగానే మన వాళ్ళు ఆయాన్ని భిష్కరించి ఉంటే అది తప్పక ఖండించాల్సిన విషయం. కానీ ఆ రెండొది కాదు అని నా అనుమానం.
కానీ మన దేశం లో ప్రభుత్వాలు, “లిబెరల్” మహాశయులు చాలా అసంభధ్ధం గా వ్యవహరించడం వల్ల ఈ విషయాన్ని ఇంకా confuse and complicate చేసి వారి credibility ని వారే దెబ్బ తీసుకుంటున్నారు. దీనికి మూల కారణం కూడా మన first amendment – వాక్స్వేచ్చ ను ఖండించడం అక్కడ మొదలైంది.
ఐనా ఈ వెండీ ది Free speech విషయం కాదు కాబట్టీ, అట్టే ఇంక చర్చించడం అనవసరం (from both sides of the political spectrum). తస్లీమా విషయం లో ప్రభుత్వం నిషేదించింది. ఇది నిస్సందేహం గా వాక్స్వేచ్చకి విరుధ్ధం.
నా విమర్శలన్నీ కూడా వ్యాసం లో లోపించిన ఆలొచనా అస్పష్టత, అహేతుకమైన వాదన, పక్షపాత ధోరణి, loose vocabulary కి సంబంధించనవి (శ్రీరాం గారన్నట్టు). ఆ విషయాలన్నీ నేను ముందే ఉటంకించేసాను. కాబట్టీ ఇక పెద్దగా చర్చ అనవసరం.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి మోహన అభిప్రాయం:
03/14/2014 11:30 pm
ఆంధ్రభారతి నిఘంటువు శోధించగా లభించినది – “ఛందశ్శాస్త్ర సంబంధమైనది ఛాందసం. షడంగాలలో ఒకటి. వేద వ్యాఖ్యాన గ్రంథం ఛాందసం. కేవలం ఛందస్సును మాత్రం పాటిస్తూ, సాహిత్య విలువలను పట్టించు కొనకపోవడం వ్యవహారంలో ఛాందసం అనిపించుకొన్నది. లోక జ్ఞానం లేకపోవడం అని కూడా ఛాందసానికి అర్థం రూఢమైంది. ఛాందసీయుడు అంటే ఛంద శ్శాస్త్రం చదివిన వాడని అర్థం. వ్యవహారంలో లోకజ్ఞానం లేని వాడు అనే అర్థం (ఛాందసుడికి) స్థిరపడింది.”
గర్వముగా నేనిలా చెప్పుకోవచ్చు – నేనుసైతం ఛాందసానికి వ్యాసమొక్కటి వ్రాసినానే! విధేయుడు – మోహన
నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
03/14/2014 2:18 pm
అయ్యో ఈమాత్రం దానికి sorry ఎందుకండీ! చరిత్రలకే alternatives ఉన్నప్పుడు పద్యాలకు alternative interpretations ఉండడంలో ఆశ్చర్యమేవుంది! మనది కాని interpretation ఎప్పుడైనా ఎలానూ misinterpretation అయ్యే తీరుతుంది. ఎవరి interpretationకి వాళ్ళవాళ్ళ reasoning ఉండనే ఉంటుంది. ఉదాహరణకు నా interpretation వెనక నాకున్న reasoning ఇది – “పొత్తి” “పొత్తిలి” అనేది చిన్నపిల్లలకు వేసే గుడ్డ. అందుకే పసిపాపలను “పొత్తిళ్ళలో బిడ్డ” అని కూడా అంటారు.
ఎవరి మనోభావాలూ దెబ్బతిననంత వరకూ ఇందులో ఇబ్బందేమీ లేదు! 🙂
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam అభిప్రాయం:
03/14/2014 1:08 pm
అన్నయగారు,
యోగ గారు చాంధస వాదం అంటే ఎమిటో వికీ లోని వివరణ ఇచ్చారు. మీరు చెప్పె ఛాందసవాదం ఎమీటో మీకే తెలియాలి. మీ లాజిక్ ప్రకారం, ఈ వ్యాస రచయిత కూడా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ, అర్థ సత్యాలను అందంగా చెప్పారని అనవచ్చా? నాసదీయ సూక్తం ఋగ్వేదంతో వ్యాసం మొదలు పెట్టి, పద్నాలుగు పేజిలు రాసి, అటుతిప్పి ఇటుతిప్పి,పాఠకులను కంఫ్యుస్ చేసి, చెప్పిచెప్పనట్లు, చివరకు తేల్చింది హిందువులను తాలిబన్ లతో పోల్చటమా ఈ వ్యాసం యొక్క అంతిమ లక్ష్యం? మోడి సంగతి పక్కన పెట్టండి. ప్రగతి కాముక వామపక్ష వాదులు మమత బెనర్జి ముందు బెంగాల్ ను, సుమారు రెండున్నర దశాబ్దాలపైగా పాలించారే, కనీసం కుల వ్యవస్తను బలపరిచే ఖాప్ పంచాయితిని ఎందుకు నిషేదించలేకపోయారో ఎప్పుడైనా ఆలోచించారా? బెంగాల్ లో వారి పాలన మీరనే మత ఛాందసవాదుల పాలన కంటే భిన్నమైనదా? మిమ్మల్ని మీరే ఒకసారి ప్రశ్నించుకోండి.
వెండి గారి ఈ పుస్తకం గొడవకు, ఒక వారం ముందు తస్లీమా నస్రీన్ రాసిన టి వి సీరియల్ ని బెంగాల్ ప్రభుత్వం నిషేదించింది. ఆ వార్తను ఏ మీడీయా హౌస్ వారు గాని, మీరు చెప్పే ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్రవాదులు గాని,వెండి గారి పుస్తకానికి ఇచ్చిన అటెన్షన్ లో కనీసం సగం కూడా ఇవ్వలేదు. ఎందుకని? మీలాంటి ప్రగతి కాముకులు హుసేన్ గారి గురించి ఆలోచించే కన్నా, మధ్యతరగతి ప్రజల జీవితాలను గురించి ఆలోచించే తస్లీమ నస్రిన్ లాంటి వారికి మద్దతు ఇస్తే బాగుంట్టుందేమో!
నిర్మాతలకి మత ఛాందసవాదుల వలన వచ్చిన ముప్పేమిలేదు. మీరు అనవసరంగా ఆందోళన చెందుతున్నారు. వారికి పూర్తి స్వేచ్చ ఉంది, మహేష్ భట్ ఇమ్రాన్ హష్మీ తో తీసిన మడ్డర్ 1 & 2 సినేమాలు చూడండి . భారతదేశం లో ఎంత స్వేచ్చ ఉందో మీకే తెలుస్తుంది.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/14/2014 12:23 pm
భాను గారూ,
పరంపర విషయంలో మీతో ఏకీభవిస్తాను.
వేదాధ్యయనం మహిళలు చెయ్యకపోవడానికి కారణం ఖచ్చితంగా చెప్పలేమో… వ్యాసకర్త ఉద్దేశంలో అన్నిటికీ హిందుత్వా, (హిందూ) మత చాందస వాదులు (అంటే ఏమిటో నాకింకా తెలీదు) ఎలా కారణమో :-P, నాకు అన్నిటికీ ప్రధాన కారణం పేదరికం… దానికి స్వాతంత్ర్యం లేకపోవడం కారణం.
సంపన్నం గా దేశం లేనప్పుడూ, లేదా పరపాలన పీడితులైనపుడు మహిళల discrimination ఎక్కువవుతుందేమో అనిపిస్తుంది. May be society becomes protective about its women and slowly suppression of their freedom is institutionalized. ఆర్ధిక, రాజకీయ, వ్యక్తిగత స్వాతంత్రం సంభవించినపుడే ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఇది నా అభిప్రాయం.
మీరన్నట్టు ఆ సమయంలో (15th-16th centuries)సమయం లో ఆ పరిస్థితులు నెలకొని ఉండొచ్చు.
ఐతే ఆర్ధిక పరంగా చూసినట్లైతే, వేదాధ్యయనం వల్ల ఏమి వస్తుందో నాకు ఇప్పటికీ తెలీదు (ఇప్పుడు ఈ పాయింటు మీద చర్చలు చెయ్యలేను నేను. దిగ్గజాలందరూ చెప్పినట్టు తీసుకోండి అంతే!). పెద్దగా ఆర్ధిక ఉపయోగం లేనప్పుడు ఎవడు చదువుతాడు. అది ఇప్పుడైనా అప్పుడైనా ఒకటే గా…కాబట్టీ, వేదాధ్యయనం స్త్రీలు చెయ్యనందున వారిని అణగదొక్కారు అన్న కారణం తప్పేమో. అణగదొక్కడం వాస్తవమే కావొచ్చు. దానికి ఇంకా బలమైన కారణాలు,ప్రమాణాలు ఉండొచ్చు.
అంటే మనం చాలా చోట్ల correlation vs causation దగ్గర అయోమయ పడతామేమో అనిపిస్తూ ఉంటుంది.
కానీ కేవలం ఈ ఉదాహరణ (వేదాధ్యయన) లోపభూయిష్టమైనది అని నా అభిప్రాయం. ఐతే చరిత్రకారులెవరో గంభీరంగా పరిశీలించి ఉంటారు లెండి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:
03/14/2014 11:51 am
ప్రసాద్ గారూ: మీకు ఆనందం కలిగించినందుకు నాకు ఆనందంగా ఉన్నది, ఆ పై భ్రమ తొలగించినందుకు అసలు చెప్పలేనంత మహదానందంగా కూడా ఉంది.
నా సంబరం నాది, మీ ముచ్చట మీది. (అ)స్వతంత్ర భారతీయులకి ఈ విషయంలో కొద్దిగా స్వేచ్చ ఉన్నాది లెండి 🙂
P.S:- వ్యాసానికి సంబంధం లేదు కనుక ఇక ఈ విషయమై మన పరస్పర satire లు అనవసరం. హాయిగా కావాలంటే offline “చాయ్ పే చర్చా” చేస్కుకోవచ్చు.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam అభిప్రాయం:
03/14/2014 11:43 am
ఆయన దుస్థితి మీద మీ జాలి చూస్తుంటే, పాపం హుసేన్ గారు కట్టుబట్టలతో చేతిలో చిల్లిగవ్వలేకుండా, దేశంగాని దేశంలో నానా కష్ట్టాలు అనుభవిస్తూ కన్ను మూశాడనుకొంటారు. ఆయన కష్టాలు మనదేశం వదలగానే మాయమైనట్లు ఉన్నాయి. వారు విదేశాలలో హాయిగా, సుఖంగా, ఎంతో రిచ్ గా జీవించారు. ఆయన కొన్న కార్ల గురించి వచ్చిన వ్యాసం చదవండి.
హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి భాను అభిప్రాయం:
03/14/2014 11:17 am