చెప్పటం మర్చిపోయాను. ఈ వ్యాసం నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా సెప్టెంబర్ లో డిట్రాయట్ కు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మా డిటియల్సీ తరఫున శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ ల శతజయంతి ఉత్సవం జరుపుతున్నాం (సెప్టెంబర్ 26, 27). మీరందరూ వచ్చారంటే ఈ వ్యాసం నచ్చలేదని నాకు ముఖం మీదే చెప్పొచ్చు, కథల గురించి చాలా కబుర్లు చెప్పుకోవచ్చు, నాకంటే వ్యాసాలు బాగా రాసే వారిని చాలా మందిని కలవొచ్చు. ఏమంటారూ? వస్తారు కదూ.
రవికిరణ్ గారూ,
నేన్రాసిన నిజాయితీ, కథలోని వస్తువుమీద రచయితకున్న నిజాయితీ. రచయిత బతుకు గురించి కాదు.
విరసం వల్ల మంచి కథకులు ఎవరూ తయారవలేదని నా నమ్మకం. విరసం వల్ల రచయితలూ మరియూ కళాకారులూ “ఫారం కోడిపెట్టల్లా” తయారయేరని నా అనుమానం. విరసం వల్లే విరసపు సాహిత్యం తప్ప మిగిలిన సాహిత్యవంతా అంటరానిదనీ, ముట్టుకుంటే దేవిడీమన్నా అనుకునే తత్వం ప్రబలిపోయిందని నా నమ్మకం. మహానుభావులందరూ వొప్పుకున్న కథకుండవలసిన “చదివించే గుణం” చెట్టెక్కిపోయిందని నానమ్మకం. ఇవన్నీ అపనమ్మకాలయితే చాలా సంతోషం.
మిత్రులారా, ఒక్క విషయం. ఈ కథ ఆత్మహత్య గురించి కానే కాదు. ప్రకృతిలో లీనమై పోవాలన్న ఒక తీవ్రమైన కోరికలోంచి వచ్చిన తాదాత్మ్యపు ఆలొచనా ధారగా నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నపుడు భగవంతం, నేను కొన్ని సమయాల్లో కలిసే ఉన్నాం. ఇదొక అలోచనా ధారకు అక్షర రూపం, కొన్ని విషయాలను ఏ అక్షరం ప్రకటింప చేయగలగదు. కథ చివర్లో అర్ధం కావట్లెదు అన్నది, భాషకి అందని ఎక్స్‌ప్రెషన్ అని భావన. ఎంతైనా కథా రచయిత కథని చాలా సమర్ధవంతంగా నడిపించాడు. కథలో కవిత్వం నిబిడీకృతమైఉంది.
ఈగ హనుమాన్
వెంకటేశ్వర రావు గారు ,
నేను కూడా చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాడినే. కానీ గణన యంత్రం (కంప్యూటర్) కనిపెట్టినప్పుడు దాని వలన దుష్ఫలితాలు ఉన్నాయని తెలిసినా దాన్ని వాడల్సినటువంటి పరిస్థితి ఎలా కలిగిందో , రేపు ఈ Digitalization కూడా అంతే. మన కాలం వాళ్ళు దీనిని జిర్నించుకోవడం కష్టం కానీ, రాబోయే తరాల వారికీ అంతా గణన యంత్రమే. (ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ , నాన్న ,కంప్యూటర్ అన్నమాట ).
నమస్కారం
ఇట్లాంటివి చదవడానికే ఓపిక, సమయం పడితే, వ్రాయడానికింకెంత ఓపిక, పరిశ్రమ,పరిశోధన ముఖ్యంగా విషయంపై విశేషమైన ఆసక్తి ఉండాలో, కాదు ఉంటేనే తప్ప ఇట్లాంటివి వ్రాయడం సాధ్యం కాదు అనిపిస్తుంది.
“వేణు గాన లోలుని కన వేయి కనులు కావలెనే” అన్నది త్యాగరాజ కృతి అని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాను. సుశీలగారి కమ్మని గళంలో ఉన్న సినిమా పాట “వేణు గాన లోలుని గన వేయి కనులు చాలవులే” అన్నదానికి త్యాగరాజు కృతి ప్రేరకమే అయినప్పటికినీ, ‘వేయి కన్నులు కావలెనే’, అనడంకంటే, ‘వేయికను(లైనా) చాలవులే’ అని ఎంతో రసరమ్యంగా రాసారు రచయిత ఎవరో _ సినారె/ఆత్రేయ/ఆరుద్ర?!!
త్యాగరాజుకు పూర్వులు, సమకాలీనులు, తెలుగు సంస్కృతాలలోనే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే, (నాకు) తెలిసినంతలో ఎంతోమంది మహానుభావులు, పూర్వకవులను స్తుతించడం, ఇతరులకు కృతజ్ఞతలందించడం లాంటివి ఉన్నా, “ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని అంత సింపుల్గా, స్పష్టంగా, సాత్వికంగా, సువర్ణానికి సువాసనబ్బినట్లు, సంగీతపరంగా గళమెత్తి పలికింది, పాడింది ఒక్క త్యాగరాజే అనుకుంటాను. ఎన్నో వివరాలందించినందుకు వందనాలు.
====
విధేయుడు
-Srinivas
బాబ్జీలు మొషోయ్,
I quote your words: “పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.” ఇవి బాబాగారి అభిప్రాయమ్మీద తమరుగారు వెలువరించిన అభిప్రాయం కాదా? ఇట్టాంటి పుంజీడు వ్యాఖ్యల్ని చూస్తే గరికపాటి వారికి బాధ కలగదా?
అయినా కవితాత్మని ఎవరో ఎందుకు ఆవిష్కరించాలి? కవి చెప్పాల్సింది చెప్పాడు. ఆవిష్కరించాల్సిందేదో ఆయనే ఆవిష్కరించాడు (దాచి ఉంచాల్సిందాన్ని చూపించేశాడనే గదా, అస్లీలం అని మొత్తుకునేది జనాలు). ఆ ఆవిష్కరించింది ఆత్మకాదు, అది దెయ్యం బూతం పిశాచం అని కొందరు సహృదయులు సెర్టిఫై చేసేశారు గదా. తమరుగారికి తృప్తికాలేదా? హబ్భే, మీరనవసరంగా దాన్నొక కొరివిదయ్యమని భయపడుతున్నారు, అది ఒక దీపమే అని చూపించడానికి ప్రయత్నించిన బొల్లోజుబాబా మీద పుంజీడు పేణ్ణీళ్ళు చల్లింది తమరుగారు కాదా? ఇంకా యేల ఈ ఆత్మల వేట?
ముందుగా బాబ్జీలు గారికి – ఈ మాత్రానికి కాపీ అనుకోనక్కర్లేదు. ఆనందభైరవి, మధ్యమావతి, సురటి, ఇలాంటి రాగఛ్ఛాయలున్న సాంప్రదాయక పాటలు (స్త్రీల పాటలు లాలి పాటలు ఇత్యాది) బోలెడున్నాయి. త్యాగరాజు ఉత్సవ సాంప్రదాయ కృతుల్నీ, దివ్యనామ సంకీర్తనల్నీ ఇదే ఉద్దేశంతో (సంగీతం నేర్చుకోని వాళ్ళయినా పాడుకోగలిగేట్టు) రాశారని నా నమ్మకం. అంచేత ఇటువంటి సాంప్రదాయ బాణీలు కొన్ని ఈ కృతుల్లో కనిపిస్తాయి.
సాయిబ్రహ్మానందం గారూ – మీరు మళ్ళీ పొరబడ్డారని చెప్పడానికి విచారిస్తున్నాను. త్యాగరాజ కృతుల్లో రెండో అక్షర ప్రాస రెండు విడతలుగా అమలు అవుతుంది. పల్లవికీ అనుపల్లవికీ కలిపి ఒక ప్రాస. చరణానికి ఇంకో ప్రాస. ఒకటికంటే ఎక్కువ చరణాలుంటే ప్రతి చరణానికీ వేరే ప్రాస ఉండొచ్చు. కొన్ని కృతుల్లో పల్లవిలో ఉపయోగించిన ప్రాసనే చరణంలోనూ వాడ్డం ఉంది. ఉదా:
పల్లవి: ఎందరో మహానుభావులు; అను: చందురూ వర్ణుని
పల్లవి: నను పాలింప; అను: వనజ నయన
పాట అంతా ఒకటే ప్రాస: పల్లవి: నగుమోము గనలేని; అను: నగరాజ ధర; చరణం: ఖగరాజు, గగనానికి, జగమేలే, వగ జూపకు
ఇక, ఒక తాళ ఆవృత్తము = ఒక పాదము అనే సూత్రం. నగుమోమునే తీసుకోండి. పల్లవీ అనుపల్లవీ కూడా ఆదితాళంలో రెండేసి ఆవృత్తాలు పడతాయి. కానీ పాదం ఒక్కటే.
మీరు మొదట ఉదహరించిన వాసుదేవయని కృతి యైనా అంతే. చరణంలోనూ అంతే. ఒక్కో పాదమూ రెండేసి ఆవృత్తాలు సాగుతుంది. అదే రెండుకళల చౌక పద్ధతిలో పాడారనుకోండి, ఈ పాదం మొత్తమూ ఒక తాళ ఆవృత్తంలోనే ఇముడుతుంది. సాహిత్యపు వరుసకీ తాళానికీ ఉన్న సంబంధం సాపేక్షమే గానీ అబ్సొల్యూటు కాదుగదా. నా ఉద్దేశంలో చివరికి పాదం ఎక్కడ అంతమైంది అనేది ఆయా కృతిలో అనుసరించిన ఛందస్సుని బట్టి ఉంటుంది. ఇక ఆయన రాసిన కొన్ని పద్యాల్లో ఛందస్సు సరిపోలేదన్న మూలాన త్యాగరాజు ఛందస్సుని పట్టించుకోలేదనే వ్యాఖ్య కూడా పేలవంగా కనిపిస్తుంది. శాస్త్రాలు ఏమీ చదువుకోని నేనే రాయగలను అర్ధవంతమైన కందపద్యాలూ, సీసపద్యాలూ. సంస్కృతాంధ్రాల్లో పండితుడైన త్యాగరాజు ఆమాత్రం సీస పద్యం ఛందోనియమాలన్నీ పాటిస్తూ రాయలేదనేది ఏమీ నమ్మేట్టుగా లేదు. మరి మన చేతికి అందిన ప్రతుల్లో ఆ తప్పులు ఎందుకు ఉన్నాయో పైవాడికి తెలియాలి.
కథ దేని గురించి? గురించి ఆరి సీతారామయ్య అభిప్రాయం:
03/21/2009 4:19 am
చెప్పటం మర్చిపోయాను. ఈ వ్యాసం నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా సెప్టెంబర్ లో డిట్రాయట్ కు రమ్మని ఆహ్వానిస్తున్నాను. మా డిటియల్సీ తరఫున శ్రీశ్రీ, కొకు, గోపీచంద్ ల శతజయంతి ఉత్సవం జరుపుతున్నాం (సెప్టెంబర్ 26, 27). మీరందరూ వచ్చారంటే ఈ వ్యాసం నచ్చలేదని నాకు ముఖం మీదే చెప్పొచ్చు, కథల గురించి చాలా కబుర్లు చెప్పుకోవచ్చు, నాకంటే వ్యాసాలు బాగా రాసే వారిని చాలా మందిని కలవొచ్చు. ఏమంటారూ? వస్తారు కదూ.
విశ్వగుణాదర్శ కావ్యపరిచయం గురించి M.S.Prasad అభిప్రాయం:
03/21/2009 1:41 am
రమ గారికి చాలా కృతజ్ఞుడిని. నేను చెప్పాలనుకున్న భావాన్నిమీరుచాలా సమర్ధవంతంగా విస్ఫష్టంగా వెలువరించారు.
కథ దేని గురించి? గురించి baabjeelu అభిప్రాయం:
03/21/2009 12:57 am
రవికిరణ్ గారూ,
నేన్రాసిన నిజాయితీ, కథలోని వస్తువుమీద రచయితకున్న నిజాయితీ. రచయిత బతుకు గురించి కాదు.
విరసం వల్ల మంచి కథకులు ఎవరూ తయారవలేదని నా నమ్మకం. విరసం వల్ల రచయితలూ మరియూ కళాకారులూ “ఫారం కోడిపెట్టల్లా” తయారయేరని నా అనుమానం. విరసం వల్లే విరసపు సాహిత్యం తప్ప మిగిలిన సాహిత్యవంతా అంటరానిదనీ, ముట్టుకుంటే దేవిడీమన్నా అనుకునే తత్వం ప్రబలిపోయిందని నా నమ్మకం. మహానుభావులందరూ వొప్పుకున్న కథకుండవలసిన “చదివించే గుణం” చెట్టెక్కిపోయిందని నానమ్మకం. ఇవన్నీ అపనమ్మకాలయితే చాలా సంతోషం.
అతడు, నేను, అతడి కథ గురించి ega hanuman అభిప్రాయం:
03/20/2009 8:31 pm
మిత్రులారా, ఒక్క విషయం. ఈ కథ ఆత్మహత్య గురించి కానే కాదు. ప్రకృతిలో లీనమై పోవాలన్న ఒక తీవ్రమైన కోరికలోంచి వచ్చిన తాదాత్మ్యపు ఆలొచనా ధారగా నేను స్వీకరిస్తున్నా. ఎందుకంటే ఈ కథ రాస్తున్నపుడు భగవంతం, నేను కొన్ని సమయాల్లో కలిసే ఉన్నాం. ఇదొక అలోచనా ధారకు అక్షర రూపం, కొన్ని విషయాలను ఏ అక్షరం ప్రకటింప చేయగలగదు. కథ చివర్లో అర్ధం కావట్లెదు అన్నది, భాషకి అందని ఎక్స్‌ప్రెషన్ అని భావన. ఎంతైనా కథా రచయిత కథని చాలా సమర్ధవంతంగా నడిపించాడు. కథలో కవిత్వం నిబిడీకృతమైఉంది.
ఈగ హనుమాన్
ప్రపంచ సాహిత్యం – ప్రజాస్వామ్యీకరణం గురించి Rajesh అభిప్రాయం:
03/20/2009 2:04 pm
వెంకటేశ్వర రావు గారు ,
నేను కూడా చిన్నప్పటి నుండి పుస్తకాలు చదివే అలవాటు ఉన్న వాడినే. కానీ గణన యంత్రం (కంప్యూటర్) కనిపెట్టినప్పుడు దాని వలన దుష్ఫలితాలు ఉన్నాయని తెలిసినా దాన్ని వాడల్సినటువంటి పరిస్థితి ఎలా కలిగిందో , రేపు ఈ Digitalization కూడా అంతే. మన కాలం వాళ్ళు దీనిని జిర్నించుకోవడం కష్టం కానీ, రాబోయే తరాల వారికీ అంతా గణన యంత్రమే. (ఒక్క ముక్కలో చెప్పాలంటే అమ్మ , నాన్న ,కంప్యూటర్ అన్నమాట ).
3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి ravikiran timmireddy అభిప్రాయం:
03/20/2009 8:42 am
కావలి, నెల్లూరు జిల్లా.
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
03/20/2009 7:52 am
నమస్కారం
ఇట్లాంటివి చదవడానికే ఓపిక, సమయం పడితే, వ్రాయడానికింకెంత ఓపిక, పరిశ్రమ,పరిశోధన ముఖ్యంగా విషయంపై విశేషమైన ఆసక్తి ఉండాలో, కాదు ఉంటేనే తప్ప ఇట్లాంటివి వ్రాయడం సాధ్యం కాదు అనిపిస్తుంది.
“వేణు గాన లోలుని కన వేయి కనులు కావలెనే” అన్నది త్యాగరాజ కృతి అని తెలుసుకొని ఆశ్చర్యపడ్డాను. సుశీలగారి కమ్మని గళంలో ఉన్న సినిమా పాట “వేణు గాన లోలుని గన వేయి కనులు చాలవులే” అన్నదానికి త్యాగరాజు కృతి ప్రేరకమే అయినప్పటికినీ, ‘వేయి కన్నులు కావలెనే’, అనడంకంటే, ‘వేయికను(లైనా) చాలవులే’ అని ఎంతో రసరమ్యంగా రాసారు రచయిత ఎవరో _ సినారె/ఆత్రేయ/ఆరుద్ర?!!
త్యాగరాజుకు పూర్వులు, సమకాలీనులు, తెలుగు సంస్కృతాలలోనే కాదు, మొత్తం ప్రపంచ సాహిత్యంలోనే, (నాకు) తెలిసినంతలో ఎంతోమంది మహానుభావులు, పూర్వకవులను స్తుతించడం, ఇతరులకు కృతజ్ఞతలందించడం లాంటివి ఉన్నా, “ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు” అని అంత సింపుల్గా, స్పష్టంగా, సాత్వికంగా, సువర్ణానికి సువాసనబ్బినట్లు, సంగీతపరంగా గళమెత్తి పలికింది, పాడింది ఒక్క త్యాగరాజే అనుకుంటాను. ఎన్నో వివరాలందించినందుకు వందనాలు.
====
విధేయుడు
-Srinivas
బోడి పద్యం గురించి యుగంధర్ అభిప్రాయం:
03/20/2009 6:32 am
బాబ్జీలు మొషోయ్,
I quote your words: “పుంజీడు మంచి “ఇమేజెస్”మంచి కవిత్వాన్ని చెయ్యవు. పుంజీడు మంచి వాక్యాలు మంచి వ్యాసాన్ని చెయ్యలేవు. పుంజీడు మంచి “పేరాగ్రాఫులు” మంచి కథని అల్లలేవు. పుంజీడు మంచి “షాట్లు” మంచి సినిమాని తయారు చెయ్యలేవు.” ఇవి బాబాగారి అభిప్రాయమ్మీద తమరుగారు వెలువరించిన అభిప్రాయం కాదా? ఇట్టాంటి పుంజీడు వ్యాఖ్యల్ని చూస్తే గరికపాటి వారికి బాధ కలగదా?
అయినా కవితాత్మని ఎవరో ఎందుకు ఆవిష్కరించాలి? కవి చెప్పాల్సింది చెప్పాడు. ఆవిష్కరించాల్సిందేదో ఆయనే ఆవిష్కరించాడు (దాచి ఉంచాల్సిందాన్ని చూపించేశాడనే గదా, అస్లీలం అని మొత్తుకునేది జనాలు). ఆ ఆవిష్కరించింది ఆత్మకాదు, అది దెయ్యం బూతం పిశాచం అని కొందరు సహృదయులు సెర్టిఫై చేసేశారు గదా. తమరుగారికి తృప్తికాలేదా? హబ్భే, మీరనవసరంగా దాన్నొక కొరివిదయ్యమని భయపడుతున్నారు, అది ఒక దీపమే అని చూపించడానికి ప్రయత్నించిన బొల్లోజుబాబా మీద పుంజీడు పేణ్ణీళ్ళు చల్లింది తమరుగారు కాదా? ఇంకా యేల ఈ ఆత్మల వేట?
[ఈ కామెంట్ ఎడిట్ చేయబడినది – సం.]
మనకు తెలియని మన త్యాగరాజు – 4 గురించి యుగంధర్ అభిప్రాయం:
03/20/2009 6:15 am
ముందుగా బాబ్జీలు గారికి – ఈ మాత్రానికి కాపీ అనుకోనక్కర్లేదు. ఆనందభైరవి, మధ్యమావతి, సురటి, ఇలాంటి రాగఛ్ఛాయలున్న సాంప్రదాయక పాటలు (స్త్రీల పాటలు లాలి పాటలు ఇత్యాది) బోలెడున్నాయి. త్యాగరాజు ఉత్సవ సాంప్రదాయ కృతుల్నీ, దివ్యనామ సంకీర్తనల్నీ ఇదే ఉద్దేశంతో (సంగీతం నేర్చుకోని వాళ్ళయినా పాడుకోగలిగేట్టు) రాశారని నా నమ్మకం. అంచేత ఇటువంటి సాంప్రదాయ బాణీలు కొన్ని ఈ కృతుల్లో కనిపిస్తాయి.
సాయిబ్రహ్మానందం గారూ – మీరు మళ్ళీ పొరబడ్డారని చెప్పడానికి విచారిస్తున్నాను. త్యాగరాజ కృతుల్లో రెండో అక్షర ప్రాస రెండు విడతలుగా అమలు అవుతుంది. పల్లవికీ అనుపల్లవికీ కలిపి ఒక ప్రాస. చరణానికి ఇంకో ప్రాస. ఒకటికంటే ఎక్కువ చరణాలుంటే ప్రతి చరణానికీ వేరే ప్రాస ఉండొచ్చు. కొన్ని కృతుల్లో పల్లవిలో ఉపయోగించిన ప్రాసనే చరణంలోనూ వాడ్డం ఉంది. ఉదా:
పల్లవి: ఎందరో మహానుభావులు; అను: చందురూ వర్ణుని
పల్లవి: నను పాలింప; అను: వనజ నయన
పాట అంతా ఒకటే ప్రాస: పల్లవి: నగుమోము గనలేని; అను: నగరాజ ధర; చరణం: ఖగరాజు, గగనానికి, జగమేలే, వగ జూపకు
ఇక, ఒక తాళ ఆవృత్తము = ఒక పాదము అనే సూత్రం. నగుమోమునే తీసుకోండి. పల్లవీ అనుపల్లవీ కూడా ఆదితాళంలో రెండేసి ఆవృత్తాలు పడతాయి. కానీ పాదం ఒక్కటే.
మీరు మొదట ఉదహరించిన వాసుదేవయని కృతి యైనా అంతే. చరణంలోనూ అంతే. ఒక్కో పాదమూ రెండేసి ఆవృత్తాలు సాగుతుంది. అదే రెండుకళల చౌక పద్ధతిలో పాడారనుకోండి, ఈ పాదం మొత్తమూ ఒక తాళ ఆవృత్తంలోనే ఇముడుతుంది. సాహిత్యపు వరుసకీ తాళానికీ ఉన్న సంబంధం సాపేక్షమే గానీ అబ్సొల్యూటు కాదుగదా. నా ఉద్దేశంలో చివరికి పాదం ఎక్కడ అంతమైంది అనేది ఆయా కృతిలో అనుసరించిన ఛందస్సుని బట్టి ఉంటుంది. ఇక ఆయన రాసిన కొన్ని పద్యాల్లో ఛందస్సు సరిపోలేదన్న మూలాన త్యాగరాజు ఛందస్సుని పట్టించుకోలేదనే వ్యాఖ్య కూడా పేలవంగా కనిపిస్తుంది. శాస్త్రాలు ఏమీ చదువుకోని నేనే రాయగలను అర్ధవంతమైన కందపద్యాలూ, సీసపద్యాలూ. సంస్కృతాంధ్రాల్లో పండితుడైన త్యాగరాజు ఆమాత్రం సీస పద్యం ఛందోనియమాలన్నీ పాటిస్తూ రాయలేదనేది ఏమీ నమ్మేట్టుగా లేదు. మరి మన చేతికి అందిన ప్రతుల్లో ఆ తప్పులు ఎందుకు ఉన్నాయో పైవాడికి తెలియాలి.
3వ కాలిఫోర్నియా సాహితీ సదస్సు – ఒక పరిచయం గురించి యుగంధర్ అభిప్రాయం:
03/20/2009 5:32 am
“తెలంగాణా యాసలో “దర్గామిట్టీ కథలూ” ?? ఖదీర్ బాబు రాసిన దర్గామిట్ట కతలకి రంగస్థలం ఒంగోలు జిల్లాలోని కావలి పట్టణం.