పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అంతరం గురించి kamal అభిప్రాయం:

    07/18/2012 3:19 am

    చాలా బాగా చెప్పారు-కమల్

  2. కాల్వీనో కథల నుంచి – 4 గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    07/18/2012 1:12 am

    బాగా రాశారు. రెండూ కూడా – రెండు ఆర్ట్ ఫిల్ములు చూస్తున్నంత అనుభూతిని కలిగించాయి.
    అభినందనలతో-
    ఆర్.దమయంతి.

  3. పాఠకులకు సూచనలు గురించి saprara అభిప్రాయం:

    07/18/2012 12:54 am

    సంపాదకులకు శుభోదయం. మీ పత్రిక ద్వారా ఇతర తెలుగు పత్రికలను పాఠకులకు పరిచయం చేస్తె బావుంటుంది. గత 35 సంవత్సరాలుగా ప్రగతి శీల తెలుగు సాహిత్యాన్ని పాఠకులకు అందిస్తున్న ప్రజాసాహితి లాంటి పత్రికలను మనం ప్రోత్సహించవలసివుంది. దయచేసి పరిశీలించగలరు.

  4. ఇటు నేనే – అటు నేనే గురించి saprara అభిప్రాయం:

    07/18/2012 12:44 am

    వెనుక బడిన తరగతులను హేళన చేయాలనే మీ తహతహ చూస్తే నవ్వొస్తుంది. మీ అహంకారం శమించు గాక! వారు వెనుక బడిన తరగతులు కాదు. బలిసిన వారిచే వెనుకకు నెట్ట బడిన వారని గ్రహించలేని మీ సృజనాత్మకత హాస్యాస్పదంగా వుంది.

  5. సాహిత్య చర్చలు – పర్యవసానాలు గురించి saprara అభిప్రాయం:

    07/18/2012 12:30 am

    మన కవులు చాలా మందికి ఒక లక్ష్యం లేదు. కవిత్వం కోసం కవిత్వం కాదు కదా! సామాజిక చలనం లో తన వంతు పాత్రని ప్రతి సృజన పోషించాలి. ఆ దృష్టి లేని కవిత్వం అడవి కాచిన వెన్నెలె.

  6. యజ్ఞం కథ: మరో పరిశీలన గురించి C.S.Rao అభిప్రాయం:

    07/17/2012 10:32 pm

    ఎం కె రావు గారూ,
    సాహిత్య విమర్శ చేయవలసింది పరామర్శ చేస్తున్న దాని యొక్క గుణ,దోషాలను నిశితంగా విశ్లేషించటం. లోపాలను ఎత్తి చూపటం కసిగా జరగకూడదు. వ్యక్తిగత విమర్శ జోలికి పోకుండా, సాహిత్య విమర్శకు సంబంధించిన విశ్లేషణ సాధ్యమయినంతవరకు క్రిటికల్ టెర్మినాలజీ ద్వారా సంయమనంతో జరగాలి. కానీ అసలు లోపాల జోలికే పోగూడదు అనడం ప్రయోజనకారి కాజాలదు. ఏ రంగంలో నైనా మానవుడి కృషికి ధ్యేయం ప్రగతి, పరిపూర్ణత, సమన్వయత, సామరస్యం సాధించటం. లోపాలు గుర్తించక పోతే పైన చెప్పిన ధ్యేయం వైపు పురోగమించటం సాధ్యం కాదు. పరిపూర్ణత కళారూపాలలో సాధించటం బహుశా ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చునని నేనూ భావిస్తాను. కానీ ఆ దిశగా మనం ముందుకు సాగాలంటే సంయమనం, సహృదయతలతో కూడిన నిశితమైన గుణ, దోష విచారణ అవసరం.

    యజ్ఞం కధ గురించి నా అనుభవం లోకి వచ్చిన దోషాలతో పాటు గుణాలను కూడా ప్రస్తావించటం జరిగింది. ముఖ్యంగా కధనం,పాత్రచిత్రణలలో రామారావు గారి నైపుణ్యం గురించి. (కధా నిర్మితికి, కధావసరాలకు పొసగక పోయినా) మీరన్నట్లు కధాంశం వ్యవస్థ లోని దోపిడీ గురించే. కానీ ఎవరు ఎవరిని దోపిడీ చేశారు? శిక్ష ఎవరికి పడింది? పడవలసిన వారికే పడిందా? ఈ అంశాలు కధలో అస్తవ్యస్తంగా ఉన్నాయని నా అభిప్రాయం.

    ఈ వ్యాసం మీద స్పందించిన వారందరికీ కృతజ్ఞతలు
    సి.ఎస్.రావ్

  7. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి మోహన అభిప్రాయం:

    07/17/2012 9:21 pm

    కామేశ్వర రావు గారు,

    సంస్కృతంలో “ళ”కారం లేనప్పుడు, కొన్ని కొన్ని సంస్కృత పదాలకు మాత్రమే తెలుగులో “ల”కారం బదులుగా “ళ”కారంగా ఎలా వచ్చింది? ఈ మార్పులో ఏమైనా సూత్రబద్ధత ఉన్నదా?

    నా ఉద్దేశములో ఇది కేవలము వాడుక ద్వార వచ్చినట్లున్నది. కల అనే తెలుగు పదము ఉన్నది కాబట్టి కళ (లలిత కళ వలె) అనే పదము వచ్చినదనుకొంటే, దళము (ఆధిక్యత దళారి లాటిది), దళము (ఆకు, రేకు) రెండు ఒకే విధముగా ఉన్నాయి. వేరువేరు అర్థాలు ఉన్న పదాలకు ల, ళ లను ఉపయోగిస్తారు అనుకొంటే (కాళ, కాల; వేళ, వేల, ఇత్యాదులు) తాళ (తాటి), తాళ (సంగీతములోని తాళము) రెండు ఒకే విధముగా ఉన్నాయి. కొన్ని చోటులలో రెండు విధాలుగా వాడుతారు (నలినము, నళినము; అకలంకము, అకళంకము ఇత్యాదులు). కొన్ని పదాలు ఒక్కొక్క భాషలో ఒక్కొక్క విధముగా ఉంటుంది (ఉదా. కన్నడములో నీళ, తెలుగులో నీల; కన్నడములో కుంతళ, తెలుగులో కుంతల, ఇత్యాదులు). కొన్ని పదాలకు సంస్కృతములో అర్థము వేరు, తెలుగులో వేరు – ఉదా. కలేవర – దేహము, కళేబర – శవము, అర్థము మారితే చందన చర్చిత నీల కలేవర అనే అష్టపది నవ్వు తెప్పిస్తుంది, వకారముతో తప్ప బకారముతో కలేబర అనే పదము సంస్కృతములో లేదు. నిజముగా ఆంగ్లములోని cadaver లాటిన్ ద్వార ఈ కలేవర నుండి వచ్చినదే. రెండు లకారాలు పక్కపక్కన ఉంటే అవి తెలుగులో ళకారమవదు. ఒకే పదము రెండు రూపాలు కూడ తీసికొంటాయి – ఉదా. మిలనము, మిళితము. తెలుగులో కన్న మలయాళములో, కన్నడములో సంస్కృత ళకార పదాలు ఎక్కువ అని నా భావన. విధేయుడు – మోహన

  8. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి rama bharadwaj అభిప్రాయం:

    07/17/2012 2:48 pm

    మోహన గారూ!! “మేల”అన్నపదం తహ తహ గారు రాసినప్పుడు మేళ అన్నది రాసినప్పుడూ నేను వాటిని అలాగే రిపీట్ చేసినప్పుడూ మీరన్న అర్ధం లోనే చేశాము. మీరన్న అర్ధం మాకు తెలుసును. దీర్ఘం రాయక పోవడం వలన మాత్రమే బహుశా మీరు మాకు తెలియక పొరపడ్డామని అనుకున్నట్టున్నారు. దీర్ఘం ఎందుకని రాయ లేదంటే అది అక్కడ ఉంది[ implied ] అని అర్ధం. పలికేటప్పుడు దీర్ఘం తోనే అనాలి. హ్రస్వం తో అనం . రాసేటప్పుడు తెలుగులో వాళ్ళు” మేళా” అని రాసి ఉండరు బహుశా. అంతే కానీ పుస్తకం + ఏల ? అని మేము భావించలేదు విభజించుకోలేదు సుమండీ! ఇంక మీరు చెప్పిన దాని బట్టీ “ఎ” “అ” అవుతోందే గానీ “అ” అన్నది “ఎ” కావడం లేదు కదా? మరి ఆమె [ యెం యెస్ ] ” వెదజల్లెడు అన్న మాట ని ” వెదజల్లడు” గా ఎందుకని పలికారూ?

    “చలం” కాదు కదా? పేరు లో ప్రధానం ” అచలం “కొండ” అచలం ” అంటే అది కదలనిది కదా?? అది కాస్తా మరుగున పడిపోయి “చలానికి” అంటే కదిలేది అన్న విరుధ్ధ మైన అర్ధానికి ప్రాముఖ్యమిచ్చి ప్రచారంలోకి తేవడం విడ్డూరం ! ” మధు” కూడా అలాగే ఉంది నిజమే !!

    సురేశ్ ! తెలంగాణం లో ఉన్నట్టు గా “థ” “ధ” ల మధ్య తేడా మీకు సర్కారు జిల్లాలలో లేదు. అక్కడ కధ అని ఎవరన్నా రాస్తే లేదా విశ్వనాధ అని గానీ రాస్తే అది తప్పు గా పరిగణించరు . బొడ్డులో చుక్క పెట్తకపోయినా ఏం తేడా ఉండదు. అది తప్పు స్పెల్లింగు కాదు . రెండు రూపాలూ సమానం గానే అమలులో ఉన్నాయి . తెలంగాణం లోనే ఒక నిబధ్ధత తో ” కథ” అని అనడం మనం గమనిస్తాం. మిగిలిన చోట లేదు.
    ఇలాంటి తేడాలు ఏ కారణం గా వచ్చేయీ ..ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయీ అన్నది కుతూహలానికి కారణం కావాలి . ముఖ్యం గా భాష ని గురించి ఆసక్తి ఉన్న ఎవరికైనా ! వీలుంటే ఆ దిశ గా మాట్లాడుకోవడం లో ప్రయోజనం ఎక్కువ కలుగుతుంది. [ “నిగాహ్” ” నిఘా” గా మారడం అలాంటి ఉర్దూ పదాలు తెలుగులో అవి వేరే అర్ధం లో విపరిణామం చెందడం మీద జయప్రభ గారి పుస్తకం “ప్రతికూల పవనాలలో” ఒక ముఖ్యమైన వ్యాసం ఉంది. అది తెలుగులో వచ్చే అన్య దేశ్యాల ని గురించి చర్చిస్తుంది , ఆసక్తి ఉన్న వాళ్ళు చదవవొచ్చును

    కామేశ్వర రావు గారి సందేహం నాకునూ కలదు కొలిచాలా !!

    రమ.

  9. తెలుగు వ్యాకరణాల పరిచయం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    07/17/2012 1:06 pm

    “ల”, “ళ”ల గురించి నాకున్న రెండు సందేహాలు:
    1. మాహేశ్వరసూత్రాలలో చెప్పకపోయినా, వేదవాఙ్మయంలో కొన్ని చోట్ల “ళ”కారం కనిపిస్తుంది కదా? అది మొదట ఉండి తర్వాత కాలంలో అంతరించినదా? లేక మొదట లేకుండా తర్వాత వచ్చినదా?
    2. సంస్కృతంలో “ళ”కారం లేనప్పుడు, కొన్ని కొన్ని సంస్కృత పదాలకు మాత్రమే తెలుగులో “ల”కారం బదులుగా “ళ”కారంగా ఎలా వచ్చింది? ఈ మార్పులో ఏమైనా సూత్రబద్ధత ఉన్నదా?

  10. 88 ఏళ్ళ యువకులు గురించి Rohiniprasad అభిప్రాయం:

    07/17/2012 1:57 am

    మాధవిగారూ,
    నా email rohiniprasadk@యాహూ.కాం నర్తనం నిర్వహీంచిన జి.ఎం. శర్మగారు బొంబాయిలో నాకు చిరకాలమిత్రులు. ఆయనవల్ల నేను కృష్ణపారిజాతంలో కొత్తగా ప్రవేశపెట్టిన తులాభారం సీన్‌కు సంగీతంకూడా సమకూర్చాను. అది షణ్ముఖానంద హాలులో కేలూచరణ్ మహాపాత్ర గారి సమక్షంలో ప్రదర్శించారు.