నేను ఉదహరించిన సైట్, మీరు ఇచ్చిన సైట్ ఒకటే అని ఇప్పుడే గ్రహించాను.
నేను bookmark చేసుకున్న mainpage url, మీరు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఉండడంతో వెంటనే గుర్తు పట్టలేక పోయాను. Thanks for your effort anyways.
తెలుగు లలిత సంగీతం అంటే ఆసక్తి ఉన్న వారు, “ఎత్తవోయీ కేల” పాటని ఇక్కడ విని ఆనందించవచ్చు
Thanks to Sri B. N. Murty who originally recorded these songs.
కృష్ణమోహనరావుగారూ, మీరు నన్నెచోడుని కాలాన్ని నిర్ధారించడానికై లక్షణగ్రంథాలని ఇతర కవుల ప్రయోగాలనీ వాడుకుంటూ వ్యాసాన్ని తార్కికంగా నడిపించిన తీరు ఆద్యంతమూ చాలా బావుంది.
ఇలాంటి అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు.
సంభాషణాశైలిలోనూ నాటకీయతలోనూ గౌరనను (హరిశ్చంద్రోపాఖ్యానము) మించిన కవి లేడనే నా భావమ్ ఈ వ్యాసమ్ చదివిన తరువాత ఇనుమడించింది. మీరు చూపిన లక్షణాలన్నీ నాచనలో చంద్రరేఖా సదృశంగా వుంటీ గౌరనలో సూర్య ప్రభగా గోచరిస్తాయి. దయచేసి ఈ మహాకవి గూర్చి మీ యంత ప్రతిభాశాలులు వ్రాస్తే చదవాలని వుంది.
౧ (సందర్భాన్నిబట్టి) సాధారణంగా సంభాషణలలో వ్యావహారిక భాష వాడడం వల్ల వచ్చే అందం, వచ్చే రససిద్ధి వ్యావహారికేతర భాష వలన కలగడం కొంచెం కష్టం.
౨ మంచి ప్రశ్న అడిగారు. సంస్కృతిలో కూడా ఈ రకమైన మార్పులూ చేర్పులూ సహజమే అనుకుంటే ఈ ప్రశ్న కొంత అసంబద్ధంగా అనిపిస్తుంది. కానీ అయ్యో నా భాష నా సంస్కృతి అనుకునేవాళ్లలో చాలామందికి కచ్చితంగా జీర్ణించుకోలేని సమాధానమే వస్తుంది ఈ ప్రశ్న వేసుకుంటే. ఈ ప్రశ్నని ఎవరికి వారు తెలుగువారిలో ఒకరిగా వేసుకుంటే వచ్చే సమాధానం, తెలుగవారందరి పరంగా ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం కూడా వేరేగా ఉండచ్చు కూడా. ఏదేమైనా తెలుగువారందరూ దీని గురించి ఆలోచించవలసినదే.
ఇక నాకు అనిపించినదిదీ… తెలుగు భాషలో ఇంగ్లీషు పదాల వాడకం ఎక్కువైంది. ఎంత భాషపై మమకారం ఉన్నా ఎంత కాదనుకున్నా నాబోటివాళ్లకి అక్కడక్కడా ఆంధ్రభాష చ్యుతమై ఆంగ్లభాష అయ్యి కూర్చుంటూనే ఉంది. భాషలో ఈ మార్పు సహజం అనుకుందాం అంటే, వేషభాషలు విద్యావ్యవస్థ నిద్రాహారపుటలవాట్లూ ఇలా ఒకటీ రెండూ కాదు దాదాపు అన్నీ మారాయి. మారుతునే ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో చూస్తే ఇదివరకు ప్రాంతీయమై ఉన్న అలవాట్లూ గట్రా ఇప్పుడు ప్రాంతభేదాలు తగ్గుముఖం పట్టడం వల్ల మారుతూ వస్తున్నాయి. దీని వల్ల ఒకటి మాత్రం సూటిగా తెలుస్తోంది. ఇంకొక శతాబ్దం తర్వాత తెలుగు కావ్యాలు చదవాలంటే ప్రస్తుతం కంటే ఎక్కువగా చరిత్రలో జ్ఞానం కూడా అవసరమౌతుందీ అని!
whistle blow చేసేరు. కానీ వినేవాళ్ళున్నారా అని !? మీరు వివరించిన పుస్తక పఠనానుభవంలో రేపటి తరాలు భాగస్వామ్యం అయే అవకాశం ఉందా? వాళ్ళు లాప్ టాప్ ముందే… మీ వాలుకుర్చీని మించిన ఆనందాన్ని పొందుతారో ఏమో?! మీ బాధ.. మీ హెచ్చరిక సబబైనవి. అయితే పుస్తకాల విలువని గుర్తించిన వాళ్ళకి మాత్రమే అవి అర్ధం అవుతాయి. వారి సంఖ్య ఇవాళ ఎంతా అన్న దే నా సందేహం.
రమ.
శ్రీనివాస్ గారు, Thanks for responding to my request. పాట సగమే ఉన్నట్లనిపించింది. మిమ్మల్ని అడగక మునుపే మరొక వెబ్ సైట్ లో కూడా ఇలా సగమే దొరికింది. అదే సైట్ లో మరొక ఆణిముత్యం, “ఏ గాలి వడి రాలి ఏ ధూళిదోగినదొ, ఏ కబరి ముడి సడలి ఈ దారి జారినదొ, ఎత్తవో నీ కేల ఈ బేల సుమబాల” అనే పాట కూడా దొరికింది. నేను దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ పాట కోసం వెతుకుతుంటే, అనుకోకుండా దొరికింది. ఈ సైట్ maintain చేస్తున్నవారి తండ్రిగారు AIR Hyderabad లో ఇంజనీరుగా పని చేసేవారట. ఆయన ఫిలిప్స్ 6″ tapes మీద ఈ పాటలు radio లో ప్రసారమైనపుడు record చేసారట. వాటిని digitize చేసి ఈ సైట్లో ఉంచడం జరిగింది. AIR Hyderabad వాళ్ళు ఇలాంటి మంచి పాటలని archives లో కప్పేట్టేసి ఉంచడం ఇటు శ్రోతలకూ, అటు radio కళాకారులకూ, గేయ రచయిత(త్రు)లకూ పెద్ద disservice.
ఏది ఏమైనా మీకు మరోసారి ధన్యవదాలు.
గూగుల్ లోనో యాహూలోనో idangai, valangai అని టైపు చేస్తే ఈ కుడి ఎడమల జాతి వివరణలు తెలుస్తాయి. బ్రిటిషువారి పరిపాలనలో ఒకప్పుడు కోమటులకు శెట్టికులము వారికి తగాదాలు చాలా తీవ్రంగా మదరాసులో వచ్చిందట. ఇళ్లను వాకిళ్లను తగలబెట్టారట. దానిని సరి చేయడానికి బ్రాహ్మణులను కొందరిని పంపారట. దక్షిణాంధ్రలో కూడా ఇట్టివి ఉండేవని చదివి ఉన్నాను. కుడి జాతివారి స్త్రీలు ఎడమవైపు పైట వేసికొనేవారట, ఎడమజాతివారు కుడివైపు వేసికొనేవారట. గొల్ల కులాలవారు రెండు వైపులా వేసికొనే్ వారట. బ్రాహ్మణుల ఆధిఖ్యాన్ని విశ్వబ్రాహ్మణ కులం వారు ఎదురుకొనేవారు. అందుకే వారు జందెం వేసికొని ఆచార్యులని పేరు పెట్టుకొనేవారు. అదృష్ట వశాత్తు ఈ రోజు ఇవన్నీ లేవు అందుకు మనం సంతోషించాలి! ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదు.
విధేయుడు – మోహన
“అయితే ఏ మంచికి హాని చేస్తున్నావోఁ, ఏ చెడుకి మంచి చేస్తున్నావోఁ తెలుసుకుంటే హాయి హాయి గా సాగుతుంది ఆమని.”
బాబ్జీలు గారి అభిప్రాయాలతో పేచీ పడేంత చదువు నాకు లేదు. కానీ వారన్న పై మాట నాకు అర్ధం కాలేదు. ఈ పుస్తకం ప్రచురించడానికి తోడ్పడి కొడవళ్ళ గారు హాని చేశారనా? ఎవరికి?ఈ పుస్తకం ప్రచురించడం చెడు పనా? ఏది చెడు, ఎవరు దానికి మంచి చేస్తున్నారు? పోనీ వేరే పుస్తకాలేమన్నా అచ్చేస్తే మంచికి మంచి జరిగేట్టయితే ఉదాహరణలేమన్నా చెబ్తారా? ఈ మంచి చెడుల ప్రస్తావన నాకు అంతుబట్టలేదు.
ఏమనుకోకపోతే ఇంకో చిన్నమాట – పైమాట ఒక్కటే కాదు. చాలా సార్లు వారు దేనిగురించి మాట్లాడుతున్నారో అర్ధం కాదు. వారి ఉద్దేశాలు అంతుపట్టవు. బాబ్జీలు గారి అభిప్రాయాల్ని ఉత్సాహంగా చదివి అర్ధం అయినంతమటుకూ ఆనందించే ఈమాట పాఠకుల్లో నేనూ ఒకణ్ణి. అందువల్ల వారు చెప్పదలచుకున్నది వారి ‘ధోరణి’ లో కాకుండా సరళంగా చెబితే నాబోటి వాళ్ళకు అర్ధమౌతుందని, నా చిన్న రిక్వెస్టు. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.
– గిరి
I read this after a long time. One way to understand the infinities is to consider a hotel with infinite rooms, with infinite guests. If one more guest comes, how do you accommodate? [Ask the first guest to move to the next room and the guest in that room to next and so on; use the first room for the new guest.] If another infinite hotel had a fire problem and you want to accommodate them how would you?
This series of mappings illustrate the concept of infinities to kids. Now, an enterprising soul can come with analogies to all the equations in terms of hotels and rooms and guests :-).
I did not understand the complexity in reductio ad absurdum. Philosophically, people may have issues with law of excluded middle, but other than that it is a desire to see the system not be inconsistent.
కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar అభిప్రాయం:
03/04/2009 7:28 am
శ్రీనివాస్ గారూ,
నేను ఉదహరించిన సైట్, మీరు ఇచ్చిన సైట్ ఒకటే అని ఇప్పుడే గ్రహించాను.
నేను bookmark చేసుకున్న mainpage url, మీరు ఇచ్చిన దానికంటే భిన్నంగా ఉండడంతో వెంటనే గుర్తు పట్టలేక పోయాను. Thanks for your effort anyways.
తెలుగు లలిత సంగీతం అంటే ఆసక్తి ఉన్న వారు, “ఎత్తవోయీ కేల” పాటని ఇక్కడ విని ఆనందించవచ్చు
Thanks to Sri B. N. Murty who originally recorded these songs.
రాజాశంకర్
కొండ నుంచి కడలి దాకా గురించి rama bharadwaj అభిప్రాయం:
03/04/2009 6:01 am
శ్రీనివాస్ గారూ!
మీరు ఇబ్బంది పడకండి. మీ అభిప్రాయానికి తెనుగు అనువాదం పంపినా నేను respond కాను.నా భావాలు నావి.
రమ.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి రాఘవ అభిప్రాయం:
03/04/2009 4:32 am
కృష్ణమోహనరావుగారూ, మీరు నన్నెచోడుని కాలాన్ని నిర్ధారించడానికై లక్షణగ్రంథాలని ఇతర కవుల ప్రయోగాలనీ వాడుకుంటూ వ్యాసాన్ని తార్కికంగా నడిపించిన తీరు ఆద్యంతమూ చాలా బావుంది.
ఇలాంటి అద్భుతమైన వ్యాసాన్ని అందించినందుకు ఈమాటవారికి కృతజ్ఞతలు.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/04/2009 3:21 am
సంభాషణాశైలిలోనూ నాటకీయతలోనూ గౌరనను (హరిశ్చంద్రోపాఖ్యానము) మించిన కవి లేడనే నా భావమ్ ఈ వ్యాసమ్ చదివిన తరువాత ఇనుమడించింది. మీరు చూపిన లక్షణాలన్నీ నాచనలో చంద్రరేఖా సదృశంగా వుంటీ గౌరనలో సూర్య ప్రభగా గోచరిస్తాయి. దయచేసి ఈ మహాకవి గూర్చి మీ యంత ప్రతిభాశాలులు వ్రాస్తే చదవాలని వుంది.
నాచన సోమన చతుర వచో విలాసం గురించి రాఘవ అభిప్రాయం:
03/04/2009 3:20 am
౧ (సందర్భాన్నిబట్టి) సాధారణంగా సంభాషణలలో వ్యావహారిక భాష వాడడం వల్ల వచ్చే అందం, వచ్చే రససిద్ధి వ్యావహారికేతర భాష వలన కలగడం కొంచెం కష్టం.
౨ మంచి ప్రశ్న అడిగారు. సంస్కృతిలో కూడా ఈ రకమైన మార్పులూ చేర్పులూ సహజమే అనుకుంటే ఈ ప్రశ్న కొంత అసంబద్ధంగా అనిపిస్తుంది. కానీ అయ్యో నా భాష నా సంస్కృతి అనుకునేవాళ్లలో చాలామందికి కచ్చితంగా జీర్ణించుకోలేని సమాధానమే వస్తుంది ఈ ప్రశ్న వేసుకుంటే. ఈ ప్రశ్నని ఎవరికి వారు తెలుగువారిలో ఒకరిగా వేసుకుంటే వచ్చే సమాధానం, తెలుగవారందరి పరంగా ఆలోచిస్తూ ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం కూడా వేరేగా ఉండచ్చు కూడా. ఏదేమైనా తెలుగువారందరూ దీని గురించి ఆలోచించవలసినదే.
ఇక నాకు అనిపించినదిదీ… తెలుగు భాషలో ఇంగ్లీషు పదాల వాడకం ఎక్కువైంది. ఎంత భాషపై మమకారం ఉన్నా ఎంత కాదనుకున్నా నాబోటివాళ్లకి అక్కడక్కడా ఆంధ్రభాష చ్యుతమై ఆంగ్లభాష అయ్యి కూర్చుంటూనే ఉంది. భాషలో ఈ మార్పు సహజం అనుకుందాం అంటే, వేషభాషలు విద్యావ్యవస్థ నిద్రాహారపుటలవాట్లూ ఇలా ఒకటీ రెండూ కాదు దాదాపు అన్నీ మారాయి. మారుతునే ఉన్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో చూస్తే ఇదివరకు ప్రాంతీయమై ఉన్న అలవాట్లూ గట్రా ఇప్పుడు ప్రాంతభేదాలు తగ్గుముఖం పట్టడం వల్ల మారుతూ వస్తున్నాయి. దీని వల్ల ఒకటి మాత్రం సూటిగా తెలుస్తోంది. ఇంకొక శతాబ్దం తర్వాత తెలుగు కావ్యాలు చదవాలంటే ప్రస్తుతం కంటే ఎక్కువగా చరిత్రలో జ్ఞానం కూడా అవసరమౌతుందీ అని!
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి rama bharadwaj అభిప్రాయం:
03/03/2009 10:19 pm
వెంకటేశ్వర్రావు గారూ!
whistle blow చేసేరు. కానీ వినేవాళ్ళున్నారా అని !? మీరు వివరించిన పుస్తక పఠనానుభవంలో రేపటి తరాలు భాగస్వామ్యం అయే అవకాశం ఉందా? వాళ్ళు లాప్ టాప్ ముందే… మీ వాలుకుర్చీని మించిన ఆనందాన్ని పొందుతారో ఏమో?! మీ బాధ.. మీ హెచ్చరిక సబబైనవి. అయితే పుస్తకాల విలువని గుర్తించిన వాళ్ళకి మాత్రమే అవి అర్ధం అవుతాయి. వారి సంఖ్య ఇవాళ ఎంతా అన్న దే నా సందేహం.
రమ.
కొండ నుంచి కడలి దాకా గురించి kasinadhuni rajasankar అభిప్రాయం:
03/03/2009 7:34 pm
శ్రీనివాస్ గారు, Thanks for responding to my request. పాట సగమే ఉన్నట్లనిపించింది. మిమ్మల్ని అడగక మునుపే మరొక వెబ్ సైట్ లో కూడా ఇలా సగమే దొరికింది. అదే సైట్ లో మరొక ఆణిముత్యం, “ఏ గాలి వడి రాలి ఏ ధూళిదోగినదొ, ఏ కబరి ముడి సడలి ఈ దారి జారినదొ, ఎత్తవో నీ కేల ఈ బేల సుమబాల” అనే పాట కూడా దొరికింది. నేను దాదాపు ఇరవై ఏళ్ళుగా ఈ పాట కోసం వెతుకుతుంటే, అనుకోకుండా దొరికింది. ఈ సైట్ maintain చేస్తున్నవారి తండ్రిగారు AIR Hyderabad లో ఇంజనీరుగా పని చేసేవారట. ఆయన ఫిలిప్స్ 6″ tapes మీద ఈ పాటలు radio లో ప్రసారమైనపుడు record చేసారట. వాటిని digitize చేసి ఈ సైట్లో ఉంచడం జరిగింది. AIR Hyderabad వాళ్ళు ఇలాంటి మంచి పాటలని archives లో కప్పేట్టేసి ఉంచడం ఇటు శ్రోతలకూ, అటు radio కళాకారులకూ, గేయ రచయిత(త్రు)లకూ పెద్ద disservice.
ఏది ఏమైనా మీకు మరోసారి ధన్యవదాలు.
రాజాశంకర్
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి mOhana అభిప్రాయం:
03/03/2009 6:00 pm
గూగుల్ లోనో యాహూలోనో idangai, valangai అని టైపు చేస్తే ఈ కుడి ఎడమల జాతి వివరణలు తెలుస్తాయి. బ్రిటిషువారి పరిపాలనలో ఒకప్పుడు కోమటులకు శెట్టికులము వారికి తగాదాలు చాలా తీవ్రంగా మదరాసులో వచ్చిందట. ఇళ్లను వాకిళ్లను తగలబెట్టారట. దానిని సరి చేయడానికి బ్రాహ్మణులను కొందరిని పంపారట. దక్షిణాంధ్రలో కూడా ఇట్టివి ఉండేవని చదివి ఉన్నాను. కుడి జాతివారి స్త్రీలు ఎడమవైపు పైట వేసికొనేవారట, ఎడమజాతివారు కుడివైపు వేసికొనేవారట. గొల్ల కులాలవారు రెండు వైపులా వేసికొనే్ వారట. బ్రాహ్మణుల ఆధిఖ్యాన్ని విశ్వబ్రాహ్మణ కులం వారు ఎదురుకొనేవారు. అందుకే వారు జందెం వేసికొని ఆచార్యులని పేరు పెట్టుకొనేవారు. అదృష్ట వశాత్తు ఈ రోజు ఇవన్నీ లేవు అందుకు మనం సంతోషించాలి! ఇప్పుడు కుడి ఎడమైతే పొరపాటు లేదు.
విధేయుడు – మోహన
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి గిరి అభిప్రాయం:
03/03/2009 12:13 pm
బాబ్జీలు గారి అభిప్రాయాలతో పేచీ పడేంత చదువు నాకు లేదు. కానీ వారన్న పై మాట నాకు అర్ధం కాలేదు. ఈ పుస్తకం ప్రచురించడానికి తోడ్పడి కొడవళ్ళ గారు హాని చేశారనా? ఎవరికి?ఈ పుస్తకం ప్రచురించడం చెడు పనా? ఏది చెడు, ఎవరు దానికి మంచి చేస్తున్నారు? పోనీ వేరే పుస్తకాలేమన్నా అచ్చేస్తే మంచికి మంచి జరిగేట్టయితే ఉదాహరణలేమన్నా చెబ్తారా? ఈ మంచి చెడుల ప్రస్తావన నాకు అంతుబట్టలేదు.
ఏమనుకోకపోతే ఇంకో చిన్నమాట – పైమాట ఒక్కటే కాదు. చాలా సార్లు వారు దేనిగురించి మాట్లాడుతున్నారో అర్ధం కాదు. వారి ఉద్దేశాలు అంతుపట్టవు. బాబ్జీలు గారి అభిప్రాయాల్ని ఉత్సాహంగా చదివి అర్ధం అయినంతమటుకూ ఆనందించే ఈమాట పాఠకుల్లో నేనూ ఒకణ్ణి. అందువల్ల వారు చెప్పదలచుకున్నది వారి ‘ధోరణి’ లో కాకుండా సరళంగా చెబితే నాబోటి వాళ్ళకు అర్ధమౌతుందని, నా చిన్న రిక్వెస్టు. అన్యధా భావించరని ఆశిస్తున్నాను.
– గిరి
కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
03/03/2009 11:21 am