పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి jayaprabha అభిప్రాయం:

    07/03/2012 2:30 pm

    విద్యా సాగర్ ఆదిభట్ల గారూ! నా పై అభిప్రాయంలో నేను రాసిన ఆ మాటలన్నీ నిజానికి కారా మాస్టారి మాటలే! అవి నా ఊహ కాదు. ఆ కధా నేపధ్యం గురించి మాస్టారు ఇంకా కూడా చెప్పేరు. అవన్నీ ఇక్కడ అప్రస్తుతం గనక మాత్రమే నేను రాయలేదు. యజ్ఞం కధని గురించి రామారావు గారు చెప్పిన మాటల్ని మాత్రమే నేను రాసేను. అవి మాస్టారి మాటలని నేను ప్రత్యేకంగా పేర్కొనలేదు. ఆయన ఒక ఉదాహరణ లాగా మాత్రమే సుమా శ్రీ రాములు నాయుడునీ, .. అప్పల్రాముడినీ , అతడి కొడుకునీ వివిధ పార్టీల ఉదాహరణలిచ్చి పేర్కొన్నారు. అంతే కానీ అప్పటికి యెం యెల్ పార్టీలు ఏర్పడ్డాయని కాదు. తన ఆ కధని గురించి మాస్టారికి చాలా స్పస్టమైన అభిప్రాయాలున్నాయి. అందుకే అన్నాను ఆయన అభిప్రాయం కూడా ఈ కధా సందర్భంలో ముఖ్యమే అని.

    మోహన్ గారూ! యజ్ఞం కధ ని ముగించిన తీరు గురించి అడిగితే మాస్టారు అన్నది ఇదీ. “సమాజమ్లో ఇవాళ్టికీ ఆ దోపిడీ, ఆ హింస అలాగే ఉంది. అది కంటికి కనిపించని హింస. నేను ఆ కనిపించని హింసని ప్రత్యక్ష పరిచేను. దానిని దృశ్యం గానే చూపించాలని అనుకున్నాను. కధ చివరలో పాఠకులు సానుభూతిలో భాగం కావడం కాదు నాకు కావలసింది , వాళ్లని షాక్ కి గురి చేయాలి. వాళ్లని ఆలోచించేలా చేయాలి. పాఠకుల గుండెల్లో అసలు హింస ఎంత తీవ్రమైనదో అది బలంగా నాటుకు పోవాలి” అని అన్నారు. ఈ పెద్ద వయసులో మాస్టారు ఈమాట చర్చల్లో పాల్గోగలరని నేను అనుకోను గానీ, ఆసక్తి ఉన్న వాళ్ళు మాస్టారిని ఇంటర్ వ్యూ చేసి ఆయన భావాలని కూడా ప్రచురించవచ్చు.

    అలాగే ముగింపుని గురించి ఆయన ఏమీ ఇప్పటికీ ఇబ్బంది పడటం లేదు. యజ్ఞం కధ ఆనాటి కాలమాన పరిస్థితుల నించి పుట్టింది. ఇవాళ్టికీ ఆ పరిస్థితులు ఏమీ మారలేదు అని మాత్రం అన్నారు. మాస్టారు 1964లో యజ్ఞం కధా రచన చేసానని చెప్పారు. మరి నాలుగేళ్ళకి కాబోలు శ్రీకాకుళ పోరాటం ఆ తరువాత విరసం ఆవిర్భావం జరిగాయి. మీరు మాటవరసగా చెప్పిన ఉదాహరణని పట్టుకుని అదేదో తారీఖులు వేసి చెప్పిన చారిత్రక యదార్ధం లాగా భావించి మాట్లాడుతూ ఆనాటికి యెం యెల్ పార్టీ పుట్టలేదు అని అంటే మాత్రం నవ్వొచ్చింది. ఆ సంగతి ఆ ఉదాహరణ ఇచ్చిన కారా మాస్టారికీ తెలుసు. నాకూ తెలుసు.

    జయప్రభ.

  2. అమ్మ గోపెమ్మ గురించి Aparna అభిప్రాయం:

    07/03/2012 1:16 pm

    ఇలాంటి అంశాన్ని రాయటానికి పూనుకుంటే అసలు ఏ పద్యాన్ని విడవాలో అర్థం కాదు. పోతన భాగవతం నిజంగా అమృతసాగరం. అందులోని ఆణిముత్యాల లాంటి అద్భుతమైన పద్యాలను ఎంచి, భావాలతో సహా అందించి భాగవత రుచిని, యశోద మాతృ ప్రేమను, కృష్ణుడు కొడుకుగా ఆవిడకు అందించిన ఆనందాన్ని మరొకసారి కళ్ళ ముందు నిలిపారు. అసలు తల్లి అంటే యశోదే. ప్రతి తల్లికీ తన కొడుకు చిన్ని కృష్ణుడే అన్నంతగా ఆ పద్యాలు రచించిన పోతనకూ, మీకూ కూడా ధన్యవాదాలు.

  3. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి మోహన అభిప్రాయం:

    07/03/2012 10:58 am

    ఈ కథను original రూపములో నేను చదువలేదు. కాని వ్యాసరచయిత వ్రాసిన దానిని బట్టి కథ అర్థము చేసికోగలిగాను. నేను సి. ఎస్. రావుగారితో ఏకీభవిస్తాను. కథలలోగాని, నవలలోగాని, చలనచిత్రాలలోగాని అనవసరముగా పాత్రలను “హత్య” చేయడము ఒక విధమైన జుగుప్సను కలిగిస్తుంది, మానవజీవితముపైన నమ్మకాన్ని తగ్గిస్తుంది. అందువల్ల వీటిని రచయితలు అనుసరించడము నా ఉద్దేశములో సరియైనది కాదనే తోస్తుంది. జీవితానికే అర్థము లేదు అని వాదిస్తే, అప్పుడు కథకు కూడ అర్థము లేదనే ప్రతిస్పందన కూడ ఉదయిస్తుంది. ఒక కథ మనసులో కలకాలం నిలబడాలంటే దారుణ మరణంతో కథను అంతము చేయడము మాత్రము ఒక మార్గము కాదు. విధేయుడు – మోహన

  4. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి vidyasagarsriadibhatla అభిప్రాయం:

    07/03/2012 8:42 am

    జయప్రభ గారి కామెంట్ చదివాను. ML పార్టీలు ఆనాటికి ఏర్పడలేదు. వాటిని కూడ రచయిత ఉహించ గలిగారని జయప్రభ గారి ఊహ అనుకుంటా. నిజానికి రచయిత కథ అంతా కల్పితమే. ఆ కథలో చరిత్రని రాజకీయాలని వెదకడమంటే ఎండమావిలో నీరు వెదకడం.
    విద్యాసాగర్

  5. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తఃతః అభిప్రాయం:

    07/03/2012 7:39 am

    సురేశ్ మంచి వ్యాసం రాశారు. మోహన గారూ, రమగారూ చూపించిన ఇతర విశేషాలను కూడా కలిపి ఒకే చోట ఒకే వ్యాసంగా చేయ గలిగితే ఉపయోగకరంగా ఉంటుంది.

    ఈ రోజు తెలుగుభాష స్వరూపం ముఖ్యంగా రెందు ప్రభావాలకు లోనుగా ఉంది, ఈ రెండు ఒకదాన్నొకటి ప్రభావితం చేస్తూ.. సినిమా, టీవీ. ఇంగ్లీషు ప్రభావం తరచి చూస్తే అంతగా లేదనే అనిపిస్తూంది. ఎందుకంటే ఇంగ్లీష్ నిజంగా తెలిసిన వాళ్ళు ఈ రెండిట్లోనూ ఉన్నట్టుగా లేరు. ఇంగ్లీషు అని అనిపించే ఒక కొత్తరకం భాష అలవాటయింది. ఒక ఉదాహరణ – ‘ఫీలవుతాడ్రా’ బాధపడతాడు, యేడిచి పోతాడు అనే అర్ధంలొ ప్రస్తుతం వాడుక అయిపోయింది. ఇది ఇంగ్లీషు ప్రభావమా? ఏ భాషా రాని ‘రచయితల’ ప్రభావమా తెలుగు సినిమాల పేర్లు ‘తొట్టి గాంగ్’, ‘అదుర్స్’ ఇవి ఒక ఐదారు సంవత్సరాల క్రితం పేర్లనుకుంటాను. టీ వీ చానళ్ళలో తయారవుతున్న మాటలు తెలుగే అని చెప్పటానికి చాలా తెలియాలి.

    మరో వంక నుంచి చూస్తే సరిగ్గా రెండు రోజుల క్రితం అనాస పళ్ళను పైనాపిల్ అని అమ్ముతున్న- నలభై లకు దగ్గరగా ఉన్న- ఏ చదువు చదువుకోని ఒక ఆడమనిషి ‘అనాస’ అంటే, ఆమాట నాకు తెలీదు పైనాపిల్ అనే తెలుసు అన్నది.

    భాష పోతే తెలివి తేటలు పోతాయి. native genius చచ్చిపోతుంది. ఒక బళ్ళో, దేశంలో అన్ని ప్రాంతాలనుంచీ పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ వయసు లోపు పిల్లలు చదువుకునే చోట, రాంక్ లు గొప్పవైనా తెలివితేటలూ, నేర్చుకోవాలనే ఉత్సాహమూ తక్కువగా ఉండటం తెలుగు పిల్లల లోనే కనపడ్డది. తెలుగు భాషకు ఈ రోజున వ్యాకరణం అంటే mathematical పరిభాష లో ఒక chaos కి వ్యాకరణం రాయడం. సాహసం చేయగలమా?

    తఃతః

  6. ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    07/03/2012 3:04 am

    Does aDavi bApirAjiu gari ‘himabindu’ a historical novel of the sAtavAhana time? What is time period of aDavi bApirAju garu?

  7. కళాపూర్ణోదయం -1: సిద్ధుడి ప్రవేశం గురించి somesh అభిప్రాయం:

    07/02/2012 11:21 pm

    మధురానుభూతిని కలిగించే సాహిత్యాన్ని, ఆందులోను పింగలి వారిని స్మరణకు తెచ్చే కళాపూర్ణోదయం అందించినందుకు కృతజ్ఞతలు.

  8. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:

    07/02/2012 9:02 pm

    సురేశ్‌గారు, మంచి వ్యాసము, జోహారులు.
    1. కవిచింతామణి – వెల్లంకి తాతంభట్టు – తరువాతి లాక్షణికులు ఎంతగానో ప్రశంసించిన ఈ గ్రంథం మనకు పూర్తిగా లభ్యం కాకపోవడం మన దురదృష్టం. ఇందులో ఐదు అధికారములు ఉన్నాయి. దొరసామి శర్మ పుస్తకములో పద్యములలో కొన్ని మార్పులు చేసినానని చెప్పారు. కాని ఈ ఐదు అధ్యాయాలకంటె ఎక్కువ ఉన్నట్లు తెలుపలేదు.
    2. పుస్తకము యిప్పటిదే అయినా కూడ, క్రీ. శ. 1000 కి ముందటి కాలపు వ్యాకరణమును గురించి కోరాడ మహాదేవ శాస్త్రిచే వ్రాయబడిన Historical Grammar of Telugu with Special Reference to Old Telugu (200 BC to 1000 AD) ఒక అద్భుతమయిన గ్రంథము.
    3) ఓగిరాల రంగనాథకవి ద్విరేఫ వర్ణ దర్పణము అనే పుస్తకము రేఫద్వయమును గురించి విస్తారముగా చర్చిస్తుంది.
    విధేయుడు – మోహన

  9. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి వేణు అభిప్రాయం:

    07/02/2012 12:31 pm

    సురేశ్ గారూ! తెలుగు వ్యాకరణాల గురించి వివరంగా, ఆసక్తికరంగా రాశారు. ముఖ్యంగా కేతన ‘ఆంధ్ర భాషాభూషణము’ గురించి రాసింది బాగుంది.

    చిన్నప్పటినుంచీ ‘చిన్నయసూరి’ అని చదువుకున్నాం. ఆ పేరును మీరు ‘చిన్నయ్యసూరి’ గా రాశారు. శిష్టు కృష్ణమూర్తి శాస్త్రి కూడా పద విభాగం చేసి కొత్త అర్థంతో ఎద్దేవా చేసింది ‘చిన్నయసూరి’ నే కదా? మరి సరైన రూపం అది కాదా?

  10. చాటు పద్యాల్లో శ్రీనాథుడు గురించి Rama krishna Reddy అభిప్రాయం:

    07/02/2012 11:52 am

    చాలా బాగున్నాయి. ఇంత మంచి పద్యాలను అందించినందుకు మీకు ధన్యవాదములు. కానీ పద్యాలకు అర్థం అందించినచో అది మాలాంటి వారికి ఇంకా బాగుండేది.

    అన్యధా భావించరని ఆశిస్తూ……