మీ కవిత చదవగానే నచ్చింది. దీనిని ఆంగ్లంలోకి తర్జుమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలనిపించి వెంటనే చేసేయడం జరిగింది. చదివి మీ అభిప్రాయం తెలియజేస్తారని ఆశిస్తూ…
The last human
Gradually adapting to the death only
Becomes the way of life
Instead of pigeons “theetuvu ” birds
Start carrying the letters.
They find their own photo
And go away –
Those who flashed smiles
In their childhood group – photograph.
Not only the actors but also the
Audience leave one by one.
There wont be anyone to shed the tears
together on both the sides
For the trajedy on the stage
Along with the leaves this “samsara vrkhsham”
Loses its roots one by one
After all the knots get loosened
And after all the strings get broken
The emaciated body would be left behind
Like a single thread connecting with the world.
తఃతః గారు, తమిళములో పాల్, కన్నడములో హాలు పదాలు ఏకవచనమే. రసవాచకములు అన్నీ నిత్యైకవచనములు అంటారు, ఉదా. చమురు, నూనె, నేయి, ఇత్యాదులు. మరి పాలు నూనెలా ద్రవ పదార్థమే కదా? నీళ్లకు నీరు అనే పదము ఏకవచనము, మరి పాలు అనె పదానికి ఏకవచన పదము ఏమి? లేకపోతే పాలు అనే పదము పాల్ అనే పదమునుండి పుట్టలేదా? పాలు అనే పదము పాడి (పాడిపంటలలోని పాడి) అనే పదానికి బహువచనమా? అలా అయితే పాలు పాల్ – పాడి – పాడులు – పాలు మార్గముగా పుట్టిందా? కాల్ కాలు, తేళ్ తేలు, విరల్ వ్రేలు అయితే పాల్ మాత్రము పాలు కాక పాడి అయినదా? అంతా అయోమయోపియా! విధేయుడు – మోహన
సురేశ్ ! “ల , ళ” లని గురించి మీరెక్కడైనా చెప్పేరా?? లేకపోతే చెప్పకూడదూ? ళ అన్నది తెలుగు లోనే ఉందా?? సంస్కృతం లో లేదేమిటి? వాళ్ళు “మంగలం” అని అంటూంటారు. మనం “మంగళం” అని అంటాం!! నా సందేహం ఇంతవరకే!! ఇవాళ్టి టీవీల్లోనూ, కొండొకచో విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు కూడా ఈ మధ్య తెలుగులో “ళ” కి ” ల” ని వాడటాన్ని విన్నాను :). కళ్ల కి కల్లు అనీనీ; పళ్లకి, పల్లూ అనీనీ; వాళ్ళు అనడనికి వాల్లు అనీని. వెళ్ళు అనడానికి వెల్లు అనీనీ; దీని గురించి కాదు నేను అడుగుతున్నది. ఒకప్పుడు ఏయే కారణాలకైనా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే ఇటువంటి మాటల వాడుక టీ.వీ ల ధర్మమా అని ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ అక్ష్యరాస్యులూ నిరక్షరాస్యులూ అన్న భేదం క్రమంగా పోయి బలపడటాన్ని చూస్తున్నాను. ఇలా మాట్లాడుతున్న వారిలో టీచర్లూ డాక్టర్లూ వంటి వారూ ఉంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ చేరుతున్న కొందరు టీచర్లు కూడా ఉంటున్నారు. దీని మీద భాషా పరమైన చర్చ ఎవరూ చేసినట్టు లేదు. గొడవలు తప్ప భాషని గురించిన ధ్యాస మనుష్యులలో సన్నగిల్లడం బహుశా ఇందుకు కారణం. దీనిని వ్యాకరణం రాసిన చిన్నయసూరి ఏదైనా ఒక సూత్రం రాసి ఏదో సమర్ధింపు చేసే పరిస్థితి మరి ఇప్పుడు లేదాయె:) మరి మనం ఏం చేస్తాం? మళ్ళీ ఏదో సూత్రం ఇందుకోసం తయారు చేయాలా?? లేక నిశ్శబ్దంగా [ఇలాంటివి వింటున్నప్పుడల్లా] లోలోపలే గొణుక్కుంటూ ఊరుకోవాలా?? అప్పుడు రేపటి పిల్లలు ఏ తోవ తొక్కాలీ? “డౌటేహం” వస్తే ఎవరిని అడగాలీ?? వాడకం ఒకటి చెబుతూండగా సూత్రాలు మరొకటి చెబుతూంటాయి కదా 🙂 లేదా వర్గాల వారీగా మళ్ళీ వ్యాకరణాలని మార్చుకోవాలా?? ఇది నా ఇంకో ” డౌటేహం” !! 🙂
సరే నేను మొదలెట్టినప్పటి సందేహం దీని గురించి కాదు. సంస్కృతం లోని ల , తెలుగు లోని ” ళ” ల కలగలుపులూ వగైరాలు ఎలా రూపుదిద్దుకున్నాయీ అని? ఈ మంగలం అనడం హిందీ లోనూ ఇలాగే ఉన్నట్టుంది. శ్లోకం చదవ వలసి వస్తే వాళ్ళు, మంగలం భగవాన్ విష్ణుం మంగలం గరుడధ్వజా.. మంగలం పుండ రీకాక్ష అంటూనే కొనసాగిస్తారు. ఇది సంస్కృత ప్రభావం కాబోలు. లేదా ఔత్తరాహికులీ వాడకాన్ని చేస్తారా?? ఇదే తెలుగు వాళ్ళు అనవలసి వస్తే, మంగళం భగవాన్ విష్ణుం, అని కదా అంటాం. ఈ బేధం ఎందుకు వచ్చిందీ? ఇది తెలుగు లోనే ఉందా?? లేక ఇతర ద్రావిడ భాషలలోనూ ఉందా?? అదే సంస్కృతపు లకారం తెలుగున ళకారం కావడం. దాని వివిధ దశలూనూ అని. దీని గురించి మీ ఆలోచనలని చెప్పండి.
ఇంక తెలుగు తమిళ భాషల మధ్య ఉన్న భాషాపరమైన వాడకం వల్ల కాబోలు తమిళ గాయకులు తెలుగు పదాలనీ, కీర్తనలనీ పాడేటప్పుడు , “పలుకు” అని అనడానికి ” పలికు” అనీనీ, “వెదజల్లెడు” అని అనేటప్పుడు “వెదజల్లడు” అనీనీ అంటూంటారు. ఇలాంటి ఉదాహరణలు మనం అనేకం పట్టుకోవచ్చు. ఇలా ఎందుకని వాళ్ళు పాడటం జరుగుతూ ఉంటుందీ? తమిళంలో “ఎ” కారం తెలుగు లోని అకారానికి సమానమా?? ఏమిటీ కారణం? వాళ్ళకి ఉ , ఎ లాంటివి లేవేంటి ?
ఇవన్నీ భాషల, వ్యాకరణాల పరిధి లోకే వస్తాయి గనక మీరు చెప్పగలరేమో అని.
విశ్వనాథం గారికి, తఃతః గారికి నా వ్యాసము నచ్చినందులకు కృతజ్ఞతలు.
తఃతః గారు – 1962లో తిరుపతి, 1971లో బెంగళూరు వదలిన తరువాత నాకు దైనందినము తెలుగు మాటలాడే అవకాశము లేదు. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు మాత్రమే అలాటి అవకాశము కలుగుతుంది. ఇదంతా ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాదు, కన్నడము. మీరు చెప్పినది బహుశా సరియే అనుకొంటాను. అదలా ఉంచితే, బాలవ్యాకరణములో ఆచ్ఛిక పరిచ్ఛేదములో – ఇ, టి, తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు. ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం ప్రాయికంబుగ నగు అనే సూత్రము క్రింద కాలు – కాలిని – కాలిచే, నాఁగలి – నాఁగటిని – నాఁగటిచే, నేయి – నేతిని – నేతిచే ఉదాహరణములుగా ఇవ్వబడినవి. అలాగే ఆలు (భార్య) కూడ. పాలు పదము కాలు, ఆలు వంటిదే కదా? కాని పాలు ఏకవచనము కాక నిత్యబహువచనమా? అది నిత్య బహువచనము అయితే అప్పుడు, చేలను (చేను – చేలు), ఆలను (ఆవు – ఆలు) వలె పాలు – పాలను అవుతుంది.
సంజీవదేవ్ గారికున్న ఒక గొప్ప గుణం, నమ్రత. ఒక గొప్ప లక్షణం, ఆయన సౌహార్దత. ఆయన వేసిన నీటిరంగుల బొమ్మలపై, ఆయన చిత్రకళావిమర్శలపై, చివరకి ఆయన రాసిన వేదాంత వ్యాసాలపై తీవ్రమైన అభిప్రాయభేదాలు వెల్లబుచ్చిన వారిని సైతం ఆయన సగౌరవంగా ఆహ్వానించడం నేనెరుగుదును. ఇది స్వానుభవం. ఆ సహృదయుడు మీబోటి వారికి “చిత్రకళారంగంలో” ఓ న మాలు దిద్దించడం నాకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
చిత్రకారుడిగా రామారావు నాకు గత 30+ సంవత్సరాలుగా పరిచయమున్నవ్యక్తి.
Poems in Pigment అనే వ్యాసం నేను ఇంగ్లీషులో రాశాను; 1995 షికాగో తానా సావనీర్ కోసం. ఈ వ్యాసం రాయడానికి రామారావుతో నాకున్న స్నేహం ఒక కారణం. నవ్యచిత్రకళాస్వాదనపరంగా నాకున్న కొద్దిపాటి నిపుణతపై రామారావుకున్న భరోసా, మరొక కారణం.
ప్రస్తుతం అచ్చైన వ్యాసానికి అనువాదం ఎప్పుడో పధ్నాల్గేళ్ళక్రితం ఈనాడు పత్రికలో పనిచేసే వ్యక్తి చేత చేయించారని విన్నాను. అలాగని ఇప్పుడు ఈమాటలో ప్రచురించబడ్డ వ్యాసానికి నేను బాధ్యుణ్ణి కానని కప్పదాటు వెయ్యటల్లేదు. అనువాదం నప్పకపోయినా, తప్పులేమైనా దొర్లి ఉన్నా, ఆ తప్పులు నావే! మరొకరెవరైనా అనువదించి ఉంటే ఇంతకన్నా బాగా ఉండి ఉండవచ్చును అన్నది వివాదాంశం కాదు.
చిత్రకళ మతింపుపై నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ప్రపంచస్థాయిలో పేరున్న విమర్శకులు. చిత్రకళలో కొత్త మెరుపులపై, చిత్రకళాస్వాదనపై వాళ్ళు ఇప్పటికీ అమెరికాలోను , ఇంగ్లండ్ లోనూ పత్రికల్లో వ్యాసాలు రాస్తూనే వున్నారు. సంజీవదేవ్ గారి పుస్తకాలు తిరగవేయవలసిన అవసరం నాకు ఇప్పుడు లేదు. సంజీవదేవ్ గారి కళతో, రచనలతో నాకు అభిప్రాయభేదాలున్నాయి. అలాగని వారిని చులకన చెయ్యటం లేదు. ఎవరి రాతలైనా చులకన చెయ్యటం పొగరుమోతు లక్షణం అని నాకు తెలుసును.
ఆఖరుగా, మీతో ఏ విషయంపై ఐనా చర్చకి దిగటం అనవసరం. ముఖ్యంగా మరొకసారి రససిద్ధాంత చర్చ చేయటం అంతకన్నా అనవసరం. చేయను. క్షమించండి.
సురేశ్ గారూ! తెలుగులో వ్యాకరణగ్రంధాలను చాలా చక్కగా పరిచయంచేశారు. ఈ విధంగా పరిచయచేయడం నిడదవోలు వెంకట రావుగారి తర్వాత మీరేనేమో. ధన్యవాదాలు. కవిజనాశ్రయం గురించి యొక విషయం. కవిజనాశ్రయంలో మూడధికారముల వఱకు బ్రౌణ్ దొరగారు భాషాంతరీకరణం చేసారనియు, 1917కి ముందే వారి యెద్దనున్న ప్రతిలో కవిజనాశ్రయము మల్లియరేచన కృతమని స్పష్టముగ నున్నదని కీ.శే.వావిళ్ళ వెంకటేశ్వరులుగారు 1950లో వ్రాసిన తమ విజ్ఞప్తిని, 1951 శివరాత్రి నాడు కీ.శే.నిడదవోలు వెంకటరావుగారు వ్రాసిన సుదీర్ఘమైన “తెలుగుభాషలో చంధో లక్షణగ్రంధములు” అనే శీర్షికతో వ్రాసిన పీఠికతో 1966లో ముద్రించేరు. ఆ పీఠికలోనే సుమారు 35 వ్యాకరణ లక్షణ గ్రంధములు పేర్కొని యింకను ఇటువంటివి తంజావూరు పుస్తక భాండాగరమున గలవని వ్రాసిరి. అంచేత ఇంకా ఎన్నోయుండి యుండవచ్చు. కొన్నిటినైనా పరిచయం జేసినందుకు మీకు నా ధన్యవాదములు.
ఆంధ్రభాషలో చారిత్రక నవల అనే వ్యాసం చాలాబాగుంది. ఎన్నో చారిత్రక నవలలు వాటిలో విశేషాలు చాలా చక్కగా వివరించేరు నోరి వారు. వారి నవల కవిసార్వభౌముడు నా దృష్టిని శ్రీనాధుని వైపు మళ్ళించింది. పై వ్యాసంలో తెలుగులో వచ్చిన అద్భుత నవల ‘సత్యప్రభ’ గురించి ప్రస్తావన లేకపోవడానికి కారణాలు మనకు తెలియవు. ఈ నవల రచయిత కావ్యకంఠ వాశిష్ఠ గణపతిమునిగారు. ఇది 1937 లోనే భారతి మాస పత్రికలో ధారావాహికంగా వచ్చింది. తదుపరి వారి కుమారుడు కీ.శే. వాశిష్ఠ మహదేవశాస్త్రిగారు 1964లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించేరు. పిదప ఈ నవలను విశాలాంధ్ర పుస్తక ప్రచురణలు, హైదరాబాదు వారు ముద్రించేరు. ఈ నవలను నా సోదరుడు కీ.శే. డా.గంటి శ్రీరామమమూర్తి, 1982లో ఆంగ్లము లోనికి అనువదించేరు. 2011 అక్టోబరు నుంచి “పొద్దు” అంతర్జాల పత్రికలో ధారావాహికంగా రావడం ముదావహం. కాని ఈ నవల తెలుగు, ఇంగ్లీషు కూడా ఇప్పుడు ఒకటి రెండు కాపీలు తప్ప ఆంధ్రదేశంలో ఎక్కడా దొరకక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఈ నవల ఇతి వృత్తం అలనాటి ఆంధ్రసామ్రాజ్యమునేలిన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ. ఆంధ్ర, మగధ రాజ్యాల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల నాధారంగా జేసుకొని విస్తృతమైన తెరమీద ఎన్నో పాత్రలను సంధానం చేస్తూ ఆంధ్రమహావిష్ణువు యొక్క చారిత్రాత్మక ప్రణయగాధగా మలచిన శ్రీకావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునిగారి స్వకపోల కల్పితం.చివరి కొంత భాగమ మాత్రం వారి కుమారుడు వాశిష్ఠ పూరించేరు.
ఆఖరి మనిషి గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:
07/14/2012 12:46 pm

మత్తకోకిల కథ గురించి మోహన అభిప్రాయం:
07/14/2012 9:03 am
తఃతః గారు, తమిళములో పాల్, కన్నడములో హాలు పదాలు ఏకవచనమే. రసవాచకములు అన్నీ నిత్యైకవచనములు అంటారు, ఉదా. చమురు, నూనె, నేయి, ఇత్యాదులు. మరి పాలు నూనెలా ద్రవ పదార్థమే కదా? నీళ్లకు నీరు అనే పదము ఏకవచనము, మరి పాలు అనె పదానికి ఏకవచన పదము ఏమి? లేకపోతే పాలు అనే పదము పాల్ అనే పదమునుండి పుట్టలేదా? పాలు అనే పదము పాడి (పాడిపంటలలోని పాడి) అనే పదానికి బహువచనమా? అలా అయితే పాలు పాల్ – పాడి – పాడులు – పాలు మార్గముగా పుట్టిందా? కాల్ కాలు, తేళ్ తేలు, విరల్ వ్రేలు అయితే పాల్ మాత్రము పాలు కాక పాడి అయినదా? అంతా అయోమయోపియా! విధేయుడు – మోహన
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
07/14/2012 12:52 am
సురేశ్ ! “ల , ళ” లని గురించి మీరెక్కడైనా చెప్పేరా?? లేకపోతే చెప్పకూడదూ? ళ అన్నది తెలుగు లోనే ఉందా?? సంస్కృతం లో లేదేమిటి? వాళ్ళు “మంగలం” అని అంటూంటారు. మనం “మంగళం” అని అంటాం!! నా సందేహం ఇంతవరకే!! ఇవాళ్టి టీవీల్లోనూ, కొండొకచో విశ్వవిద్యాలయాల్లో పాఠాలు చెప్పే ప్రొఫెసర్లు కూడా ఈ మధ్య తెలుగులో “ళ” కి ” ల” ని వాడటాన్ని విన్నాను :). కళ్ల కి కల్లు అనీనీ; పళ్లకి, పల్లూ అనీనీ; వాళ్ళు అనడనికి వాల్లు అనీని. వెళ్ళు అనడానికి వెల్లు అనీనీ; దీని గురించి కాదు నేను అడుగుతున్నది. ఒకప్పుడు ఏయే కారణాలకైనా ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమై ఉండే ఇటువంటి మాటల వాడుక టీ.వీ ల ధర్మమా అని ఇప్పుడు అన్ని ప్రాంతాలలోనూ అక్ష్యరాస్యులూ నిరక్షరాస్యులూ అన్న భేదం క్రమంగా పోయి బలపడటాన్ని చూస్తున్నాను. ఇలా మాట్లాడుతున్న వారిలో టీచర్లూ డాక్టర్లూ వంటి వారూ ఉంటున్నారు. విశ్వవిద్యాలయాల్లో ఇవాళ చేరుతున్న కొందరు టీచర్లు కూడా ఉంటున్నారు. దీని మీద భాషా పరమైన చర్చ ఎవరూ చేసినట్టు లేదు. గొడవలు తప్ప భాషని గురించిన ధ్యాస మనుష్యులలో సన్నగిల్లడం బహుశా ఇందుకు కారణం. దీనిని వ్యాకరణం రాసిన చిన్నయసూరి ఏదైనా ఒక సూత్రం రాసి ఏదో సమర్ధింపు చేసే పరిస్థితి మరి ఇప్పుడు లేదాయె:) మరి మనం ఏం చేస్తాం? మళ్ళీ ఏదో సూత్రం ఇందుకోసం తయారు చేయాలా?? లేక నిశ్శబ్దంగా [ఇలాంటివి వింటున్నప్పుడల్లా] లోలోపలే గొణుక్కుంటూ ఊరుకోవాలా?? అప్పుడు రేపటి పిల్లలు ఏ తోవ తొక్కాలీ? “డౌటేహం” వస్తే ఎవరిని అడగాలీ?? వాడకం ఒకటి చెబుతూండగా సూత్రాలు మరొకటి చెబుతూంటాయి కదా 🙂 లేదా వర్గాల వారీగా మళ్ళీ వ్యాకరణాలని మార్చుకోవాలా?? ఇది నా ఇంకో ” డౌటేహం” !! 🙂
సరే నేను మొదలెట్టినప్పటి సందేహం దీని గురించి కాదు. సంస్కృతం లోని ల , తెలుగు లోని ” ళ” ల కలగలుపులూ వగైరాలు ఎలా రూపుదిద్దుకున్నాయీ అని? ఈ మంగలం అనడం హిందీ లోనూ ఇలాగే ఉన్నట్టుంది. శ్లోకం చదవ వలసి వస్తే వాళ్ళు, మంగలం భగవాన్ విష్ణుం మంగలం గరుడధ్వజా.. మంగలం పుండ రీకాక్ష అంటూనే కొనసాగిస్తారు. ఇది సంస్కృత ప్రభావం కాబోలు. లేదా ఔత్తరాహికులీ వాడకాన్ని చేస్తారా?? ఇదే తెలుగు వాళ్ళు అనవలసి వస్తే, మంగళం భగవాన్ విష్ణుం, అని కదా అంటాం. ఈ బేధం ఎందుకు వచ్చిందీ? ఇది తెలుగు లోనే ఉందా?? లేక ఇతర ద్రావిడ భాషలలోనూ ఉందా?? అదే సంస్కృతపు లకారం తెలుగున ళకారం కావడం. దాని వివిధ దశలూనూ అని. దీని గురించి మీ ఆలోచనలని చెప్పండి.
ఇంక తెలుగు తమిళ భాషల మధ్య ఉన్న భాషాపరమైన వాడకం వల్ల కాబోలు తమిళ గాయకులు తెలుగు పదాలనీ, కీర్తనలనీ పాడేటప్పుడు , “పలుకు” అని అనడానికి ” పలికు” అనీనీ, “వెదజల్లెడు” అని అనేటప్పుడు “వెదజల్లడు” అనీనీ అంటూంటారు. ఇలాంటి ఉదాహరణలు మనం అనేకం పట్టుకోవచ్చు. ఇలా ఎందుకని వాళ్ళు పాడటం జరుగుతూ ఉంటుందీ? తమిళంలో “ఎ” కారం తెలుగు లోని అకారానికి సమానమా?? ఏమిటీ కారణం? వాళ్ళకి ఉ , ఎ లాంటివి లేవేంటి ?
ఇవన్నీ భాషల, వ్యాకరణాల పరిధి లోకే వస్తాయి గనక మీరు చెప్పగలరేమో అని.
రమ.
మత్తకోకిల కథ గురించి తః తః అభిప్రాయం:
07/13/2012 9:04 pm
శ్రీ మోహన:
1.’పాలు వచ్చాయి/కారాయి.’ అలాగే ‘నీళ్ళు వచ్చాయి/కారాయి’ అనే అంటాము కాబట్టి పాలు, నీళ్ళూ నిత్య బహువచనాలు.
2 పాలు అంటే ‘భాగము’ అనే అర్థం కూడా ఉంది. చెందవలసినది అనే అర్థంలో కూడా వాడుక ఉంది.
సగపాలు = సగము భాగము
“..సింహము ‘పాలి’ సొమ్ము గోమాయువు కోరు చందమున …” [పోతన భాగవతం రుక్మిణీ కల్యాణం] సింహమునకు చెందవలసినది.
మిత్రుడు
తః తః
మత్తకోకిల కథ గురించి మోహన అభిప్రాయం:
07/13/2012 4:14 pm
విశ్వనాథం గారికి, తఃతః గారికి నా వ్యాసము నచ్చినందులకు కృతజ్ఞతలు.
తఃతః గారు – 1962లో తిరుపతి, 1971లో బెంగళూరు వదలిన తరువాత నాకు దైనందినము తెలుగు మాటలాడే అవకాశము లేదు. ఎప్పుడైనా ఎవరినైనా కలిసినప్పుడు మాత్రమే అలాటి అవకాశము కలుగుతుంది. ఇదంతా ఎందుకంటే నా మాతృభాష తెలుగు కాదు, కన్నడము. మీరు చెప్పినది బహుశా సరియే అనుకొంటాను. అదలా ఉంచితే, బాలవ్యాకరణములో ఆచ్ఛిక పరిచ్ఛేదములో – ఇ, టి, తి వర్ణంబులు వక్ష్యమాణంబు లౌపవిభక్తికంబులు. ఇవి ద్వితీయాద్యేకవచనంబులు పరంబులగునపుడు నామంబులకుం గొన్నింటికిం ప్రాయికంబుగ నగు అనే సూత్రము క్రింద కాలు – కాలిని – కాలిచే, నాఁగలి – నాఁగటిని – నాఁగటిచే, నేయి – నేతిని – నేతిచే ఉదాహరణములుగా ఇవ్వబడినవి. అలాగే ఆలు (భార్య) కూడ. పాలు పదము కాలు, ఆలు వంటిదే కదా? కాని పాలు ఏకవచనము కాక నిత్యబహువచనమా? అది నిత్య బహువచనము అయితే అప్పుడు, చేలను (చేను – చేలు), ఆలను (ఆవు – ఆలు) వలె పాలు – పాలను అవుతుంది.
విధేయుడు – మోహన
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి vrveluri అభిప్రాయం:
07/13/2012 3:42 pm
తమ్మినేని యదుకులభూషణ్ గారికి ముందుగా కృతజ్ఞతలు.
సంజీవదేవ్ గారికున్న ఒక గొప్ప గుణం, నమ్రత. ఒక గొప్ప లక్షణం, ఆయన సౌహార్దత. ఆయన వేసిన నీటిరంగుల బొమ్మలపై, ఆయన చిత్రకళావిమర్శలపై, చివరకి ఆయన రాసిన వేదాంత వ్యాసాలపై తీవ్రమైన అభిప్రాయభేదాలు వెల్లబుచ్చిన వారిని సైతం ఆయన సగౌరవంగా ఆహ్వానించడం నేనెరుగుదును. ఇది స్వానుభవం. ఆ సహృదయుడు మీబోటి వారికి “చిత్రకళారంగంలో” ఓ న మాలు దిద్దించడం నాకు ఏమాత్రం ఆశ్చర్యాన్ని కలిగించలేదు.
చిత్రకారుడిగా రామారావు నాకు గత 30+ సంవత్సరాలుగా పరిచయమున్నవ్యక్తి.
Poems in Pigment అనే వ్యాసం నేను ఇంగ్లీషులో రాశాను; 1995 షికాగో తానా సావనీర్ కోసం. ఈ వ్యాసం రాయడానికి రామారావుతో నాకున్న స్నేహం ఒక కారణం. నవ్యచిత్రకళాస్వాదనపరంగా నాకున్న కొద్దిపాటి నిపుణతపై రామారావుకున్న భరోసా, మరొక కారణం.
ప్రస్తుతం అచ్చైన వ్యాసానికి అనువాదం ఎప్పుడో పధ్నాల్గేళ్ళక్రితం ఈనాడు పత్రికలో పనిచేసే వ్యక్తి చేత చేయించారని విన్నాను. అలాగని ఇప్పుడు ఈమాటలో ప్రచురించబడ్డ వ్యాసానికి నేను బాధ్యుణ్ణి కానని కప్పదాటు వెయ్యటల్లేదు. అనువాదం నప్పకపోయినా, తప్పులేమైనా దొర్లి ఉన్నా, ఆ తప్పులు నావే! మరొకరెవరైనా అనువదించి ఉంటే ఇంతకన్నా బాగా ఉండి ఉండవచ్చును అన్నది వివాదాంశం కాదు.
చిత్రకళ మతింపుపై నాకు పాఠాలు చెప్పిన వాళ్ళు ప్రపంచస్థాయిలో పేరున్న విమర్శకులు. చిత్రకళలో కొత్త మెరుపులపై, చిత్రకళాస్వాదనపై వాళ్ళు ఇప్పటికీ అమెరికాలోను , ఇంగ్లండ్ లోనూ పత్రికల్లో వ్యాసాలు రాస్తూనే వున్నారు. సంజీవదేవ్ గారి పుస్తకాలు తిరగవేయవలసిన అవసరం నాకు ఇప్పుడు లేదు. సంజీవదేవ్ గారి కళతో, రచనలతో నాకు అభిప్రాయభేదాలున్నాయి. అలాగని వారిని చులకన చెయ్యటం లేదు. ఎవరి రాతలైనా చులకన చెయ్యటం పొగరుమోతు లక్షణం అని నాకు తెలుసును.
ఆఖరుగా, మీతో ఏ విషయంపై ఐనా చర్చకి దిగటం అనవసరం. ముఖ్యంగా మరొకసారి రససిద్ధాంత చర్చ చేయటం అంతకన్నా అనవసరం. చేయను. క్షమించండి.
మిత్రుడు,
వేలూరి వేంకటేశ్వర రావు.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి గంటి లక్ష్మీ నరసింహ మూర్తి అభిప్రాయం:
07/13/2012 11:59 am
సురేశ్ గారూ! తెలుగులో వ్యాకరణగ్రంధాలను చాలా చక్కగా పరిచయంచేశారు. ఈ విధంగా పరిచయచేయడం నిడదవోలు వెంకట రావుగారి తర్వాత మీరేనేమో. ధన్యవాదాలు. కవిజనాశ్రయం గురించి యొక విషయం. కవిజనాశ్రయంలో మూడధికారముల వఱకు బ్రౌణ్ దొరగారు భాషాంతరీకరణం చేసారనియు, 1917కి ముందే వారి యెద్దనున్న ప్రతిలో కవిజనాశ్రయము మల్లియరేచన కృతమని స్పష్టముగ నున్నదని కీ.శే.వావిళ్ళ వెంకటేశ్వరులుగారు 1950లో వ్రాసిన తమ విజ్ఞప్తిని, 1951 శివరాత్రి నాడు కీ.శే.నిడదవోలు వెంకటరావుగారు వ్రాసిన సుదీర్ఘమైన “తెలుగుభాషలో చంధో లక్షణగ్రంధములు” అనే శీర్షికతో వ్రాసిన పీఠికతో 1966లో ముద్రించేరు. ఆ పీఠికలోనే సుమారు 35 వ్యాకరణ లక్షణ గ్రంధములు పేర్కొని యింకను ఇటువంటివి తంజావూరు పుస్తక భాండాగరమున గలవని వ్రాసిరి. అంచేత ఇంకా ఎన్నోయుండి యుండవచ్చు. కొన్నిటినైనా పరిచయం జేసినందుకు మీకు నా ధన్యవాదములు.
భవదీయుడు
గంటి లక్ష్మీనరసింహమూర్తి
(బెంగుళూరు)
బింబం గురించి G.S.Lakshmi అభిప్రాయం:
07/13/2012 10:47 am
ఆలోచింపచేసే కథ. మహిళలు ఎదుర్కొంటున్న సమస్య విశ్లేషిస్తూనే పరిష్కారం కూడా చెప్పిన మూలకథ, అనువాదం కూడా చాలా బాగున్నాయి.
ఆంధ్రభాషలో చరిత్రాత్మక నవల గురించి గంటి లక్ష్మీ నరసింహ మూర్తి అభిప్రాయం:
07/13/2012 10:41 am
ఆంధ్రభాషలో చారిత్రక నవల అనే వ్యాసం చాలాబాగుంది. ఎన్నో చారిత్రక నవలలు వాటిలో విశేషాలు చాలా చక్కగా వివరించేరు నోరి వారు. వారి నవల కవిసార్వభౌముడు నా దృష్టిని శ్రీనాధుని వైపు మళ్ళించింది. పై వ్యాసంలో తెలుగులో వచ్చిన అద్భుత నవల ‘సత్యప్రభ’ గురించి ప్రస్తావన లేకపోవడానికి కారణాలు మనకు తెలియవు. ఈ నవల రచయిత కావ్యకంఠ వాశిష్ఠ గణపతిమునిగారు. ఇది 1937 లోనే భారతి మాస పత్రికలో ధారావాహికంగా వచ్చింది. తదుపరి వారి కుమారుడు కీ.శే. వాశిష్ఠ మహదేవశాస్త్రిగారు 1964లో ఆంధ్రప్రభ వారపత్రికలో ధారావాహికంగా ప్రచురించేరు. పిదప ఈ నవలను విశాలాంధ్ర పుస్తక ప్రచురణలు, హైదరాబాదు వారు ముద్రించేరు. ఈ నవలను నా సోదరుడు కీ.శే. డా.గంటి శ్రీరామమమూర్తి, 1982లో ఆంగ్లము లోనికి అనువదించేరు. 2011 అక్టోబరు నుంచి “పొద్దు” అంతర్జాల పత్రికలో ధారావాహికంగా రావడం ముదావహం. కాని ఈ నవల తెలుగు, ఇంగ్లీషు కూడా ఇప్పుడు ఒకటి రెండు కాపీలు తప్ప ఆంధ్రదేశంలో ఎక్కడా దొరకక పోవడం ఆంధ్రుల దురదృష్టం.
ఈ నవల ఇతి వృత్తం అలనాటి ఆంధ్రసామ్రాజ్యమునేలిన శ్రీకాకుళ ఆంధ్రమహావిష్ణువు కథ. ఆంధ్ర, మగధ రాజ్యాల రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక పరిస్థితుల నాధారంగా జేసుకొని విస్తృతమైన తెరమీద ఎన్నో పాత్రలను సంధానం చేస్తూ ఆంధ్రమహావిష్ణువు యొక్క చారిత్రాత్మక ప్రణయగాధగా మలచిన శ్రీకావ్యకంఠ వాశిష్ఠ గణపతి మునిగారి స్వకపోల కల్పితం.చివరి కొంత భాగమ మాత్రం వారి కుమారుడు వాశిష్ఠ పూరించేరు.
భవదీయుడు
గంటి లక్ష్మీ నరసింహమూర్తి (బెంగుళూరు).
ఉరుము ఉరిమి… గురించి pandu అభిప్రాయం:
07/13/2012 8:50 am
చాలా బాగుంది. ఇవి అన్ని ఇళ్ళలో రొజు మామూలే, పనిమనుషులతో.