పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. ఈమాట సెప్టెంబర్ 2015 సంచికకు స్వాగతం! గురించి SeshaKumar KV అభిప్రాయం:

    09/09/2015 3:39 am

    “చంద్రికా పరిణయము”ను శ్రధ్ధ తోడ
    మరల వ్రాసి యొసంగిన మాన్య మతికి
    కృష్ణ దేశికా చార్యులకు కేలు మోడ్తు
    అంద జేసిన “ఈమాట” కంజలిడుదు

  2. ఒక పద్ధతి ప్రకా…రం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/08/2015 2:20 pm

    చలసాని ప్రసాదు గారికి కనక ప్రసాదు గారి నివాళి “ఒక పద్ధతి ప్రకా…రం“ ప్రింట్ కాపీని చదివి శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారు తమ హర్షాన్ని వెల్లడించారు (నాగ్ పూర్ నుండి). రావిశాస్త్రి గారి తర్వాత విశాఖ మాండలీకాన్ని అంత వొడుపుగా పట్టుకున్నవాడు కనక ప్రసాదు అని త్రిపుర గారు తనతో అన్నమాటని తలపోసుకున్నారు.

    అభ్యుదయ పత్రిక పాత సంచికలు కోసం గాలించి, బహుమతి పొందిన కనక ప్రసాదు “కన్యాశుల్కం నాటకం సీక్వెల్” రచనని సంపాదించి తనకు, పదిమందికీ సమర్పించమని ప్రేమతో ఆజ్ఞాపించారు.

    సజీవంగా చిరకాలం గుర్తుండే చలసాని ప్రసాదు గారి జ్ఞాపకాలు మనతో పంచుకున్న కనక ప్రసాదు గారికి తన కృతజ్ఞతలు, దీవెనలు తెలియజెయ్యమన్నారు.

  3. ఒక పద్ధతి ప్రకా…రం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    09/08/2015 1:48 pm

    “ విశాపట్నం డాల్ఫింస్ నోస్ కొండ మీద లైట్ హౌసూ, కనక మహాలచ్చి తల్లీ, రావి శాస్త్రీ , విరసం చలసానీ అలా ఎప్పటికీ ఉంటారు బయ్యా .. “ ఎస్సూజ్ మి వసంత లక్ష్మి గారూ, మీరేవీ అనుకోనంటే శ్రీ శ్రీ, త్రిపుర కూడా విశాఖతో పెనవేసుకుపోయి ఎప్పటికీ ఉంటారు బయ్యా అని అనాలనుంది … ( కాఫ్కా కి ప్రాగ్ నగరంలా, త్రిపురకి విశాఖానూ అని ఒకరు మనకి చెప్పాలా, మనకి తెలీదా ఏంటి బయ్యా ).

    “ త్రిపుర ఇల్లు రచైతలకి, కవులకి కాశీ బెనారసూ, అక్కడే మోక్షమూ తీర్ధమూ అని ఎవరో ఒకరు మనకి చెప్పాలా, మనకి తెలీదా ఏంటి బయ్యా “ .. మీ నోట్లో గుప్పెడు పందార పొయ్యా ఎంత తియ్యటి మాట అన్నారు వసంత లక్ష్మిగారూ !

    ‘మనుషులతో మాటాడుతునట్టు కాకుండా, ఎవరో ఆకాశంలోని యెహోవాతో డైరెక్టుగా తన సొదనంతా వెళ్ళబోసుకుంటున్నట్టున్నాది’ చలసాని ప్రసాదు గారికి కనక పెసాదు నివాళి. (కనకా! ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును [కీర్తనల గ్రంథము – Psalms 121:8] )

  4. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి వేటూరి ఆనందమూర్తి అభిప్రాయం:

    09/07/2015 11:34 pm

    శ్రీనివాస్ గారి అద్భుత వ్యాసం ఇప్పుడే చదివాను.వాస్తవానికి ఈ పత్రికలో పడే వ్యాసాలన్నీఅద్భుతాలే. పత్రికకూ, రచయితలకూ అభినందనలు.

    రజని అన్నగారు నా కన్నా పదేళ్ళ పది నెలలు పెద్దవారు. వారితో నా తొలి ప్రత్యక్షపరిచయం 1940-45 ల మధ్య మాయింటికి వచ్చి మూడునాలుగురోజులు బసచేసినప్పుడు. రజని అన్నగారి ప్రభావం నామీద చాలా ఉంది. నాన్నగారు 1940-47ల మధ్య (చూ.వ్యాసమంజరి, నవెంబరు,1988. పునర్ముద్రితం-తితిదే 2015)మద్రాసురేడియో కేన్ద్రంద్వారా పసారం చేసిన సోదాహరణ ప్రసంగాల్లో ప్రయాగ, మల్లిక్, రజనిల చేత పాడించడం తో మొదలై అన్నమాచార్యోత్సవంతో తాళ్ళపాకవారి వాగ్గేయరచనలప్రచారానికి ఉజ్జ్వలదశ ప్రారంభమైనదని చెప్పాలి.

    మంచి వ్యాసాన్ని అందించినందుకు ధన్యవాదాలు.

  5. పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం గురించి desikachary అభిప్రాయం:

    09/07/2015 11:41 pm

    పోతనగారి బహుగ్రంథపరిశీలనానుభవంతో బాటు మురళీధరరావుగారి బహుగ్రంథపరిశీలనానుభవాన్ని కూడ ఈవ్యాసం వ్యక్తపరుస్తూ ఉన్నది. పోతనగారి ఈపద్యాన్ని ఉల్లేఖాలంకారానికి గూడ ఉదాహరణంగా చెప్పడం జరిగింది (ఉదా: సన్నిధానంవారి కావ్యాలంకారసంగ్రహవివరణము). ఇందులో రవిబింబము అనేది విషయము. అది అనేకవిధములుగా రూపొందిందని చెప్పడం మాత్రమే గ్రహిస్తే అది ఉల్లేఖమే ఔతుంది. ఛత్రం కంటె తిలకం గొప్పదని, కౌస్తుభంకంటె పాదపీఠం గొప్పదని సూర్యబింబానికి ఉత్తరోత్తరోత్కృష్టతను చెప్పలేము. అందుచేత సూర్యబింబవర్ణనలో సారాలంకారం లేదు. కాని ఒకే సూర్యబింబం ఇట్లు అనేకవిధములుగా రూపొందింది అని చెప్పడంవల్ల వామనుని ఉత్తరోత్తరౌన్నత్యము స్ఫురిస్తూ ఉన్నది. కావున ఇది ఉల్లేఖానుప్రాణితమైన సారాలంకారము కావలెననిపిస్తున్నది. నాదగు నీ అపండితాభిప్రాయమును సహృదయతో పరిశీలించి ఈవిచారమునందలి దోషమును ఎత్తిచూపగలరని ఆశిస్తున్నాను.

  6. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి krishnamurthy punna అభిప్రాయం:

    09/07/2015 11:17 pm

    రజనికి చక్కని పదాంజలి.

  7. నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి వేలూరి వేంకటేశ్వర రావు అభిప్రాయం:

    09/07/2015 1:10 pm

    కామేశ్వర రావు గారూ:

    దాశరథి రంగాచార్యుల గారి శ్రీ మదాంధ్ర వచన ఋగ్వేద సంహితలో ఉన్న అనువాదం ఇది:

    నూటడెబ్బది తొమ్మిదవ సూక్తము

    ఋషి 1-2 లోపాముద్ర, 3-4 అగస్త్యుడు, 5-6 బ్రహ్మచారి,
    దేవత – రతి, చందస్సు – 1-4,6 త్రిష్టుప్, 5 బృహతి.

    1. లోపాముద్ర అనుచున్నది:

    అగస్త్యా!అనేక సంవత్సరాలనుండి రాత్రింబవళ్ళు జరాకారకమగు ఉషస్సులందు నిన్ను సేవించినాను. అలసినాను. ముదిమి శారీరక సౌందర్యమును నష్టపరచును. అప్పుడు పురుషుడు స్త్రీ వద్దకు ఏల చేరవలెను?

    2. అగస్త్యా! ప్రాచీనులు సత్యపాలకులు అగు ఋషులు దేవతలతో సంభాషించినారు. వారికి కూడ రేతస్ఖలనము జరిగినది. వారికి సహితము అంతుపట్టలేదు, పురుషుడు స్త్రీ వద్దకు ఏల చేరవలెను?

    3. అగస్త్యుడు అనుచున్నాడు:

    మనము వట్టిగా అలసిపోలేదు. దేవతలు మనని రక్షించుచున్నారు. మనము సర్వభోగములను అనుభవించవచ్చును. మనము ఇద్దరము కోరినచో ఇహ లోకములందలి వందల కొలది భోగములను సాధించగలము. అనుభవించగలము.

    4. నేను జయము, సంయమము కోరి ఉన్నాను. అయినను ఏ కారణముననో ఏదో కారణమున నాకు కామవాంఛ కలిగినది. లోపాముద్ర పతితో సంగమించవలెను. అధీరయగు నారి బలవానుడగు పురుషునకు ఉపభోగ్యము కావలెను.

    5. శిష్యుడు అనుచున్నాడు:

    మనసుతో త్రావిన సోమమును హృదయ పూర్వకముగా ప్రార్థించుచున్నాను. సోమను నాకు సుఖమును ప్రసాదించవలెను. లీపులు కామోహి మర్త్యః మానవుడు అనేక కోరికలవాడు.

    (సోమమునకు చంద్రపరమగు అర్థము ఉన్నది)

    6. అగస్త్యుడు మహిమాన్వితుడు అగు ఋషి. అతడు అనేక ఉషస్సులను ఉపాసించినాడు. అతడు బలము కోరినాడు. పుత్రులను కోరినాడు. తపమాచరించినాడు. కామము అనుభవించినాడు. ఉభయములను పాలించినాడు. అగస్త్యుడు దేవతలనుండి వాస్తవ ఆశీస్సులు అందుకున్నాడు.

    విధేయుడు,

    వేలూరి వేంకటేశ్వర రావు.

    పి. యస్. ఏ అనువాదం సమంజసముగా ఉన్నదో ఊహ తెలిసిన పాఠకులు నిర్ణయించగలరు.

  8. తెలుగు కవిత్వంలో దళితవాదం గురించి nandagopal అభిప్రాయం:

    09/07/2015 6:42 am

    అయ్యా, నమస్కారం. మీ మాట, మా మాటా ఈమాటలో చూసుకుంటుంటే నాకు ఎక్కడలేని ఆనందం కలుగుతోంది. ధన్యజీవులు. పెద్దవాడిగా ఇంతకంటే చెప్పలేను.

  9. నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    09/06/2015 3:20 pm

    వేలూరిగారు,
    Thanks for your comments. నా రాతల్లోని తప్పులు దిద్దడం, ఖాళీలు పూరించడం అనే విషయాల్లో ఈమాట పాఠకులపై నాకున్న భరోసాని మరోసారి నిలబెట్టారు. ఈ సూక్తాలకు రెండు మూడు చోట్ల (నెట్లో వెతికితే) కాస్త భిన్నమైన అర్థాలు కనిపించాయి. ఏది “authentic”, ఏది కాదు అన్నది నాకు తెలియదు కాబట్టి వాటి జోలికి వెళ్ళలేదు. దాశరథి రంగాచార్యులుగారి అనువాదంలో యీ సూక్తాలు ఉన్నాయేమో చూడాలి.

    ఇక “ఒత్తుకొని వచ్చు” వాటి గురించి ఒత్తి చెప్పడమెందుకని ఊరుకొన్నాను. తెలిసినవాళ్ళకి వివరించనక్కర లేదు, తెలియని వాళ్ళకి వివరించినా తెలియదు 🙂

    మీ ప్రోత్సాహానికి మరోసారి ధన్యవాదాలు!

  10. ఒక పద్ధతి ప్రకా…రం గురించి rama sundari MSBPNV అభిప్రాయం:

    09/06/2015 4:16 am

    ఎందుకో చార్లీ చాప్లిన్ సినిమాలు గుర్తుకొస్తున్నాయి, ఆయన చూపించే దృశ్యానికి ఆవలి దృశ్యం మన గుండెని తడి చేస్తుంది. మీ మాటలు కూడా అంతే, కనక ప్రసాద్ గారూ, మీ రాతలు శబ్దాతీత ధ్వనికి సంబంధించినవి.