పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి ప్రసాద్ అభిప్రాయం:

    05/05/2014 1:45 pm

    ఎలా తిట్టి కొట్టి ఈసడించినా నీళ్ళొచ్చినందుకు ఆయన మహామహుడా? అనడం అసలు విశయాన్ని భూతద్దంలో చూపించడమే!

    ఈ వ్యాసం చర్చించినట్లు బ్రౌన్ తెలుగు పండితుడు అయివుండకపోవచ్చు. అసలు పండితులని నామ మాత్రపు రుసుముతో వాడుకొని వుండవచ్చు. అయితే చరిత్రలో ఏది చూసినా అలాగేగా వుంది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకోసమే రైల్వే లైన్లు వేసినా అది అఖండ భారతాన్ని ఒకటిగా చేయడానికి ఉపయోగపడింది. కాటన్ దొర ఎక్కువ పన్ను రాబడికోసం ఆనకట్టలు కట్టినా అది కోస్తా అన్నపూర్ణ కావడానికి తోడ్పడింది. మరి మన రాజులు వాళ్ళ బొక్కెసం నింపుకోవడానికి కాక కేవలం ప్రజలకు తిండి పెట్టడానికే చెరువులు తవ్వించారా? ఆ కట్టినవాడు నల్లవాడే కావాలా విగ్రహం పెట్టడానికీ, కృతజ్ఞత చూపడానికీ?

  2. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:

    05/05/2014 1:36 pm

    శ్రీ వేమూరి: “తరగతిలో పాఠాలు ఎలా చెప్పాలో నేను చెప్పటం లేదు.” అన్నారు మీరు నా అభిప్రాయానికి జవాబుగా. మీ వ్యాసం ముక్తాయింపులో రెండొ వాక్యం “పాఠ్య పుస్తకాలు రాసే వారికి సైన్సు మీద అవగాహన, భాష మీద పట్టు ఉండాలి.” అన్న దాన్ని చూసి, పాఠ్య పుస్తకాలకీ తరగతిలో పాఠం చెప్పటానికీ – కొద్దొ గొప్పో- ఉన్న సంబంధాన్ని పురస్కరించుకుని నేను తరగతి గది ప్రస్తావన తెచ్చాను. పారిభాషిక పదాలను కూడా తర్జుమా చేస్తే శాస్త్ర విషయాన్ని సగటు తెలుగు చదువరికి చేరవేయటం మెరుగ్గా నెరవేరుతుందని మీ భావన అని నేను అనుకుని, ‘మీరు తెలుగు అనువాదం పేరిట సైన్స్ లొ ఇంగ్లిష్ లొ ప్రాచుర్యంలొ ఉన్న పడికట్టు పదాలకు చేస్తున్న సంస్కృతీకరణ నాకు మెచ్చుకోదగినట్టుగా అనిపించదు.’ అని అన్నాను. నేను మెచ్చకుంటే మించిపొయింది ఏమీ లెదని తెలిసి కూడా.

    ‘మానిఫోల్డ్’ గురించి నేను చెప్పినది కూడా చాలా భాగం తెనిగింపే. అక్కడ నేను ‘మానిఫొల్డ్’ని అలాగే ఉంచాను. ‘మానిఫొల్డ్’ని ఏ ‘వళీ బాహుళ్య’ అనో, ‘బహువళీ’ అనో అనటం శాస్త్రాన్ని తెలుగు చదవరికి చేరవేయటం అన్న సత్కార్యానికి ఒనగూర్చే అదనపు మేలు ఏమీ లేదనే నా అభిప్రాయం.

  3. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి okaDu అభిప్రాయం:

    05/05/2014 1:03 pm

    జయప్రభ గారు,

    ఏమిటేమిటీ? అంటే దొరగారు మనల్ని ఎలా తిట్టి కొట్టి ఈసడించినా నీళ్ళొచ్చినందుకు ఆయన మహామహుడా? భలే, భలే. అందుకేనా ఆయనకి విగ్రహాలూ, పూలదండలూను? భానే ఉంది సంబడం.

    ఇంకో విషయమండోయ్, ఈ వ్యాసంలో ఎక్కదా నా.రా. గారు కంగారు పడినట్టు నాకు అనిపించలేదు. అరవై పైన ఆర్టికిల్స్/పుస్తకాలు కోట్ చేసి రాసినది “అనవసరమైన తొందర” గా ఉంది అని మీకు ఎలా అనిపించింది? శ్రీనివాస్ చాలాకాలం నుంచీ ఈ బ్రౌన్ గురించి ఈ విషయాలు అంటూనే ఉన్నారు. ఏమోలెండి, ప్రపంచం మన మనసుకి ప్రతిబింబం అన్నారు కదా?

  4. ఎండని ఏడో చేప కథ గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/05/2014 12:27 pm

    రంగ, రంగా! ఎంత మాటన్నారు!

    ఇప్పటికే “స్టువర్డెస్‌” కి “గగనసఖి” లాంటి తెలుగు పదాలు కట్టి వాడితే సంపాదకులవారి కత్తెరకి గురి అయాయి. తెలుగు మాటలు వాడడం నాకు ఒక “ఫెటిష్‌” (అంటే, ఏ పని మీదనైనా అతిగా దృష్టి నిలపడం) గా తయారయిందని ఆక్షేపణలు కూడ వస్తున్నాయి. కనుక ఏదో నన్ను ఇలా బతకనివ్వండి! అప్పుడప్పుడు ఇంగ్లీషు మాటలు వాడకపోతే నన్ను ఏ పిచ్చాసుపత్రిలోనో పడెస్తారేమోనన్న భయంతో – వేమూరి

  5. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి Rao Vemuri అభిప్రాయం:

    05/05/2014 11:41 am

    వాసుదేవ రావు గారూ,

    “మేనిఫోల్డ్‌” కి మీరు ఇచ్చిన వివరణ నా “బిందుసమూహం” కంటె బాగుంది. నేను పూర్వం ఎప్పుడో రాసిన “ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది?” అనే వ్యాసాన్ని మరమ్మత్తు చేసి తిరగ రాస్తున్నాను. అందులో మీ వివరణ వాడుకుంటాను.

    మీరు తలుచుకుంటే చాలా బాగా రాయగలరని నాకు తెలిసింది కనుక మీరు కూడ అప్పుడప్పుడు తెలుగులో రాసి చూడండి. ఇంగ్లీషు వచ్చిన వాళ్లు కూడ అందరూ “టొపాలజీ” పుస్తకాలు, “రెలెటివిటీ” పుస్తకాలు అర్థం చేసుకోలేరు. అదే పదార్థం తెలుగులో కనిపిస్తే చదువుతారు. సైన్సుని నలుగురికీ అర్థం అయే భాషలో రాసి అదేమిటో చెప్పవలసిన బాధ్యత “సైంటిస్టు” ల మీదే ఉంది.

    – వేమూరి

  6. అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి Manjari Lakshmi అభిప్రాయం:

    05/05/2014 7:53 am

    మీరు చేసిన విశ్లేషణ బాగుందండి.

  7. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Halley అభిప్రాయం:

    05/05/2014 5:20 am

    “వలసరాజ్యాల మీద వలసదేశాలు ఆధిపత్యం చలాయించడానికి కారణం కేవలం సైనికమైనది కాదనీ అది నిజానికి సాంస్కృతికమైనదనీ గమనించి మంచి ఆలోచనలు ప్రతిపాదించిన వాళ్ళు అమెరికాలో ఉన్నారు. తరువాత కాలంలో ఇంగ్లండులో ఉన్నారు. భారతదేశంలో కూడా ఉన్నారు”

    “కాకపోతే ఆ పరిశోధనలన్నీ ఇంగ్లీషులో జరగబట్టి కాబోలు మన తెలుగు పండితుల చెవులకెక్కలేదు”

    అంటే వలస దేశాల సాంస్కృతిక ఆధిపత్యం గురించి తెలుసుకోవాలంటే ఇంగ్లండు అమెరికా మేధావులే శరణ్యమనా లేక ఇంగ్లీషు రిసర్చి పత్రాలే దిక్కు అనా ? తెలుగు సాహిత్యంలోనే ఇటువంటి ఆలోచనలు చేసిన పండితులు ఆ కాలం లోనే ఉండి ఉండచ్చును కదా? విశ్వనాథ?

  8. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/05/2014 3:41 am

    సుబ్బలక్ష్మి గారూ, మీరు కూడా చక్కగా విశ్లేషణాపూరితమైన వ్యాఖ్యని చేశారు కథ గురించి. చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు మీకు.

  9. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/05/2014 3:36 am

    చాలా సంతోషంగా ఉందండీ సుకన్య గారూ మీ కామెంట్ కి. ధన్యవాదాలు

  10. విముక్తం గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    05/05/2014 2:46 am

    మైథిలి పడ్ద మానసిక సంఘర్షణను చాలా బాగా వ్రాసారండీ. తనవాడూ అనుకున్న మనిషి పరాయివాడైపోతున్నాడేమోనన్న ఆందోళనతో ఆవిడ పడిన మానసికవ్యథ న్యాయంగానే కనిపిస్తుంది. అదే సమయంలో ఆవిడలో వున్న సంస్కారం ఆ ఆందోళన అర్ధంలేదని వివరిస్తుంది. ఈరెండింటిమధ్యనున్న సన్నగీతని చాలా చక్కగా విశ్లేశించారు. అభినందనలండీ రాధగారూ..