పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి sathya అభిప్రాయం:

    07/13/2012 6:33 am

    యజ్ఞం పై కొన్ని అభిప్రాయాలు ఈ బ్లాగులో చూడండి.

  2. రచయితలకు సూచనలు గురించి Varanasi Nagalakshmi అభిప్రాయం:

    07/13/2012 2:32 am

    ఈ మాట వెబ్ పత్రిక చాలా బావుంది.పుస్తక సమీక్ష కోసం పుస్తకాలు పంపాలంటే ఎలాగో చెప్పగలరా?
    వారణాసి నాగలక్ష్మి

    [ఈమాట సంపాదకులు పుస్తకాల సమీక్ష చేయరండీ. సమీక్షలు వ్రాసి లేదా వ్రాయించి ప్రచురణకి పంపితే పరిశీలించగలం. – సం.]

  3. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi అభిప్రాయం:

    07/12/2012 7:46 pm

    యశస్వి గారూ:మీరు యిలా అన్నారు “ఆదిత్య రెడ్డి గారి భావాలలో మరీ ఎక్కువ “ఎర్రతనం” తొణికిసలాడుతోంది” అని.కాని నిజానికి నేను చాలా నల్లవాణ్ణి, నా భావాలు కూడా నల్లవే. ఎర్రవాళ్ళు, ఎర్రచొక్కాల వాళ్ళు, ఈ కథని ఎర్రకథ అన్నారు,ఆకాశానికి ఎత్తేసారు, అదే నా బాధ. అలా కాకుండా ఈ కధని ఏ ఆర్ష ధర్మ ప్రచార సభ వారో ప్రచారం చేసుంటే అసలు గొడవే లేకపోను. నేను బాగా ఇష్టపడేవాణ్ణికూడా.

    ఎం కె రావు గారూ: ఈ కధని గురించి సి.యస్.రావు గారు పైన ఏమన్నారో చూడండి. “ఈ కథ ద్వారా రామారావుగారు ఇంతకూ చెప్పదలచుకున్నది ఏమిటంటే అదేదో చెప్పటం కష్టం. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లేకుండా కథ సాగుతుంది.” అని. దాని పరమార్ధమేదో దానికే తెలియదు. యింక అదేం సాధిస్తుందంటారు.

  4. మత్తకోకిల కథ గురించి తఃతః అభిప్రాయం:

    07/12/2012 2:53 pm

    మోహన గారూ — చక్కని వ్యాసం మరొకటి చదివించారు. మత్త కోకిల మీద హైస్కూల్ రొజుల్లొ నాకెందుకొ చిన్న చూపుగా ఉండేది, చాలా తేలిగ్గా రాసెయ్యొచ్చని. తెలుగు భాష లాగా నెమలి ఆటా కొయిల పాటా రెండూ ఉన్న మత్త కొకిల అందాలు మీ వ్యాసం లొ వెల్లి విరిసాయి.

    ఒక మాట: మీ ఆఖరి పద్యం ఆఖరి చరణంలో “గిన్నెపాలిని పిల్లి తాగెను” లొ తెలుగు లొ ‘పాలను’ అంటాము గానీ ‘పాలిని’ అని అనమనుకుంటాను. అది అలా ఉంచితే అందులొ సింహము పాలి సొమ్ము గోమాయువు దోచుకు పొయిందన్న ధ్వని ఉన్నట్టనిపిస్తొంది. ఆ పాలను పిల్లిని తాగనీయకండి.

    నమస్కారాలతొ
    మిత్రుడు
    తఃతః

  5. స్మృతి గురించి Seetha Kumari అభిప్రాయం:

    07/12/2012 1:57 am

    కవితలో ఆర్ద్రత ఉంది.

  6. వేసవి గురించి Seetha Kumari అభిప్రాయం:

    07/12/2012 1:38 am

    మీలో ఎంత భావుకత్వమో సుమా! ఎంత బాగా వ్రాసారంటే ప్రతి చిన్న విషయాన్నీ కదలికనూ ఎంతో కవితాత్మంగా… Keep writing. All the best.

  7. ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/11/2012 8:10 pm

    భాస్కర్ గారూ!
    మీ కాంప్లిమెంట్స్ కి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ..
    ధన్యవాదాలతో –
    ఆర్.దమయంతి.

  8. జీవిత నవల – 1 గురించి రాణి. అభిప్రాయం:

    07/11/2012 6:49 am

    నవలకి ముడిసరుకు జీవితమే. కానీ ఏ వ్యక్తి జీవితమూ యథాతథంగా నవలకి వస్తువుగా పనికి రాదనే భ్రమలో ఉన్నవారికి ఇది కనువిప్పులాంటి వ్యాసం. నిజానికి నిజాయితీగా ప్రయత్నించాలే గానీ ప్రతి మనిషి జీవితంలోని ప్రతి చిన్న సంఘటనా సందర్భమూ సన్నివేశమూ కూడా ఎన్నో ముఖాలని కలిగి ఉంటుంది. అందులో ఎదుటివారికి కనపడేది ఒకటి, తనకి మాత్రమే తెలిసినది ఒకటి, తనకి తెలియకుండానే తనమీద తన చుట్టూ ఉన్న సమాజం ద్వారా ప్రభావితమయ్యేది ఒకటి, తనకి తెలియకుండానే అసంకల్పిత స్పందనలకి సంబంధించినది ఇంకొకటి, తన పూర్వీకులద్వారా తనకి సంక్రమించిన లక్షణాలకి సంబంధించినది వేరొకటీ ఇలా బహుముఖాలుగా ఉంటుంది.

    మళ్ళీ అందులోకూడా ఎదుటివారికి కనపడే ముఖంలో చాలా ముఖాలుంటాయి. అవన్నీ చూసేవాళ్ళ దృష్టినిబట్టి ఉంటాయి. ఒకరికి మంచి అనిపించిందే మరొకరికి చెడుగానూ ఇంకొకరికి లౌక్యంగానూ మరొకరికి మోసం గానూ దానివల్ల లాభం పొందినవారికి సహృదయతగానూ కనిపిస్తుంది. వాటిలో ఏది నిజం? ఏది ఆ వ్యక్తి అసలైన ముఖాన్ని పట్టి ఇవ్వగలదు? ఆ పట్టు దొరికిన ముఖం అలాగే ఉందా లేక కాలాన్నీ పరిస్థితులనీ అనుసరించి మారిపోయిందా? రాయడం అంటూ మొదలుపెట్టాలేగానీ అన్నీ ప్రశ్నలే. ఇలాంటి ప్రశ్నలన్నిటికీ జవాబులు వెతుక్కుంటూ తిరిగేవారికి ఈ వ్యాసం ఒక గొప్ప మజిలీ. ఇక్కడ ఆగితే చాలా ప్రశ్నలకి జవాబులు దొరుకుతాయనే నమ్మకం దొరికింది. మిగిలిన వ్యాసభాగం కోసం ఎదురు చూస్తున్నాను.

    పప్పు నాగరాజుగారూ, మీ అనువాదం చాలా బాగుంది. ముఖ్యంగా ఎక్కడా అనువాదం అని అనిపించలేదు. కృతకమైన పదజాలం లేదు. చాలా సహజంగా సాగింది. చాలా చక్కటి వ్యాసాన్ని అందించినందుకు కృతజ్ఞతలు.

    రాణి.

  9. మత్తకోకిల కథ గురించి kasi viswanadham y అభిప్రాయం:

    07/11/2012 6:11 am

    మీ మత్తకోకిల వ్యాసం చదివి చాల అనందించిన వారిలో నేను ఒకడిని.

  10. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి mkrao అభిప్రాయం:

    07/11/2012 4:55 am

    నచ్చొచ్చు నచ్చకపోవచ్చు – కానీ ఇంత చర్చకి కారణమైన ఆ కథ తన పరమార్ధం సాధించినట్టే.