పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16487

  1. తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:

    10/08/2009 12:58 pm

    ఇంటర్నెటులో నిఘంటువులుంటే నిజంగా ఎంతో మేలు. బ్రౌన్‌ నిఘంటువు (అసమగ్రమైనా) తెలిసిందే.

    అర్థాలు చెప్పి వాటికి పద్యాలనుదహరించే నిఘంటువులున్నాయి. కాని, పదాలు సరిగ్గా, అందంగా, స్పష్టంగా వచనంలో వాడడానికి సూచనలిచ్చే నిఘంటువులు లేవు, English లో usages చెప్పినట్లు. చిన్ని ఉదాహరణ: చెరువుకు “గండి” పడి వరదలు అని వార్త. “గండి” కి 1)బిలము 2) రంధ్రము 3) సందు 4)నీళ్ళు ఎక్కువైనప్పుడు కట్ట తెగుట అర్థాలు ఉన్నాయి(శబ్దరత్నాకరములో) . 4వ అర్థమే ఎక్కువగా వాడడం తెలుసు. ఒక గోడకో, బట్టకో రంధ్రం పడితే “గండి పడింది” అనడం వినలేదు_అనొచ్చో లేదోతెలియదు. Usages ఇస్తే ఇట్లాంటివి మెరుగ్గా తెలుసుకునే అవకాశం ఉందనిపిస్తుంది.

    తెలియని పదాల అర్థాలనే కాక, తెలిసినట్టు అనిపించే పదాలు సైతం సార్థకంగా వాడడానికి నిఘంటువులు ఉపయోగపడుతాయి కదా. ఆ దృష్టితో ఇంకొంత సాయం చేయడానికి, భాష వాడుకను మరింత పటిష్టపరుస్తూ చేయూత నివ్వడానికి మార్గదర్శకంగా కొత్త నిఘంటువులు ఉంటే లాభం అని కూడా అనిపిస్తుంది.
    _________
    విధేయుడు
    Srinivas

  2. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Jagannadham Alapati అభిప్రాయం:

    10/07/2009 6:14 pm

    వేమూరి వేంకటేశ్వర రావు గారి “శాస్త్రీయ” వ్యాసం తెలుగులో యెంతో హృద్యంగా వుంది. ఒకరిద్దరి భాషాపరమైన సలహాలు కూడా మెచ్చదగ్గవిగా వున్నాయి. మిగిలిన కువిమర్శకులు (ఎవరో నేను ప్రత్యేకంగా రాయక్కర లేదు), ఎలానూ రాయలేరు, కనీసం టీ.వీ సంకర భాష గురించి వారికి రాయగలరా? మరికొందరు ఆంగ్ల పదాల్నే రాయచ్చన్నారు. ఏకంగా దాన్నే రాజభాష చేసుకుంటే మాట్లాడుకోవచ్చు కూడా! అంచేత కనీసం కొంతమందినైనా రాసేవాళ్ళని రాయనియ్యండి. మరి మీరేమంటారు? ఒక మంచిని ఆహ్వానిద్దామంటారా? లేక రంధ్రాన్వేషణ చేస్తూ పోదామంటారా?

    జగన్నాథం ఆలపాటి

  3. మరోపువ్వు గురించి రాకేశ్వర రావు అభిప్రాయం:

    10/06/2009 1:21 pm

    ఆఖరి పద్యం చాలా బాగుంది.
    మీ కవితలతో నాకెప్పుడూ వుండే మొఱ ఒకటే. నిడివి.
    రుచి చూపించి వదిలేసినట్టుంటుంది.

  4. జవాబు ఫలితం గురించి pantula Jogarao అభిప్రాయం:

    10/06/2009 10:25 am

    మీ రచన శ్రీ శ్రీ గారి “నిప్పులు చిమ్ముకు౦టూ” గేయ౦ లాగా చిన్నదయినా చాలా గొప్పగా ఉ౦ద౦డీ. ధన్యవాదాలు. నాది పార్వతీపురమ౦డీ.

  5. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి గరికపాటి పవన్ కుమార్ అభిప్రాయం:

    10/05/2009 7:06 pm

    రవి కిరణ్ గారి సుదీర్ఘ వ్యాసానికి, వేమూరి వారిది చక్కని వంగ్యమైన జవాబు అని రమ గారు చెపితే అర్థమయ్యింది. అంతవరకూ రమణి గారి లాగే నేను బాధపడ్డాను.

    ప్రశ్న లేవనెత్తినందుకు రమణి గారికి ధన్యవాదాలు.

    గరికపాటి పవన్ కుమార్

  6. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి rama bharadwaj అభిప్రాయం:

    10/05/2009 1:32 am

    రమణి గారూ! వేమూరి వారిది వెక్కిరింత. మీడియాలోని తెలుగుకి ఆయన ఒక బొమ్మ గీసి చూపించారు. ఆయనకి కల్గిన కోపం అటువంటి సంకరవాక్యాల మీద ఎంత గాఢమైనదో అందరికీ తెలిసేలా రాసారు వ్యంగ్యాన్ని. దాన్ని
    చదువుకున్న వారు “అమ్మో! ఇలా ఉంటుందన్నమాట!” తెలుగులో ఎక్కువ ఇంగ్లీషు వాడితే! అని అనుకోవాలన్నదే ఆయన అభిప్రాయంఅ గనక ఆయన అనుకున్నది నెరవేరినట్టే !

    లైలా గారి అభిప్రాయం మీద మీ అభిప్రాయం బాగుంది.

    రమ.

  7. తెలుగు నిఘంటువు గురించి… గురించి అనిలు అభిప్రాయం:

    10/04/2009 10:41 pm

    తెలుగుఁ వారికిఁ జాలినంత తెలుఁగుబాస కలదు; వారు పరభాషా దాస్యమునకుఁ జేతులొగ్గవలసినది లేదు” అంటు, “అచ్చతెలుగు కోశము” (రెండు సంపుటాలు) ని 1979 లో పోతుకుచ్చి సుబ్రహ్మణ్య శాస్త్రి (శ్రీ శ్రీనివాస భవనశ్రీ – నెం 22-7-7, మోటుపల్లి వారి వీధి, కొత్తపేట, తెనాలి-522 201, గుంటూరు జిల్లా, ఆం. ప్రదేశ్ ) గారు వెలువరించారు. ఆవుల సాంబశివరావు గారు కృతికర్త. ధర (50+50) వంద రూపాయలు.
    మనకి నిఘంటువులు లేకపోలేదు. కాని వాటిని పట్టించుకుంటున్నామా అన్నది ప్రశ్న.

  8. ఈ రాత్రి నేను వ్రాయగలను గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    10/04/2009 9:17 am

    (లైలా గారి) అభిప్రాయం ఆంగ్లంలో కొటేషన్లు తెలుగులో ఏమి బేహద్బీ !!
    రచయిత్రి తమ అభిప్రాయాలను తెలుగులో రాస్తే సొమ్మేం పోయింది??
    English online magazine చదివి తెలుగులో అభిప్రాయాలు
    రాస్తే ఇతరులు (తెలుగు రానివారు) ఆనందించగలరా ?? సంపాదక వర్యులు ఆంగ్లంలో అభిప్రాయాలు రాసేవారిని కొంచెం పట్టించుకొండి.

    సర్పవరం రమణి.

  9. ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    10/04/2009 9:00 am

    పంతుళ్లు కూడా తెలుగులో రాయలేక చతికిలపడిపోతే ?? పైగా యాంకర్ల యాసలో కొంకర్లు పోయిన తెలుగు(?)లో అభిప్రాయాలు రాస్తే ఎవ్వరిననుకొని ఏమి లాభం ??ఏటికి ఎదురీదగల సాహసే ఏమైనా సాధించగలడు. “ఫ్లోని అప్పోజ్ చేస్తూ స్విం చెయ్యటానికి ట్రై చెయ్యటా”నికి పెద్ద గట్స్ అవసరం లేదు.

    సర్పవరపు రమణి.

  10. గుర్రం జాషువా పాపాయి పద్యాలు గురించి సర్పవరపు రమణి అభిప్రాయం:

    10/04/2009 8:47 am

    విరామ చిహ్నాలు తెలియకుండా మహాకవులు గావచ్చు.
    అసలేమీ చదవకుండా ఆధునిక కవిత్వాలు అప్రయత్నంగా
    అర్థమవాలనుకునే అసాధరణ పాఠకులు కావచ్చు.ఘనంగా
    సినిమా పాటలు రాసుకుంటూ జ్ఞానపీఠం బడయవచ్చు.
    ఇవన్నీ ,మన ఒక్క తెలుగులోనే సాధ్యం సుమా !!

    సర్పవరపు రమణి.