పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఆషాఢస్య ప్రథమ దివసే గురించి మోహన అభిప్రాయం:

    07/01/2012 9:38 am

    లీలాశుకుని శ్రీకృష్ణకర్ణామృతములో రెండవ శతకములో కొన్ని మందాక్రాంతములున్నాయి. అందులో మందం మందం మధుర నినదైః … అనే పద్యాన్నిలవకుశ (1934) చిత్రములో యిక్కడ వినవచ్చును. విధేయుడు – మోహన.

  2. హాబూ నిప్పు గురించి రాజీవుడు అభిప్రాయం:

    06/29/2012 4:28 pm

    గుంపుల్లో సంచరించే ఆది మానవుల దశ నుండి ఒక చోట స్థిరపడి తెగ ఏర్పరచుకోవటం, ఒక భాష రూపుదిద్దుకోవటం, ఒక నాయకుడు ఉండటం దాకా ఎదిగిన వాళ్లు నిప్పును మొదటి సారి చూడ్టం అనే ఆలోచన నాకు కాస్త సబబుగా తోచలేదు. కానీ మనుషులకు నిప్పు మొదటి సారి పరిచయం అయితె ఇలానే ఉంటుందేమో అనిపించేట్టు, బాగా రాసారు గుల్జార్ గారు.

    వేరే జంతువుల నుండి మనల్ని వేరు చేసే ఆలోచనా శక్తి, చుట్టూ జరిగే వాటిని గమనించే కొద్దీ – పరిసరాలని చూసే కొద్దీ మనిషి మెదడుని ఉక్కిరిబిక్కిరి చేసే వేల ప్రశ్నలు, అనుభవ లేమీ అజ్ఞానంతో కూడిన నిస్సహాయత, వెరసి మనిషి ఎలా తనకి అంతుబట్టని విషయాల్లో ఒక కాల్పనిక శక్తిని ముడిపెట్టి తనని తను సమాధానపర్చుకోటం మొదలుపెట్టాడో ఈ కథ ద్వారా రచయిత చెప్పారని నా అభిప్రాయం.

  3. కొవ్వుపుంజి గురించి రాజీవుడు అభిప్రాయం:

    06/29/2012 2:59 pm

    దు:ఖం ఆవరించింది మనస్సుని. మొపాసా గారిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు!

  4. లెఖ్ఖల పరీక్ష గురించి Aparna Yeluripati అభిప్రాయం:

    06/29/2012 11:08 am

    మీ శైలి చాలా బాగుంది. మళ్ళీ బుడుగు ని చదువుతున్నట్టుగా. చివర ముగింపు కూడా నచ్చింది. అప్పట్లో బాధ అనిపించినా అమ్మ కొట్టడం, అన్న తిట్టడం ఇప్పుడు మధురానుభూతులే. సుమారు అందరి బాల్యాలూ ఇంచుమించు ఒకలాగె ఉన్నా, దాన్ని కథ రూపం లో నవ్వు వచ్చేలాగా రాయగలగడం నిజంగా great.

  5. క్రీడాభిరామము:1 వ భాగం గురించి గంటి లక్ష్మీ నరసింహమూర్తి అభిప్రాయం:

    06/29/2012 8:05 am

    క్రీడాభిరామామనే శృంగార గ్రంధాన్ని నెట్ లో పెట్టి అందరికీ అందుబాటులోకి తెచ్చినందుకు చాలా సంతోషం (ఈ కృతి తొలి ప్రతులు పండితులకు మాత్రమే పరిమితం.) ఈ నెట్లో ప్రచురణకు మూలం ఏదో తెలియ జెయ్య లేదు.శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారి పరిష్కారంతో ప్రచురించిన మణిమంజరి వారి ముద్రణ ప్రామాణికమని పండితాభిప్రాయము.

    శ్రీఎమ్.ఎస్.ప్రసాదుగారన్నట్లుగా క్రీడాభిరామ కృతికర్త శ్రీనాధుడనే బహుళ ప్రచారంలో యున్నది. దానికి కారణం ఈ గ్రంధాన్ని క్షుణ్ణంగా చదివి, నిశితంగా పరిశోధించిన పండితులు ఈ కృతిలో శైలి పదగుంభనములు మెదలుగునవి శ్రీనాధుని ఇతర కావ్యములతో పోల్చి చూసి పుంఖానుపంఖాలుగా ఉదాహరణలు లభించుటచే ఈ గ్రంధము శ్రీనాధుని రచనయే అని నిర్ధారణకు వచ్చుట. వల్లభుని ఇతర కావ్యములు లభ్యము కాక పోవుట. ఇంకా కొన్ని ఇతర కారణముల చేత వల్లభుని పేరు మరుగున పడుట చేత.

    సరివత్తురీవ అని మొదలయ్యే పద్యంలో జలద అనే యున్నది. అట్లాగే మందార వారుణీ అని మొదలయ్యే పద్యంలో మూడవ పాదం వెలఁది కోఱల మోము వేల్పు చేత అని యున్నది. గంధవతీ ప్రతీర పుర ఘస్మర అని మొదలయ్యే పద్యంలో చివరి పాదంలో బైచన మల్లన తిప్ప మంత్రులన్ అన్న వాక్యంలో మల్లనకు బదులుగా వల్లభుడు అని యుండాలని శ్రీ శాస్త్రి గారు సూచించేరు. అట్లాగే దాని తర్వాతి పద్యంలో చివరి పాదంలో డర్మవణికి బదులు డార్యమణి యనియుండాలని వారు సూచించేరు.

    శృంగార కవిత్వం వ్రాసినంత మాత్రాన మనం శ్రీనాధుని ఏహ్యభావంతో చూడవలసిన పనిలేదు. అతడు ఈశ్వరార్చన కళాశీలుడు.బ్రాహ్మీదత్తవరప్రసాదుడు. సంస్కృత ప్రాకృత శౌరసేనీ ముఖ్య భాషా పరిజ్ఞాన పాటవంబు కల్గినప్పటికి దేశభాషలందు తెలుగు లెస్స యని తెలుగు వారి భాషా సంస్కృతులను ఢంకా మీద దెబ్బకొట్టి మరీ చాటి చెప్పిన మహాకవి. తెలుగువారిగా మనందరికి ఆయన గర్వకారణం.

    -గంటి లక్ష్మీ నరసింహమూర్తి.

  6. దీవి సుబ్బారావు “మాటన్నది జ్యోతిర్లింగం” గురించి chavakiran అభిప్రాయం:

    06/29/2012 4:05 am

    ఈ పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెలో లభ్యం. వివరాలకు చూడండి http://kinige.com/kbook.php?id=946

  7. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి sreedhar అభిప్రాయం:

    06/29/2012 1:29 am

    వ్యాసం చాలా చక్కగా నేటి కాలానికి అణుగుణంగా తేలికగా వివరించినందుకు ధన్యవాదాలు. నిజంగానే ఇది చాలా సున్నితమైన విషయం. మనిషి ఏదైన మానసిక అస్తవ్యస్త పరిస్తితుల్లొ కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఇలా జాతకాల వెంట పడటం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్క సారి సృతి మించి జీవితాలే నాశనం అయేలా తయారవుతై. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. జీవితం పట్ల మంచి ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండాలి.

  8. శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి రాజీవుడు అభిప్రాయం:

    06/28/2012 8:51 pm

    “ప్రభావతీ విధేయుడైన ప్రద్యుమ్నుడు అనబడే నేను ఎదురు ప్రశ్న లేకుండా ఆ ఆజ్ఞ పాటించాను.” పంక్తి మొదలుకొని చివరి దాకా మహా సరదాగా రాసారండి. జంధ్యాల గారి శ్రీలక్ష్మి పాత్ర కొట్టొచ్చినట్టు, తన్నొచ్చినట్టు, బాదొచ్చినట్టు కనిపించింది.
    మీరు పంచిన నవ్వులకు మా ధన్యవాదాలు!

  9. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    06/28/2012 7:07 pm

    అవునండి. తెలంగాణలో తోటికోడలు అన్న అర్థంలో యారాలు (ఏఱాలు) అన్న మాటే ఎక్కువగా వాడుతారు. గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు. ఏఱాలు అన్నది అచ్చతెలుగు పదమేనండి. చివర్లో ఉన్న -ఆలు అన్న పదమే అది అచ్చతెలుగు పదమని చెబుతుంది. ఏఱాలు అన్న పదం వేఱాలు అన్న పదం నుండి వచ్చింది.

    ఏఱాలు < వేఱాలు < వేఱు + ఆలు = వేరే భార్య/కోడలు ఇంటిలో ఉండే వేఱే కోడలు కాబట్టి ఆ స్త్రీ ని వేఱాలు అని పిలిచారని చెప్పుకోవచ్చు. సవతిని కూడా ఏఱాలు అని పిలుస్తారు. వేఱు అన్న పదం ఇలాంటి అర్థంలోనే ప్రయోగించడం తమిళంలో కూడా కనిపిస్తుంది: వేఱ్ తాయి (=వేఱే తల్లి) అని సవతి తల్లిని పిలుస్తారట. సవతి అన్న పదం మాత్రం సంస్కృతం లోని సపత్ని (ఒకే భర్తగల స్త్రీలు) నుండి ప్రాకృతంలో సపత్తిగా మారి ఆపై సవత్తి అయి తెలుగులో సవతి అయ్యింది. తమిళంలో ఇప్పటికీ సవతిభార్యను సవత్తి/చవత్తి అనే అంటారు.

  10. పలుకుబడి: మానవ బంధుత్వ పదాలు 2 గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:

    06/28/2012 8:25 am

    “తెలంగాణాలో తోటి అల్లుడిని సడ్డకుడు/షడ్డకుడు అని, తోటి కోడలును సడ్డకురాలు అని అంటారు.” అని అన్నారు. నేనెక్కువగా విన్నది మాత్రం – ‘యారాలు’ అని. (ఇది తెలుగు పదం కాకపోవచ్చు కానీ, వాడుకలో ఈ పదాన్నే ఎక్కువగా విన్నాను.)

    ‘పలుకుబడి’ లో ఎన్నో తెలీని సంగతులు తెలియచేస్తున్నందుకు ధన్య వాదాలు సురేశ్ గారూ!

    అభినందనలతో-
    ఆర్.దమయంతి.