విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్న చాలా నిgUఢమైనది. అంత ఎత్తుకు ఎదిగే లోపల తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.
చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఎలా పుట్టాడు? భూమి నుంచా? చంద్రుడు ఒకప్పటి భూమిలోని భాగమా? భూమి ఎలా పుట్టింది? సౌరకుటుంబంలో మరే గ్రహానికీ లేని “నీరు” భూమికి మాత్రమే ఎలా సొంతమైంది? భూమిపై సృష్టి ఎలా సాధ్యమైనది?
ఇలా అడుగుతూ పోతే ప్రశ్నల పరంపరలకు అడ్డు లేదు. ఇలాంటి విషయాలపై అతి క్లిష్టమైన సూత్రాలను అర్ధం చేసుకోటం కష్టమే! కానీ వాటిని తెలుగులో రాయవలసిన అవసరం మటుకు చాలా ఉంది. వేమూరి వారి వ్యాసం, విజ్ఞులైన తెలుగు రచయితలని కవ్వించి (మంచి మార్గంలోనే), వారిచే చక్కటి రచనలు చేయించగలdaనే ఆశతో,
వేమూరి వెంకటేశ్వరరావుగారు ఎన్నో ఏళ్ళుగా పాప్యులర్ సైన్స్ రచనలు చేస్తున్నారు. నేను అయిదేళ్ళనుంచీ ఏపీ వీక్లీ డాట్ కాం తదితర పత్రికల్లో ప్రతి వారం రాస్తున్నాను. ఎంతమంది ఈ రంగంలో కృషి చేసినా సరిపడేంత పని ఉంది.
బాగుంది. ఎప్పుడో గాని పత్రికల్ని చదవని నాచేత వేమూరివారి రచన చదివింప జేస్తే, విమర్శలు నాచేత కలం పట్టించాయి.
“అసలు కంటె వడ్డీ ఎక్కువ” లా రచన కంటె విమర్శలే కాకుండా, రచయిత సంజాయిషీ కూడా ఇప్పించుకొన్నాం!
ఏది ఏమైనా, మంచి ఏమంటే, మనకి అటువంటి మరొక రచయితగా శ్రీ రోహిణీ ప్రసాదుగారు దొరికిపోయారు. మరి వేమూరి వారి మరో రచనతోపాటు(నిజంగా కోరుకొంటున్నాం) వీరు కూడా రాసేస్తే మాకు పండగే పండగ. ఇక శ్రీమతి రమ గారు కూడా మరొకటి అందిస్తే మా ఆనందానికి హద్దులే వుండవు.
ఐతే.. మనం దీనికి ఇక్కడ ఆనకట్ట వేసేసి, పాత నీటితో పాటు కొత్త నీటికి ఎదురు చూడచ్చా?
జగన్నాథం
[Kosuru gAru, ఈమాటలో మీరు రాసే అభిప్రాయాలని ఇకనించి తెలుగు లిపిలోనే రాయమని కోరుతున్నాము. తెలుగుని ఇంగ్లీష్ లిపిలో, అందులోనూ సరైన లిపి అంతరీకరణ పద్ధతి ఉపయోగించకుండా, రాసినది చదవడం చాలా కష్టం. – సంపాదకులు]
The story is really good. Read a good one after many days. In fact, of all the stories here, this is the one that I liked most. It reminds us of the stories that we used to read as kids in Chandamama, Balajyothi, Balamitra, etc.
థాంక్స్ దంతుర్తి శర్మ గారు, ఈ కథని వెలికి తీసినందుకు.
కామేశ్వరరావుగారు,
Telugu Etymology Database లింకులు (సంస్కృత నిఘంటువుతో) బాటు తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు.
ఇటువంటి links (comments లోనే ఉండిపోక), ఒక చోట చేర్చి FAQ or Frequently Used Links అనో ఇంకేదో పేరుతో “ఈమాట” (లైబ్రరీలో?) పెట్టడం ఎక్కువమందికి, ఎక్కువగా అందుబాటులోఉంటుందేమో
సంపాదకులు ఆలోచించ మనవి.
మరుగున పడిపోయే మాండలిక, వృత్తి పదకోశాలను digitize చేసే ఆలోచన చాలా బాగుంది. దానికి కావలసిన అనుమతి (తెలుగు విశ్వవిద్యాలయం నుంచి), copyrights తెలిసిందానికన్నా నాకు తెలియనిదే ఎక్కువ.
ఇక పదాలకు వాడుకలిస్తే నిఘంటువు పెద్దదే అవుతుంది, నిజమే. నిఘంటువు పెద్దదవడం ఇంత పాత భాషకు సహజమూ, మంచిదే కదా,
ఇది ఎవరికి ఉపయోగం ప్రశ్నకు కొంత బాధపడి ఊరుకుందాం
అనుకున్నా, గోడు చెప్పుకోకపోతే తెలియదని రాయడం. ఇటువంటివి నాకైతే ఉపయోగం. నాలాగా భాష వచ్చీ రాని వారు, ఎవరిని అడగాలో తెలియక తికమక పడేవారు, లోపల సందేహం ఉన్నా బయటకు అడగడానికి జంకే వారు, బాగా తెలిసిన పదాలైనా ఇంకొకరికి (పిల్లలకు?) చెప్పాలన్నప్పుడు precise పదాలు టపీమని దొరకక ఇబ్బందిపడేవారు, అయినా సొంతానికి కొంత కృషిచేసి నేర్చుకుందామనుకునే వారికందరికీ ఇటువంటి నిఘంటువులు సాయపడతాయనుకుంటున్నాను.
________
విధేయుడు
_Srinivas
సైన్సులో మరీ క్లుప్తంగా రాస్తే కష్టమే!
వేమూరివారు ఇంగ్లీషులో వివరించినదాన్ని నేనయితే తెలుగులో ఇలా రాస్తాను.
వృత్తమనేది వంపు తిరిగిన గీతవంటిదనుకోవచ్చు. మనం దాన్నంటిపెట్టుకుని మాత్రమే పోగలం. దానిమీద ఎన్ని చక్కర్లు కొట్టినా ఆ పరిధిని అతిక్రమించం కనక దానికి హద్దులూ, అంచులూ లేవనిపిస్తుంది. కానీ ఒక గుండ్రని పలకను చూస్తే దానికి అంచు కనిపిస్తుంది. దానిమీద విహరిస్తూ “పొరపాటున” దాని అంచును దాటినట్టయితే మనం “పడిపోతాం”. వలయాకారంలో ఉన్న తీగ (లేదా దారం) విషయంలో ఇలా జరగదు.
పదాల ప్రయోగానికి ఉదాహరణలు కొన్ని కొన్ని పదాలకి బ్రౌణ్యంలో కనిపిస్తాయి. శబ్దరత్నాకరం ప్రధానంగా ప్రాచీన కావ్య భాషని దృష్టిలో పెట్టుకొని తయారుచెయ్యబడింది కాబట్టి కావ్యాలలోని ప్రయోగాలు కొన్ని పదాలకి అందులో ఉన్నాయి. ప్రతి పదానికీ ప్రయోగాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా పెద్ద నిఘంటువు తయారవుతుంది. నేను మళ్ళీ అడిగిన మొదటి ప్రశ్ననే అడుగుతాను. అలాంటి నిఘంటువు ఎవరికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
పర్యాయపదకోశాలు పెద్దవేమైనా తెలుగులో ఉన్నాయా అన్నది నాకు తెలియదు కాని “విద్యార్థికల్పతరువు”లో పర్యాయపదాలూ, నానార్థాలూ ఉంటాయి. ఇంటర్నెట్లో Search సౌలభ్యం ఉన్న నిఘంటువులు ఇంచుమించు Thesaurus ప్రయోజనాన్ని అందిస్తాయి. ఏదైనా పదానికి సంబంధించిన పర్యాయపదాలు కావలిస్తే ఆ పదంతో Search చేస్తే సరిపోతుంది. పదకేళి నింపడానికి ఇంటర్నెట్లో ఉన్న బ్రౌణ్యం ఉపయోగించేవాళ్ళకి ఈ విషయం అనుభవమే. అంచేత ప్రత్యేకించి పర్యాయపదకోశాలు ఇంటర్నెట్లో అవసరం లేదనుకుంటాను.
ఇంటర్నెట్లో బ్రౌణ్యం కాకుండా మరో రెండు ఉపయోగకరమైన సైట్లు:
ఈ రెంటికీ Search సౌలభ్యం ఉంది.
నా దృష్టిలో ముఖ్యంగా డిజిటైజ్ చెయ్యాల్సిన నిఘంటువులు మాండలిక పదకోశాలు, వృత్తిపదకోశాలు. వీటి ద్వారా ఈ లాభాలుంటాయి (ముఖ్యంగా ఇంటర్నెట్లో వస్తున్న సాహిత్యానికి):
మాండలికంలో రచనలు చేసేవాళ్ళకీ చదివేవాళ్ళకీ చాలా సౌకర్యంగా ఉంటుంది. అటువంటి రచనలకి మంచి ప్రోత్సాహం కలుగుతుంది.
వృత్తి పదకోశాల ద్వారా చాలా మరుగున పడిపోయిన పదాలు తెలుస్తాయి. అవి తెలియక వాటి స్థానంలో ఇంగ్లీషు పదాలని వాడే చోట్ల మళ్ళీ ఆ తెలుగు పదాలకి వాడుక కలిగే అవకాశం ఉంది.
కొత్త సాంకేతిక పదాలు సృస్ఠించుకోడానికి ఇప్పటికే ఉన్న వృత్తిపదకోశాలు దారి చూపిస్తాయి.
మాండలిక, వృత్తి పదకోశాలు కొన్ని Digital Libraryలో ఉన్నాయి కాని వాటికి Search సౌలభ్యం లేకపోవడంతో వాడటానికి అనువుగా లేవు. వాటిని యూనీకోడీకరించి Searchable చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి నలుగురూ ఆలోచిస్తే మంచిది.
ఉన్నవాటిని, అంటే, మనకు దుకాణాలలో దొరికేవాటిని digitize చేసి ఇంటర్నెటులో పెట్టడం మన ఉద్దేశం కాదనుకుంటాను.
ఎంతో కొంత ధరకు, కాదు, కొంత ధరకే దొరికే వాటిని digitize చేయడం మూలాన కలిగే ఇంటర్నెటు సౌకర్యానికి, ఆ పాటి కాపీలు అమ్ముకొని బతికే ప్రచురణకర్తల ఆదాయానికి గండికొట్టడం మన ఆలోచన కాదని కూడా అనుకుంటున్నాను.
____
విధేయుడు
-Srinivas
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:
10/14/2009 11:38 am
ఖగోళ విశేషాలను గురించిన నా పుస్తకం ఈమధ్యనే విడుదల అయింది:
http://rohiniprasadkscience.blogspot.com/2009/10/1.html
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:
10/13/2009 8:43 pm
విశ్వం ఏ ఆకారంలో ఉంది? అన్న ప్రశ్న చాలా నిgUఢమైనది. అంత ఎత్తుకు ఎదిగే లోపల తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి.
చంద్రుడు భూమికి ఉపగ్రహంగా ఎలా పుట్టాడు? భూమి నుంచా? చంద్రుడు ఒకప్పటి భూమిలోని భాగమా? భూమి ఎలా పుట్టింది? సౌరకుటుంబంలో మరే గ్రహానికీ లేని “నీరు” భూమికి మాత్రమే ఎలా సొంతమైంది? భూమిపై సృష్టి ఎలా సాధ్యమైనది?
ఇలా అడుగుతూ పోతే ప్రశ్నల పరంపరలకు అడ్డు లేదు. ఇలాంటి విషయాలపై అతి క్లిష్టమైన సూత్రాలను అర్ధం చేసుకోటం కష్టమే! కానీ వాటిని తెలుగులో రాయవలసిన అవసరం మటుకు చాలా ఉంది. వేమూరి వారి వ్యాసం, విజ్ఞులైన తెలుగు రచయితలని కవ్వించి (మంచి మార్గంలోనే), వారిచే చక్కటి రచనలు చేయించగలdaనే ఆశతో,
విష్ణుభొట్ల లక్ష్మన్న
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:
10/13/2009 7:40 pm
వేమూరి వెంకటేశ్వరరావుగారు ఎన్నో ఏళ్ళుగా పాప్యులర్ సైన్స్ రచనలు చేస్తున్నారు. నేను అయిదేళ్ళనుంచీ ఏపీ వీక్లీ డాట్ కాం తదితర పత్రికల్లో ప్రతి వారం రాస్తున్నాను. ఎంతమంది ఈ రంగంలో కృషి చేసినా సరిపడేంత పని ఉంది.
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Jagannadham Alapati అభిప్రాయం:
10/13/2009 5:29 pm
బాగుంది. ఎప్పుడో గాని పత్రికల్ని చదవని నాచేత వేమూరివారి రచన చదివింప జేస్తే, విమర్శలు నాచేత కలం పట్టించాయి.
“అసలు కంటె వడ్డీ ఎక్కువ” లా రచన కంటె విమర్శలే కాకుండా, రచయిత సంజాయిషీ కూడా ఇప్పించుకొన్నాం!
ఏది ఏమైనా, మంచి ఏమంటే, మనకి అటువంటి మరొక రచయితగా శ్రీ రోహిణీ ప్రసాదుగారు దొరికిపోయారు. మరి వేమూరి వారి మరో రచనతోపాటు(నిజంగా కోరుకొంటున్నాం) వీరు కూడా రాసేస్తే మాకు పండగే పండగ. ఇక శ్రీమతి రమ గారు కూడా మరొకటి అందిస్తే మా ఆనందానికి హద్దులే వుండవు.
ఐతే.. మనం దీనికి ఇక్కడ ఆనకట్ట వేసేసి, పాత నీటితో పాటు కొత్త నీటికి ఎదురు చూడచ్చా?
జగన్నాథం
తెలుగు సినిమా పాట గురించి kosuru అభిప్రాయం:
10/13/2009 1:09 am
[Kosuru gAru, ఈమాటలో మీరు రాసే అభిప్రాయాలని ఇకనించి తెలుగు లిపిలోనే రాయమని కోరుతున్నాము. తెలుగుని ఇంగ్లీష్ లిపిలో, అందులోనూ సరైన లిపి అంతరీకరణ పద్ధతి ఉపయోగించకుండా, రాసినది చదవడం చాలా కష్టం. – సంపాదకులు]
Naayana. . . .!
Nuvvu anta baagaanea raasevu kaani telugulo vottulu, gunintalu, deerghalu, vyaakaranam chaala mukhyamaina amsam kanuka vaatini marichipoo vaddu.
vuntaanu tammudu
Kosuru
మిగారమాత గురించి kiranmayee అభిప్రాయం:
10/12/2009 5:31 pm
The story is really good. Read a good one after many days. In fact, of all the stories here, this is the one that I liked most. It reminds us of the stories that we used to read as kids in Chandamama, Balajyothi, Balamitra, etc.
థాంక్స్ దంతుర్తి శర్మ గారు, ఈ కథని వెలికి తీసినందుకు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
10/11/2009 1:33 pm
కామేశ్వరరావుగారు,
Telugu Etymology Database లింకులు (సంస్కృత నిఘంటువుతో) బాటు తెలిపినందుకు చాలా కృతజ్ఞతలు.
ఇటువంటి links (comments లోనే ఉండిపోక), ఒక చోట చేర్చి FAQ or Frequently Used Links అనో ఇంకేదో పేరుతో “ఈమాట” (లైబ్రరీలో?) పెట్టడం ఎక్కువమందికి, ఎక్కువగా అందుబాటులోఉంటుందేమో
సంపాదకులు ఆలోచించ మనవి.
మరుగున పడిపోయే మాండలిక, వృత్తి పదకోశాలను digitize చేసే ఆలోచన చాలా బాగుంది. దానికి కావలసిన అనుమతి (తెలుగు విశ్వవిద్యాలయం నుంచి), copyrights తెలిసిందానికన్నా నాకు తెలియనిదే ఎక్కువ.
ఇక పదాలకు వాడుకలిస్తే నిఘంటువు పెద్దదే అవుతుంది, నిజమే. నిఘంటువు పెద్దదవడం ఇంత పాత భాషకు సహజమూ, మంచిదే కదా,
ఇది ఎవరికి ఉపయోగం ప్రశ్నకు కొంత బాధపడి ఊరుకుందాం
అనుకున్నా, గోడు చెప్పుకోకపోతే తెలియదని రాయడం. ఇటువంటివి నాకైతే ఉపయోగం. నాలాగా భాష వచ్చీ రాని వారు, ఎవరిని అడగాలో తెలియక తికమక పడేవారు, లోపల సందేహం ఉన్నా బయటకు అడగడానికి జంకే వారు, బాగా తెలిసిన పదాలైనా ఇంకొకరికి (పిల్లలకు?) చెప్పాలన్నప్పుడు precise పదాలు టపీమని దొరకక ఇబ్బందిపడేవారు, అయినా సొంతానికి కొంత కృషిచేసి నేర్చుకుందామనుకునే వారికందరికీ ఇటువంటి నిఘంటువులు సాయపడతాయనుకుంటున్నాను.
________
విధేయుడు
_Srinivas
ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? గురించి Rohiniprasad అభిప్రాయం:
10/11/2009 9:20 am
సైన్సులో మరీ క్లుప్తంగా రాస్తే కష్టమే!
వేమూరివారు ఇంగ్లీషులో వివరించినదాన్ని నేనయితే తెలుగులో ఇలా రాస్తాను.
వృత్తమనేది వంపు తిరిగిన గీతవంటిదనుకోవచ్చు. మనం దాన్నంటిపెట్టుకుని మాత్రమే పోగలం. దానిమీద ఎన్ని చక్కర్లు కొట్టినా ఆ పరిధిని అతిక్రమించం కనక దానికి హద్దులూ, అంచులూ లేవనిపిస్తుంది. కానీ ఒక గుండ్రని పలకను చూస్తే దానికి అంచు కనిపిస్తుంది. దానిమీద విహరిస్తూ “పొరపాటున” దాని అంచును దాటినట్టయితే మనం “పడిపోతాం”. వలయాకారంలో ఉన్న తీగ (లేదా దారం) విషయంలో ఇలా జరగదు.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Kameswara Rao అభిప్రాయం:
10/11/2009 5:42 am
పదాల ప్రయోగానికి ఉదాహరణలు కొన్ని కొన్ని పదాలకి బ్రౌణ్యంలో కనిపిస్తాయి. శబ్దరత్నాకరం ప్రధానంగా ప్రాచీన కావ్య భాషని దృష్టిలో పెట్టుకొని తయారుచెయ్యబడింది కాబట్టి కావ్యాలలోని ప్రయోగాలు కొన్ని పదాలకి అందులో ఉన్నాయి. ప్రతి పదానికీ ప్రయోగాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళాలంటే చాలా పెద్ద నిఘంటువు తయారవుతుంది. నేను మళ్ళీ అడిగిన మొదటి ప్రశ్ననే అడుగుతాను. అలాంటి నిఘంటువు ఎవరికి ఎంతవరకూ ఉపయోగపడుతుంది?
పర్యాయపదకోశాలు పెద్దవేమైనా తెలుగులో ఉన్నాయా అన్నది నాకు తెలియదు కాని “విద్యార్థికల్పతరువు”లో పర్యాయపదాలూ, నానార్థాలూ ఉంటాయి. ఇంటర్నెట్లో Search సౌలభ్యం ఉన్న నిఘంటువులు ఇంచుమించు Thesaurus ప్రయోజనాన్ని అందిస్తాయి. ఏదైనా పదానికి సంబంధించిన పర్యాయపదాలు కావలిస్తే ఆ పదంతో Search చేస్తే సరిపోతుంది. పదకేళి నింపడానికి ఇంటర్నెట్లో ఉన్న బ్రౌణ్యం ఉపయోగించేవాళ్ళకి ఈ విషయం అనుభవమే. అంచేత ప్రత్యేకించి పర్యాయపదకోశాలు ఇంటర్నెట్లో అవసరం లేదనుకుంటాను.
ఇంటర్నెట్లో బ్రౌణ్యం కాకుండా మరో రెండు ఉపయోగకరమైన సైట్లు:
ఈ రెంటికీ Search సౌలభ్యం ఉంది.
నా దృష్టిలో ముఖ్యంగా డిజిటైజ్ చెయ్యాల్సిన నిఘంటువులు మాండలిక పదకోశాలు, వృత్తిపదకోశాలు. వీటి ద్వారా ఈ లాభాలుంటాయి (ముఖ్యంగా ఇంటర్నెట్లో వస్తున్న సాహిత్యానికి):
మాండలిక, వృత్తి పదకోశాలు కొన్ని Digital Libraryలో ఉన్నాయి కాని వాటికి Search సౌలభ్యం లేకపోవడంతో వాడటానికి అనువుగా లేవు. వాటిని యూనీకోడీకరించి Searchable చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. దీని గురించి నలుగురూ ఆలోచిస్తే మంచిది.
తెలుగు నిఘంటువు గురించి… గురించి Srinivas Nagulapalli అభిప్రాయం:
10/10/2009 10:50 pm