తరువు నుండి పుట్టిన రోకటి పాట యొక్క ఛందం __ తరువోజ అన్న అన్వయం చాలా బాగుంది. చదివేదాకా తట్టలేదు. ఈ మధ్యనే అక్కిరాజు రమాపతిరావుగారు “తన మయం అయింది” కాబట్టే ‘తన్మయం’
అయిందేమో అనడం కూడా ఆశ్చర్యపరచింది.
**
పాఠకులు వ్యక్తం చేయవలసింది ఇతరుల అభిప్రాయలగురించి కాదంటూనే ఇంకొన్ని అభిప్రాయలు చేరుస్తున్నాం! Pattern, లాగా కాక, ఎప్పుడో కొన్ని అక్షరాలు చేజారినందుకు, అంతకు మించిన అక్షరాలను, కాదు అక్షింతలను వేయడం సహృదయంకాదు. నొచ్చిన వారినింకా నొప్పించడమే అనిపిస్తుంది.
‘ఈ మాట ‘కు ఉన్న మాట చెప్పుకోవాలి. సంపాదనేమీ పొందని సంపాదకులు, (అసలు ‘సంపాదకు’లని ఎందుకంటారో? పదం చదివినప్పుడల్లా తమాషా చేస్తున్నట్లనిపిస్తుంది నాకైతే వారిని!) రాబడి రాని రచయితలు, పనిలేనప్పుడు చదువుకునే పాఠకులు చేరే చోటలో, కొంత సహృదయపూర్వక సర్దుబాటుకు మించిన ప్రమాణాలేముంటాయో తెలియదు, నాకైతే.
===
విధేయుడు
-Srinivas
గూగుల్లో తెలుగు పుస్తకాలు లేవు అనడానికి కారణం బహుశా హైదరాబాదులో ఉండే విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల పుస్తకాలు DLIలో డిజిటైసు చేయబడుతున్నాయి. బెంగళూరు, హైదరాబాదు DLIలలో, archive.orgలో ఉండే తెలుగు పురాతన సాహిత్య గ్రంథాలు అందరి అందుబాటులో మరెక్కడా ఈ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు. సాహిత్యంలో ఆసక్తి ఉండేవాళ్లు ఇక్కడికి వెళ్లి డవున్లోడ్ చేసికోవచ్చు. నా ఉద్దేశంలో తెలుగు సాహిత్యంపైన
పరిశోధన చేయాలనుకొనేవాళ్లకు (అక్కడా, ఇక్కడా) ఇవి కల్పవృక్షాలు. గూగుల్ చేయలేదని కన్నీళ్లు కార్చడంకన్నా ఈ DLIలను ఎలా ముందుకు తేవాలో దానికి ఇక్కడి వాళ్లు ఎలా సహాయం చేయడానికి వీలవుతుందో అని చర్చిస్తే బాగుంటుంది.
విధేయుడు – మోహన
బాబ్జీలు గారూ ! సాహిత్యం ఒక్కటే ఉంటుంది. అది చదివినప్పుడు మనసుకి సుఖాన్నివ్వాలి అంతే!! మంచి సాహిత్యానికి అదే గుర్తు. అది కవిత్వమైనా..కధ అయినా!! కధకుల్ని కవులు చిన్న చూపు చూస్తారన్నది దేని ఆధారంగా మీరు అంత సునాయాసంగా అనీసిందీ ..అభాండాలు వేసిందీ నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే నిజమైతే రావిశాస్త్రి..శ్రీశ్రీ కి అంత అభిమానిగా ఉండగలిగేవారా?? కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ కి ..కాశీభట్ల వేణుగోపాల్ ‘ తపన’ కీ జయప్రభ గారు ముందుమాట రాసేవారా?
కవిత్వం చదివినప్పుడు కలిగే అనుభవం భిన్నమైంది. క్లుప్తంగా ఉంటూనే గాఢంగా మనసు మీద ఒక ముద్ర వేయగలదు కవిత్వం.నేను చెప్పేది మంచి పోయెమ్ గురించి. మంచి కధ కూడా చాలా ఆలోచనల్ని రేకెత్తించగలదు. తెలుగులో ఈ గాడత పరిధిలోకి వచ్చే కవులు.. రచయితలు..అన్ని కాలాల్లోనూ కొందరే !!
సిధ్ధాంతాలు సృజనకి ప్రేరణనిస్తాయి. అదే లేకపోతే గోర్కీ..’అమ్మ’ వచ్చేదే కాదు. సిధ్ధాంతాన్ని సృజనాత్మక సాహిత్యం ఎలా ప్రతిఫలించాలి అన్న విషయంలో తెలుగులో రావిశాస్త్రీ..కాళీపట్నం…చాసో…కేశవరెడ్డి వంటి వారిలో తప్ప మిగిలిన అనేకుల్లో ఏ స్పష్టతా కనిపించదు.ఫెమినిస్టుల కధల్లోనూ ఇది ఉంది. బ హుశా యదుకులభూషణ్ గారి కోపం వెనక ఉద్దేశ్యం ఇదే కావొచ్చు.మీరు ‘విరసం’ ప్రభావాన్ని గురించి అన్న నిష్టూరం కూడా ఇదే కావొచ్చు. అప్పటికీ తప్పు సిధ్ధాంతాలదే కాలేదు. సృజన లేమి ఉన్న వాళ్ళు చేసే రచనలకి సిధ్ధాంతాలూ..సంస్థలూ బాధ్యత ఎంత వరకూ తీసుకోగలవూ?? వాళ్ళు మేలైన రచయితల్ని ఆకట్టుకోలేకపోయి ఉండొచ్చును కదా? ఖాదిర్ బాబు ఏ సిధ్ధాంత చట్రాలకీ లోబడకుండా మంచి కధలు రాస్తున్నాడు కదా?ఇదే దృష్టాంతం.
అందువల్ల నా అభిప్రాయం మంచి కవుల్నీ, కధకుల్నీ సిధ్ధాంతాలు తయారుచేయవు. అలాగే చంపవు.
రమ.
అభిప్రాయాలకు సంబంధించి ఒక విషయం చెప్పడం మరిచాను.ఈమాట ప్రమాణాలకు సరితూగని అభిప్రాయాలను పూర్తిగా వేయకపోవడమే మంచిది. అలాకాక, సంపాదకులు కత్తిరిస్తారులే అన్న భావం పాఠకులకు కలిగిస్తే ఇష్టానుసారం
రాస్తారు.పాఠకుల అభిప్రాయాలను ఎడిట్ చేయడం కూడా అంత సులువైన పనేమీ కాదు..అలానే,పెద్దలు వేమూరి గారు సెలవిచ్చినట్టు- (“ఇదే విధంగా రచనాంశం (content) ని స్వయంప్రపత్తితో, రచయితతో సంప్రదించకుండా మార్చే హక్కు ఏ సంపాదకుడికీ లేదు.” రచయితలు-ఎడిటర్లు- జనవరి 2009). పాఠకులతో సంప్రదించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఉదాహరణకు ఎడిట్ చేయబడ్డ పెద్దలు మాగంటి(www.maganti.org) గారి అభిప్రాయంలో (ఎమర్జెన్సీ కాలపు వార్తాపత్రికలోని నలుపు చేసిన columnsలా ఉన్నవి మనకు తెలియవు)“తాత్పర్యమే లేదు వెంకోజీ” అన్న వాక్యం అస్సలు అతకలేదు. ఇలా అతికీ అతకని వాక్యాలు ప్రచురించడం కన్నా సదరు అభిప్రాయాలను పూర్తిగా తొలగించడమే మేలు.
సంపాదకీయం అంటే పత్రిక లేదా పత్రిక నడిపే వారి ఆభిప్రాయాలను వెల్లడి జేయడం. సంపాదకీయాలు, Routine వ్యాసాలకి భిన్నంగా ఉండాలి. ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది. అభిప్రాయ వ్యక్తీకరణే కాబట్టి, చారిత్రక రుజువులతో పని లేదు. ఈ పరిధిలోకి ఇమడక పోతే, సంపాదకీయం అన్న పేరు తొలగించి మామూలు వ్యాసంగా ప్రకటించడమే సబబు.
సీతారామయ్యగారూ, ఇప్పుడు మంచి కథలు రావటం లేదని నా అభిప్రాయం కాదు. కిందటి ఆదివారం ఖదీర్ బాబు రాసిన మంచి కథ చదివేను ఒక ఆదివారం అనుబంధంలో. కేశవరెడ్డి గారి మునెమ్మ, చివరిగుడిశె లాటి కథలూ వచ్చేయి ఈ మధ్యనే. పసలపూడి కథలూ వచ్చేయి. డెభ్భైల తరవాత విరసం ప్రభావం వల్ల “రొటీను” కథలు ఎక్కువైపోయేయి. కథలు రాసే వారి నిజాయితీ కథలో కనబడదు. అదీ నా వ్యధ. ఇంకొహ విషయం కథలు రాసీవారంటే కవులకూ, నవలా రచయిత(త్రు)లకూ, విమర్శకులకూ ఆఖరికి చదివే వాళ్ళకూ చిన్న చూపు కదా? అప్పుడూ ఇప్పుడూ కూడాను.
ఈ వ్యాసం మీద అభిప్రాయం వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు.
బాబ్జీలు గారూ, మంచి కథలు రావిశాస్త్రి, కుటుంబరావులతోనే ఆగిపోయాయనీ, తర్వాత మంచి కథలు రాకపోవటానికి కారణం విరసం అనే అభిప్రాయాలతో నేను ఏకీభవించను. మంచి కథలు ఇప్పుడూ వస్తున్నాయి. విరసానికి ముందుకూడా వ్యాసాల్లాగా కథలు రాసిన వారున్నారు. ఎప్పటికప్పుడు పాతరోజుల్లో మంచి కథలుండేవి అనుకోవటం మనకే కాదు, ఇతర భాషల్లో కూడా కనిపిస్తుంది. అది మానవ సహజమేమో.
వంశీ గారు, ఈ వ్యాసం “రంజింప చేయటంలో కొద్దిగా వెనక పడింది” అన్నారు. సహృదయంతో కొద్దిగా అన్నారు! మీ అభిప్రాయం నాకు అర్థమయింది. నిజానికి ఈ వ్యాసం మీకు కొద్దిగా నచ్చినా దానికి కారణం ఈమాట వారి రివ్యూవర్సే. లోపాలు మాత్రం నావి.
సాయి బ్రహ్మానందం గారూ, నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కాని, నాకు తెలిసినంతవరకు, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ లో చేసే కథనాన్ని తెలుగులో ఉత్తమ పురుష అంటారు. అలాంటి కథల్లో కథకుడి ఆలోచనలు తప్ప ఇతర పాత్రల ఆలోచనల గురించి రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రథమ పురుష కథనంలో రచయితో లేక మరో కథకుడో కథ చెప్తాడు కాబట్టి అన్ని పాత్రల ఆలోచనల గురించీ రాయటానికి అవకాశం ఉంటుంది. పాత్రల ప్రవర్తన చిత్రించటం ద్వారా కథ నడపాలనీ, వాళ్ళ మనోగతాల గురించి ఎక్కువగా రాయటం అంత మంచిది కాదనీ నా అభిప్రాయం. అదీగాక, నేను ముఖ్యంగా చెప్పదలిచింది, స్వంత అభిప్రాయాలను వ్యక్తీకరించటానికే కథ నడిపినట్లు బాహాటంగానే కనిపిస్తే, వీలయిన (కాకపోయినా) ప్రతిచోటా రచయితే వ్యాఖ్యానం చేస్తే, కథ పేలవంగా ఉంటుందని.
భూషణ్ గారూ, ధన్యవాదాలు. అవును, వాతావరణ కల్పన ఉజ్వలంగా ఉన్న కథలు చదవటం ముగించిన తర్వాత కూడా మనసులో ఉంటాయి.
Suresh gaaru,
Your article is an excellent insight into the origins of internet and eemaata. By using the quotations of telugu writers you have created a genuine telugu work.
Wouldn’t it be a nice idea to encourage famous telugu people to treasure their memories on Eeemata for the future generations?.
Best wishes.
Sudhakar
నన్నెచోడుని క్రౌంచపదము గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
03/15/2009 10:01 am
తరువు నుండి పుట్టిన రోకటి పాట యొక్క ఛందం __ తరువోజ అన్న అన్వయం చాలా బాగుంది. చదివేదాకా తట్టలేదు. ఈ మధ్యనే అక్కిరాజు రమాపతిరావుగారు “తన మయం అయింది” కాబట్టే ‘తన్మయం’
అయిందేమో అనడం కూడా ఆశ్చర్యపరచింది.
**
పాఠకులు వ్యక్తం చేయవలసింది ఇతరుల అభిప్రాయలగురించి కాదంటూనే ఇంకొన్ని అభిప్రాయలు చేరుస్తున్నాం! Pattern, లాగా కాక, ఎప్పుడో కొన్ని అక్షరాలు చేజారినందుకు, అంతకు మించిన అక్షరాలను, కాదు అక్షింతలను వేయడం సహృదయంకాదు. నొచ్చిన వారినింకా నొప్పించడమే అనిపిస్తుంది.
‘ఈ మాట ‘కు ఉన్న మాట చెప్పుకోవాలి. సంపాదనేమీ పొందని సంపాదకులు, (అసలు ‘సంపాదకు’లని ఎందుకంటారో? పదం చదివినప్పుడల్లా తమాషా చేస్తున్నట్లనిపిస్తుంది నాకైతే వారిని!) రాబడి రాని రచయితలు, పనిలేనప్పుడు చదువుకునే పాఠకులు చేరే చోటలో, కొంత సహృదయపూర్వక సర్దుబాటుకు మించిన ప్రమాణాలేముంటాయో తెలియదు, నాకైతే.
===
విధేయుడు
-Srinivas
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి mOhana అభిప్రాయం:
03/15/2009 7:25 am
గూగుల్లో తెలుగు పుస్తకాలు లేవు అనడానికి కారణం బహుశా హైదరాబాదులో ఉండే విశ్వవిద్యాలయాల గ్రంథాలయాల పుస్తకాలు DLIలో డిజిటైసు చేయబడుతున్నాయి. బెంగళూరు, హైదరాబాదు DLIలలో, archive.orgలో ఉండే తెలుగు పురాతన సాహిత్య గ్రంథాలు అందరి అందుబాటులో మరెక్కడా ఈ ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు. సాహిత్యంలో ఆసక్తి ఉండేవాళ్లు ఇక్కడికి వెళ్లి డవున్లోడ్ చేసికోవచ్చు. నా ఉద్దేశంలో తెలుగు సాహిత్యంపైన
పరిశోధన చేయాలనుకొనేవాళ్లకు (అక్కడా, ఇక్కడా) ఇవి కల్పవృక్షాలు. గూగుల్ చేయలేదని కన్నీళ్లు కార్చడంకన్నా ఈ DLIలను ఎలా ముందుకు తేవాలో దానికి ఇక్కడి వాళ్లు ఎలా సహాయం చేయడానికి వీలవుతుందో అని చర్చిస్తే బాగుంటుంది.
విధేయుడు – మోహన
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి baabjeelu అభిప్రాయం:
03/15/2009 7:02 am
ఈ మాట కి సంపాదకీయం అవసరవాఁ?
కథ దేని గురించి? గురించి rama bharadwaj అభిప్రాయం:
03/14/2009 10:33 pm
బాబ్జీలు గారూ ! సాహిత్యం ఒక్కటే ఉంటుంది. అది చదివినప్పుడు మనసుకి సుఖాన్నివ్వాలి అంతే!! మంచి సాహిత్యానికి అదే గుర్తు. అది కవిత్వమైనా..కధ అయినా!! కధకుల్ని కవులు చిన్న చూపు చూస్తారన్నది దేని ఆధారంగా మీరు అంత సునాయాసంగా అనీసిందీ ..అభాండాలు వేసిందీ నాకు ఆశ్చర్యంగా ఉంది. అదే నిజమైతే రావిశాస్త్రి..శ్రీశ్రీ కి అంత అభిమానిగా ఉండగలిగేవారా?? కేశవరెడ్డి గారి ‘మునెమ్మ’ కి ..కాశీభట్ల వేణుగోపాల్ ‘ తపన’ కీ జయప్రభ గారు ముందుమాట రాసేవారా?
కవిత్వం చదివినప్పుడు కలిగే అనుభవం భిన్నమైంది. క్లుప్తంగా ఉంటూనే గాఢంగా మనసు మీద ఒక ముద్ర వేయగలదు కవిత్వం.నేను చెప్పేది మంచి పోయెమ్ గురించి. మంచి కధ కూడా చాలా ఆలోచనల్ని రేకెత్తించగలదు. తెలుగులో ఈ గాడత పరిధిలోకి వచ్చే కవులు.. రచయితలు..అన్ని కాలాల్లోనూ కొందరే !!
సిధ్ధాంతాలు సృజనకి ప్రేరణనిస్తాయి. అదే లేకపోతే గోర్కీ..’అమ్మ’ వచ్చేదే కాదు. సిధ్ధాంతాన్ని సృజనాత్మక సాహిత్యం ఎలా ప్రతిఫలించాలి అన్న విషయంలో తెలుగులో రావిశాస్త్రీ..కాళీపట్నం…చాసో…కేశవరెడ్డి వంటి వారిలో తప్ప మిగిలిన అనేకుల్లో ఏ స్పష్టతా కనిపించదు.ఫెమినిస్టుల కధల్లోనూ ఇది ఉంది. బ హుశా యదుకులభూషణ్ గారి కోపం వెనక ఉద్దేశ్యం ఇదే కావొచ్చు.మీరు ‘విరసం’ ప్రభావాన్ని గురించి అన్న నిష్టూరం కూడా ఇదే కావొచ్చు. అప్పటికీ తప్పు సిధ్ధాంతాలదే కాలేదు. సృజన లేమి ఉన్న వాళ్ళు చేసే రచనలకి సిధ్ధాంతాలూ..సంస్థలూ బాధ్యత ఎంత వరకూ తీసుకోగలవూ?? వాళ్ళు మేలైన రచయితల్ని ఆకట్టుకోలేకపోయి ఉండొచ్చును కదా? ఖాదిర్ బాబు ఏ సిధ్ధాంత చట్రాలకీ లోబడకుండా మంచి కధలు రాస్తున్నాడు కదా?ఇదే దృష్టాంతం.
అందువల్ల నా అభిప్రాయం మంచి కవుల్నీ, కధకుల్నీ సిధ్ధాంతాలు తయారుచేయవు. అలాగే చంపవు.
రమ.
నన్నెచోడుని క్రౌంచపదము గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:
03/14/2009 8:14 pm
అభిప్రాయాలకు సంబంధించి ఒక విషయం చెప్పడం మరిచాను.ఈమాట ప్రమాణాలకు సరితూగని అభిప్రాయాలను పూర్తిగా వేయకపోవడమే మంచిది. అలాకాక, సంపాదకులు కత్తిరిస్తారులే అన్న భావం పాఠకులకు కలిగిస్తే ఇష్టానుసారం
రాస్తారు.పాఠకుల అభిప్రాయాలను ఎడిట్ చేయడం కూడా అంత సులువైన పనేమీ కాదు..అలానే,పెద్దలు వేమూరి గారు సెలవిచ్చినట్టు- (“ఇదే విధంగా రచనాంశం (content) ని స్వయంప్రపత్తితో, రచయితతో సంప్రదించకుండా మార్చే హక్కు ఏ సంపాదకుడికీ లేదు.” రచయితలు-ఎడిటర్లు- జనవరి 2009). పాఠకులతో సంప్రదించడం చాలా శ్రమతో కూడుకున్న పని. ఉదాహరణకు ఎడిట్ చేయబడ్డ పెద్దలు మాగంటి(www.maganti.org) గారి అభిప్రాయంలో (ఎమర్జెన్సీ కాలపు వార్తాపత్రికలోని నలుపు చేసిన columnsలా ఉన్నవి మనకు తెలియవు)“తాత్పర్యమే లేదు వెంకోజీ” అన్న వాక్యం అస్సలు అతకలేదు. ఇలా అతికీ అతకని వాక్యాలు ప్రచురించడం కన్నా సదరు అభిప్రాయాలను పూర్తిగా తొలగించడమే మేలు.
గరికపాటి పవన్ కుమార్
ముగ్గురు ముసలమ్మలు గురించి అక్కిరాజు భట్టిప్రోలు అభిప్రాయం:
03/14/2009 12:56 pm
ఈ కథ గురించి నా బ్లాగులో చర్చించాను గమనించండి.
http://after3beers.com/teluguhome/?p=165
అక్కిరాజు
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి పవన్ కుమార్ గరికపాటి అభిప్రాయం:
03/14/2009 10:24 am
సంపాదకీయం అంటే పత్రిక లేదా పత్రిక నడిపే వారి ఆభిప్రాయాలను వెల్లడి జేయడం. సంపాదకీయాలు, Routine వ్యాసాలకి భిన్నంగా ఉండాలి. ఎంత క్లుప్తంగా ఉంటే అంత మంచిది. అభిప్రాయ వ్యక్తీకరణే కాబట్టి, చారిత్రక రుజువులతో పని లేదు. ఈ పరిధిలోకి ఇమడక పోతే, సంపాదకీయం అన్న పేరు తొలగించి మామూలు వ్యాసంగా ప్రకటించడమే సబబు.
గరికపాటి పవన్ కుమార్.
కథ దేని గురించి? గురించి baabjeelu అభిప్రాయం:
03/14/2009 8:29 am
సీతారామయ్యగారూ, ఇప్పుడు మంచి కథలు రావటం లేదని నా అభిప్రాయం కాదు. కిందటి ఆదివారం ఖదీర్ బాబు రాసిన మంచి కథ చదివేను ఒక ఆదివారం అనుబంధంలో. కేశవరెడ్డి గారి మునెమ్మ, చివరిగుడిశె లాటి కథలూ వచ్చేయి ఈ మధ్యనే. పసలపూడి కథలూ వచ్చేయి. డెభ్భైల తరవాత విరసం ప్రభావం వల్ల “రొటీను” కథలు ఎక్కువైపోయేయి. కథలు రాసే వారి నిజాయితీ కథలో కనబడదు. అదీ నా వ్యధ. ఇంకొహ విషయం కథలు రాసీవారంటే కవులకూ, నవలా రచయిత(త్రు)లకూ, విమర్శకులకూ ఆఖరికి చదివే వాళ్ళకూ చిన్న చూపు కదా? అప్పుడూ ఇప్పుడూ కూడాను.
కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య అభిప్రాయం:
03/14/2009 5:32 am
ఈ వ్యాసం మీద అభిప్రాయం వ్యక్తం చేసిన వారందరికీ ధన్యవాదాలు.
బాబ్జీలు గారూ, మంచి కథలు రావిశాస్త్రి, కుటుంబరావులతోనే ఆగిపోయాయనీ, తర్వాత మంచి కథలు రాకపోవటానికి కారణం విరసం అనే అభిప్రాయాలతో నేను ఏకీభవించను. మంచి కథలు ఇప్పుడూ వస్తున్నాయి. విరసానికి ముందుకూడా వ్యాసాల్లాగా కథలు రాసిన వారున్నారు. ఎప్పటికప్పుడు పాతరోజుల్లో మంచి కథలుండేవి అనుకోవటం మనకే కాదు, ఇతర భాషల్లో కూడా కనిపిస్తుంది. అది మానవ సహజమేమో.
వంశీ గారు, ఈ వ్యాసం “రంజింప చేయటంలో కొద్దిగా వెనక పడింది” అన్నారు. సహృదయంతో కొద్దిగా అన్నారు! మీ అభిప్రాయం నాకు అర్థమయింది. నిజానికి ఈ వ్యాసం మీకు కొద్దిగా నచ్చినా దానికి కారణం ఈమాట వారి రివ్యూవర్సే. లోపాలు మాత్రం నావి.
సాయి బ్రహ్మానందం గారూ, నేను పొరపాటు చేసి ఉండవచ్చు, కాని, నాకు తెలిసినంతవరకు, ఇంగ్లీషులో ఫస్ట్ పర్సన్ లో చేసే కథనాన్ని తెలుగులో ఉత్తమ పురుష అంటారు. అలాంటి కథల్లో కథకుడి ఆలోచనలు తప్ప ఇతర పాత్రల ఆలోచనల గురించి రాస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. ప్రథమ పురుష కథనంలో రచయితో లేక మరో కథకుడో కథ చెప్తాడు కాబట్టి అన్ని పాత్రల ఆలోచనల గురించీ రాయటానికి అవకాశం ఉంటుంది. పాత్రల ప్రవర్తన చిత్రించటం ద్వారా కథ నడపాలనీ, వాళ్ళ మనోగతాల గురించి ఎక్కువగా రాయటం అంత మంచిది కాదనీ నా అభిప్రాయం. అదీగాక, నేను ముఖ్యంగా చెప్పదలిచింది, స్వంత అభిప్రాయాలను వ్యక్తీకరించటానికే కథ నడిపినట్లు బాహాటంగానే కనిపిస్తే, వీలయిన (కాకపోయినా) ప్రతిచోటా రచయితే వ్యాఖ్యానం చేస్తే, కథ పేలవంగా ఉంటుందని.
భూషణ్ గారూ, ధన్యవాదాలు. అవును, వాతావరణ కల్పన ఉజ్వలంగా ఉన్న కథలు చదవటం ముగించిన తర్వాత కూడా మనసులో ఉంటాయి.
ఈమాట పూర్వాపరాలు – నా జ్ఞాపకాలు I గురించి Sudhakar అభిప్రాయం:
03/14/2009 2:31 am