‘స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన.‘
* అదే బెటరనిపిస్తుంది మోహనగారూ!
మాకొక డ్రైవర్ వుండే వాడు. పేరు మునిరాజ్. ఎప్ఫుడూ టైం కి వచ్చేవాడు కాడు. ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, ‘ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా సార్..’ అనే వాడు. ‘ఐతే ఏం చేయమంటావ్’? ఆఫీస్ మానేయమంటావా? అని విసురుగా అడిగితే… ‘మానేయడం ఎందుకు సార్? మీరు బేగ ఫలానాచోటు కొచ్చేస్తే, నేనాడ్నుంచి తోలుకుపోతా’ అంటూ ఓ ఉచిత సలహా చెప్పేవాడు. పైగా, ‘అలా ఐతేనే, మనకు టైం కల్సొస్తుంద్సార్. మీరు త్వరగ ఆఫీస్ కి పోవచ్చు, (ఆలోచించుకోండి)’ అంటూ ఓ సూచన కూడా పడేసే వాడు.
చెబితే నవ్వుతారు కానీ, చివరికి అదే జరిగేది. అతను చెప్పినట్టే నడుచుకునే వాళ్ళం. అలనాడు – రథసారధి గీతోపదేశంతో అర్జునునికి జ్ఞానోదయమైనట్టు, మాకూ ‘కాల జ్ఞానం’ కలిగింది ఈ డ్రైవర్ల వల్ల! అందుకని, మేమే ఓ అడుగు ముందుగా బయల్దేరే వాళ్ళం. “ఏమిటీ! ఇంత త్వరగా,?” అని ఎవరైనా అడిగితే “డ్రైవర్ని పికప్ చేసుకోవాలి!” అంటూ మా జోక్ కి మేమే నవ్వుకునే వాళ్ళం.
ఇలాంటి ‘బద్ధకిష్టుల’ పట్ల మనకు – మానవతా దృక్పధం మెండుగా వుంటే తప్ప, భారత దేశంలో నవ్వడం సాధ్యం కాదని స్వానుభవంతో తెలుసుకున్నా.
థాంక్స్ మోహన గారూ! నా రచన బావుంది అన్నందుకు!
నమస్సులతో-
ఆర్. దమయంతి
రవీందర్ గారు – మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. భావం తెలుస్తోంది. మరికొంత మెరుగుపరచవచ్చునేమో చూడండి.
వ్యాఖ్యలు రాసిన ఇతరులకు కూడా ధన్యవాదాలు. ఒక చిన్న వివరణ. ఒక తరంలో ఆత్మీయులు, సహచరులు, తాము ఆరాధించిన సెలబ్రిటీలు ఒకరొకరుగా వెళ్ళిపోయాక, మిగిలిన మనుషుల అంతరంగచిత్రణ కోసం చేసిన ప్రయత్నం ఈ కవిత. ఇక్కడ ఆఖరి మనిషి అంటే అర్థం అదే. అంతేగాని, మానవజాతి నశిస్తుందని నా ఉద్దేశం కాదు. – రవిశంకర్
ఎం కె రావు గారూ, ఏ లోపం లేకుండా, ఎక్కడా నూటికి నూరుశాతం పెర్ఫెక్షన్ ఉంటున్దని నేను అనుకోను. ఏ లోపం లేని వ్యక్తులెలా ఉండరో అలాగే లోపం లేని కధ ఉండకపోవచ్చు. కాని ఈ కధలో లోపాలు చాలా ప్రధానమైనవి. వాటిని పట్టించుకోకుండా ఈ కధకు గత యాబై ఏళ్ళుగా కొంతమంది వీరపూజ చేసారు. అదే నిజమని ప్రచారం చేసారు. యిప్పటికీ చేస్తునే ఉన్నారు. ఆ ‘అతి’ మీదనే నా వ్యతిరేకత.
యిక మీరన్నట్టు, మంచి అన్నది మల్లెపూల సువాసన లాంటిది దానిని వీలయినంత ఎక్కువ ప్రచారం చేయాలి. చెడు అన్నది మురిక్కాలవ వాసన వంటిది. దానిని వీలయినంత వేగంగా కప్పెట్టేయాలి. నేను అదే చేస్తున్నాననుకుంటున్నాను.
రమ గారు, “పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి.
ఇక్కడ మేలా (పుస్తక్ మేలా, మేల కాదు) అనేది పండుగ లేక సంత అనే అర్థములో వచ్చే హిందీ పదము అని నా భావన. అది మేళ కాదు, తెలుగులో మేళము అంటే సమూహము, ముఖ్యముగా ఆటకత్తెల సమూహము అనుకొంటాను. పుస్తకము + ఏల = పుస్తక మేల అనలేదే, అందుకు సంతోషించాలి. తమిళంలో “ఎ” కారం తెలుగు లోని అకారానికి సమానమా?? ఏమిటీ కారణం? వాళ్ళకి ఉ , ఎ లాంటివి లేవేంటి ?
అన్ని చోటులలో అలా వాడరు వాళ్లు. జ-కారముతో మొదలయ్యే సంస్కృత పదాలకు జె-కారమును తరచు వాడుతారు, ఉదా. జయం – జెయం. ఇలాటివి తెలుగులో కూడ కొన్ని ఉన్నాయి, ఉదా. చంద్రిక, చెంద్రిక; జలగ, జెలగ. ర-కారానికి బదులు రె-కారమును అరుదుగా వాడుతారు, ఉదా. రమ – రెమ. తమిళ ఛందస్సులో ఐ-కారమును లఘువుగా వాడడము నాకు తెలుసు. ఉ-కారము చివర వస్తే అది ఒక్కొక్కప్పుడు పరిగణించబడదు. కాని కొన్ని విషయాలలో వాళ్ల నియమాలు చాల కఠినమైనవి. మిగిలిన భాషలలో ఆ, అం, కల్ మున్నగునవి ఒకే విధమైన గురువుగా అంగీకరించినా తమిళములో వాటికి భిన్నత ఉన్నది. పాటలలో వీటిని గమనించవచ్చును. విధేయుడు – మోహన
రమగారు: ‘వేంకటాచలం’ అని పెట్టక ‘వెంకట చలం’ అని పేరుపెట్టినప్పుడు ‘చలం’ అని పిలవడం సరదాగా ఉంది అంటే చెప్పలేను గానీ ‘మధుసూదన’ అని దేవుడి పేరు పెట్టి ‘మధు’ అని – ఆ దేవుడి చేతిలో చచ్చిన – రాక్షసుడి పేరుతో పిలవటం నవ్వు తెప్పిస్తుంది.
సంజీవ దేవుల సౌహార్దము జగమెరిగినదే. గురు శుశ్రూషా ఫలం మన రాతల్లో, చేతల్లో కనిపించాలి కానీ మాటల్లో కాదు. రచయితగా వేలూరి వారు వివరణ ఇచ్చుకొనే అవసరమే లేదు. కారణం, వారు, ఈ అనువాదం చేయలేదు. అంతే గాక నేను వారి ఆంగ్ల మాతృక చదవలేదు, కాబట్టి నేను ‘వెల్లబుచ్చిన’ అభిప్రాయాలు కేవలం ప్రస్తుత అనువాదానికే పరిమితం.ఇక పోతే,
రచయితలకు సూచనలు అన్న విభాగంలో
“మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. “
శుభం, ఈ వ్యాసాన్ని సంపాదకులు సమీక్షించారా ?? [ఈ వ్యాసం Poems in Pigment అనే ఇంగ్లీషు వ్యాసం కొన్ని సవరణలతో అనువదించబడి మొదట 1995లో తానా తెలుగు వెలుగులో ప్రచురించబడింది. కొత్తగా మార్పులూ చేర్పులూ చేసిన వ్యాసం ఈమాటలో ఇప్పుడు ప్రచురించాము – సం]
సమీక్షంచడమే, కాదు, మార్పులు చేర్పులు కూడా చేశారు, సంతోషం,
వ్యాసానికి ఒక పఠనీయత అవసరం లేదా ??పారిభాషిక పదాల విషయంలో జాగ్రత్త అవసరంలేదా ?? వాక్యాలకు ఒక అన్వయం ఉండొద్దా ??అనువాదం ఎలా వికటించినా పాఠకులు భరించ వలసిందేనా??
వ్యాసకర్తలు సంపాదకులే అయినప్పుడు పాటించవలసిన సమీక్షా ప్రమాణాలు మారతాయా ?? ఈ మాట సంపాదక మండలి మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలివి.
రామాయణంలో పిడకల వేట :
“1950ల చివరలో ప్రముఖ జీవసాంఖ్య* శాస్తవేత్త సర్ జె. బి. ఎస్. హాల్డేన్ అప్పట్లో కలకత్తా నుండి వెలువడుతుండిన ప్రముఖ ఆంగ్లపత్రిక స్టేట్స్‌మన్‌లో ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన ఉత్తరంలో తెలుగుభాషకు ఇతర భాషలతో ఒదిగే అద్భుతగుణం వుందని విపరీతంగా పొగిడాడు. అక్కడితో ఆగక తెలుగు భాషకు భారతదేశంలో జాతీయభాష కావటానికి అవసరమైన అన్నిఅర్హతలు ఉన్నాయని రాశాడు.” (*సాంఖ్యక అని ఉండాలి, సాంఖ్యము షట్ దర్శనాల్లో ఒకటి, సాంఖ్యక శాస్త్రం అంటే Statistics )
అతకని హాల్డేన్ ఉదంతంతో వ్యాసాన్ని ఆరంభించారు, బాగానే ఉంది, తెలుగు గురించి హాల్డేన్ కు ఏమి తెలుసో , ఎలా తెలుసో అన్నీ ఊహపోహలే, ఇంత కథ నడిపే ముందు, హాల్డేన్ తెలుగు భాష గురించి
ఏమన్నాడో రచయితకు తెలుసా?? తెలుసే అనుకుందాం, ఆ విషయాన్ని, పాద పీఠికలో పాఠకులకుతెలియజేయడం రచయిత కనీస ధర్మం.
“You cannot keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps, Telugu accepts them more easily than any other Indian
language and this will certainly help to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering.”
– J.B.S.Haldane, THE HINDU (27-4-1958) ( ఈ లేఖ పూర్తి పాఠం గవరసాన గారి దగ్గర ఉన్నట్టు తెలుసా చర్చలో చదివినట్టు గుర్తు.)
పై అభిప్రాయం వెలుగులో పాఠకులే హాల్డేన్ ఉద్దేశితార్థాన్ని గ్రహించగలరు.
జాతీయ భాష విషయంలో భారత రాజ్యాంగం సరిగా చదవని వారు తరచూ పప్పులో కాలు వేస్తుంటారు. మన రాజ్యాంగం ప్రకారం హిందీ జాతీయ భాష కాదు, కేంద్ర స్థాయిలోని అధికార భాష మాత్రమే.రాజ్యాంగ
పరంగా ,ఇంగ్లీషుకు కూడా అదే స్థాయి ఉంది. ఇక , రాజ్యాంగంలో జాతీయ భాషే నిర్వచితం కానప్పుడు భారత దేశానికి ఏ భాషైనా జాతీయ భాష ఎలా కాగలదు.?? హాల్డేన్ అంతటి శాస్త్రవేత్త ఇంత చిన్న విషయంలో పొరబడతాడనుకోను. ఇటీవల , గుజరాత్ న్యాయస్థానం ఈ విషయమై చక్కని తీర్పు కూడా ఇచ్చింది. ఒక వేళ లింకు పని చేయకపోతే, సారాంశం:
The court observed, “Normally, in India, majority of the people have accepted Hindi as a national language and many people speak Hindi and write in Devanagari script but there is nothing on record to suggest that any provision has been made or order issued declaring Hindi as a national language of the country.”
“However, in the constitution, Hindi was declared as an official language and not a national language..”
“The court in its order said Part XVII of the Constitution deals with Official Language. Under Article 343, official language of the Union has been prescribed, which includes Hindi in Devanagari script and English.”
వ్యాసానికి, హరికథకు తేడా ఉంది. జనరంజన కోసం హరిదాసు పిట్టకథలు చెబుతాడు. వ్యాసకర్తకు ఆ స్వేచ్చ లేదు, వ్యాసం నేలమీద నడవ వలసిందే. అంతేకాక, వ్యాసకర్త,ఎక్కడ అవసరమైతే అక్కడ ఆధారాలను ఇవ్వవలసిందే. ఆలోచనల్లో ఒక శాస్త్రీయ పంథా లేనిదే వ్యాసరచన కష్టం, కాబట్టే, తెలుగు నాట కవులు, కథకులు అధికం, వ్యాసకర్తలు, విమర్శకులు బహు సకృతు. ఇక జాలింతును.
సురేశ్ గారు:
అక్షరాలను పలకటంలో వస్తున్న మార్పుల వలన భాష స్వరూపం మారటం ఒకటయితే – భక్తి కార్యక్రమాల్లో చాలా మంది బక్తులే టీవీలో. వస్తువులనూ గుణాలనూ క్రియలనూ సైతం చెప్పే మాటలూ మరొక భాషా ప్రభావంతో మారిపొవటం అనేది అసలు భరించలేని ఇంకొక విషయం. చక్కని ‘కుడి’ ,ఎడమ’ లాంటిమాటలు గూడా ఇప్పుడు వాడకం లొ లేవు . ‘లెఫ్ట్ తీసుకో’ ఉంది; ‘ఎడమ వైపు తిరుగు’ లేదు. యేదైనా వస్తువు కాలక్రమంలో కనుమరుగయితే ఆ నామవాచకం పోవటం (రాచిప్పలా) అర్థం చేసుకొగలం. కానీ కుడి ఎడమలు కూడా పోతే?
ఇళ్ళల్లో ‘వంటిల్లు’ లేదు కిచెనే. కత్తిరించడం, కొయ్యడం పోయి ‘కట్ చెయ్యడం’ సర్వ సాధారణమై పొయింది. తెలుగు టీ వీ లొ వంటల కార్యక్రమాలలొ వస్తున్న అప్రాచ్యమైన తెలుగు కొక ఉదాహరణ –
“వాటర్ యాడ్ చెయ్యండి”
ఈ పరిస్థితి తెలుగును ప్రాథమిక విద్యా స్థాయిలో తప్పనిసరి చేస్తే మారుతుందని అనుకోగలమా? ఈ పరిస్థితి ని ఎలా మార్చేది?
ఆసక్తి కలిగించే విషయమే తహ తహ గారూ !! “పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి. అక్కడికి అదే పదివేలు.
సురేశ్ !! మీ వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి. క్లుప్తంగా ఉంటాయి. సూటిగా ఉంటాయి. విషయ ప్రధానంగా ఉంటాయి. ఉద్వేగ రహితంగా ఉంటాయి. ముఖ్యంగా చదువుతున్నప్పుడు నాకు బాగుంటాయి. తెలుగు వాక్యాలు ఇలా రాస్తే బాగుంటుంది అని అనుకునేలా ఉంటాయి. నా అభినందనలు అందుకోండి అందుకు. ఇంతకీ మీ జవాబు నాకు చాలా బాగా అనిపించింది. థాంక్యూ!
నాకు ఒక విషయం స్పష్టపడలేదు ఇంకా. బహుశా మీరు చెప్పే ఉంటారేమో. నేనే ఇంకా సరిగా ఆలోచించాలేమో. ఏమంటే, తమిళం ద్రవిడ భాషా వర్గమే కదా?? అచ్చులు పలకడంలో తెలుగు తమిళాల మధ్య వస్తున్న అడ్దంకి ఎందుకని వస్తోందీ అన్నది మరికొంచెం వివరించాలి మీరు. నేను వ్యాకరణాల విషయంలో కొంచెం మొద్దు అమ్మాయిని అనుకుని కాస్త శ్రధ్ధగా చెప్పండి 🙂
“వెదజల్లెడు” అన్న పదాన్ని “వెదజల్లడు” అని యెం యెస్ ఎందుకని అనవలసి వచ్చిందీ పాడుతున్నప్పుడు? ఇలాంటివి ఇతర తమిళ గాయనీ గాయకులు పాడినప్పుడూ చాలా మనం గుర్తించవచ్చును. అప్పుడు అక్కడ అన్నమయ్య వాడిన పదం తాలూకు అర్ధమే పూర్తిగా మారిపోవడం లేదా?? ఈ గొడవ ఏంటి? దీనికి పరిష్కారం లేనే లేదా?
తెలుగుకి పూర్తిగా ద్రావిడ భాషా స్వభావం అబ్బలేదని అనుకుందామా?? తమిళంలో పరుషాలు లేవు సరళాలు తప్ప అన్న ఒక్క పరిమితికీ, వాళ్ళు తెలుగుని పలకవలసి వస్తే తమిళానికి ఉచ్చారణని మార్చుకుని పాడడానికీ మధ్య ఉన్న తార్కిక సంబంధం గురించి చెప్పండి. ఇదీ నాకింకా తెలియాలి.
మీరు “థ” , “ధ” ల ఉదాహరణని ఇస్తే నాకు మరొకటి గుర్తొచ్చింది. ఏమంటే వేంకటాచలపతి అన్న పేరు ఉందనుకుందాం లేదా అలాంటిది మరొకటి. పోనీ మన గుడిపాటి వెంకట చలం గారి పేరే తీసుకుందాం ఉదాహరణకి. ఆయన్ని మనం “చలం” గా సంభావిస్తాం కదా? ఈ అలవాటు భాష పట్ల మరీ పట్టు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ కూడాను. చలం అన్నది తప్పు. అచలం అని అనాలి సంధిని విడదీసి. కానీ అక్కడ అందరూ “చలపతి” లే! “అచలపతి” లు లేరు. ఇది మరో వింత 🙂 ఇలా భాష కల్పించే సరదాలూ, తమాషాలూ బోలెడు.
అసలు ప్రపంచంలో ఏ లోపం లేని కథ ఉందా? ఒక వేళ అలాటిది ఉంది అని మీకనిపిస్తే, అది మీరు చెప్పగలిగితే, అందులో లక్షల లోపాలు చూపించగలవాళ్ళు మీకు దొరుకుతారు. అసలు ఆ కథ చెప్పిన తీరు మంచో, చెడో, జుగుప్సో, భీబత్సమో ఎదైతే అది, కథాంశం వ్యవస్థ లోని దోపిడీ గురించి అని మీకు కానీ, ఈ వ్యాసం వ్రాసిన రావుగారికి కానీ అనిపించలేదా? నిజంగానే నాకు ఇది ఆశ్చర్యం కలిగించింది. వ్యాసంలో వెలువరించిన అభిప్రాయాన్ని, మీ అభిప్రాయాన్ని ఖండించే విద్వత్తు నాకు లేదు కానీ మంచి శక్తివంతమైన విమర్శలు చెయ్యగలవారు తమ శక్తిని, ఒక కథలోని దోషాలని ఎత్తి వాటిని ఎక్కువ వెలుగులోకి తీసుకు వచ్చే కంటే అందులో ఏ మాత్రం మంచి ఉంది అనిపిస్తే దానిని విశ్లేషించి మరింతగా పదిమందిలోకి తీసుకురాగలిగితే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఇది కూడా మీకు నచ్చకపోతే నన్ను మన్నించగలరు.
ఉరుము ఉరిమి… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
07/17/2012 1:09 am
‘స్కెచ్ బావుంది, కాని యిది భారతదేశంలోని అనుభవం మాత్రమే. ఇక్కడ మేమే డ్రైవరులము, మేమే పనివాళ్లము, మేమే తోటమాలులము, అప్పుడప్పుడు తన్నులు తినేవాళ్లము కూడ మేమే. విధేయుడు – మోహన.‘
* అదే బెటరనిపిస్తుంది మోహనగారూ!
మాకొక డ్రైవర్ వుండే వాడు. పేరు మునిరాజ్. ఎప్ఫుడూ టైం కి వచ్చేవాడు కాడు. ఫోన్ చేసి, ఎక్కడున్నావని అడిగితే, ‘ట్రాఫిక్ లో ఇరుక్కుపోయా సార్..’ అనే వాడు. ‘ఐతే ఏం చేయమంటావ్’? ఆఫీస్ మానేయమంటావా? అని విసురుగా అడిగితే… ‘మానేయడం ఎందుకు సార్? మీరు బేగ ఫలానాచోటు కొచ్చేస్తే, నేనాడ్నుంచి తోలుకుపోతా’ అంటూ ఓ ఉచిత సలహా చెప్పేవాడు. పైగా, ‘అలా ఐతేనే, మనకు టైం కల్సొస్తుంద్సార్. మీరు త్వరగ ఆఫీస్ కి పోవచ్చు, (ఆలోచించుకోండి)’ అంటూ ఓ సూచన కూడా పడేసే వాడు.
చెబితే నవ్వుతారు కానీ, చివరికి అదే జరిగేది. అతను చెప్పినట్టే నడుచుకునే వాళ్ళం. అలనాడు – రథసారధి గీతోపదేశంతో అర్జునునికి జ్ఞానోదయమైనట్టు, మాకూ ‘కాల జ్ఞానం’ కలిగింది ఈ డ్రైవర్ల వల్ల! అందుకని, మేమే ఓ అడుగు ముందుగా బయల్దేరే వాళ్ళం. “ఏమిటీ! ఇంత త్వరగా,?” అని ఎవరైనా అడిగితే “డ్రైవర్ని పికప్ చేసుకోవాలి!” అంటూ మా జోక్ కి మేమే నవ్వుకునే వాళ్ళం.
ఇలాంటి ‘బద్ధకిష్టుల’ పట్ల మనకు – మానవతా దృక్పధం మెండుగా వుంటే తప్ప, భారత దేశంలో నవ్వడం సాధ్యం కాదని స్వానుభవంతో తెలుసుకున్నా.
థాంక్స్ మోహన గారూ! నా రచన బావుంది అన్నందుకు!
నమస్సులతో-
ఆర్. దమయంతి
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:
07/16/2012 11:59 pm
>> “ఖండించి, దీవించి, ఊగించి, శాసించి, రక్షించే”
సురేశ్ గారూ, చలంగారు వాడిన ఈ మాటలు ఇంగ్లీషులో ఆలోచించి తెలుగులో రాసినట్లుంది. ఆ పలుకుబడికి మూలం ఏవిటో మీకు?
ఈ నడుమ నేను చదువుతున్న కొల్లాయి గట్టితేనేమి లో “థ-ధ” కలగలుపులు కుప్పలు కుప్పలుగా చూస్తున్నాను. ఎక్కడపడితే అక్కడ “అర్ధం, సమర్ధన” కనబడుతుంటాయి. 🙂
ఇంకా ఒకటి రెండు సందేహాలు తీర్చుకోవాలి మిమ్మల్ని అడిగి. మీ ఈ-మెయిల్ ఐడీ ఇవ్వగలరా?
నా మటుకు – దంత్య/తాలవ్య చ-జ లను తేడా తెలిసేంత బాగా పలకలేను. :).
మీరన్నట్లు ప్రాథమిక విద్యలో తెలుగుకి ప్రాముఖ్యం పెరగాల్సిన అవసరం ఉంది. అలాగే తెలుగు పట్ల అభిరుచి కలిగించాల్సిన అవసరమూ ఉంది.
ఆఖరి మనిషి గురించి రవిశంకర్ అభిప్రాయం:
07/16/2012 9:16 pm
రవీందర్ గారు – మీ ప్రయత్నానికి ధన్యవాదాలు. భావం తెలుస్తోంది. మరికొంత మెరుగుపరచవచ్చునేమో చూడండి.
వ్యాఖ్యలు రాసిన ఇతరులకు కూడా ధన్యవాదాలు. ఒక చిన్న వివరణ. ఒక తరంలో ఆత్మీయులు, సహచరులు, తాము ఆరాధించిన సెలబ్రిటీలు ఒకరొకరుగా వెళ్ళిపోయాక, మిగిలిన మనుషుల అంతరంగచిత్రణ కోసం చేసిన ప్రయత్నం ఈ కవిత. ఇక్కడ ఆఖరి మనిషి అంటే అర్థం అదే. అంతేగాని, మానవజాతి నశిస్తుందని నా ఉద్దేశం కాదు. – రవిశంకర్
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి aaditya reddi అభిప్రాయం:
07/16/2012 9:16 pm
ఎం కె రావు గారూ, ఏ లోపం లేకుండా, ఎక్కడా నూటికి నూరుశాతం పెర్ఫెక్షన్ ఉంటున్దని నేను అనుకోను. ఏ లోపం లేని వ్యక్తులెలా ఉండరో అలాగే లోపం లేని కధ ఉండకపోవచ్చు. కాని ఈ కధలో లోపాలు చాలా ప్రధానమైనవి. వాటిని పట్టించుకోకుండా ఈ కధకు గత యాబై ఏళ్ళుగా కొంతమంది వీరపూజ చేసారు. అదే నిజమని ప్రచారం చేసారు. యిప్పటికీ చేస్తునే ఉన్నారు. ఆ ‘అతి’ మీదనే నా వ్యతిరేకత.
యిక మీరన్నట్టు, మంచి అన్నది మల్లెపూల సువాసన లాంటిది దానిని వీలయినంత ఎక్కువ ప్రచారం చేయాలి. చెడు అన్నది మురిక్కాలవ వాసన వంటిది. దానిని వీలయినంత వేగంగా కప్పెట్టేయాలి. నేను అదే చేస్తున్నాననుకుంటున్నాను.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:
07/16/2012 8:04 pm
రమ గారు,
“పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి.
ఇక్కడ మేలా (పుస్తక్ మేలా, మేల కాదు) అనేది పండుగ లేక సంత అనే అర్థములో వచ్చే హిందీ పదము అని నా భావన. అది మేళ కాదు, తెలుగులో మేళము అంటే సమూహము, ముఖ్యముగా ఆటకత్తెల సమూహము అనుకొంటాను. పుస్తకము + ఏల = పుస్తక మేల అనలేదే, అందుకు సంతోషించాలి.
తమిళంలో “ఎ” కారం తెలుగు లోని అకారానికి సమానమా?? ఏమిటీ కారణం? వాళ్ళకి ఉ , ఎ లాంటివి లేవేంటి ?
అన్ని చోటులలో అలా వాడరు వాళ్లు. జ-కారముతో మొదలయ్యే సంస్కృత పదాలకు జె-కారమును తరచు వాడుతారు, ఉదా. జయం – జెయం. ఇలాటివి తెలుగులో కూడ కొన్ని ఉన్నాయి, ఉదా. చంద్రిక, చెంద్రిక; జలగ, జెలగ. ర-కారానికి బదులు రె-కారమును అరుదుగా వాడుతారు, ఉదా. రమ – రెమ. తమిళ ఛందస్సులో ఐ-కారమును లఘువుగా వాడడము నాకు తెలుసు. ఉ-కారము చివర వస్తే అది ఒక్కొక్కప్పుడు పరిగణించబడదు. కాని కొన్ని విషయాలలో వాళ్ల నియమాలు చాల కఠినమైనవి. మిగిలిన భాషలలో ఆ, అం, కల్ మున్నగునవి ఒకే విధమైన గురువుగా అంగీకరించినా తమిళములో వాటికి భిన్నత ఉన్నది. పాటలలో వీటిని గమనించవచ్చును. విధేయుడు – మోహన
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తః తః అభిప్రాయం:
07/16/2012 5:10 pm
రమగారు: ‘వేంకటాచలం’ అని పెట్టక ‘వెంకట చలం’ అని పేరుపెట్టినప్పుడు ‘చలం’ అని పిలవడం సరదాగా ఉంది అంటే చెప్పలేను గానీ ‘మధుసూదన’ అని దేవుడి పేరు పెట్టి ‘మధు’ అని – ఆ దేవుడి చేతిలో చచ్చిన – రాక్షసుడి పేరుతో పిలవటం నవ్వు తెప్పిస్తుంది.
తః తః
నైరూప్యచిత్ర కళాయాత్రికుడు గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:
07/16/2012 3:49 pm
సంజీవ దేవుల సౌహార్దము జగమెరిగినదే. గురు శుశ్రూషా ఫలం మన రాతల్లో, చేతల్లో కనిపించాలి కానీ మాటల్లో కాదు. రచయితగా వేలూరి వారు వివరణ ఇచ్చుకొనే అవసరమే లేదు. కారణం, వారు, ఈ అనువాదం చేయలేదు. అంతే గాక నేను వారి ఆంగ్ల మాతృక చదవలేదు, కాబట్టి నేను ‘వెల్లబుచ్చిన’ అభిప్రాయాలు కేవలం ప్రస్తుత అనువాదానికే పరిమితం.ఇక పోతే,
రచయితలకు సూచనలు అన్న విభాగంలో
“మంచి సాహిత్యానికి తోటి రచయితల సమీక్ష, విమర్శ మేలు చేస్తుంది తప్పితే కీడు చేయదు అన్నది మా బలమైన నమ్మకం. అందుకే ఈమాటకు వచ్చే రచనల ప్రచురణపై Peer Review పద్ధతి ప్రకారం నిర్ణయాలు తీసుకుంటాం. ఈమాట రచయితలూ కవులే మాకు సమీక్షకులు కూడా. ఈమాటకు మీరు పంపే రచనల్ని మొదట మేము (సంపాదకులు) సమీక్షిస్తాం. ఆపైన, అవసరమైతే కనీసం ఇద్దరు సమీక్షకులకు పంపి, వారి సూచనల ఆధారంగా రచనల ప్రచురణార్హత నిర్ణయిస్తాం. “
శుభం, ఈ వ్యాసాన్ని సంపాదకులు సమీక్షించారా ??
[ఈ వ్యాసం Poems in Pigment అనే ఇంగ్లీషు వ్యాసం కొన్ని సవరణలతో అనువదించబడి మొదట 1995లో తానా తెలుగు వెలుగులో ప్రచురించబడింది. కొత్తగా మార్పులూ చేర్పులూ చేసిన వ్యాసం ఈమాటలో ఇప్పుడు ప్రచురించాము – సం]
సమీక్షంచడమే, కాదు, మార్పులు చేర్పులు కూడా చేశారు, సంతోషం,
వ్యాసానికి ఒక పఠనీయత అవసరం లేదా ??పారిభాషిక పదాల విషయంలో జాగ్రత్త అవసరంలేదా ?? వాక్యాలకు ఒక అన్వయం ఉండొద్దా ??అనువాదం ఎలా వికటించినా పాఠకులు భరించ వలసిందేనా??
వ్యాసకర్తలు సంపాదకులే అయినప్పుడు పాటించవలసిన సమీక్షా ప్రమాణాలు మారతాయా ?? ఈ మాట సంపాదక మండలి మాత్రమే సమాధానం చెప్పగల ప్రశ్నలివి.
రామాయణంలో పిడకల వేట :
“1950ల చివరలో ప్రముఖ జీవసాంఖ్య* శాస్తవేత్త సర్ జె. బి. ఎస్. హాల్డేన్ అప్పట్లో కలకత్తా నుండి వెలువడుతుండిన ప్రముఖ ఆంగ్లపత్రిక స్టేట్స్‌మన్‌లో ఒక ఉత్తరం రాశాడు. ఆయన తన ఉత్తరంలో తెలుగుభాషకు ఇతర భాషలతో ఒదిగే అద్భుతగుణం వుందని విపరీతంగా పొగిడాడు. అక్కడితో ఆగక తెలుగు భాషకు భారతదేశంలో జాతీయభాష కావటానికి అవసరమైన అన్నిఅర్హతలు ఉన్నాయని రాశాడు.”
(*సాంఖ్యక అని ఉండాలి, సాంఖ్యము షట్ దర్శనాల్లో ఒకటి, సాంఖ్యక శాస్త్రం అంటే Statistics )
అతకని హాల్డేన్ ఉదంతంతో వ్యాసాన్ని ఆరంభించారు, బాగానే ఉంది, తెలుగు గురించి హాల్డేన్ కు ఏమి తెలుసో , ఎలా తెలుసో అన్నీ ఊహపోహలే, ఇంత కథ నడిపే ముందు, హాల్డేన్ తెలుగు భాష గురించి
ఏమన్నాడో రచయితకు తెలుసా?? తెలుసే అనుకుందాం, ఆ విషయాన్ని, పాద పీఠికలో పాఠకులకుతెలియజేయడం రచయిత కనీస ధర్మం.
“You cannot keep out foreign words as you keep out foreign manufactured goods. Perhaps, Telugu accepts them more easily than any other Indian
language and this will certainly help to make it a rival to Hindi in teaching Science, Medicine and Engineering.”
– J.B.S.Haldane, THE HINDU (27-4-1958) ( ఈ లేఖ పూర్తి పాఠం గవరసాన గారి దగ్గర ఉన్నట్టు తెలుసా చర్చలో చదివినట్టు గుర్తు.)
పై అభిప్రాయం వెలుగులో పాఠకులే హాల్డేన్ ఉద్దేశితార్థాన్ని గ్రహించగలరు.
జాతీయ భాష విషయంలో భారత రాజ్యాంగం సరిగా చదవని వారు తరచూ పప్పులో కాలు వేస్తుంటారు. మన రాజ్యాంగం ప్రకారం హిందీ జాతీయ భాష కాదు, కేంద్ర స్థాయిలోని అధికార భాష మాత్రమే.రాజ్యాంగ
పరంగా ,ఇంగ్లీషుకు కూడా అదే స్థాయి ఉంది. ఇక , రాజ్యాంగంలో జాతీయ భాషే నిర్వచితం కానప్పుడు భారత దేశానికి ఏ భాషైనా జాతీయ భాష ఎలా కాగలదు.?? హాల్డేన్ అంతటి శాస్త్రవేత్త ఇంత చిన్న విషయంలో పొరబడతాడనుకోను. ఇటీవల , గుజరాత్ న్యాయస్థానం ఈ విషయమై చక్కని తీర్పు కూడా ఇచ్చింది. ఒక వేళ లింకు పని చేయకపోతే, సారాంశం:
The court observed, “Normally, in India, majority of the people have accepted Hindi as a national language and many people speak Hindi and write in Devanagari script but there is nothing on record to suggest that any provision has been made or order issued declaring Hindi as a national language of the country.”
“However, in the constitution, Hindi was declared as an official language and not a national language..”
“The court in its order said Part XVII of the Constitution deals with Official Language. Under Article 343, official language of the Union has been prescribed, which includes Hindi in Devanagari script and English.”
వ్యాసానికి, హరికథకు తేడా ఉంది. జనరంజన కోసం హరిదాసు పిట్టకథలు చెబుతాడు. వ్యాసకర్తకు ఆ స్వేచ్చ లేదు, వ్యాసం నేలమీద నడవ వలసిందే. అంతేకాక, వ్యాసకర్త,ఎక్కడ అవసరమైతే అక్కడ ఆధారాలను ఇవ్వవలసిందే. ఆలోచనల్లో ఒక శాస్త్రీయ పంథా లేనిదే వ్యాసరచన కష్టం, కాబట్టే, తెలుగు నాట కవులు, కథకులు అధికం, వ్యాసకర్తలు, విమర్శకులు బహు సకృతు. ఇక జాలింతును.
తమ్మినేని యదుకుల భూషణ్.
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి తః తః అభిప్రాయం:
07/16/2012 3:14 pm
సురేశ్ గారు:
అక్షరాలను పలకటంలో వస్తున్న మార్పుల వలన భాష స్వరూపం మారటం ఒకటయితే – భక్తి కార్యక్రమాల్లో చాలా మంది బక్తులే టీవీలో. వస్తువులనూ గుణాలనూ క్రియలనూ సైతం చెప్పే మాటలూ మరొక భాషా ప్రభావంతో మారిపొవటం అనేది అసలు భరించలేని ఇంకొక విషయం. చక్కని ‘కుడి’ ,ఎడమ’ లాంటిమాటలు గూడా ఇప్పుడు వాడకం లొ లేవు . ‘లెఫ్ట్ తీసుకో’ ఉంది; ‘ఎడమ వైపు తిరుగు’ లేదు. యేదైనా వస్తువు కాలక్రమంలో కనుమరుగయితే ఆ నామవాచకం పోవటం (రాచిప్పలా) అర్థం చేసుకొగలం. కానీ కుడి ఎడమలు కూడా పోతే?
ఇళ్ళల్లో ‘వంటిల్లు’ లేదు కిచెనే. కత్తిరించడం, కొయ్యడం పోయి ‘కట్ చెయ్యడం’ సర్వ సాధారణమై పొయింది. తెలుగు టీ వీ లొ వంటల కార్యక్రమాలలొ వస్తున్న అప్రాచ్యమైన తెలుగు కొక ఉదాహరణ –
“వాటర్ యాడ్ చెయ్యండి”
ఈ పరిస్థితి తెలుగును ప్రాథమిక విద్యా స్థాయిలో తప్పనిసరి చేస్తే మారుతుందని అనుకోగలమా? ఈ పరిస్థితి ని ఎలా మార్చేది?
మీ ఆలొచన దయచేసి చెపుతారా?
తః తః
తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:
07/16/2012 2:42 pm
ఆసక్తి కలిగించే విషయమే తహ తహ గారూ !! “పుస్తక మేల” అని అనకుండా ” పుస్తక మేళ ” అని NBT వాళ్ళు అనడం. వాళ్ళు బహుశా తెలుగు నేలని గౌరవించి అలా పెట్టేరని అనుకోవాలి. అక్కడికి అదే పదివేలు.
సురేశ్ !! మీ వాక్యాలు నన్ను ఆకట్టుకుంటాయి. క్లుప్తంగా ఉంటాయి. సూటిగా ఉంటాయి. విషయ ప్రధానంగా ఉంటాయి. ఉద్వేగ రహితంగా ఉంటాయి. ముఖ్యంగా చదువుతున్నప్పుడు నాకు బాగుంటాయి. తెలుగు వాక్యాలు ఇలా రాస్తే బాగుంటుంది అని అనుకునేలా ఉంటాయి. నా అభినందనలు అందుకోండి అందుకు. ఇంతకీ మీ జవాబు నాకు చాలా బాగా అనిపించింది. థాంక్యూ!
నాకు ఒక విషయం స్పష్టపడలేదు ఇంకా. బహుశా మీరు చెప్పే ఉంటారేమో. నేనే ఇంకా సరిగా ఆలోచించాలేమో. ఏమంటే, తమిళం ద్రవిడ భాషా వర్గమే కదా?? అచ్చులు పలకడంలో తెలుగు తమిళాల మధ్య వస్తున్న అడ్దంకి ఎందుకని వస్తోందీ అన్నది మరికొంచెం వివరించాలి మీరు. నేను వ్యాకరణాల విషయంలో కొంచెం మొద్దు అమ్మాయిని అనుకుని కాస్త శ్రధ్ధగా చెప్పండి 🙂
“వెదజల్లెడు” అన్న పదాన్ని “వెదజల్లడు” అని యెం యెస్ ఎందుకని అనవలసి వచ్చిందీ పాడుతున్నప్పుడు? ఇలాంటివి ఇతర తమిళ గాయనీ గాయకులు పాడినప్పుడూ చాలా మనం గుర్తించవచ్చును. అప్పుడు అక్కడ అన్నమయ్య వాడిన పదం తాలూకు అర్ధమే పూర్తిగా మారిపోవడం లేదా?? ఈ గొడవ ఏంటి? దీనికి పరిష్కారం లేనే లేదా?
తెలుగుకి పూర్తిగా ద్రావిడ భాషా స్వభావం అబ్బలేదని అనుకుందామా?? తమిళంలో పరుషాలు లేవు సరళాలు తప్ప అన్న ఒక్క పరిమితికీ, వాళ్ళు తెలుగుని పలకవలసి వస్తే తమిళానికి ఉచ్చారణని మార్చుకుని పాడడానికీ మధ్య ఉన్న తార్కిక సంబంధం గురించి చెప్పండి. ఇదీ నాకింకా తెలియాలి.
మీరు “థ” , “ధ” ల ఉదాహరణని ఇస్తే నాకు మరొకటి గుర్తొచ్చింది. ఏమంటే వేంకటాచలపతి అన్న పేరు ఉందనుకుందాం లేదా అలాంటిది మరొకటి. పోనీ మన గుడిపాటి వెంకట చలం గారి పేరే తీసుకుందాం ఉదాహరణకి. ఆయన్ని మనం “చలం” గా సంభావిస్తాం కదా? ఈ అలవాటు భాష పట్ల మరీ పట్టు ఉన్న ఉభయ గోదావరి జిల్లాలోనే ఎక్కువ కూడాను. చలం అన్నది తప్పు. అచలం అని అనాలి సంధిని విడదీసి. కానీ అక్కడ అందరూ “చలపతి” లే! “అచలపతి” లు లేరు. ఇది మరో వింత 🙂 ఇలా భాష కల్పించే సరదాలూ, తమాషాలూ బోలెడు.
రమ.
యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి mkrao అభిప్రాయం:
07/16/2012 2:15 pm
ఆదిత్య గారు,